tips and tricks లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tips and tricks లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2016, శనివారం

How to Hide Photos, Video and Files in your Android Mobile

మన మిత్రులు ఎవరైనా గా రాగానే మన మొబైల్ చూపించడం అనడం సహజం .
మరి మొబైల్ తీస్కోని వారు చేసే పని ఏంటంటే అందులో ఉన్న ఫొటోస్ చూడడం వీడియోస్

చూడడంచేస్తుంటారుమన మొబైల్ లో మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా 
వీడియోస్ కావచ్చు ఏ ఫైల్స్  అయినా ఉండవచ్చు అవి వారు చూడడం మనకి ఇష్టం ఉండదు. మరి వాటిని మనం గ్యాలరీ లో కనిపించకుండా చేస్తే , అలాగే మన వీడియోస్ వీడియో ప్లేయర్ లో కనిపించకుండా  చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. అయితే చాల మంది మిత్రులు ఈ సమస్య ని ఎదురు కొనుటకు ఎన్నో రకాల అప్లికేషను లను వాడుతుంటారు. అవి మన ఫైల్స్ ని encrypt చేసేస్తాయి .కావున మనం వాటిని విడిగా access చేయలేము. వాటితో సమస్య ఏర్పడగానే మా ఫొటోస్ పోయినాయి , వీడియోస్ పోయినాయి ఇంపార్టెంట్ అని మోర పెట్టుకుంటారు , చేతులు కాలినాక ఆకులు పట్టుకొంటే ఎం లాభం, అంతేగా
  మరి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో లో చూపించాబోయే వీడియో లో ఎలాంటి అప్లికేషన్ ని వాడకుండా మన ఫైల్స్ కి డేటా కి ఎలాంటి హాని జరగకుండా  సులువుగా గ్యాలరీ లో కనిపించకుండా hide చేయడం ఎలా అనేది స్పష్టంగా తెలియజేశాను . నాకు తెలిసి ఈ వీడియో మీకు చాల బాగా ఉపయోగపడుతుందని బావిస్తున్నాను.

ఈ వీడియో మీకు ఉపయోగపదినట్లు అయితే తప్పక షేర్ మరియు లైక్  చేయండి ఇటువంటి మరిన్ని వీడియో లు చేసేలా నన్ను ప్రోత్సహించండి .

rktechnics.com       rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

16, ఆగస్టు 2016, మంగళవారం

Hike New Option

న్ని ఇన్నిరోజులుగా హైక్ లో favorites అని ప్రవేశ పెట్టిన ప్రకారం ఎవరినైతే మనం ఫేవరెట్స్ లో ఆడ్ చేస్కొంటామో వారికి మాత్రమే మన టైంలైన్ పోస్ట్ లు కనిపించేవి....... వారు మనని ఫేవరెట్ గా ఆడ్ చేస్కొంటే వారికి మన పోస్ట్ లుకనిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ అందరికి అర్ధం కావటం లేదని గమనించిన హైక్ సంస్థ ఇప్పుడు ఆ ఫీచర్ ని కాస్తా ఫ్రెండ్స్ గా మార్చేసింది..
ప్రస్తుత ప్రజలు పై ఫేస్బుక్ ప్రభావితం చూసి ఇలా అయితే ఈజీ గా ప్రజలలోకి చొరబడుతుంది అని గమనించి ఇలా ఫ్రెండ్స్ అనే ఫీచర్ గా మార్చేసారు.. favorites లో ఎలాగైతే ఆడ్ చేస్కోన్తామో అదే విధంగా ఇది కూడా.. ఆడ్ ఫ్రెండ్ పై క్లిక్ చేస్తే చాలు.. విషయం ఏంటంటే మనం ఫ్రెండ్ గా ఆడ్ చేస్కోన్నాము అనే విషయం వారికి కూడా తెలిసి పోతుంది, అందువలన మరింత గట్టి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అని బావించింది హైక్ ఇండియన్ సంస్థ.
ఒక్కప్పటితో పోలిస్తే అప్పట్లో ఎక్కువగా పోస్ట్ లకి లైక్ లు రావట్లేదు అని బావించే మిత్రులకి ఇది అద్బుతమైనా ఆప్షన్ గా మారిపోయింది..
వాస్తవానికి వాట్స్ యాప్ తో పోలిస్తే హైక్ నే చాల ఫాస్ట్ గా తక్కువ డేటా ని ఉపయోగించుకునే అప్లికేషను అని స్పష్టంగా తెలిసిపోతుంది.
I always like hike ..
Thanks Hike

20, మే 2016, శుక్రవారం

Facebook Group for technological information amd solutions

గత 2 సంవత్సరాల గా మీ ఆదరాభిమానాలతో నడుస్తున్న మా గ్రూప్ ఎంతో మంది మిత్రులకు సహాయం గా నిలుస్తుందని బావిస్తున్నాను . ..

కంప్యూటర్ సమస్యలను ఎదురుకొంటున్న  వారు వారి సమస్యలను నా గ్రూప్ లో పోస్ట్ చేసి మా టెక్నికల్ టీం సహాయం తో పరిష్కారాన్ని అందుకొంటున్నారని బావిస్తున్నాను .

కరెక్ట్ గా 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న మా గ్రూప్ లో ఇంచు మించు ప్రస్తుతానికి 12000 మంది మిత్రులను జాయిన్ అయ్యారు ..  అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

అలాగే మా ఎదుగుదల కి  సపోర్ట్ అందిస్తున్న మిత్రులందరికీ  పాదాబివంధనాలు

గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u/

3, మే 2016, మంగళవారం

సరికొత్త అదృశ్య ఫేస్బుక్ ఫీచర్

ఫేస్బుక్ గోప్యత యూసర్ లందరికి స్వచ్చమైన శుభవార్త .

ఎంటబ్బా ?

ఫేస్బుక్ లో నయా గా ఒక అదృశ్య ఫీచర్ రానుంది. అదేంటంటే మనం మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ మాయమవనుంది అంటా.. అగొ ఇదేంది అనుకుంటున్నారా?

అవును కొత్తగా ఈ ఫీచర్ రానుంది ఈ ఫీచర్ ఆన్ చేసుకొన్నా వారికి వారు మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ నామ రూపాలు లేకుండా పోతుంది. ఎందుకు మరి ఇలాంటి ఫీచర్ అంటే ప్రైవసీ సీక్రెట్ చాటింగ్ వారికి ఈ ఫీచర్ బలే ఉపయోగపడనుంది అని తెలుపుతున్నారు ఫేస్బుక్ వాళ్ళు, మనకు తెలుసు కదా ఈ ఫీచర్ ఎవరికీ ఎక్కువగా ఉపయోగపడుతుందో అని ఇగ నేన్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ..

మరి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాకా మరి ఉపయోగాలు ఉన్నాయా లేక నిరుపయోగాలు ఉన్నాయా మనకే తెలుస్తుంది.

1, మే 2016, ఆదివారం

learn Photoshop Today and Now

ఎవరైనా ఫేస్బుక్ లో ఏదైనా ఫోటో ఫోటోషాప్ లో ఎడిట్ చేసి అద్బుతంగా మలిచి పెడితే వావ్.... అనాలి అనిపిస్తుంది .

ఒక్క సారి ఆలోచించండి మరి మనే అలా ఫొటోస్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని .. అలా ఊహ నే ఎంత బాగుందో కదా .. బాగుంటుంది మరి . మరి


మరి నేన్ ఉన్నదీ ఎందుకు మీకు ఏదైనా నేర్పించడానికే . అందుకో మీకోసం ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ ని youtube లో అప్లోడ్ చేస్తున్నాను . నెమ్మదిగా ఫోటోషాప్ నేర్చుకొని మీరు కూడా ఫొటోస్ ని ఆధారగోట్టేయాలి మరి .అందుకే ఇక్కడ నేన్ ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక్క ప్లే లిస్టు గా మర్చి లింక్ అందిస్తున్నాను . ఒక్కోట్టిగా అన్ని చూసేయండి .. ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి వెంటనే కాక పోయిన ఎప్పటికైనా మీ పోస్ట్ లని చూసి ఇతరులు వావ్ అనేలా ఉంటుంది .

మరి రెడీ నా .. ఇదిగోండి ప్లే లిస్టు లింక్ ..


పోస్ట్ చూసి చదివి .. ఇప్పుడు ఏముంది లే తర్వాత చూద్దాం అని వోదిలేయకండి . అలా అలా సరదాకి ఒకటి రెండు చూడండి మీకే ఆసక్తి వస్తుంది . ఎందుకంటే సరళమైన రీతిలో అందరికి అర్ధం అయ్యేలా వీడియోస్ చేసాను .. ఏమైనా సందేహాలున్న తప్పక సంప్రదించవచ్చు . ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను .. ఒక వేలా చూడడానికి సమయం అనుకరించక పోతే బుక్ మార్క్ అయిన చేసి పెట్టుకోండి . వీలు ఉన్నప్పుడు చూడండి .

వీడియోస్ చూసాక మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయాలి మరి .. వెయిట్ చేస్తా ఉంటాను .. మీ రిప్లై కోసం ..

మీ కర్ణా



30, ఏప్రిల్ 2016, శనివారం

Best Opportunity for Earning Online With Social work

ప్రతిఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాని అది అందరు బయట పెట్టలేరు .. కాని ప్రతుత కాలం లో ఇంటర్నెట్ అనేది ప్రజల లోకి చొచ్చుకు పోయి జీవిస్తుంది కావున ఇంటర్నెట్ ఉపయోగించి
తమ ప్రతిభను ,సేవ ను ప్రజలకు అందచేయడం చాల సులభం .

కవితలు రాయడం , కథలు రాయడం , టెక్నాలజీ విషయాలను అందించడం , ఆరోగ్యం గురించి చెప్పడం , మంచి అలావాట్లు చెప్పడం , తేలిక గా అగు ట్రిక్స్ టిప్స్ చెప్పడం ఇలాంటివి
ఎన్నో ఉంటాయి .
మరి వాటిని మీరు ప్రజలకి చెప్పడం లో ఎంతో సహాయ పడిన వారుగా అవుతారు వారి నుంచి అభినందనలు కూడా అందుతాయి.
అలా చేయడం ద్వారా చాల సంతృప్తి దొరుకుతుంది అందులో అనుమానమే లేదు .

ఇలా చేసే వారు కూడా చాల మంది ఉన్నారు . కాని.. ఎక్కడో చిన్న ఆశ ఇంతగా చేస్తున్నాను కదా కనీసం నెట్ కి సరిపడు ఆదాయం వచ్చిన బాగుండు అని . సమస్యే లేదు దాదాపు
అందరికి ఇలానే ఉంటుంది . అందులో తప్పు కూడా లేదు . ఇంత సహాయం చేసిన వాడికి ఏదో ఒక లాభం ఉంటేనే బాగుంటుంది కూడ.. చెప్పుకోవడానికి నామోషీగా ఉన్న వారికి కూడా
సమస్యలు ఉంటాయి కదా .

చాల మంది ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఆన్లైన్ ఎర్నింగ్ డేటా ఎంట్రీ లాంటివి ఉంటె చెప్పండి అని కాని అది ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంత కష్టపడాలో నాకు తెలుసు,ఇలా
social సర్వీస్ ద్వారా ఆదాయం కన్నా ఎక్కువగా సంతృప్తి వస్తుంది నలుగురిలో మంచి పేరు ఉంటుంది , ఇంతకన్నా ఎక్కువ ఎం కావలి వ్యక్తికి ..

అంటే నేన్ చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ఉపయోగించి (బ్లాగ్, వెబ్సైటు లాంటివి) ప్రజలకు తమ వంతు సహాయాన్ని చేకురుస్తున్న వారికి ఎంతో కొంత ఆదాయం వస్తే బాగుంటుంది అని .
కాని సహాయం చేసి డబ్బు అడగడం నూటికి నూరు శాతం తప్పే . మరి ఎలా ఎవరిస్తారు , ఎలా అని ఆలోచిస్తుంటారు.

మరి ఇటువంటి వాటికి నేన్ చెప్పే సమాధానం ఏంటంటే ప్రజల నుంచి తీస్కొంటే తప్పు.. కాని వారు తమ సైట్ ని వీక్షించినందుకు గాను వస్తే తప్పేం లేదు .

అస్సలు అర్ధం కాలేదు కదా .... !

వెబ్సైటు ఉనికి , వీక్షకుల సంక్య , రోజువారి విజిటింగ్ రేటింగ్ ,శాతం బట్టి కూడా ఇతర కంపెనీ లనుంచి డబ్బును సంపాదించుకోవచ్చు. కాక పోతే దీనికోసం మనం కొంచం కష్టపడాల్సి
ఉంటుంది. లేదా సులభంగా కూడా చేస్కోవచ్చు(కొంత ఖర్చుతో కూడుకోనిన) కాని మన ప్రతిభను మాత్రం విడరాదు మీకు సేవ దృక్పథం ఎక్కువగా ఉండాలి ఆదాయం పై మక్కువ
తక్కువగా ఉండాలి అప్పుడు మాత్రం ఎంతో కొంత ఎర్న్ చేయగలరు.

. ఎలాగు మరి ?

ఇప్పుడు అదెలా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
కావున ఆశక్తి ఉన్నవారు ఫేస్బుక్ లో మెసేజ్ చేయగలరు, విషయం తెలుసుకొన్నాకా.. మీ ఇష్టం .

నోట్ : అందరితో కాల్స్ లలో మాట్లాడం అంటే కొంచం కష్టమే అందుకనే మెసేజ్ రూపం లో అయితే ఆసక్తి ఉంటె ముందుకేలతారు లేదంటే ఆగిపోతారు .. నాకు అంతగా ఇబ్బంది గా
ఉండదు . అలాగే దయచేసి కామెంట్ లు పెట్టకండి.. మెసేజ్ పెట్టండి నేన్ రిప్లయ్ ఇస్తాను

mail id : rayarakula.karnakar@gmail.com

10, ఫిబ్రవరి 2016, బుధవారం

Stopping Support To Windows 8 from microsoft


విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేత 

      విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఓఎస్‌ను వాడుతున్న యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా విండోస్ 8కు ముందు వెర్షన్ విండోస్ 7కు సెక్యూరిటీ సపోర్ట్‌ను 2020 జనవరి 14 వరకు కొనసాగించనుండగా, ప్రస్తుతం యూజర్లు కొత్తగా వాడుతున్న విండోస్ 10కు 2025 అక్టోబర్ 14 వరకు సపోర్ట్‌ను అందించనుంది. విండోస్ 7కు కాకుండా విండోస్ 8కు సపోర్ట్‌ను ఆపేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. విండోస్ 7 లా కాకుండా 8 వెర్షన్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదని ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


మూలం : నమస్తే తెలంగాణ

25, జనవరి 2016, సోమవారం

Whats App Life time Validity offer Gives some More


ప్రస్తుత కాలం లో వాట్స్ ఆప్ ఎంత పాపులర్ నో  మనందరికీ తెలుసు 

అయితే ...

ఇంత వరకు సంవత్సరానికి 55 రూ|| చొప్పున తీస్కోని మనకి సర్వీస్ ని అందించేవారు .
అయితే ఇటివల కాలం లో ఎలాంటి రూపాయి ఆశించకుండా అందరికి లైఫ్ టైం సర్వీస్ ని అందించింది. 

మరి ఎం జరిగి ఉంటుంది అంటే .. వివరంగా చెప్తాను ,,, వినుకోండి 

ఇదివరకు మన వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్కోన్తుంది. అంటే ఆదాయం మన వద్ద నుంచి వస్తుంది కావున సరిపోయింది . మరి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేదు మరి ఎలా అంటే . ఇదవరకు డబ్బులు పే చేసాము కావున ఎలాంటి ఆడ్స్ మన వాట్స్ ఆప్ లో రాకపోయేవి. కాని ఇప్పుడు ఫ్రీ సర్వీస్ కావున ఇక పై మన వాట్స్ ఆప్ లో ఆడ్స్ వచ్చేస్తాయి.  చికాకు పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి. 


సంవత్సరానికి మనం ఇచ్చే 55 రూ కన్నా ఆడ్స్ ద్వారా ఒక్కరోజులో వచ్చే ఆదాయం 1000 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు విజ్ఞాన  నిపుణులు.

ఇంత వరకు ఎలాంటి ఆడ్స్ లేకుండా ప్రశాంతగా చాట్ చేస్కోన్నాము కదా . ఇప్పుడు ఇక ఎలానో ఏంటో. నాకు కూడా చాల ఫికర్ ఐతంది. చిరాకు పుట్టిస్తాయి కావున .

మరి పాపం #markzukerberg గారు ఆసితిలో 99% ఇచ్చాడు కదా మరి మల్లి కొంత అయినా సమకూర్చుకోవాలి కదా .

ఇది వాట్స్ ఆప్ లైఫ్ టైం validity అస్సలు కథ 



నా మట్టుకు మాత్రం ఎప్పటి లాగే hike నే ఎక్కువగా వాడుతాను.


15, జనవరి 2016, శుక్రవారం

11, డిసెంబర్ 2015, శుక్రవారం

Google Input Tools Offline Installer

సిస్టం లో తెలుగు ఎలా టైపు చేయాలి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది . అందులో చెప్పిన సూచనలు పాటిస్తే చాలు . 




అయితే ఈ వీడియో లో చూపిన తెలుగు టైపింగ్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవాలంటే 
ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే 

మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ఉంటె  వీడియో చూస్తాము అందులో ఉన్న ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ కూడా  చేస్కోన్టాము . చాల సులభమైన పని  . 

కాని ఒక వేల నెట్ లేని సిస్టం లో తెలుగు ఇంస్టాల్  చేయాలంటే ?

అయ్యో దానికి నా వద్ద అద్బుతమైనా సలహా , పరిష్కారం ఉంది.
ఏంటి అంటే 

గూగుల్  ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేయడానికి నెట్ అవసరం లేకుండా offline installer ఫైల్స్ ని నేను ఇక్కడ పొంధపరచాలు .  కేవలం ఈ ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని  ఏ సిస్టం  లోనైనా ఈజీ  గా గూగుల్ ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవచ్చు .

ఫైల్ లింక్ : www.bit.ly/HS-GIT

గమనిక : ఈ ఫైల్ ని విన్రార్ సహాయం తో ఎక్స్ట్రాక్ట్ చేసాక ఇందులో వచ్చిన రెండు ఫైల్ లలో మొదటగా  ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసాక ఆ తర్వాత తెలుగు టూల్స్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయాలి . 


24, అక్టోబర్ 2015, శనివారం

Learn Photoshop Right Now

ఫోటోషాపుపై ఆసక్తి ఉండీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియోస్ (తెలుగులో) మీకోసం... www.rktechinfo.com

-------------------------------------------------
ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-1 )

ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-2 )

మోనోక్రోమ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఫొటోషాప్ లో 

ఫొటోషాప్ను ఉపయోగించి passport ఫోటోలను తయారు చేయుట

అను స్క్రిప్ట్ మేనేజర్ను విండోస్ 7, 8, 8.1 మరియు విండోస్ 10 లలో ఎలా ఉపయోగించాలి

ఫోటోషాప్ CS6 మరియు CC [14.0] లలో తెలుగు ఎలా టైప్ చేయాలి

ఫోటోలలో పర్సన్ యొక్క జుట్టు తొలగకుండా నీట్_గా బ్యాక్_గ్రౌండ్ మార్చుట

వివిధ రంగులను కలిగి ఉన్న బ్యాక్_గ్రౌండ్_ను తొలగించి కావలసిన బ్యాక్_గ్రౌండ్ అప్లై చేయుట

ఫ్రీ హ్యాండ్ టైపింగ్ ఫోటోషాపులో

లేయర్ మాస్క్ ఫీచర్ ఉపయోగించుట

బ్యానర్లు తయారీ నేర్చుకొనుటకు ప్రాథమిక అవగాహన

తేలికైన పద్దతిలో డ్రస్ కలర్ మార్చుట

ఆకుపై కృత్రిమ నీటి బిందువును సృష్టించుట

అక్షరాలకూ మరియు లేయర్_కు లైటింగ్ ఎఫెక్టు


17, జులై 2015, శుక్రవారం

How to Type Telugu In Photoshop Cs6 & CC(14.0)

ఫోటోలపై మంచి మంచి కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ?

అయితే వాటిని మంచి స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్.
కాని ఫోటోషాప్ లో తెలుగు రాయడం సాద్యం కాదని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.

ఫోటోషాప్ లో తెలుగు రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి.  ఉదాహరణకు అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి ఎన్నో రకాల ఫాంట్స్ ని ఉపయోగిస్తూ తెలుగు రాసుకోవచ్చు కాని అను స్క్రిప్ట్ మేనేజర్ లో రాయడానికి తెలుగు కీబోర్డ్ లేఔట్ లు తెలుసుకొని ఉండాలి అంటే ఆపిల్ , రోమ, ఫోనెటిక్ ఇలాంటివి.
 ఎంతైనా  అంత ఈజీ గా టైపు చేయలేము కొంచం కష్టమే మరియు అది ఫోటోషాప్ 7.0 లేదా 8.0(సి ఎస్) లో మాత్రమే సాద్యమౌతుంది.

గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి రాసినచో అక్షరాలూ విపోతుంటాయి. లేదా ప్రశ్నార్ధకాలు వస్తుంటాయి .

అయితే ఇప్పుడు ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ లు వచ్చాయి . అవి adobe photoshop cs6 (13.0) , Adobe Photosho CC (14.0). అయితే ఇందులో ఒక చిన్న చేంజ్ తో  గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు రాసే అవకాశం ఉంది .


  ఇలా తెలుగు ఈజీ గా టైపు చేయచ్చు . వివిధ రకాల బ్లెండింగ్ ఆప్షన్స్ అదే విధంగా స్టైల్స్ కూడా అదే విధంగా తెలుగు విజయం వారి ఫాంట్స్ కూడా ఉపయోగిస్తూ డిజైన్ చేసుకోవచ్చు
ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా చేసిన ఈ వీడియో లో చూడవచ్చు.



(గూగుల్ ఇన్పుట్ టూల్స్ గురించి తెలుసుకొనుటకు ఇక్కడ పై  క్లిక్ చేయండి: www.bit.ly/HSteGIT )

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు అదే విధంగా సలహాలు ఉంటె తెలియజేయగలరు నేను తప్పకుండ సమాధానం ఇస్తాను ..

మా  అప్డేట్స్ కోసం ఫేస్బుక్  పేజి  లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా వీడియో ఛానల్ : www.youtube.com/rayarakula
అదే విధంగా ఏమైనా కంప్యూటర్ కి సంబంధించిన  సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మీకు తప్పక సమాధానం దొరకుతుంది : గ్రూప్ లింక్ : www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

23, జూన్ 2015, మంగళవారం

How To Make Passport Photos in easy way using photoshop తెలుగులో



న నిత్య జీవితం లో పాస్ ఫోటోలు చాల ఉపయోగపడుతుంటాయి. ఏదైనా అప్లికేషను నింపాలి అన్న పాస్ ఫోటో అదే విధంగా ఒక సిం కొనాలి అన్న పాస్ ఫోటో 

మరి ప్రతి సారి 40 నుంచి 100 రూపాయలు ఈ పాస్ ఫోటో లేక్ అవుతాయి. అదే మనమే చేస్కొంటే ఎలా ఉంటుంది ..  సింపుల్ గ 5 నుంచి 10 రూపాయలలో అయిపోతుంది ..  

మనకు చేయడం రాదూ కదా అంటారా?

దానికెందుకు చింత నేన్ ఉండగా.. అతి సులువుగా పాస్ ఫోటోలను మీ చేస్తా నేన్ చేయిస్తాను .  కేవలం మీ ఫోటో అండ్ మీ సిస్టం లో ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి ఉంటె చాలు .

ఈ ఐడియా ఏదో బాగుంది కదా .. అయితే మరెందుకు ఆలస్యం 

వెంటనే ఈ క్రింది లింక్ నుంచి వీడియో చూడండి. పాస్ ఫోటోలు ఏవిధంగా చేస్తారో తెలుసుకోండి .

Video link : http://bit.ly/HSpassphoto



ఈ వీడియో గనుక ఉపయోగకరమైనది అని మీరు బావిస్తే తప్పక షేర్ చేయండి. 

→ అలాగే మరిన్ని టెక్నికల్ సమాచారాల కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ని సందర్శించండి. 

→ అదే విధంగా మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని subscribe చేస్కొండి మా అప్డేట్ లను మీ మెయిల్ కి పొందండి. 

   youtube ఛానల్ లింక్ : www.bit.ly/HSrayarakula

→ మా official ఫేస్బుక్ పేజి : www.fb.com/heerasolutions

→మీకు కంప్యూటర్ లో ఏవైనా సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మా టెక్నికల్ టీం తప్పక స్పందిస్తారు 
మా గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u

→→ఈ పోస్ట్ పై లేదా వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదా నన్ను సంప్రదించండి ←←

రాయరాకుల కర్ణాకర్​
9014819428
rayarakula.karnakar@gmail.com
www.fb.com/rayarakula

16, జూన్ 2015, మంగళవారం

New Unread Messages Option in Facebook



ఫేస్బుక్ లో మరో కొత్త మార్పు .. 


ఇంతకు ముందు ఎవరైనా మెసేజ్ చేస్తే అది మనం చూస్కోక పోతే అది మల్లి వాళ్ళతో తిరిగి చాట్ చేసే సమయం  లోనే కనిపిస్తుంది లేదా unread మెస్సేజ్ లు  చూస్తేనే తెలుసుతుంది. మరి ఇలా అయితే కొన్ని మెసేజ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది.

 కాని కొత్తగా వచ్చిన మార్పు లో చాట్ బాక్స్ లో గ్రీన్ సిగ్నల్ పక్కన వాళ్ళు మెసేజ్ చేసి ఉంటె ఎన్ని మెసేజ్ లు అయితే చేసినారో అంత సంఖ్య పడుతుంది .
దీని ద్వార మనం ఈజీ గా మెసేజ్ లు వచ్చాయి అని చూస్కోవచ్చు. 

note: ఈ ఆప్షన్ కొందరికి ఎప్పుడో వచ్చి ఉంటుంది మరి కొందరికి ఇంకా రాక పోవచ్చు .. కాని త్వరలోనే అందరికి అప్డేట్ అవుతుంది . 

12, ఏప్రిల్ 2015, ఆదివారం

Stickers on Uploading Photo

క ఐ నుంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటో ల పై స్టికర్ లను అంటిస్తూ డిజైన్ చేస్కోవచ్చు 

ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయంలో ఈ క్రింది ఇమేజ్ లో వాలే మనకి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది దాని పై క్లిక్ చేయాలి 

వెంటనే మనకి ఈ క్రింది ఫోటో వాలే స్టికర్ లని కనిపిస్తుంది . క్లిక్ చేసి మనకి కావాల్సిన స్టికర్ ఎంచుకోవాలి 
 ఫైనల్ గా ఎంచుకొన్న స్టికర్ ని కావలసిన చోట ప్లేస్ చేసేసి డన్ పై క్లిక్ చేయడమే . 

ఈ  పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కంమ్మేంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేన్ తప్పక సమాదానం ఇస్తాను.

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ఫాల్లో అవగలరు .

రాయరాకుల కర్ణాకర్
9014819428

2, ఏప్రిల్ 2015, గురువారం

How to Change Background Around Lots of Hair

ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో  లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు 

అందుకోసమని నేను  ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై  వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ  చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను

వీడియో లింక్ : http://bit.ly/HShaircutting

 తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు.

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు.
subscribe link : www.bit.ly/HSrayarakula

మా టెక్నికల్ బ్లాగ్ ని ఫాల్లో అవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు 
www.heerasolutions.blogspot.com

మా ఫేస్బుక్ పేజి : www.facebook.com/heerasolutions
మా ఫేస్బుక్ గ్రూప్ : www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.fb.com/rayarakula

26, మార్చి 2015, గురువారం

whats app calling



ఆకరికి వాట్స్ అప్ లో ఫ్రీ కాలింగ్ ఫీచర్ కి అధికార పూర్వకంగా అనుమతి లభించింది. ఇప్పటికే ఫేస్బుక్ మెసెంజర్ లో ఫ్రీ కాలింగ్ అందిస్తున్న ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాట్స్ అప్ లో కూడా పూర్తి స్థాయిలో  ఫ్రీ కాలింగ్ ని ఫీచర్ ని ఎనెబల్ చేయడం జరిగింది .

దీనికి కేవలం మనం చేయవలసిందల్ల 
https://www.whatsapp.com/ వెబ్ సైట్ నుంచి లేటెస్ట్ వెర్షన్ వాట్స్ అప్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవడం మాత్రమె .. 

ఈ విషయం నేను వాడిన తర్వాతే మీకు తెలియజేయడం జరిగింది .

మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం నా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు 
www.heerasolutions.blogspot.com

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని విజిట్ మరియు Subscibe చేస్కోగలరు 

నా youtube ఛానల్ లింక్ : www.youtube.com/rayarakula 

మీకు టెక్నికల్ గా ఏమైనా సందేహాలుఉంటె మా ఫేస్బుక్ గ్రూప్ www.facebook.com/groups/PCSolutions4u లో అడగవచ్చు మా టెక్నికల్ టీం మీకు సహాయ పడుతుంది , అదే విధంగా మీరు ఏదైనా టెక్నికల్ సంబధిత సమాచారం ఇతరులకు తెలియజేయాలి అనుకున్న గ్రూప్ లో పోస్ట్ చేయవచ్చు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.facebook.com/heerasolutions

7, మార్చి 2015, శనివారం

How to Use Multi Language Movies



నం చాల సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి YouTube లోను లేదా ఇతర ఆన్లైన్ సైట్స్ లలో కూడా చూడడం మొదలయింది . అంతే కాక టొరెంట్ అనే సదుపాయం తోని సినిమాలు డౌన్లోడ్ చేస్కొని మరి చూసే అవకాశం లభించింది . 

         అయితే ఇలా మనం చూసే సినిమాలలో మనకు కొన్నిసినిమాలు ఇంగ్లీష్ వెర్షన్ లోనివి మరికొన్ని తెలుగు లోను , తమిళ్ లోను ఇలా చాల సినిమాలు పలు భాషలలో రిలీజ్ చేయబడుతున్నాయి. సో వాటిని మనం ఒక లాంగ్వేజ్ లో చూసి ఉంటె మరొక లాంగ్వేజ్ లో చూడడానికి మల్లి వేరే ఫైల్ ని డౌన్లోడ్ చేస్కొని చూడాల్సి వస్తుంది .. దీని వలన మనకు మెమరీ ఫుల్ అంతే కాక డౌన్లోడ్ చేస్కోన్నది నెట్ డేటా వేస్ట్ (fup వాళ్ళకు ) .


 
ఇలాంటి పరిస్తుతులను ఎదుర్కొన్న టొరెంట్ uploaders ఎం చేసారంటే . ఒకే వీడియో లో పలు రకాల భాషలను (ఆడియో) ని అమర్చడం  జరిగింది . అంటే అర్ధం కాలేదా ..? 
అంటే వీడియో ఒకటే కాని ఆడియో (భాషలు) ఎన్నో. అంటే మనం డౌన్లోడ్ చేస్కొన్న వీడియో లో రెండు లేదా అంత కన్నా ఎక్కువ భాషలు అమర్చడం వలన మనం కావలసిన భాషలో చూస్కోవచ్చు.
వీటిని Multi Language Movies అంటారు. వీటిని ఎలా వాడలో తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి : 




గమనిక : ఈ మూవీ కావలి ఆ మూవీ కావాలని నన్ను అడగవద్దు. టొరెంట్ సైట్ లలో దొరికినవి డౌన్లోడ్ చేస్కోవచ్చు.

 ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాదానం ఇస్తాను.  మరిన్ని టెక్నికల్ అప్డేట్ కోసం నా ఈ యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు

రాయరాకుల కర్ణాకర్
www.facebook.com/rayarakula

2, మార్చి 2015, సోమవారం

Photoshop Tools Videos


ఫోటోషాప్ ని ఉపయోగించి అద్బుతమైనా ఫోటో ఎఫెక్ట్స్ డిజైన్స్ create చేయవచ్చు అని మనందికి తెలుసు అలా ఫొటోస్ డిజైన్ చేయాలనీ అందరికి ఉంటుంది  కాని ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయడం అందరికి రాదూ ..

అది రావాలంటే ముందుగా మనకి అందులో ఉన్న టూల్స్ గురించి ఎంతో కొంత అవగాహనా తప్పక ఉండాలి . అలా అయితేనే మనం ఏదైనా ఫొటోస్ డిజైన్ చేయవచ్చు.. 

ఈ ఫోటోషాప్ టూల్స్ పై ప్రతిఒక్కరికి  కొంత అవగాహనా తీసుకరావాలనే ఉద్దేశం తో నేన్ ఈ ఫోటోషాప్ బేసిక్ టూల్స్ వీడియో ని మీకు అందిస్తున్నాను . ఈ వీడియో రెండు పార్ట్ లలో ఉంటుంది .. 


పార్ట్ 1 వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు ..

Photoshop Tools Bar Part 1 Video link  : http://bit.ly/HSPStools



Photoshop Tools Bar Part 2 Video link: www.bit.ly/HSPStools2

 


ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు,సలహాలు  ఉన్నచో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula

www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
https://www.facebook.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula