30, నవంబర్ 2016, బుధవారం

do's and don'ts in Facebook

ఫేస్బుక్ లో చేయవలసిన పనులు 


మీకు స్వంతం అనే విషయం లేదా అర్తికల్
మీ ఫీలింగ్ లేదా ఆక్టివిటీ
ప్రెసెంట్ లొకేషన్
మీ స్వంత విషయాల లైవ్ వీడియోలు
మీ ఫొటోస్, వీడియోస్ లేదా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేని ఫొటోస్ వీడియోస్
మీ పోస్ట్ లతో సంబదిత వ్యక్తులకే ట్యాగ్ చేయడం
మీరు పోస్ట్ చేసిన ఫోటోలో మీ మిత్రులు వుంటే వారికి మాత్రమే ట్యాగ్ చేయడం
మీకు ఇతరులకు ఉపయోగపడే విషయాలను ఇతర వెబ్సైటు   లనుంచి తీసుకొన్న యడల వెబ్సైటు లేదా వారి పేరును తెలియజేయడం
నచ్చిన విషయాలకు మాత్రమే like, కామెంట్ చేయడం
నిర్ణయించుకున్న ఈవెంట్ నే ఎంచుకోవడం

మొదలగునవి.



ఫేస్బుక్ లో నిషేధమైన పనులు

ఇతరుల కంటెంట్ ని కాపీ చేసి తమ పేరు రాసుకొని పోస్ట్ చేయడం
చెడు విషయాలను పోస్ట్ చేయడం
ఇతరులను తప్పు దారి పట్టించడం
అనవసరపు పోస్ట్ లు చేయడం
→ like ల ఆశకి సంబంధం లేని వ్యక్తులకు ట్యాగ్ చేయడం
కామెంట్ లు పెంచుకొనే ఉద్దేశిత పోస్ట్ లను పోస్ట్ చేయడం
అంగీకారము లేకుండా గ్రూప్ లలో ఇతరులను ఆడ్ చేయడం
పేజిలను like చేయమని మెసేజ్ చేయడం విసిగించండం
ఇతరుల ఫోటోలను,వీడియోలను డౌన్లోడ్ చేసి పోస్ట్ చేయడం
youtube నుంచి వీడియో లను డౌన్లోడ్ చేసి పోస్ట్ చేయడం
వెబ్సైటు లోని విషయాన్ని కాపీ చేసి పోస్ట్ చేయడం
అసభ్యకరమైన పోస్ట్ లను పోస్ట్ చేయడం ,like కామెంట్ చేయడం
తెలియని స్పాం లింక్ లపై ఏదో ఆశించి క్లిక్ చేయడం

ఇంకా ఎన్నో మరెన్నో.......

ఇంపార్టెంట్ 

   ఇంత చిన్న ఫేస్బుక్ లో ఇన్ని రూల్స్ నా అంటే తప్పవు మరి ఇదే ఫేస్బుక్ నుంచి పైకి వచ్చిన ఎందరో వ్యక్తులు కూడా ఉన్నారు కదా ఇలాంటి రూల్స్ అన్ని తప్పక పాటించిన వాడే ఎలాంటి సమస్యలో పడకుండా ఉంటాడు. ఒక వేల ఇలా కాదని ఉల్లంగించిన యడల మీ ఫేస్బుక్ కి దూరం కావలసి ఉంటుంది .
ఫేస్బుక్ ఫేక్ ఎకౌంటు, పేజి , గ్రూప్లను నిర్మూలుంచే విధానం పైగా చాల కటిన చర్యలు  తీసుకోబోతున్నధీ ఫేస్బుక్ . కావున తామెల్లరు కొంచం జాగ్రత్తగా ఫేస్బుక్ ని వాడధలసింది గా కోరుచున్నారు. Jio నెట్వర్క్ తో ఇండియా ఉన్నట్టు ఉండి ఫేస్బుక్ యూసర్ ల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు ఫేస్బుక్ వాళ్ళు తెలియజేసారు. కావున ఫేస్బుక్ లోని యూసర్ లందరినీ కట్టు దిట్టం చేసే దిశగా ఫేస్బుక్ పయనించనుంది.
ఉదాహరణకు youtube లో ఎన్ని రకాల వీడియో లు లభిస్తున్నాయి అందులోంచి వీడియో లు డౌన్లోడ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసే వీరులు ఎంతో మంది ఉన్నారు దాని వలన youtube లో వీడియో వ్యూస్ తగ్గడం జరుగుతుంది కావున నిర్దిష్టమైన అంచనా లేకుండా పోయింది కావున అలా చేసిన వారి ఎకౌంటు ని వెంటనే disable చేసేస్తుంది ఫేస్బుక్. అన్ని వీడియో లు తొలగించిన తర్వాత అగ్రిమెంట్ తీస్కోని ఆ తర్వాత మల్లి ఆ ఎకౌంటు కి accessని కల్పిస్తుంది. అయినప్పటికీ వారు నెల రోజులవరకు ఎలాంటి like కామెంట్ పోస్ట్ మెసేజ్ చేయకుండా కాముగా ఉండేలా కేవలం ఇతరుల పోస్ట్ లు చూసే విధంగా మాత్రమే అనుమతి లభిస్తుంది.  కావున ఆ పని చేసే మిత్రులారా ఇక మీ పనికి పులిస్టాప్ పెట్టేయండి.
ఇలాంటి మరెన్నో చర్యలు తీసుకుంటుంది ఫేస్బుక్ ..

మరింత సమాచారం తో మల్లి కలుస్తాను
మీ కర్ణాకర్


15, నవంబర్ 2016, మంగళవారం

Memory Capacities

1 Bit = Binary Digit
8 Bits = 1 Byte
1024 Bytes = 1 Kilobyte
1024 Kilobytes = 1 Megabyte
1024 Megabytes = 1 Gigabyte
1024 Gigabytes = 1 Terabyte
1024 Terabytes = 1 Petabyte
1024 Petabytes = 1 Exabyte
1024 Exabytes = 1 Zettabyte
1024 Zettabytes = 1 Yottabyte
1024 Yottabytes = 1 Brontobyte
1024 Brontobytes  = 1 Geopbyte
1024 Geopbyte = 1 Saganbyte
1024 Saganbyte  = 1 Pijabyte
1024 Pijabyte  = 1 Alphabyte
1024 Alphabyte  = 1 Kryatbyte
1 Amosbyte = 1024 Kryatbyte
1024 Amosbyte  = 1 Pectrolbyte
1024 Pectrolbyte  = 1 Bolgerbyte
1024 Bolgerbyte  = 1 Sambobyte
1024 Sambobyte  = 1 Quesabyte
1024 Quesabyte  = 1 Kinsabyte
1024 Kinsabyte  = 1 Rutherbyte
1024 Rutherbyte  = 1 Dubnibyte
1024 Dubnibyte  = 1 Seaborgbyte
1024 Seaborgbyte  = 1 Bohrbyte
1024 Bohrbyte  = 1 Hassiubyte
1024 Hassiubyte  = 1 Meitnerbyte
1024 Meitnerbyte  = 1 Darmstadbyte
1024 Darmstadbyte  = 1 Roentbyte
1024 Roentbyte  = 1 Coperbyte

    

8, నవంబర్ 2016, మంగళవారం

500, 1000 రూపాయల నోట్లు చెల్లవు

రేపటి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు . కాని వాటిని మార్చుకొనే అవకాశం 50 రోజుల వరకు ఉంది . బ్యాంకు లలో మార్చుకోవచ్చు. నల్ల ధనాన్ని నామరూపాలు లేకుండా తొలగించే ద్యేయంగా ఈ నిర్ణయం తీస్కోన్నది.
రేపు మరియు ఎల్లుండి ATM లు బంద్. రేపు ఒక్కరోజు మాత్రమే బ్యాంకులు బంద్. ATM నుంచి రోజుకు 10,000 తీస్కోనుటకు పరిమితం. వారానికి 20,000 పరిమితం.
వచ్చే నెల నుంచి కొత్త 500 రూ నోట్లు, 1000 రూ నోట్లు  మరియు 2000 రూ నోట్లు  రానున్నాయి .

    

3, నవంబర్ 2016, గురువారం

TSPSC Group II Hall Ticket Download

GROUP II HALL TICKET DOWNLOAD

► తెలంగాణలో 1,032 గ్రూప్‌-2 పోస్టులకు ఈనెల 11,13 తేదీల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 1,032 గ్రూప్‌-2 పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈనెల 11,13 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, పేపర్‌-3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2, పేపర్‌-4 రాతపరీక్షలు జరుగుతాయి. గ్రూప్‌-2 రాతపరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థులకు సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సూచనలు విడుదల చేసింది. అభ్యర్థులు బూట్లు తొడుక్కొని పరీక్షా కేంద్రాల్లోకి హాజరుకావొద్దని కోరింది. బూట్లతోపాటు నగలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించి రాకూడదని సూచించింది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్‌, చేతిబ్యాగులు, పర్సులు, నోటుపుస్తకాలు, చార్టులు, రికార్డింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్లు వంటివి పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దని తెలిపింది.

► అభ్యర్థులు చేతివేళ్లపైన గోరింటాకు (మెహిందీ), ఇంక్‌ వంటివి లేకుండా రావాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని తెలిపింది. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం జరిగే పరీక్షకు 8.15 గంటలకు ద్వారం (గేటు) తెరుస్తారని 9.45 గంటలకు మూసివేస్తారని తెలిపింది. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1.15 గంటల నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, గేట్లు మూసివేయబడతాయని తెలిపింది. తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్‌ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని పేర్కొంది. ఆ వివరాలను టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తామని తెలిపింది. ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరుకాకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ కవర్‌లోనే ఓఎంఆర్‌ ఉంటుందని తెలిపింది. ప్రశ్నాపత్రం సీల్‌కు ఇబ్బంది కలగకుండా ఓఎంఆర్‌ను తీసుకోవాలని సూచించింది. గంట మోగడం లేదా ప్రకటన చేసిన తర్వాతే ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ను విప్పాలని కోరింది. ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ కోడ్‌ 7 నెంబర్లతో ఉంటుందని, బుక్‌లెట్‌ సిరీస్‌ కోడ్‌ రెండు డిజిట్లు (ఏబీ, బీసీ, సీడీ, డీఏ) ఉంటుందని, ఓఎంఆర్‌ జవాబు పత్రం7 నెండర్లతో ఉంటుందని తెలిపింది.

► ఓఎంఆర్‌ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతోనే రాయాలని సూచించింది. పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్‌ ఓఎంఆర్‌ పత్రంతో పరీక్షా కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది.

To Download Your 
Group II Hall ticket Download : Click Here
Download Your Group II Hall ticket Download : Click Here

పై లింక్ పై క్లిక్ చేసి మీ TSPSC OTR (one time registration) నెంబర్ ని ఎంటర్ చేసి అలాగే డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి గో అనే బటన్ పై క్లిక్ చేయండి వెంటంటే మీ పేరుతో డౌన్లోడ్ అనే బుట్టిఒన్ కనిపిస్తుంది డౌన్లోడ్ అనే బటన్ పై క్లిక్ చేసి మీ గ్రూప్ 2 హాల్ టికెట్ ని పొందవచ్చు . ముందుగా ప్రింట్ తీస్కోని సరిచూస్కోగలరు.
అలాగే పరీక్షా కేంద్రము తెలియని యెడల ఒక రోజు ముందుగానే వెళ్లి చూస్కొని రాగలరు. 

♥ అల్ ది బెస్ట్ ♥

read post in english : click here