31, మే 2014, శనివారం

How to Transfer Files Fastly (Andriod)

 ఆండ్రాయిడ్ లో ఏదైనా ఫైల్ ని షేర్ చేయాలంటే మనం బ్లూటూత్ ని వాడుతుంటాం. అది కొద్దిగా స్లో గా అనిపిస్తుంది . ఇంకా వేగంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనిపిస్తే దానికి మనం WiFi ని ఉపయోగించి ఫైల్స్ షేర్ చేయవచ్చు. అదెలా చేయాలో ఈ పోస్ట్ లో మీరు చూడవచ్చు .. 

WiFi టెక్నాలజీ ని ఉపయోగించి ఫైల్ షేర్ చేయడానికి మనకు ఉపయోగపడే అప్లికేషను " ఫ్లాష్ ట్రాన్స్ఫర్ " . దీని ద్వార మనం wifi ని ఉపయోగించి ఫైల్స్ ని ఈజీ గా స్పీడ్ గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు .. 


ఇది ఎలా పని చేస్తుంది ?


ఇదెల పని చేస్తుంది అంటే ఫైల్ ని ఒకరి మొబైల్ నుంచి ఇంకొరికి పంపించాలనుకున్నప్పుడు ఈ అప్లికేషను  ఒకరి మొబైల్ లో wifi ని portable Wi-Fi హాట్ స్పాట్ గా మార్చేస్తుంది .. మరొకరి మొబైల్ లో WiFi ని enable చేసి ఇంతకు ముందు చేయబడిన హాట్ స్పాట్ కి కనెక్ట్ అయిపోతుంది .. అంటే ఇప్పుడు ఈ రెండు మొబైల్స్ ఒకే నెట్వర్క్ లో కమ్యూనికేట్ అయ్యాయి అన్నమాట .. తర్వాత ఫైల్స్ ని షేర్ ఈ అప్లికేషను ద్వార షేర్ చేస్కోవచ్చు .. 

ఫైల్ షేర్ చేసే సమయం లో గాల్లరీ కి వేరుగా ఆడియో వీడియో కి వేరుగా అప్లికేషన్స్ కి వేరుగా ట్యాబు లు ఇవ్వబడుతాయి కావున ఈజీ గా షేర్ చేస్కోవచ్చు .. 

ఉపయోగించే విధానం :


→ ముందుగా ఈ లింక్ నుంచి ఈ అప్లికేషను APK ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవాలి .. : http://bit.ly/HSftAPK


→ ఇన్స్టాల్ కాగానే మెనూ లోకేల్లి Flash Transfer ఓపెన్ చేయాలి.
→ Flash Transfer ఓపెన్ అవ్వగానే అది కొన్ని instructions చూపిస్తుంది . వాటిని ఒక్కసారి చదువుతూ లెఫ్ట్  సైడ్ కి swipe చేసేయండి . → తర్వాత Start Sharing అనే బటన్ పై tap చేయండి .. 
→ ఒక ప్రొఫైల్ ఫోటో ని అదే విధంగా ఒక నిక్ నేమ్ ని సెట్ చేస్కొని సేవ్ పై tap చేయండి .
→ సేవ్ చేసిన వెంటనే flash transfer ఆక్టివేట్ అవ్తుంది. కనెక్ట్ కావడానికి మనకి Connect with Friends అనే బటన్ పై tap చేయాలి .
→ Connect with Friends అనే బటన్ పై tap చేయగానే మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి . అందులో ఒక ఒక డివైస్ లో మరొక ఆప్షన్ ఇంకో డివైస్ లో చేయాల్సి ఉంటుంది . 

దేనికంటే మొబైల్1 లో మొదటి ఆప్షన్ Create a group ని ఎంచుకుంటే ఒక గ్రూప్ అనేది create చేయడం జరుగుతుంది అన్న మాట అంటే portable wifi హాట్ స్పాట్ create చేయబడుతుంది. మొబైల్2 లో Scan to join ని ఎంచుకోవాలి దాని ద్వార ఆల్రెడీ మొబైల్1 లో  create చేయబడిన హాట్ స్పాట్ ని ఇది స్కాన్ చేసి చూపిస్తుంది. మొబైల్1 అయితే దానిపై tap చేయగానే అది wifi ని enable చేస్కొని కనెక్ట్ అయిపోతుంది . అంటే రెండు మొబైల్స్ ఒకే నెట్వర్క్ లోకి కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. 
→ కనెక్ట్ అవ్వగానే రెండు డివైస్ లలో  వాటర్ డ్రాప్ సౌండ్ వస్తుంది . అదే విధంగా Connect with friends అనే ఆప్షన్ వద్ద అది పోయి మనం ఎవరితోనైతే కనెక్ట్ ఐ ఉన్నామో వారి పిక్ అండ్ పేరు వస్తుంది. 

→ ఆ తర్వాత క్రింది లైన్ లో కనిపించే వాటిల్లో app లో అప్ప్స్ అండ్ గేమ్ అనే రెండు ట్యాబు లుంటాయి మనకి ఏది పంపాలి అనుకుంటున్నామో దాని పై క్లిక్ చేసి మొబైల్ shake చేస్తే చాలు అది ఇతర మొబైల్ లోకి ట్రాన్స్ఫర్  అయిపోతాయి.  అదే విధంగా ఇమేజ్ , మీడియా (ఆడియో, వీడియో ). ఫైల్ (ఫైల్ మేనేజర్) లో ఏవైనా మీరు సెలెక్ట్ చేస్కొని shake చేస్తే చాలు ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి .. 

ఎం ఎం మనం పంపాము . ఎం రిసీవ్ చేస్కోన్నాము అనేదిమానం హిస్టరీ లో చూస్కోవచ్చు .. 


→ ఈ ఫైల్ లింక్ పని చేయని యడల తెలుపగలరు. 

→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్

17, మే 2014, శనివారం

How to Synchronize Audio and Video


       
కొన్ని సినిమాలు (డౌన్లోడ్ చేసినవి లేదా purchase చేసినవి) చూసినట్లయితే అందులోని ఆడియో అనేది వీడియో కి పర్ఫెక్ట్ గా సింక్ అవ్వకుండా కొంచం ముందుగానో లేదా లేట్ గానో రావడం జరుగుతుంది.  
అలాంటప్పుడు మనకు ఆ సినిమా చూడాలంటె విసుగు వచ్చేస్తుంది. ఇక ఆ సినిమాని కట్టేసి అంతే కాక డిలీట్ కూడా చేస్తుంటాము. 

  అలా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా మనం ఆడియో ని వీడియో తో పర్ఫెక్ట్ గా సింక్ చేస్కొని చూస్కోవచ్చు. 
అదేలగా అంటారా ?


వీడియో ఆడియో సింక్ చేయడానికి చాల అప్లికేషన్స్ ఉన్నప్పటికీ నేను vlc మీడియా ప్లేయర్ లో ఏవిధంగా చేయాలో ఈ పోస్ట్ లో చూపించాను. 

మీరు చూడాలనుకున్న వీడియో ప్లే చేయండి , ప్లే అవుతున్న సమయం లో క్రింది ఇమేజ్ లో వలె tools మెనూ లోకేల్లి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో Track Synchronization పై క్లిక్ చేయాలి (Tools→Track Synchronization) షార్ట్ కట్ కీ alt+0 then T.


ఇలా ట్రాక్ synchronization పై క్లిక్ చేయగానే మనకి కింది ఇమేజ్ లో వలె ఒక విండోస్ వస్తుంది . వాయిస్ (ఆడియో) ముందుగా వస్తూ వీడియో లేట్ గా వస్తున్నట్లయితే 
Audio Track Synchronization :  లో ప్లస్ (delayed) వాల్యూస్ ఇస్తూ ఎన్ని సెకన్స్ తేడా గా వస్తుందో చూస్తూ వీడియో ని సీక్ చేస్తూ పర్ఫెక్ట్ గా సింక్ చేస్కోవచ్చు .

వాయిస్ (ఆడియో) లేట్ గా వస్తూ వీడియో ముందుగా  ప్లే అవుతుంటే Audio Track Synchronization : లో మైనస్
(Hastended) వాల్యూస్ ఇస్తూ ఎన్ని సెకన్స్ తేడా గా వస్తుందో చూస్తూ వీడియో ని సీక్ చేస్తూ పర్ఫెక్ట్ గా సింక్ చేస్కోవచ్చు.

అదే విధంగా ఈ విండో లోనే subtitles ని కూడా సింక్ చేస్కోవచ్చు . 
--------------------------------------*------------------------------------------→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్

13, మే 2014, మంగళవారం

How to cahnge language in Multi Language Movies

     
నం చాల సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి youtube లోను లేదా ఇతర ఆన్లైన్ సైట్స్ లలో కూడా చూడడం మొదలయింది . అంతే కాక టొరెంట్ అనే సదుపాయం తోని సినిమాలు డౌన్లోడ్ చేస్కొని మరి చూసే అవకాశం లభించింది . 

అయితే ఇలా మనం చూసే సినిమాలలో మనకు కొన్నిసినిమాలు ఇంగ్లీష్ వెర్షన్ లోనివి మరికొన్ని తెలుగు లోను , తమిళ్ లోను ఇలా చాల సినిమాలు పలు భాషలలో రిలీజ్ చేయబడుతున్నాయి. సో వాటిని మనం ఒక లాంగ్వేజ్ లో చూసి ఉంటె మరొక లాంగ్వేజ్ లో చూడడానికి మల్లి వేరే ఫైల్ ని డౌన్లోడ్ చేస్కొని చూడాల్సి వస్తుంది .. దీని వలన మనకు మెమరీ ఫుల్ అంతే కాక డౌన్లోడ్ చేస్కోన్నది నెట్ డేటా వేస్ట్ (fup వాళ్ళకు ) .

 ప్రస్తుత కాలంలో torrents చాల రన్నింగ్ లో ఉన్నాయి . చాల రకాల torrents సైట్స్ కూడా లభిస్తుంటాయి . టొరెంట్ uploaders పరంగా ఆలోచిస్తే  ఏదైనా సినిమాను పలు భాషలో అప్లోడ్ చేయాలి అంటే అన్ని రకాల సినిమాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది . దీని వలన వాళ్ళకి టైం వేస్ట్ అండ్  ఎవరైనా అక్కడ అప్లోడ్ చేసిన సినిమా ని చూసి "ఓహ్ ఈ సినిమా ఇంకో బాషలో ఉంటె బాగుండు" అనుకోని వోదిలేస్తుంటారు.

ఇలాంటి పరిస్తుతులను ఎదుర్కొన్న టొరెంట్ uploaders ఎం చేసారంటే . ఒకే వీడియో లో పలు రకాల భాషలను (ఆడియో) ని అటాచ్ చేయడం జరిగింది . అంటే అర్ధం కాలేదా ..? 


పై ఇమేజ్ గమనించినట్లైతే  ఒక సినిమా తమిళ్ + హిందీ + ఇంగ్లీష్ + తెలుగు అని నాలుగు బాషల కలయిక తో ఉన్నదీ ఈ సినిమా. అంటే వీడియో ఒక్కటే కాని ఆడియో లు మాత్రం ఇలా 4 బాషలు ఉన్నాయి  అంటే మనం ఈ సినిమా తెలుగు లో చూడాలి అంటే తెలుగు లో లేదా హిందీ లో అంటే హిందీ లో తమిళ్ లో అంటే తమిల్ లో వస్తుంది .  అయితే ఫస్ట్ సినిమా ఓపెన్ చేయగానే ఏదో ఒక లాంగ్వేజ్ డిఫాల్ట్ గా వస్తుంది. మనం చేంజ్ చేస్కొంటే సరిపోతుంది . 

లాంగ్వేజ్ ఎలా సెలెక్ట్ చేస్కోవాలి ?
కొన్ని ప్లేయర్ లో ప్లేయర్ లో ఆడియో అనే ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతానికి చాల మంది vlc అండ్ km లాంటివి వాడుతున్నారు.. ఇంకా ఇలా ఎన్నో ప్లేయర్స్ వాడుతున్నారు కాని ప్రస్తుతానికి నేన్ ఆడియో ఆప్షన్ తెలియ దానికి ఈ రెండు చూపిస్తాను అన్నింట్లోను సెం ఉంటుంది కావున 

♫ VLC media Player :

 VLC మీడియా ప్లేయర్ వాడే వారు సింపుల్ గా వీడియో ప్లే అయ్యే సమయం లో  Right Click చేసి Audio అనే ఆప్షన్ లో ఉన్న Audio Track  లోకి వెళ్ళగానే మనకి లభిస్తున్న లాంగ్వేజ్స్ లిస్టు చూపిస్తుంది సింపుల్ గా సెలెక్ట్  చేస్కోవడమే. క్రింది ఇమేజ్ లో చూడవచ్చు . 
♫ Km Player :
   వీడియో ప్లే చేసి రైట్ క్లిక్ చేసి Audio ఆప్షన్ లోకేల్లి Stream Selection లో మనకు కావలసిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్కోవచ్చు .. లేదా సింపుల్ గా వీడియో ప్లే అవ్తున్న సమయం లో ctrl+x కొడుతూ సీక్వెన్స్ గా ట్రాక్ చేంజ్ చేస్కోవచ్చు . క్రింది ఇమేజ్ లో చూడవచ్చు . కొన్ని మూవీస్ వేరే ఆడియో లోకి చేంజ్ అయితే వాయిస్ సరిగా రాక పోవచ్చు వేరే ప్లేయర్ లో ట్రై చేస్తే సరిపోతుంది. 


→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్ 

6, మే 2014, మంగళవారం

How To Take Screen Shot

        సిస్టం లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఎవరికైనా సొల్యూషన్ చెప్తున్నప్పుడు స్క్రీన్ కాప్చర్ అనునది మనకు చాల ఉపయోగ పడుతుంది, అదెలా అంటారా! మీరు సిస్టం పై ఏదైనా వర్క్ చేస్తున్నప్ప ఏదైనా సందేహం గనుక వస్తే ఈ విషయాన్ని ఎవరినైనా అడగాలనుకుంటారు కాని ఎక్స్ప్లెయిన్ చేయలేక పోయినప్పుడు ఆ స్క్రీన్ ని కాప్చర్ చేసి  వారికి పంపి ఇది ప్రాబ్లం అని డౌట్ క్లారిఫయ్ చేస్కోవచ్చు. వాళ్ళకు కూడా ఎ ఇబ్బంది లేకుండా క్లారిటీ గా అర్ధం అవ్తుంది .పరిష్కారం తొందరగా దొరుకుతుంది . అదే విధంగా మీరు ఎవరికైనా ఒక సాఫ్ట్వేర్ గాని లేదా ఇంకా ఏదైనా ఆప్షన్ గురించి ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ స్క్రీన్ కాప్చర్ అనినది చాల ఉపయోగ పడుతుంది . కంప్యూటర్ ఫీల్డ్ లో ఇంతగా ఉపయోగ పడే ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి .అందువలన ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా తీస్తారో తెలుసుకుందాం.
స్క్రీన్ షాట్ తీయడానికి 3rd పార్టీ సాఫ్ట్వేర్ చాల ఉన్నపటికి ఎలాంటి సాఫ్ట్వేర్ ని యూస్ చేయకుండా మనకి విండోస్ తో పాటు వచ్చే అప్లికేషన్స్ సరిపోతాయి .
Windows 7 మరియు 8 Users కోసం :
Windows XP Users కోసం :


          విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న వారు స్క్రీన్ షాట్ తీయడానికి ముందుగా ఏ స్క్రీన్ ని అయితే మీరు కాప్చర్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి  మీ కీబోర్డు  లోని ఎడిటింగ్ బటన్స్ కి పైన ఉండే Print Screen SysRq (క్రింది ఇమేజ్ చూడండి)  అనే బటన్ ని ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయగానే ప్రస్తుతం కనిపిస్తున్న స్క్రీన్ క్లిప్ బోర్డు లోకి కాపీ అవుతుంది (క్లిప్ బోర్డు అనగా మనం ఏదైతే కాపీ చేస్తామో అది temporary గా స్టోర్ అయ్యే డైరెక్టరీ).


 తర్వాత మీడియా అప్లికేషను లో పేస్టు చేయడం ద్వారా సింపుల్ గా కాపీ చేసిన స్క్రీన్ పేస్టు చేయడం జరుగుతుంది. అందుకే ఫోటోషాప్, పెయింట్ లాంటి వాటిలో పేస్టు చేసి క్రాప్, టెక్స్ట్ టైపింగ్ లాంటివి చేసి ఎడిటింగ్ చేస్కోవచ్చు. 

      ఫోటోషాప్ లాంటి వాటిలో కొత్త డాక్యుమెంట్ తీసుకొనే సమయం లో మనం Print Screen SysRq తో కాపీ చేసిన స్క్రీన్ సైజు ఆటోమేటిక్ సైజు పర్ఫెక్ట్ గా తీసుకుంటుంది అందువలన జస్ట్ మనం ఓకే కొట్టి పేస్టు (ctrl+v) చేస్తే సరిపోతుంది,  ఎడిటింగ్ లాంటివి చేస్కోవడానికి వీలుగా ఉంటుంది.


    విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం యూస్ చేస్తున్నవారు XP లో చేసిన విధానాన్ని కూడా యూస్ చేస్కోవచ్చు.. 
కాని మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు విండోస్ 7 యూసర్ల కోసం స్నిపింగ్ టూల్ 
( Snipping Tool ) in-build అప్లికేషను ఒకటి అమర్చారు. దీనితో స్క్రీన్ షాట్ తీయడం చిన్న చిన్న ఎడిటింగ్ ఆప్షన్ కూడా కలదు .. 
 (విండోస్ 7 యూసర్లు స్టార్ట్ మెనూ లో సెర్చ్ చేసి దీని పట్టుకోవచ్చు. 
విండోస్ 8 వాడుతున్నవారు టైల్స్ వద్ద సెర్చ్ చేసి పట్టుకోవచ్చు) 
 ఈ అప్లికేషను ని ఓపెన్ చేయగానే మనకి క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా విండోస్ వస్తుంది 

 New పక్కన ఉన్న చిన్న ఆరో బటన్ ని క్లిక్ చేయగానే అందులో మనకి క్రింది ఇమేజ్ లాగా ఆప్షన్ వస్తాయి. 
ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి వివరిస్తాను.
  1. Free-form snip = ఇది మనకి కావలసిన బాగాన్ని మౌస్ తో గీసుకుంటూ ఇష్ట ప్రకారం కాప్చర్ చేస్కోవచ్చు . స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కలవగానే కాప్చర్ అవ్తుంది .
  2. Rectangular Snip = ఇది దీర్గ చతురస్ర రూపం లో కావలసిన దానిని కాప్చర్ చేస్కోవచ్చు.
  3. Window Snip =  ఓపెన్ అయి ఉన్న విండోస్ ని కాప్చర్ చేస్కోవచ్చు.
  4. Full-Screen Snip = ఫుల్ స్క్రీన్ కాప్చర్ చేస్తుంది అందులో ఏవేవి ఓపెన్ అయి ఉన్న అన్ని కాప్చర్ చేయబడుతాయి .
 కాప్చర్ అయిన తర్వాత ఇలా మనకి పై విండో వస్తుంది అందులో పెన్సిల్ , ఎరేజర్, హైలైటర్ లాంటి టూల్స్ లబిస్తాయి .  ఎడిటింగ్ కోసం ఈజీ గా ఉంటుంది .

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

note : ఈ సమాచారం గనుక ఉపయోగకరమని భావిస్తే ఇతరులకు షేర్ చేయండి .
మా youtube ఛానల్ : www.youtube.com/rayarakula
→ ధన్యవాదాలు ←
రాయరాకుల కర్ణాకర్


4, మే 2014, ఆదివారం

మీ న్యూస్ ఫీడ్ లో ఇబ్బంది పెట్టె పోస్ట్ లు రాకుండా చేస్కోవడం ఎలా ? (facebook)

    facebook లో కొందరి పోస్ట్ లు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. పోనీ  unfriend చేసేద్దాం అనుకుంటే వారు మనకు తెలిసిన వారు లేదా కావాల్సిన వారు అయితే వారిని unfriend చేయలేము, బ్లాక్ అంతకన్నా చేయలేము. అలాంటి సమయం లో వారి పోస్ట్ లు మన న్యూస్ ఫీడ్ లో రాకుండా చేస్కోవడానికి ఒక చిన్న ఆప్షన్ ఉంది అదే unfollow. ఈ ఆప్షన్ వలన ఎవరినైతే మనం unfollow చేసామో వారికి మనం వారిని ఎలాంటి నోటిఫికేషన్ పోదు అందువలన మనం వారిని unfollow  చేసాము అనే విషయం వారికి తెలియదు .

ఈ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం .

ఎవరి పోస్ట్ లైతే మీ న్యూస్ ఫీడ్ లో కనిపించ వద్దు అనుకుంటున్నారో వారి పోస్ట్ కి రైట్ సైడ్ కనిపించే డౌన్ ఆరో వద్ద క్లిక్ చేయాలి (క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా )
  అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పాప్ అప్ వస్తుంది. అక్కడ కనిపించే unfollow <వారి పేరు>  పై క్లిక్ చేయగానే ఇక పై వారి పోస్ట్లు మీ న్యూస్ ఫీడ్ లో కనిపించవు .. 
( లేదా )
 వారి ప్రొఫైల్ ని ఓపెన్ చేసి వారి కవర్ ఫోటో రైట్ సైడ్ క్రింద కనిపించే ఆప్షన్ లలో ఫాలోయింగ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే అది ఫాలో గా మారి పోతుంది అంతే .. ఇక వారి పోస్ట్ లు మీ న్యూస్ ఫీడ్ లో  రావు.. క్రింది ఇమేజ్ లో గమనించ వచ్చు .
  మీరు వారి పోస్ట్ లు గనుక చూడవలసి వస్తే వారి ప్రొఫైల్ ఓపన్ చేసి చూడవచ్చు .. అదే విధంగా ఏదైనా పరిస్థుతులలో వారిని మల్లి ఫాలో అవ్వాలనుకుంటే వారి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో అని బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది .

  → ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేన్ తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .


Thank You 


రాయరాకుల కర్ణాకర్