25, డిసెంబర్ 2015, శుక్రవారం

24, డిసెంబర్ 2015, గురువారం

State Bank Samdhan                                         ఖాతాదారులు బ్యాంకుకు రాకుండానే మరిన్ని సేవలు పొందేందుకు గాను తన వినియోగదారుల కోసం మొబైల్ యాప్ 'ఎస్బీఐ సమాధాన్'ను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించింది. ఈ యాప్ను ఎస్బీఐ ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఖాతాదారులు 'స్టేట్ బ్యాంక్ సమాధాన్' యాప్ ద్వారా ఏటీఎం లొకేషన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిపాజిట్స్, అడ్వాన్సెస్, బ్రాంచ్ వివరాలు లాంటి తదితర సేవలను పొందొచ్చని ఎస్బీఐ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చెప్పాలంటే అకౌంట్ స్టేట్మెంట్, విద్య గృహ రుణాలు తీసుకున్నవారు, ఎంత వడ్డీ చెల్లించామనే వివరాలను తాము నమోదు చేసుకున్న ఇమెయిల్కు 24 గంటల్లోగా వస్తుండటం ఈ యాప్ ప్రత్యేకత. బ్యాంకులో ఉన్న తమ డిపాజిట్ లేదా రుణం వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ సెలవులతో పాటు ఎస్బీఐ ఫ్రీడమ్, ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ బడ్డీ, ఎస్బీఐ క్విక్ వంటి మొబైల్ యాప్లను తద్వారా వినియోగించుకునే వీలు కలుగుతుంది. బ్యాంకు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు, పరిష్కారం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.

Christmas Eve .. Totally Snow Eve


క్రిష్మస్ పండుగ సందర్బంగా నా మొబైల్ లో ఎక్కడ చూసిన మంచు పడుతుంది . ఇటు హైక్ లో అటు ఫేస్బుక్ మెసెంజర్ చాట్ హెడ్ లలో .. 

వహువా మంచు ప్రదేశాలలో ఉన్నట్టు గా ఉంది.
--------------------------------------------------------------------------------
అలాగే మీ అందరికి 
క్రిస్మస్ శుభాకాంక్షలు


TrueCaller Devolopent
ట్రూ కాలర్ ఎం అభివృద్ధి అయింది .. 
చూస్తుంటే చూస్తుంటే చిన్న పిల్లగాడు పెద్దోడు అయినట్టు ,ఇది కూడా చూస్తంటే చూస్తంటే అభివృద్ధి అయిపోతుంది.
 మొదట్లో....  కాల్ వచ్చిన ఏదో ఒక నెంబర్ పేరు పడేది . 
నడిమిట్ల..... దాదాపు అన్ని కాల్స్ (unknown numbers) పేర్లు పడినాయి. 
మరి ఇప్పుడు అబ్బ అబ్బ అబ్బ ఎక్కడ unknown నెంబర్ కనిపిస్తే చాలు టక్కున నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది . unknown నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిన ఆ మెసేజ్ బాడీ లో unknown నెంబర్ ఉన్నా , మీద నోటిఫికేషన్ బార్ లో చటుక్కున్న  ప్రత్యక్షమైతంది ..

వాట్స్ యాప్  లో మెసేజ్ వచ్చిన అందులో unknown number  ఉన్న .. చూపిస్తుంది .  అబ్బ అబ్బ ఎం అభివృద్ధి ఎం అభివృద్ధి..

లెనోవో లో ఇంబిల్డ్ గా రావడం వలన ఇంకా చురుగ్గా పనిచేస్తుంది కాబోలు  


Hats off

20, డిసెంబర్ 2015, ఆదివారం

Facebook Desktop Notifications


        కపై ఫేస్బుక్ లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఇక మన బ్రౌజరు లో రైట్ సైడ్ బాటమ్ కార్నెర్ లో వస్తాయి.  దీనిని ఆక్టివేట్ చేయటానికి సింపుల్ గా .. 

ఫేస్బుక్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్ లో ఈ క్రింది ఇమేజ్ లో వలే డెస్క్టాపు అండ్ మొబైల్  సెట్టింగ్స్ ని ఆన్ చేస్కొంటే సరిపోతుంది . 

దాదాపు అన్ని ఎకౌంటు లకు ఆక్టివేట్ అయినాయి .. ఒక వేలా ఆక్టివేట్ కాని వాళ్ళు ఈ సెట్టింగ్స్ లో చూస్కోవచ్చు 


16, డిసెంబర్ 2015, బుధవారం

Publish Your Songs World Wide

HOW TO PUBLISH OUR SONGS

             చాల వరకు వ్యక్తులలో మంచి టాలెంట్ ఉంటుంటుంది. కవితలు రాయడం పాటలు రాయడం , రాసిన వాటిని పాడడం చేస్తుంటారు . అయితే ఇలా వారు పాడిన కవిత కాని , పద్యాలూ కాని, వ్యాక్యాలు కాని , పాటలు కాని ఏవైనా ఎవరికైనా పంపించాలంటే మెయిల్ చేయడం పర్సనల్ గా పంపించడం చేస్తుంటాము, లేదా క్లౌడ్ storage లో పెట్టి లింక్ ని షేర్ చేస్తుంటాము. కాని అది అందరికి డౌన్లోడ్ చేస్కోవడం రాకపోవచ్చు .

మరి ఎలా అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది . ఇలాంటి వారికోసం ప్రత్యేకమైనా వెబ్సైటు ఉంది అందులో అందరు ఒకే రకమైనా బావం తో ఉన్న వారు ఉంటారు కావి ఆ డేటాబేస్ లోనుంచి మంచి మిత్రులు కలవ వచ్చు .

వీడియో తప్పక చూడండి . ఉపయోగకరమని బావిస్తే సబ్స్క్రయిబ్ చేస్కొండి మా వీడియో లను మీ మెయిల్ కి పొందండి .

వీడియో లింక్ : How to publish your song

వీలైతే మీ మిత్ర్లులకు కూడా తెలియజేయండి .
రాయరాకుల కర్ణాకర్
9014819428
www.rktechinfo.com

2,00,000 Views for Dress Color Changing

      ఇంకో పదిహేను వ్యూస్ వస్తే చాలు .. 2,00,000 (రెండు లక్షలు ) వ్యూస్.

వీడియో లింక్ : Change Dress Color


నాకు చాల సంతోషంగా ఉంది . ఈ వీడియో ఇంత ప్రాచుర్యం చెందుతది అనుకోలేదు . 

నన్ను అనుసరిస్తూ సహకరిస్తూ మిత్రులకు , వీడియో వీక్షకులకు, అభిమానులకు  నా హృదయ పూర్వక ధన్యవాదాలు

15, డిసెంబర్ 2015, మంగళవారం

How To Publish or songs

      

 చాల వరకు వ్యక్తులలో మంచి టాలెంట్ ఉంటుంటుంది. కవితలు రాయడం పాటలు రాయడం , రాసిన వాటిని పాడడం చేస్తుంటారు . అయితే ఇలా వారు పాడిన కవిత కాని , పద్యాలూ కాని, వ్యాక్యాలు కాని , పాటలు కాని ఏవైనా ఎవరికైనా పంపించాలంటే మెయిల్ చేయడం పర్సనల్ గా పంపించడం చేస్తుంటాము, లేదా క్లౌడ్ storage లో పెట్టి లింక్ ని షేర్ చేస్తుంటాము. కాని అది అందరికి డౌన్లోడ్ చేస్కోవడం రాకపోవచ్చు .

మరి ఎలా అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది . ఇలాంటి వారికోసం ప్రత్యేకమైనా వెబ్సైటు ఉంది అందులో అందరు ఒకే రకమైనా బావం తో ఉన్న వారు ఉంటారు కావి ఆ డేటాబేస్ లోనుంచి మంచి మిత్రులు కలవ వచ్చు .

వీడియో తప్పక చూడండి . ఉపయోగకరమని బావిస్తే సబ్స్క్రయిబ్ చేస్కొండి మా వీడియో లను మీ మెయిల్ కి పొందండి .

వీడియో లింక్ : click here

వీలైతే మీ మిత్ర్లులకు కూడా తెలియజేయండి .

రాయరాకుల కర్ణాకర్
9014819428

11, డిసెంబర్ 2015, శుక్రవారం

Google Input Tools Offline Installer

సిస్టం లో తెలుగు ఎలా టైపు చేయాలి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది . అందులో చెప్పిన సూచనలు పాటిస్తే చాలు . 
అయితే ఈ వీడియో లో చూపిన తెలుగు టైపింగ్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవాలంటే 
ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే 

మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ఉంటె  వీడియో చూస్తాము అందులో ఉన్న ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ కూడా  చేస్కోన్టాము . చాల సులభమైన పని  . 

కాని ఒక వేల నెట్ లేని సిస్టం లో తెలుగు ఇంస్టాల్  చేయాలంటే ?

అయ్యో దానికి నా వద్ద అద్బుతమైనా సలహా , పరిష్కారం ఉంది.
ఏంటి అంటే 

గూగుల్  ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేయడానికి నెట్ అవసరం లేకుండా offline installer ఫైల్స్ ని నేను ఇక్కడ పొంధపరచాలు .  కేవలం ఈ ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని  ఏ సిస్టం  లోనైనా ఈజీ  గా గూగుల్ ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవచ్చు .

ఫైల్ లింక్ : www.bit.ly/HS-GIT

గమనిక : ఈ ఫైల్ ని విన్రార్ సహాయం తో ఎక్స్ట్రాక్ట్ చేసాక ఇందులో వచ్చిన రెండు ఫైల్ లలో మొదటగా  ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసాక ఆ తర్వాత తెలుగు టూల్స్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయాలి . 


10, డిసెంబర్ 2015, గురువారం

Push bullet app

Push bullet అనే పేరుతో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఒక యాప్
ఉంది. ఇది చాలా మందికి తెలిసిన అప్లికేషన్, కాని అలాగే useful
కూడా. సైజ్ 4.3 MB. 2g ఇంటర్నెట్ లో కూడా ఈజీగా డౌన్లోడ్
చేయగలరు. 4.6 స్టార్ రేటింగ్ ఉంది. ఐ ఫోన్ కూడా ఉంది.
సరే ఇది ఏమి చేస్తుంది?
మీరు కంప్యుటర్ లో సినిమాలు, ఏదైనా వర్క్ చేసుకుంటూ
ఉంటారా ఎక్కువగా? అయితే మీ మొబైల్ కు వచ్చే ప్రతీ నోటిఫికేషన్స్
ను కంప్యుటర్ లో చూడండి ఇక నుండి. జాబ్ చేసే వారికీ బాగా
helpful.
ఫోన్ జేబులో ఉండటం లేదా పక్క రూమ్ లో ఉండటం లేదా
చార్జింగ్ ఎక్కించటానికి వేరే దగ్గర పెట్టడం వంటివి
జరుగుతాయి. అప్పుడప్పుడు మీకు వినిపించక అలానే
వదిలేస్తారు.
లేదా వినిపించిన ఏదో ఇంపార్టెంట్ అని లేచి వెళ్లి చూస్తే
అనవసరమైన అప్ డేట్ ఉంటుంది. ఇలాంటివి ఏమి లేకుండా
మీరు వర్క్ చేస్తున్న pc లోనే నోటిఫికేషన్ ఏంటో చూడటం
అంటే మంచిదే కదా!
ఎలా చేయాలి?
ఈ లింక్ లో కి వెళ్లి యాప్స్ అనే దగ్గర క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్
చేసి ఇంస్టాల్ చేయండి. ఇప్పుడు సెక్యురిటీ లో అడ్మిన్
సెట్టింగ్స్ లో push bullet ను యాక్టివేట్ చేయాలి మొబైల్ లో.
ఇప్పుడు మీ క్రోమ్ లేదా మొజిల్లా బ్రౌజర్ యొక్క extension ను
ఇంస్టాల్ చేయండి. అంతే. మిగిలిన స్టెప్స్ యాప్ చెబుతుంది.
మీరు బ్రౌజర్ వాడకపోయినా మొబైల్ నోటిఫికేషన్స్ pc లో
చూపించటానికి బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లో ఆప్షన్ enable చేయండి.
యాప్ లో ఉన్న అదనపు ఫీచర్స్
- మీరు ఒకే అకౌంట్ తో లాగిన్ అవ్వాలి pc బ్రౌజర్ లో అయినా, మొబైల్ లో
అయినా.. సో ఇక మొబైల్ లేదా pc లో ఏది కాపి చేసినా (టెక్స్ట్, లింక్స్,
స్టేటస్ అప్ డేట్స్) అది మరొక డివైజ్(మొబైల్ లేదా pc) లో జస్ట్ పేస్ట్
చేస్తే చాలు అక్కడకు వచ్చేస్తుంది. దీని కోసం సెట్టింగ్స్
లో యూనివర్సల్ కాపీ & పేస్ట్ ఆన్ చేయాలి.
- clip board లో ఆటోమేటిక్ గా లింక్స్ అండ్ నోట్స్ సేవ్ అయ్యి
ఉంచుకోవోచ్చు సెట్టింగ్స్ లో ఆప్షన్ enable చేస్తే. ఫర్ eg
మొబైల్ లో కాని pc లో కానీ ఏదో టెక్స్ట్ టైప్ చేసి దానిని సేవ్
చేయాలనుకుంటే ఇది సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన దానిని మరలా
వాడుకోగలరు.
- మీకు నచ్చిన చానెల్స్ అండ్ కమ్యూనిటీల అప్ డేట్స్
channels అనే మెను నుండి పొందగలరు.
- కంప్యుటర్ నుండే వాట్స్ అప్ మెసేజ్స్ అండ్ sms లకు
reply ఇవ్వగలరు

    

4, డిసెంబర్ 2015, శుక్రవారం

Designed Nameమీ పేరు కూడా ఇలా డిజైన్ చేస్కోవాలి అని ఉందా ?  అయితే నేను మీకు తప్పక హెల్ప్ చేస్తాను.

ఫోటోషాప్ నుపయోగించి ఇలాంటి డిజైన్ చేస్కోవచ్చు అయితే ఈ పేరు డిజైన్ ఫైల్ ని మీకు .psd (Photoshop Document) ఫైల్ ఇక్కడ లింక్ ఇస్తున్నాను దాని నుంచి మీరు ఫైల్ డౌన్లోడ్ చేస్కొని winrar సహాయంతో ఎక్స్ట్రాక్ట్ చేసి ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తే సరిపోతుంది .

psd ఫైల్ లింక్ :https://www.facebook.com/download/952458271498352/name.rar

మీ పేరు తో ఎడిట్  చేసాక  తప్పక ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి వీలైతే నన్ను ట్యాగ్ కూడా చేయండి .

నా వాళ్ళ మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు అని సంతోషిస్తాను

22, నవంబర్ 2015, ఆదివారం

Telugu typing in smart phone

మీ మొబైల్ లో తెలుగు టైపు చేయాలనీ అనుకుంటున్నారా అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

గూగుల్ ఇండిక్ కీబోర్డ్

అతి సులభంగా, ఊహించలేని విధంగా వేగవంతముగా టైపు చేయవచ్చును . సిస్టం లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా టైపు చేసిన అనుభూతి , అనుభవం కలుగుతుంది

తప్పక మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టాల్ చేసుకొన్నాక కొన్ని సూచనాలని పాటిస్తే సరిపోతుంది    ఏమైనా సందేహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు

- https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.inputmethod.hindi

-మీ కర్ణాకర్

    

16, నవంబర్ 2015, సోమవారం

Super computers

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన
రెండు సూపర్ కంప్యూటర్ల తయారీ
కోసం అమెరికా ఇందన
విభాగం రూ.2623కోట్లు ఖర్చు చేసింది.
శాస్త్రరంగం, అణ్వాయుధాలపై పరిశోధనల
కోసం వీటిని రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఐబీఎం, న్విడియా, మెలనాక్స్ చెందిన విభాగాలతో
తయారుచేస్తోన్న ఈ సూపర్
కంప్యూటర్లు..ప్రస్తుతం ఉన్న వేగవంతమైన
కంప్యూటర్ల కన్న 5 నుంచి 7
రెట్లు ఎక్కవ వేగంతో పనిచేస్తాయి.

    

15, నవంబర్ 2015, ఆదివారం

Control background process applications

తక్కువ ఇంటర్నెట్ డేటా ఉందా? కాని బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ మీ డేటా ను వాడేస్తున్నాయి. మీరు కేవలం వాట్స్ అప్ అండ్ ఫేస్ బుక్ వంటి యాప్స్ కు మాత్రమే వాడటానికి ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా నెట్ అవసరం అయినప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు ఆఫ్ చేయటం వంటివి చేస్తారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ ఈ పద్దతిలో కొన్ని మెసేజెస్ మిస్ అవుతుంటారు.
సో, మీకు కావలసిన అప్లికేషన్ కు తప్ప మిగిలిన వాటికీ ఇంటర్నెట్ బ్లాక్ చేయటానికి ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ యాప్ - Mobiwol. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో 4.1 స్టార్ రేటింగ్ తో ఉంది. 3.4MB సైజ్.
దీనిని వాడటానికి మీ ఫోన్ రూటింగ్ అయ్యి ఉండనవసరం లేదు. ఎవరైనా వాడుకోవచ్చు.
ఫీచర్స్..
1. మొబైల్ ఇంటర్నెట్ లో లేదా WiFi నెట్ లో విడివిడిగా యాప్స్ ను డిసేబుల్ చేయగలరు. అంటే ఒకే యాప్ ను మొబైల్ ఇంటర్నెట్ లో పనిచేయకుండా, WiFi లో ఇంటర్నెట్ వాడేలా సెట్ చేయగలరు.
2. యాప్స్ లిస్ట్ లో యాప్ ను రైట్ సైడ్ కు స్వైప్ చేస్తే యాప్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంటర్నెట్ ను వాడకుండా ఉండేలా సెట్ చేసుకోవచ్చు.
3. ఒకేసారి అన్నీ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఇంటర్నెట్ ను వాడకుండా సెట్ చేయగలరు. అంటే మీకు కేవలం వాట్స్ అప్ మాత్రమే పనిచేయాలి అనుకుంటే, అన్నీ డిసేబుల్ చేసి, వాట్స్ అప్ మాత్రం enable చేయగలరు.
సిస్టం యాప్స్ కు మాత్రం ఇంటర్నెట్ డిసేబుల్ చేయకండి. చేస్తే మీ ఫోన్ సరిగా పనిచేయకపోవచ్చు.
గమనిక: యాప్ ను డౌన్లోడ్ చేసుకునే ముందు Description లో FAQ లో ఈ Question ( Why does Mobiwol No Root Firewall show as if using a VPN connection? ) చదవి అవగాహనతో యాప్ ను వాడండి.

    

1, నవంబర్ 2015, ఆదివారం

Happiness Today

ఈ రోజు చాల సంతోషంగా ఉంది. మునుపెన్నడూ పొందని సంతోషం తొలిసారిగా . ఒక వైపు ఆచార్యం ఇంకో వైపు ఆనందం . ఈ రోజు నా గురించి మన బ్లాగ్ గురించి తెలుగు వెలుగు మాస పత్రిక లో ప్రచురించబడినది. చాలా సంతోషం .

శాంతి జలసూత్రం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 
    

31, అక్టోబర్ 2015, శనివారం

మీ ఫొన్ ఇక ఎక్కడ పోదు.

ఫోన్ పోయిందా? ట్రాక్ చేయండిలా...!
సైట్లన్నీ వెతికి, ఫీచర్ల గురించి కనుక్కుని ఎంతో ఇష్టంగా
కొన్న ఖరీదైన ఫోన్ ఎక్కడో పోతే...? బాధపడుతూ కూర్చోవాల్సిన పని
లేదు. ఏ స్థలంలో మరిచిపోయారో, ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడుందో
క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎవరి చేతుల్లో ఉందో వారి ఫోటోలు
కూడా సంపాదించొచ్చు. మర్యాదగా ఫోన్ తెచ్చి అప్పగిస్తావా లేక నీ
ఫోటో పోలీసులకు ఇవ్వమంటావా అని మెసేజ్ పెట్టొచ్చు. మీది
ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక
ఇది సాధ్యమే. ఎలాగో చదవండి.
మాదాపూర్లో ఉండే రవి ఫ్లిప్కార్ట్లో ఇటీవలే కొత్త స్మార్ట్ఫోన్
కొన్నాడు. ఆకట్టుకునే లుక్, అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఆ ఫోన్
చూసిన తన స్నేహితులు సైతం సూపర్ ఫోన్ అన్నారు.
ఆండ్రాయిడ్ లాలిపాప్తో వచ్చిన ఆ ఫోన్ రవికి తెగ నచ్చేసింది. కానీ అది
మూన్నాళ్ల ముచ్చటే అయింది. సెలవు రోజున సూపర్మార్కెట్
కు వెళ్లిన రవి ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ రోజు
విపరీతమైన జనం. ఫోన్ ఎవరికి దొరికిందో తెలియదు. వెంటనే ఫోన్
చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దాంతో రవి దిగాలుగా మారిపోయాడు.
ఎంతో ఇష్టపడి కొన్న ఫోన్ నెల రోజులు కాకముందే పోవడంతో బాగా
బాధపడ్డాడు.
రవి స్మార్ట్ఫోన్ అయితే కొన్నాడు కానీ, యాంటీ థెఫ్ట్ యాప్స్ మాత్రం
ఇన్స్టాల్ చేసుకోలేదు. దానివల్ల ఖరీదైన ఫోన్ ఎక్కడ పోయిందో
కనుక్కోలేకపోయాడు. ఒకవేళ తను యాంటీథెప్ట్ యాప్స్ ఇన్స్టాల్
చేసుకుని ఉంటే తన ఫోన్ సులభంగా దొరికేది. ఫోన్ పోతే వెతికిపెట్టే
యాప్స్ ఇప్పుడు చాలానే ఉన్నాయి.
గాట్యా!
మీ డివైజ్కు పర్ఫెక్ట్ సెక్యూరిటీ కావాలంటే ఈ యాప్ని
ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ను ఎవరైనా తస్కరించి స్ర్కీన్లాక్ని
తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వారి
ఫోటోలను సైలెంట్గా తీసి మీ రిజిస్టర్డ్ మెయిల్కు పంపిస్తుంది.
ఫోన్ ఏ లొకేషన్లో ఉందో గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. ఆ
లింక్ను మెయిల్ చేస్తుంది. ఫోన్ మీరున్న ప్రదేశానికి దగ్గరలోనే
ఉందని తెలిస్తే సైలెంట్లో ఉన్నా బిగ్గరగా అలారం సౌండ్ వచ్చేలా
చేయవచ్చు. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. డివైజ్ లాక్/
అన్లాక్, కాల్బ్యాక్ రిక్వెస్ట్, సిమ్ చేంజ్ నోటిఫికేషన్, మెసేజ్ డిస్ప్లే
వంటి ఫీచర్లు అదనం.
వేర్ అవేర్
ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మరిచిపోతుంటారా? అయితే ఈ వాచ్
మీరు ధరించాల్సిందే. ఈ వాచ్ ఉంటే ఫోన్ మరిచిపోయే ప్రసక్తే
ఉండదు. ఫోన్ మీ వెంట లేకపోతే ఈ ఆండ్రాయిడ్ వేర్ వాచ్
మిమ్మల్ని హెచ్చరిస్తుంది. వాచ్, స్మార్ట్ఫోన్కు మధ్య సిగ్నల్స్
అనుసంధానం అవుతుంటాయి. ఒకవేళ ఈ రెండింటి మధ్య
సిగ్నల్స్ లేకపోతే వైబ్రేషన్స్తో హెచ్చరిస్తుంది. సింపుల్గా
ఉంటుంది. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
సెర్బెరస్ యాంటీథెఫ్ట్
పోయిన ఫోన్ను రికవరీ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ యాంటీథెఫ్ట్
యాప్ ఇది. ఫోన్ ఎక్కడుందో కనిపెట్టడానికి బాగా ఉపకరిస్తుంది.
ఫోన్లోని డాటాను రిమోట్గా పొందవచ్చు. సెర్బెరస్ వెబ్సైట్లోకి వెళ్లి
రిమోట్గా డాటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ లొకేషన్లో ఉందో ట్రాక్
చేయవచ్చు. కోడ్తో డివైజ్ను పర్మనెంట్ లాక్ చేయవచ్చు. ఫోన్ను
ఎవరు ఉపయోగిస్తున్నారో, వారి ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
వారు చదివేలా స్ర్కీన్పై మెసేజ్ డిస్ప్లే అయ్యేలా చేయవచ్చు.
మైక్రోఫోన్ సహాయంతో కాల్ డాటాను రికార్డు చేసుకోవచ్చు.
ఇంటర్నల్, ఎస్డీకార్డులో డాటాను డిలీట్ చేయొచ్చు. లాస్ట్కాల్
ఎవరికి చేశారో తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ ఫీచర్స్తో పోయిన
ఫోన్ను కనిపెట్టడం చాలా సులువు.
అవాస్ట్
ఇందులోనూ దాదాపుగా అవే ఫీచర్స్ ఉంటాయి. రిమోట్గా డాటాను
తొలగించుకోవచ్చు. ఫోన్ ఎవరిచేతుల్లో ఉందో వారి ఫోటోలు
తీసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల వాయిస్ని వినొచ్చు. జీపీఎస్
సహాయంతో ఏ ప్రదేశంలో ఉన్నారో లొకేట్ చేయొచ్చు. టెక్ట్స్ మెసేజ్
పంపించి ఫోన్ లాక్ అయ్యేలా చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్
గూగుల్ అందిస్తున్న యాప్ ఇది. లాస్ట్ ఫోన్ను లొకేట్ చేయడానికి
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డివైజ్లో ఉన్న డాటా ఇతరుల
చేతుల్లో పడకుండా కాపాడుకోవచ్చు. గూగుల్ అకౌంట్
సహాయంతో ఆండ్రాయిడ్ డివైజ్ను లొకేట్ చేయవచ్చు. స్ర్కీన్
లాక్పిన్ను రీసెట్ చేసుకోవచ్చు. కావాలంటే డాటా మొత్తం
తుడిచేయవచ్చు.
ఫైండ్ మై ఆండ్రాయిడ్ ఫోన్
ఫోన్ లొకేషన్ రియల్ టైమ్ అప్డేట్ని అందిస్తుంది. ఫోన్ ఉన్న
వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి
మారుతున్నట్లయితే వెంటనే చూపిస్తుంది. దీంతో స్టోలెన్
ఫోన్ను గుర్తించడం ఈజీ అవుతుంది. ఫైండ్ మై
ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్సైట్ ఇన్స్టంట్గా లొకేషన్ అప్డేట్ని
పొందవచ్చు.
ఫైండ్ మై ఫోన్ (ఆండ్రాయిడ్ వేర్)
ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్వాచ్ మాదిరిగానే ఈ యాప్ ఫోన్కు దూరంగా
వెళితే అలర్ట్ చేస్తుంది. అలారం వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
ప్రె యాంటీథెఫ్ట్
జియోలొకేషన్ ఫీచర్తో పోయిన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
జీపీఎస్, వైఫై ట్రయాంగులేషన్తో ఫోన్ ఎక్కడుందో మ్యాప్లో
గుర్తించవచ్చు. గాట్యా మాదిరిగానే ఇందులోనూ ఫోటో ట్రిక్
ఉపకరిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రేర్ కెమెరాతో రిమోట్గా
ఫోటోలు తీసి పొందవచ్చు. ఇతరులు ఓపెన్ చేయకుండా రిమోట్గా
లాక్ చేయవచ్చు.
యాంటీ థెఫ్ట్ అలారం
టూర్స్కు వెళ్లినపుడు, ప్రయాణాల్లోనూ సౌలభ్యాన్ని బట్టి
చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ఫోన్ను
కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. అలాకాకుండా మొబైల్లో
యాంటీథెప్ట్అలారం ఇన్స్టాల్ చేసి ఆన్ చేసినట్లయితే ఎవరైనా ఫోన్
చార్జింగ్ నుంచి తీస్తే పెద్ద శబ్ధం చేస్తుంది.
అంతేకాకుండా ఫోన్ లాక్ అవుతుంది. అలారం శబ్ధాన్ని ఎట్టి
పరిస్థితుల్లోనూ ఫోన్ను తస్కరించిన వ్యక్తి ఆపలేడు. పిన్
ఎంటర్ చేయడం ద్వారా మీరు మాత్రమే ఆపగలుగుతారు. ఫోన్ను
ఎవరైనా తీస్తారేమోననే భయం ఉండదు.
లుకవుట్
ఇది అద్భుతమైన యాప్. ఫోన్ను ట్రాక్ చేయడానికి బాగా
ఉపకరిస్తుంది. చేయాల్సిందల్లా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడమే.
కాంటాక్ట్స్, ఫోటోలు బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోన్
పోయినట్లయితే మరొక స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్లో నుంచి
లుక్అవుట్ అకౌంట్లోకి లాగిన్ అయి మిస్ప్లేస్ అయిన ఫోన్ను ట్రాక్
చేయవచ్చు. ఈ యాప్లో కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నాయి.
అవి లొకేట్, స్ర్కీమ్, సిగ్నల్ ఫ్లేర్, లాక్ కామ్. లుక్అవుట్
అకౌంట్లోకి యూజర్ లాగిన్ అయిన తరువాత ఈ ఆప్షన్ను
యాక్టివేట్ చేయవచ్చు. వెంటనే ఫోన్ను ట్రాక్ చేసి అది ఉన్న
ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. పోగొట్టుకున్న
డివైజ్ ఏ లొకేషన్లో ఉందో తెలియజేస్తూ మెయిల్ కూడా వస్తుంది.
మొబైల్ ఎక్కడ ఉందో తెలియజేసేందుకు స్ర్కీమ్ ఫీచర్ పెద్దగా
అలారం సౌండ్ చేస్తుంది. ఒకవేళ ఫోన్ బ్యాటరీ పూర్తిగా డౌన్
అయిపోతే కనుక్కోవడం కష్టంగా మారుతుంది. ఆ సమయంలో
సిగ్నల్ ఫ్లేర్ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్యాటరీ డెడ్
అవుతున్నట్లయితే లుక్ అవుట్ అప్లికేషన్ ఆటోమెటిక్గా చివరగా
ట్రేస్ చేసిన లోకేషన్ను అకౌంట్లో సేవ్ చేస్తుంది. ఫోన్ను అన్లాక్
చేసేందుకు ప్రయత్నించి, మూడు సార్లు విఫలమైతే
స్మార్ట్ఫోన్లో ఉన్న కెమెరా ఆటోమెటిక్గా ఫోటోలను తీస్తుంది. రిజిస్టర్
చేసుకున్న ఐడీకి మెయిల్ పంపిస్తుంది. ఇందుకోసం లాక్
కామ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. మొత్తంగా లుకవుట్ ఉంటే
మొబైల్ భద్రంగా ఉన్నట్లే. ఖరీదైన ఫోన్ కొనగానే సరిపోదు. అవసరమైన
యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే ఫోన్కు, అందులోని డాటాకు
భద్రత లభిస్తుంది. ఈ యాంటీ థెఫ్ట్ యాప్స్ ఉంటే నిశ్చింతగా
ఉండొచ్చనడంలో సందేహం లేదు కదూ.

    

24, అక్టోబర్ 2015, శనివారం

Learn Photoshop Right Now

ఫోటోషాపుపై ఆసక్తి ఉండీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియోస్ (తెలుగులో) మీకోసం... www.rktechinfo.com

-------------------------------------------------
ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-1 )

ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-2 )

మోనోక్రోమ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఫొటోషాప్ లో 

ఫొటోషాప్ను ఉపయోగించి passport ఫోటోలను తయారు చేయుట

అను స్క్రిప్ట్ మేనేజర్ను విండోస్ 7, 8, 8.1 మరియు విండోస్ 10 లలో ఎలా ఉపయోగించాలి

ఫోటోషాప్ CS6 మరియు CC [14.0] లలో తెలుగు ఎలా టైప్ చేయాలి

ఫోటోలలో పర్సన్ యొక్క జుట్టు తొలగకుండా నీట్_గా బ్యాక్_గ్రౌండ్ మార్చుట

వివిధ రంగులను కలిగి ఉన్న బ్యాక్_గ్రౌండ్_ను తొలగించి కావలసిన బ్యాక్_గ్రౌండ్ అప్లై చేయుట

ఫ్రీ హ్యాండ్ టైపింగ్ ఫోటోషాపులో

లేయర్ మాస్క్ ఫీచర్ ఉపయోగించుట

బ్యానర్లు తయారీ నేర్చుకొనుటకు ప్రాథమిక అవగాహన

తేలికైన పద్దతిలో డ్రస్ కలర్ మార్చుట

ఆకుపై కృత్రిమ నీటి బిందువును సృష్టించుట

అక్షరాలకూ మరియు లేయర్_కు లైటింగ్ ఎఫెక్టు


23, అక్టోబర్ 2015, శుక్రవారం

Post .gif Animations to Facebook

         

ఫేస్బుక్ లో .jpeg ఫోటో లను పోస్ట్ చేయడం సర్వసాధారణమే , కాని  ఈ మద్య వచ్చిన అప్డేట్ లో ఫేస్బుక్ లో అనిమేషన్ ఫోటోలను (.gif) లను కూడా అప్లోడ్ చేయడానికి వీలు కల్పించారు. 

      కాని ఇక్కడ ఒక చిక్కు ఉంది , అదేంటంటే .gif డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికి వీలు లేదు. మరి ఎలా అప్లోడ్ చేయాలి అంటారు అంతే కదా! చెప్తాను 

      ఎలా అంటే వెబ్ లో ఉన్న .gif ల యొక్క లింక్ లను పోస్ట్ చేయడం ద్వార అనిమేషన్ అయ్యే ఇమేజ్ లను కూడా మనం ఫేస్బుక్ లో పొందవచ్చు .

18, అక్టోబర్ 2015, ఆదివారం

Charles Babbage Death Anniversary

ఈరోజు ప్రఖ్యాత శాస్త్రవేత్త, కంప్యూటర్ పితామహుడు ఛార్లెస్ బాబ్బేజ్ వర్థంతి..
ఛార్లెస్ బాబ్బేజ్  (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త. ఈయనను కంప్యూటర్ పిత అని కూడా అంటారు.

       తన పై చదువులకు 1810 లో ట్రినిటీ కాలేజీ , కేంబ్రిడ్జి కు వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్లగ్రాంజ్సింప్సన్లాక్రియాక్స్ లను చదివిన ఛార్లెస్ బాబ్బేజ్ , అక్కడి గణిత శాస్త్ర భోధన తో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిసి  1812 లో Analytical Society (విశ్లేషక సమాజం) ను స్థాపించాడు. కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు చార్లెస్ బాబేజ్. 1791 డిసెంబర్ 26 న బెంజిమన్, బెట్సీ దంపతులకు లండన్‌లో జన్మించారు. ప్రాథమిక,ఉన్నత విద్యాభ్యాసాలు ఇంటివద్ద, ప్రైవేట్ పాఠశాలలో జరిగాయి. పై చదువులను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజ్, పీటర్‌హౌస్‌లో పూర్తిచేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి గౌరవపట్టా పొందారు. కేంబ్రిడ్జ్‌లో గణితాచార్యుడిగా కొంతకాలం పనిచేసి మంచి గణిత శాస్త్రజ్ఞుడిగా పేరు తెచ్చుకొన్నారు .

గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నంచాడు. బాబాజ్ మొదటి ఆశయం మెకానికల్ ఇంజన్  కంప్యూటర్. కాని అది అవసరమగు నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ ను నిర్మిస్తే అది చక్కగా పని చేసింది.
సొంతంగా గణనలు చేసే యంత్రానికి బాబేజ్ రూపకల్పన చేశారు. 'డిఫరెన్స్ ఇంజిన్', 'డిఫరెన్స్ ఇంజిన్ - II', సాంకేతికంగా ఎంతో ఉన్నతమైన 'ఎనలటికల్ ఇంజిన్ అనే యంత్రాలను తయారు చేశారు. వీటికి సంబంధించిన పత్రాలను చదివిన ఎందరో శాస్త్రవేత్తలు బాబేజ్ కృషిని ప్రశంసించారు. ఈ యంత్రాలు ప్రస్తుత కంప్యూటర్‌లా ఆలోచించి, సమస్యల సాధనను మానవ సాయం లేకుండా పరిష్కారాన్ని  కనుక్కొనే విధంగా ఉన్నాయని భావించారు. అందరు బాబేజ్‌ను కంప్యూటర్ నిర్మాణానికి ఆద్యుడు అని పిలిచారు. రైల్వే సంస్థల కోసం 'పైలట్', 'డైనమో మోటార్ కారు', కంటి పరీక్షల కోసం 'ఆఫ్తాలమోస్కోప్' అనే పరికరాలను కూడా చార్లెస్ బాబేజ్ తయారు చేశారు. గణిత, ఖగోళ సంబంధ పట్టికలను గణన చేసే యంత్రాన్ని తయారుచేశాడు. ఈ పరిశోధనకు 1824లో రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి బంగారు పతకాన్ని పొందారు. బాబేజ్ జ్ఞాపకార్థం చంద్రునిపై ఉన్న ఒక బిలానికి బాబేజ్ బిలం అని పేరు పెట్టడమే కాకుండా ఆయన పేరుమీద చార్లెస్ బాబేజ్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థను కూడా స్థాపించారు. చార్లెస్ బాబేజ్ గారు 1871లో 79వ ఏట మరణించారు.
    

13, అక్టోబర్ 2015, మంగళవారం

How to Post Facebook And Twitter At a time


ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ప్రతీది ఆటోమేటిక్ గా ట్విట్టర్ లోకి కూడా పోస్ట్ అయితే ఎంత బాగుంటుందో కదా .!
అవును మరి ఈ ఆలోచన తోనే ఈ వీడియో ని మీకోసం YouTube ద్వారా అందించందం జరిగింది 
మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న ప్రతి ప్రోస్ట్ డైరెక్ట్ గా క్షణాలలో మీ ట్విట్టర్ ఎకౌంటు లోకి కూడా ట్వీట్ చేయబడడం ఎలానో తెలుసుకోవాలంటే  ఈ క్రింది వీడియో ని తప్పక చూడాల్సిందే 
మరిన్ని టెక్నికల్ వీడియోస్ అప్డేట్ కోసం మా యుట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు

video link : http://bit.ly/HSfb2twitter

5, అక్టోబర్ 2015, సోమవారం

అందరికి వందనాలునాకు ఈ రోజు చాల సంతోషంగా ఉంది . . 

ముఖ పరిచయం లేకున్నా  ముఖ పుస్తకం ద్వార పరిచయం అయి నా పోస్ట్ లను నా వీడియో లను అభిమానిస్తున్న నా మిత్రులందరిని చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది . 

ఈ రోజు నేన్ ఇంత సంతోషంగా ఉన్నానంటే ఏదో నేను పడ్డ కస్టాలు కాదు , నేను అనుభవించిన అనుభావాలు కాదు. 

నేను చేసిన కృషి 20 శాతం అయితే నాకు మీరిచ్చిన సహకారం నా పోస్ట్ లను వీక్షించడం ఆరాధించండం 80 శాతం. 

ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎ ఉద్దేశం తో నైతే  బ్లాగ్ మరియు యుట్యూబ్ మొదలు పెట్టానో ఆ ఉద్దేశం ఆ ద్యేయం నెరవేరుతుంది అని .. 

మీ సహకారం లేనిదీ నేను సూన్యం తోని సమానం .. 

ఒక్కపుడు నన్ను నానా మాటలు అన్న నా సహా మిత్రులు ఇప్పుడు మీ సహకారం తో, మీ కామెంట్ లతో, మీ అభిమానం తో వాళ్ళు కూడా మారిపోయి నా పోస్ట్ లను చదవడం మొదలెట్టారు .. 

ఎప్పటికి వీళ్ళను మార్చలేను అనుకున్న నాలో ఒక తేజాన్ని నింపారు మీరు, మీకు నా హృదయపూర్వక వందనాలు . 

చిన్న చినన్ గ్రామాల నుంచే కాదు పెద్ద పెద్ద దేశాల నుంచే నా పోస్ట్ లను వీక్షిస్తున్నారు అంటే అంత కన్నా సంతోషం ఏముంది .. 

మీ సహకారాన్ని అందిస్తూ నేను చేస్తున్న పోస్ట్ లను వీడియో లను వీక్షితున్న వీక్షకులందరికి మరియు నా సహా మిత్రులకు అలాగే నా ముఖపుస్తక మిత్రులందరికీ పేరు పేరున శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను.

2, అక్టోబర్ 2015, శుక్రవారం

How to Stop Auto Play Videos In Facebook

ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా   కొన్నిమార్పులు జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్ గా 

http://bit.ly/HSfbvidautoplay


ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న Auto-Play Videos ని ఆఫ్ చేస్తే సరిపోతుంది ..
మొబైల్ యాప్ వాడుతున్నవారు ఫేస్బుక్ అప్లికేషను లో యాప్ సెట్టింగ్ లోకి వేల్తితే అక్కడ ఆటో ప్లే వీడియోస్ ని ఆఫ్ చేస్కొనే అవకాశం ఉంది ..