17, ఆగస్టు 2013, శనివారం

కొన్ని online shopping links


             కొత్త ప్రోడక్ట్ ఏదైనా వస్తే చాలు మార్కెట్ లో సందడి సందడిగా ఉంటుంది. ఇక ఇంటర్నెట్ ఆన్లైన్ షాపింగ్ లోనైతే ప్రోడక్ట్ రేటింగ్ బట్టి కోనేస్తుంటాము. ఎప్పటికి అప్పుడు మంచి ఆఫర్ డీల్స్ ని అందుస్తుంటాయి కొన్ని ఇ-షాపింగ్ సంస్థలు(సైట్స్) అందులో ఎప్పటికప్పుడు డీల్స్ ఆఫర్ ని అందించే సైట్స్ యొక్క లింక్స్:
  • ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలుపగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను 


రాయరాకుల కర్ణాకర్ 
rayarakulakarna@gmail.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions

11, ఆగస్టు 2013, ఆదివారం

Torrent ఫైల్స్ ని InternetDownloadManager ద్వార డౌన్లోడ్ చేయండిలా?

            కొత్త పాటలు వచ్చాయా? కొత్త సినిమా వచ్చిందా? కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయ్యా? 

పాటలు, సినిమాలు, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైనా వచ్చినా వెంటనే టొరెంట్ సెర్చ్ చేసి  తగిన టొరెంట్ సాఫ్ట్వేర్ తో ఫైల్స్ డౌన్లోడ్ చేసేస్తుస్తాము. చాల మంది టోరెంట్స్ లో డౌన్లోడ్ చేయడం కన్నా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడ్ చేయడాకిని కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు. కాని టొరెంట్ ఫైల్స్ టొరెంట్ అప్లికేషను లో సేఫ్ మోడ్ లో డౌన్లోడ్ చేయబడతాయి అందువలన IDM (Internet  download  manager ) కన్నా కొద్దిగా స్లో గా డౌన్లోడ్ చేయబడతాయి. ఎక్కువ మెమరీ కెపాసిటీ(size ) ఉన్న టొరెంట్ ఫైల్ ని టొరెంట్ అప్లికేషను(utoorent ,bittorrent  etc ) వంటి అప్లికేషన్స్ లోనే డౌన్లోడ్ చేయడం మంచిది.ఈ టోరెంట్స్ ఫైల్స్ ని కూడా ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ద్వార డౌన్లోడ్ చేస్కోవచ్చు, అది ఎలానో తెలియాలంటే మీరు ఈ పోస్ట్ ను తప్పక వీక్షించాల్సిందే  


ముందు గా కొన్ని torrent files దొరికే వెబ్ సైట్ లను చూద్దాం ...టోరెంట్ ఫైల్స్  డౌన్లోడ్ చేస్కోవడానికి వెబ్ సైట్స్: Htt3
ఇంకా ఇలా ఎన్నో  సైట్ ల నుంచి టోరెంట్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు
Torrent File డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ links : 

Tixati

UTorrent

Bitcomet

Bitorrent

ఇలా అనేక వెబ్ సైట్స్ లు లబ్యమవుతాయి ,

టొరెంట్ ఫైల్స్ ని ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడ్ చేయుటకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి 

స్టెప్ 1: మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న టొరెంట్ ఫైల్ ని ఆయా వెబ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేస్కొండి
స్టెప్ 2: మీ  బ్రౌజరు ని ఓపెన్ చేసి www.zbigz.com అనే సైట్ ని ఓపెన్ చేయండి. మీ బ్రౌజరు తప్పకుండ IDM integration అయి ఉండాలి.
(zbigz సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్తుంది బహుశా బావిషత్తు లో సైట్ డిజైన్ పై చిత్రం లోని విదంగా ఉండక పోవచ్చు)

స్టెప్ 3: Upload .torrent file అనే బటన్ పై క్లిక్ చేసి .torrent  ఫిలేని అప్లోడ్ చేసి GO (క్లౌడ్ బటన్) ని ప్రెస్ చేయండి.
స్టెప్ 4: యూసర్ నిర్దారణ అడుగుతుంది. అందులో యూసర్స్ FREE  మరియు PREMIUM


Free : ఫ్రీగా .torrent లోని ఫైల్స్ ని zip ఫైల్ లోకి కన్వేర్ట్ చేసి డౌన్లోడింగ్ ఇస్తుంది 
Premium : monitory transactions   తో కూడుకొని ఉన్న యూసర్. ఇది క్లౌడ్(ఇంటర్నెట్లో) డౌన్లోడ్ ప్రారంబమై ఫైల్ డౌన్లోడింగ్ కంప్లీట్ అవగానే ఫైల్ సేవ్ చేస్కోమని  ఇన్ఫర్మేషన్ (మెయిల్,మొబైల్) అందిస్తుంది. అదనంగా ఫీచర్స్ చాల ఉంటాయి. 
--} FREE  అనే  బటన్ ని ఎంచుకోండి 


(వెంటనే .torrent  లోని ఫైల్స్ అన్ని cache మెమరీ లోకి కాపీ చేయబడి జిప్ ఫైల్ లోకి convert  చేయబడతాయి)


స్టెప్ 5:  క్రింద చూపిన విదంగా జిప్ ఫైల్ అని వచ్చిన తర్వాత డౌన్లోడ్  కోసం జిప్ అనే బటన్ ని క్లిక్ చేయండి

 స్టెప్ 6: Zip  పై క్లిక్ చేయగానే అది మల్లి యూసర్ conformation  అడుగుతుంది Free  పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో వచ్చే ఈ పాప్ అప్ పై స్టార్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది డౌన్లోడింగ్ స్టార్ట్. 


 (ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ మీ బ్రౌజరు తో కనెక్ట్ అయి ఉంటె వెంటనే ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ లో డౌన్లోడింగ్ అవుతుంది లేదంటే మీ బ్రౌజరు లో డౌన్లోడింగ్ స్టార్ట్ అవ్తుంది. )


  • ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు అదే విధంగా మా పోస్ట్ ల పై ఏవైనా సందేహాలు ఉంటె సంబందిత పోస్ట్ ల పై కామెంట్ చేయగలరు నేను తప్పక రిప్లై ఇస్తాను 


Blog          :www.heerasolutions.blogspot.inరాయరాకుల  కర్ణాకర్ 
rayarakulakarna@gmail.com 

8, ఆగస్టు 2013, గురువారం

Screen Capture (Android)

             మీరు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ లో నెట్ బ్రౌస్ చేస్తున్నపుడు లేదా ఇంకా ఎ ఇతర ఫైల్స్ ని బ్రౌస్ చేస్తున్నప్పుడు  ఏదైనా ఆసక్తికరమైనా స్క్రీన్స్ లేదా  ఎప్పుడో ఒకేసారి వస్తాయి అనే స్క్రీన్స్ ని  మీ మిత్రులతో షేర్ చేస్కోవాలి అనిపించే స్క్రీన్స్ వచ్చినప్పుడు , ఆ సమయంలో మీ మిత్రులు మీ చోట లేనందువలన చూపించలేక పోతుంటాము.

అందుకే ఆండ్రాయిడ్ వారు ప్రవేశ పెట్టిన స్క్రీన్ కాప్చర్(in-built) సహాయం తో ఎలాంటి స్క్రీన్స్ నైనా యిట్టె .jpeg ఫార్మటు లోకి   కాప్చర్ చేస్కోవచ్చు అదెలాగో ఈ పోస్ట్ లో వివరంగా చూపిస్తున్నాను 

ఇప్పటివరకు చాల  ఆండ్రాయిడ్  మొబైల్ మోడల్స్ వచ్చాయి 


(అన్ని బ్రాండ్ మొబైల్ మోడల్స్ లో ఈ ట్రిక్ పని చేస్తుంది కాని కొన్ని assembled device లో పని చేయక పోవచ్చు)

  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కీస్ 
(దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్స్ కి ఈ బటన్స్ లభ్యమౌతు ఉంటాయి కాని వారి పొజిషన్  చేంజ్  గా ఉండొచ్చు)

      కాప్చర్ చేయలిచిన   చేయాల్సిన స్క్రీన్ వచ్చినప్పుడు క్రింద చూపిన విధంగా  మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న హోం కీ మరియు పవర్ కీ at a టైం ప్రెస్ చేసి హోల్డ్ చేయడం  ద్వార స్క్రీన్ కాప్చర్ చేయొచ్చు పైనా చూపిన విధంగా హోం కీ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి 


 పవర్ కీ ని 
ప్రెస్ చేయడం ద్వార ఏ సమయం లోనైనా  ఎక్కడైనా ఏ స్క్రీన్ నైనా స్క్రీన్ కాప్చర్ చేయొచ్చు 

స్క్రీన్ కాప్చర్ చేసినా ఫైల్స్ అన్నియును మీ ఇంటర్నల్ or ఎక్స్టర్నల్ మెమొరీలో ScreenCapture అనే ఫోల్దేర్లో .jpeg ఫార్మటు లో సేవ్ చేయబడతాయి.

NOTE: కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో స్క్రీన్ కాప్చర్ చేయుటకు కీ కాంబినేషన్ చేంజ్ గా ఉండొచ్చు 

Youtube channel


ఈ పోస్ట్ పై ఏదైనా సందేహాలు లేక సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ తెలియ జేయగలరు లేదా నాకు మెయిల్ చేయగలరు 

కర్ణా
rayarakulakarna@gmail.com

2, ఆగస్టు 2013, శుక్రవారం

CITIZEN Calculator ని ఆఫ్ చేయండి ఇలా ?

కిరాణంలో నైనా లేదా ఇంకా వేరే వ్యాపార దుకాణాలలో అదేవిధంగా కామర్స్ స్టూడెంట్స్ కి కూడా  చిన్న చిన్న లెక్కల నుంచి పెద్ద పెద్ద లెక్కల వరకు క్రింద చూపిన calculator  లాంటి  వాటిని యూస్  చేసి అలాంటి లెక్కలను  సులువుగా  చేసేస్తుంటారు.
అంత సులువుగా ఎలాంటి లేక్కలనైనా చేసే ఇలాంటి calculator లో CITIZEN calculators ఆంధ్రప్రదేశ్ లో చాలా వాడుకలో ఉన్నాయి. 
సిటిజెన్ లో ఇప్పటికి చాలా మోడల్స్ వచ్చినప్పటికీ వాటిని ఆఫ్ చేసే ప్రకియ మాత్రం చాల మందికి తెలియదు 
ఆ విషయం కొంతమందికి తెలిసినప్పటికీ తెలియని వారి కోసం ఈ పోస్ట్ చేస్తున్నాను

CITIZEN CT-505,512 ఇలాంటి ఇంకా చాలా మోడల్స్ లో calculator 6-7 mins idle గా ఉంచితే ఆటోమేటిక్ ఆఫ్ అవ్తుంది కాని కొన్ని సందర్బాలలో calculator ఆఫ్ అయ్యేంత వరకు వేచి ఉండలేము దానికి అలానే పట్టుకొని వెళ్తే బటన్ ప్రెస్ అయి కొన్ని calculator ఛార్జింగ్ పోయే అవకాశం ఉంటుంది (చాలా వరకు ఈ calculators సోలోర్ సిస్టం బేస్ చేసుకొని నడుస్తుంటాయి)


మీ వద్ద ఉన్న ఈ calculator  లోని నేను చెప్పే ఫార్ముల( బటన్ సీక్వెన్స్ ) ప్రెస్ చేయండి 

(correct  బటన్ ని two టైమ్స్ ప్రెస్ చేయాలి)
÷ x % CHECK    CORRECT (Double టైమ్స్)
ఈ సింబల్స్  ని సీక్వెన్స్ లో ప్రెస్ చేయడం ద్వారా manual గా OFF చేయవచ్చు 


(calculator దాని పై ఉన్న సోలోర్ ప్యానల్ ద్వారా సూర్య శక్తిని గ్రహించి బాటరీ ని ఛార్జింగ్ చేస్తుంది )
(అన్ని మోడల్స్ కి ఈ ట్రిక్ వర్తించదు)


కర్ణాకర్
rayarakulakarna@gmail.com
  • ఈ పోస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు 
  • ఈ పోస్ట్ పైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు