email లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
email లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2016, సోమవారం

Whats App Life time Validity offer Gives some More


ప్రస్తుత కాలం లో వాట్స్ ఆప్ ఎంత పాపులర్ నో  మనందరికీ తెలుసు 

అయితే ...

ఇంత వరకు సంవత్సరానికి 55 రూ|| చొప్పున తీస్కోని మనకి సర్వీస్ ని అందించేవారు .
అయితే ఇటివల కాలం లో ఎలాంటి రూపాయి ఆశించకుండా అందరికి లైఫ్ టైం సర్వీస్ ని అందించింది. 

మరి ఎం జరిగి ఉంటుంది అంటే .. వివరంగా చెప్తాను ,,, వినుకోండి 

ఇదివరకు మన వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్కోన్తుంది. అంటే ఆదాయం మన వద్ద నుంచి వస్తుంది కావున సరిపోయింది . మరి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేదు మరి ఎలా అంటే . ఇదవరకు డబ్బులు పే చేసాము కావున ఎలాంటి ఆడ్స్ మన వాట్స్ ఆప్ లో రాకపోయేవి. కాని ఇప్పుడు ఫ్రీ సర్వీస్ కావున ఇక పై మన వాట్స్ ఆప్ లో ఆడ్స్ వచ్చేస్తాయి.  చికాకు పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి. 


సంవత్సరానికి మనం ఇచ్చే 55 రూ కన్నా ఆడ్స్ ద్వారా ఒక్కరోజులో వచ్చే ఆదాయం 1000 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు విజ్ఞాన  నిపుణులు.

ఇంత వరకు ఎలాంటి ఆడ్స్ లేకుండా ప్రశాంతగా చాట్ చేస్కోన్నాము కదా . ఇప్పుడు ఇక ఎలానో ఏంటో. నాకు కూడా చాల ఫికర్ ఐతంది. చిరాకు పుట్టిస్తాయి కావున .

మరి పాపం #markzukerberg గారు ఆసితిలో 99% ఇచ్చాడు కదా మరి మల్లి కొంత అయినా సమకూర్చుకోవాలి కదా .

ఇది వాట్స్ ఆప్ లైఫ్ టైం validity అస్సలు కథ 



నా మట్టుకు మాత్రం ఎప్పటి లాగే hike నే ఎక్కువగా వాడుతాను.


5, అక్టోబర్ 2015, సోమవారం

అందరికి వందనాలు



నాకు ఈ రోజు చాల సంతోషంగా ఉంది . . 

ముఖ పరిచయం లేకున్నా  ముఖ పుస్తకం ద్వార పరిచయం అయి నా పోస్ట్ లను నా వీడియో లను అభిమానిస్తున్న నా మిత్రులందరిని చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది . 

ఈ రోజు నేన్ ఇంత సంతోషంగా ఉన్నానంటే ఏదో నేను పడ్డ కస్టాలు కాదు , నేను అనుభవించిన అనుభావాలు కాదు. 

నేను చేసిన కృషి 20 శాతం అయితే నాకు మీరిచ్చిన సహకారం నా పోస్ట్ లను వీక్షించడం ఆరాధించండం 80 శాతం. 

ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎ ఉద్దేశం తో నైతే  బ్లాగ్ మరియు యుట్యూబ్ మొదలు పెట్టానో ఆ ఉద్దేశం ఆ ద్యేయం నెరవేరుతుంది అని .. 

మీ సహకారం లేనిదీ నేను సూన్యం తోని సమానం .. 

ఒక్కపుడు నన్ను నానా మాటలు అన్న నా సహా మిత్రులు ఇప్పుడు మీ సహకారం తో, మీ కామెంట్ లతో, మీ అభిమానం తో వాళ్ళు కూడా మారిపోయి నా పోస్ట్ లను చదవడం మొదలెట్టారు .. 

ఎప్పటికి వీళ్ళను మార్చలేను అనుకున్న నాలో ఒక తేజాన్ని నింపారు మీరు, మీకు నా హృదయపూర్వక వందనాలు . 

చిన్న చినన్ గ్రామాల నుంచే కాదు పెద్ద పెద్ద దేశాల నుంచే నా పోస్ట్ లను వీక్షిస్తున్నారు అంటే అంత కన్నా సంతోషం ఏముంది .. 

మీ సహకారాన్ని అందిస్తూ నేను చేస్తున్న పోస్ట్ లను వీడియో లను వీక్షితున్న వీక్షకులందరికి మరియు నా సహా మిత్రులకు అలాగే నా ముఖపుస్తక మిత్రులందరికీ పేరు పేరున శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను.

30, ఆగస్టు 2015, ఆదివారం

E-mail founder

ఈమెయిల్ను కనుగొన్నది ఎవరో తెలుసా?

వాషింగ్టన్ : ఈమెయిల్ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు.
వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు.