24, ఏప్రిల్ 2013, బుధవారం

రిమోట్ సరిగా పని చేస్తుందా లేదా అని తెలుసుకోండి...


ప్రతి వాడికి శంకుచక్రం లాగ   బిపి,షుగరు.

 ఎందుకు రావు, ఇప్పడు ఆడవాళ్ళు ఉన్నారు నిద్ర లేచాకా నీళ్ళు తోడడం, వాకిలి తుడవడం, ముగ్గులు వేయడం, వంట, వార్పూ, బట్టలు  ఉతకడం, పిండి రుబ్బడం, తిప్పడం ఇవన్ని చేస్తుంటే జబ్బులెందుకస్తాయి..

అంతే గాని నీళ్ళకి స్విచ్చి, నిప్పులకు స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి, ఆకరికి ఆ స్విచ్ వేసుకోవడానికి కూడా ఓపిక లేకుండా దానికో రిమోట్ స్విచ్చి....
 రాళ్ళు తిని ఆరగ తీసుకోవలసిన వయస్సులో గుప్పిళ్ళ కొద్ది మాత్రలు  మింగే దౌర్బాగ్యం పట్టింది దౌర్బాగ్యం. 

అని ఒక మంచి డైలాగ్ ని తనికెళ్ళ భరణి గారు "మిథునం" అనే సినిమాలో ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి చేత బ్రమ్హాండంగా చెప్పించారు...

అవునండి ఈ కాలంలో టీవీ కి రిమోట్ డీవీడీ కి రిమోట్ ఎ సి కి రిమోట్ మెషిన్ కి రిమోట్  కర్టెన్ కు రిమోట్ ఆకరికి చిన్న పిల్లల ఊయల కు ఊగడానికి కూడా రిమోట్...

అంతగా పని చేసే రిమోట్ పాడైతే ఎలా?

ఈ కాలం లో చూస్తే ఒకరి ఇంట్లో నాలుగైదు రిమోట్ లు కనిపిస్తాయి .. 
మన ఇళ్ళలో ఉండే ఈ రిమోట్ లు ఒక నొక సమయం లో సరిగా పని చేయవు అలా అని వాటిని మనం చావా గొడుతూ ఉటాం... అలాంటి సమయం లో ఆ రిమోట్ లు సరిగా పని చేస్తున్నాయో లేదో అని  తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ మీరు పూర్తిగా చదువుతూ చూడాల్సిందే.

స్టెప్ ౧:

---} పని చేయుట లేదు అని అనుమాన్గా ఉన్న రిమోట్(రేమోట్లను) ని తీసుకోండి.


---} మీ దగ్గర వున్నా మొబైల్ కాని డిజిటల్ కెమారాలో కెమారాను కాని వీడియో కాని ఆన్ చేయండి


--}IR సిగ్నెల్ పూర్తిగా  కనిపించుటకు మీ రూమ్ లో లైట్స్ ని ఆఫ్ చేయండి ( లైట్స్ ఆఫ్ చేయకున్నాను సిగ్నెల్ కనిపిస్తుంది కాని క్లారిటీ కోసం ఆఫ్ చేయండి)


---}రిమోట్ ను మీ కెమెరా కి ఎదురుగా పెట్టండి .


---} మీ రిమోట్ ని కెమెరా కి ఎదురుగా ఉంచి  రిమోట్లో ని ఏదైనా బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి.(కొన్ని బటన్స్ సిగ్నెల్ ని ట్రాన్స్మిట్ చేయవు అందువలన పవర్ కీ ని యూస్ చేయండి)




---} ఆ ఇన్ఫ్రారెడ్ సిగ్నెల్ (IR సిగ్నెల్) ఒక రెడ్డిష్  కాని బ్లూఇష్ కలర్ లో రిమోట్ ముందర ఉండే లైట్ లో కనిపిస్తుంది  అల కనిపించింది అంటే రిమోట్ సరిగానే ఉంది అని అర్ధం.
  


---) ఒక వేల ir సిగ్నెల్ సరిగానే ఉంది కాని టీవీ,డీవీడీ కాని ఇంకా ఏవైనా మషీన్ పని చేయడం లేదంటే మీరు సరిగా మషీన్ వైపు పెట్టడం లేదు అని లేక మషీన్ IR వద్ద ఏదైనా అడ్డుకోవడం కాని జరుగుతుందని అర్ధం ir వద్ద కొంచం ని క్లీన్ చేసి ట్రై చేయండి...


-కర్ణా

22, ఏప్రిల్ 2013, సోమవారం

తెలుగు లో టైపు చేయండి......



         ఎప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం లో తెలుగు ఈజీ గా టైపు చేయాలా ?
ఎ సాఫ్ట్వేర్ లోనైనా తెలుగు టైపు చేయాలా?
తెలుగు టైపు చేయడాకిని మెయిల్ లో టైపు చేసి కాపీ పేస్టు లు చేస్తున్నారా?

ఇప్పుడు అలా చేయడం మానేసి సింపుల్ గా నేను చెప్పే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.కాకపోతే కొన్ని చిన్న చిన్న ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా కావలి...


ఫస్ట్ స్టెప్ :

--> మీరు Microsoft Windows XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే icomplex డౌన్లోడ్ చేసుకోవలసి వస్తుంది.
( Icomplex డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ను పైనా క్లిక్ చేయండి icomplex Download )
--> డౌన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ..తర్వాత ఆదేశం మేరకు  సిస్టం రీస్టార్ట్ చేయండి.
--> Microsoft Windows 7,8  ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నవారికి icomplex అవసరం లేదు ఆల్రెడీ OS లో వస్తుంది.
--> ఈ సాఫ్ట్వేర్ తెలుగు వర్డ్స్ కి కావలిసిన స్సిప్త్స్ ని ఇన్స్టాల్  చేస్తుంది.(ఈ ఫైల్స్ ని XP cd యుస్ చేసి కూడా ఇంస్టాల్ చేసుకోవచ్చు .

సెకండ్ స్టెప్ :

--> గూగుల్ తెలుగు input టూల్స్  డౌన్లోడ్  చేసుకోవడానికి గూగుల్ ఇన్పుట్టు టూల్స్ డౌన్లోడ్ ఈ లింక్ పైనా క్లిక్ చేసి అక్కడ వచ్చిన విండో లో  మనకు కావలిన బాష (తెలుగు ) పై చెక్ మార్క్ చేసి లైసెన్స్ అగ్రీ చెక్ మర్క్ చేసి డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి . గూగుల్ input టూల్స్ డౌన్లోడ్ అవ్తుంది
--> ఆ ఫైల్ ని ఓపెన్ చేసి డౌన్లోడ్ అయ్యేంత వరకు వేచి యుండాలి.
-->డౌన్లోడ్ పూర్తి అయినా తర్వాత టాస్క్ మేనేజర్ పై రైట్ క్లిక్ చేసి టూల్స్ బార్స్ లో లాంగ్వేజ్ బార్ ని సెలెక్ట్ చేసుకోవాలి ..అది ఈ క్రింద చూపించిన విదంగా కనిపిస్తుంది
--> ఆ ఐకాన్ పై క్లిక్ చేసి మనము టైపు చేసే బాషను ఎంచుకోవాలి...
--> ఆ తర్వాత ఎక్కడ టైపు చేసినా తెలుగు లోనే టైపు అవ్తుంది
--> తెలుగు టైపు చేయడానికి వేరే కీ బోర్డు అవసరం లేదు మామూలు గా ఇంగ్లీష్ లో టైపు చేస్తే అది తెలుగు లో చూపిస్తుంది దానితో పాటు suggestions కూడా చూపిస్తుంది


ఈ క్రింది వీడియో ద్వారా మీరు సులువుగా అర్డెం చేసుకోవచ్చు ...



-మీ కర్ణా