31, ఆగస్టు 2016, బుధవారం

Keep Hard Disk Drive Safe From error/failingమన సిస్టం మెమరీ లో ఎంతో విలువైన డేటా ఉంటది. మరిఅలాంటి హార్డ్ డిస్క్ అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోతే, పాడైపోతే...
అంత విలువైనా డేటా ని మల్లి మనం పొందలేము.. స్వీట్ మెమోరీస్ , అల్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్.. చాలచాల మిస్ అయిపోతాము వాటిని కోల్పోయాము అనే బాధ నుంచి అంత త్వరగా కోలుకోలేము కూడా..
మరి అంత విలువైన హార్డ్ డిస్క్ మెమరీని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది మరి దానికి తీస్కోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ పూర్తిగా చదవల్సినదే
ఈ క్రింద ఇవబడిన  పది పద్ధతులను  సరిగా  ఫాల్లో అయితే సరిపోతుంది .
1)     Run Check Disk
సాధరణంగా మన  హర్దిస్క్ కి ఎక్కువగా  సమస్య వచ్చేది హార్డువేర్ ప్రాబ్లం వలన ఇంకా సాఫ్ట్వేర్ ప్రొబ్లెంస్,పార్టిషన్ చేసే సమస్యలు మొదలగునవి . మరి ఇలాంటి ప్రాబ్లం ని బాడ్ సెక్టార్ లను క్రాస్ లింక్డ్ ఫైల్స్ ని సరిచేయుటకు ఈ చెక్ డిస్క్ అడుతంగా పని చేస్తుంది.
Start--> run--> command అని టైపు చేసి ఇంటర్ చేయండి ఇప్పుడు మనకి బ్లాకు స్క్రీన్ కల ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది,దానినే కమాండ్ ప్రాంప్ట్ అంటారు.
ఏ  డ్రైవ్ ని అయితే మనం చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ డ్రైవ్ లోకి వెళ్ళాలి ఎలా  అంటే ?

D:

D కోలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే D డ్రైవ్ కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది . నౌ సింపుల్ గా CHKDSK అని టైపు చేస్తే సరిపోతుంది డ్రైవ్ మొత్తం చెక్ చేయబడ్తుంది ఏమైనా ఎర్రర్ ఫైల్స్ ఉంటె అది సిస్టం రీబూట్ సమయం లో క్లీన్ చేస్తుంది . మనం కెన్సెల్ చేయక పోతే సరి
2)    ADD A MONITOR
మన హార్డ్ డ్రైవ్ ని మనం ఎంత బాగా వాడితే అంత బాగుగా ఉంటది . అయితే మన డ్రైవ్ హెల్త్ ఎప్పటి కప్పుడు  తెలుసుకొనుటకు ఇప్పటికే చాల అప్లికేషను లు అందుబాటులో ఉన్నాయి. నా ఛాయస్ ప్రకారం ACRONIS DRIVE MONITOR ఇది ఒక ఫ్రీవేర్ టూల్ ఈ అప్లికేషను మన డ్రైవ్ యొక్క ఉష్ణోగ్రత, హెల్త్ , ఫ్రీ స్పేస్ మొదలగునవి అన్ని నియత్రిస్తాయి ,తెలియజేస్తాయి. అంతే కాకుండా ఒక వేల ఈ మానిటరింగ్ లో ఏమైనా అంతరాయం ఏర్పడితే వెంటనే మన మెయిల్ కి అలెర్ట్ వస్తంది . దాని వలన మనం వెంటనే ప్రతిగాతించవచ్చు.
3)    FREEUP WINDOWS DRIVE
సాద్యమైనంత వరకు మన విండోస్ ఇన్స్టాల్ చేసి ఉన్న డ్రైవ్ ను ఫుల్ చేయకుండా చూసుకోవాలి,ఎంత ఫ్రీ అంత మంచిది, డిఫాల్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్ ని C: డ్రైవ్ లో కాకుండా వేరే డ్రైవ్ లో పెడితే డేటా ఫుల్ అవకుండా ఉంటుంది అంతే కాకుండా డెస్క్టాపు క్లీన్ అండ్ నీట్ గా ఉంచుకోవాలి, ఎక్కువ డేటా వలన ఎక్కువ రీడింగ్ అండ్ రైటింగ్ పడుతుంది కావున ఎక్కువ వాడబడుతుంది.
4)    BE CAREFUL ABOUT THE SURROUNDING ENVIRONMENT
మన సిస్టం ఉన్న రూమ్ లో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూస్కోవాలి, CPU కూడా గాలి వెలుతురు కి ఉండాలి అంతే గా టైట్ గా గాలి ఆడకుండా ఉండడం వలన హీట్ పెరిగి పోయి మెమరీ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కావున ఎంత నార్మల్ వాతావరం లోనే ఉంచాలి .
5)    WATCH OUT FOR STATIC
చాల మంది వద్ద నేను గమనించిన ముఖ్య సమస్య మరియు పెద్ద సమస్య ఇది. ఎలక్ట్రిసిటీనే మన సిస్టం కి అతి పెద్ద శత్రువు. ఎలా గంటె ప్రతి ఇంటికి ఎర్త్ *గ్రౌండ్ ఎర్త్* ఖచ్చితంగా ఉండాలి. చలికాలం మరియు వర్షాకాలం రోజులలో ఈ సమస్య ప్రాణాలకు కూడా అపాయం చేస్తుంది. కరెంటు డైరెక్ట్ ప్రవహించడం వలన ఏదైనా షాట్ అయినపుడు వెంటంటే హార్డ్ డిస్క్ కొట్టేస్తుంది . కావున ఈ విషయాన్ని ఎక్కుగవా గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి.
6)    DEGRAGMENT THAT DRIVE
ఇది కూడా అందరు గమనించాలి మన చేతిలో పనికావున చేస్కొంటే మనమే మన మెమరీ పాడవకుండా కొంత కాపడుకున్నట్టు  అవుతుంది. సాదరంగా ఈ ప్రాసెస్ మన ఆపరేటింగ్ సిస్టం నే చేసేస్కోంటా ఉంటది. కాని మనకు సమయం దొరికినపుడు మనం కూడా దాని చెక్ చేస్కొంటే ఎలాంటి సమస్య రాకుండా ఉంటది . డ్రైవ్ కి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే అక్కడ టూల్స్ ట్యాబు లో OPTIMIZE AND DEGRGMENT DRIVE అంటే సెక్షన్ లో OPTIMIZE అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఆప్షన్ లు ఫాల్లో అవుతే సరిపోతుంది .
7)    ERROR CHECKING
HARD DRIVE ERROR CHECK చేస్కొంటే సమస్య రాకుండా కొంత సహాయం పడినట్టు ఉంటది . డ్రైవ్ కి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే అక్కడ టూల్స్ ట్యాబు లో ఎర్రర్ చెకింగ్ అనే ఆప్షన్ ఉంటది అది దానిపై క్లిక్ చేసి ఫాల్లో అవుతే సరిపోతాది...
8)    INTERNAL DRIVE
మనం హార్డ్ డిస్క్ కొనే సమయంలో ఏ డ్రైవ్ కొంటె బాగుంటుంది ఏ కంపెనీ బెటర్ ఇంటర్నల్ నా లేదా ఎక్స్టర్నల్ హార్డ్డిస్క్ లో ఏది బెటర్ వాటి పై మనం చాల జాగ్రత్తలు వహించాలి. దాదాపు నా ద్రుష్ట్రా ఇంటర్నల్ హార్డ్ డిస్క్ నే బెటర్ ఎలా అంటే ఎలాంటి మూవింగ్ ఉండదు కావున నిచ్చల స్థితిలో ఎలాంటి రాశేష్ లాంటివి ఉండవు. అంతే కాకుండా ఏ సిస్టం కి పడితే ఆ సిస్టం కి పెట్టడానికి ఉండదు కావున ఎలాంటి వైరస్ దాడులు ఉండవు, ఎక్స్టర్నల్ అండ్ మనలో ఉండే సమస్యనే ఇది. లార్జ్ స్పేస్ మెమరీ హర్దిస్క్ అయితే ఇంటర్నల్ నే బెటర్ తక్కువ స్పేస్ తో అయితే ఎక్స్టర్నల్ వాడవచ్చు .
9)    TAKE ADVANTAGE OF POWER SAVE
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం లలో ఉన్న గొప్ప ఉపయోగపడే ఆప్షన్ ఈ  పవర్ సేవ్ విండోస్ 7 అలాగే ఆ పై వెర్షన్ లలో కంట్రోల్ ప్యానల్ లో పవర్ ఆప్షన్ లో చాల ఆప్షన్ లు అందుబాటులో ఉంటది . అందులో మన సిస్టం 20 నిమిషాలు IDLE గా ఉంటె సిస్టం డైరెక్ట్ గా హార్డ్ డ్రైవ్ ని ఇనాక్టివ్ చేసేస్తుంది . కావున పవర్ సమన్వయంగా ఉంటుంది కావున హార్డ్ డిస్క్ కొంచం సేఫ్ లో ఉంటుంది . అలాగే స్లీప్ లాంటి ఆప్షన్ ఇంకా ఎంతో గాను ఉపయోగపడతాయి .
10)   TIGHTEN THOSE SCREWS
ఇది చాల ముఖ్యంగా తెలియకుండా జరిగి పోయే సమస్య ఏంటంటే మన హార్డ్డిస్క్ సిస్టం CPU చాసిస్ కి భిగించినపుడు చాల టైట్ గా ఉండేలా చూస్కోవాలి లూస్ గా ఉండడం వలన చిన్న చిన్న VIBRATIONS జరిగినపుడు వర్కింగ్ లో ఉన్న హర్దిస్క్ కదలడం వలన హార్డ్ డిస్క్ ఒక్క సారిగా ఆగిపోతుంది . పాడవుతుంది . దాదాపు హార్డ్ డిస్క్ అస్సలు కదలకుండా ఫుల్ ఫిట్ అయేలా ఫీలయితే రెండు వైపులా స్క్రూ లను భిగించాలి .
11)   PENDRIVE VIRUS ATTACKING
ఇది చాల మంది ఎదురుకొంటున్న ప్రాబ్లం , PENDRIVE లోని డేటా ని ఎలాంటి స్కాన్ చేయకుండా డైరెక్ట్ గా మన హార్డ్ డిస్క్ లోకి కాపీ చేస్కోవద్దు అలా చేయడం వలన ఏదైనా మెమరీ ట్రోజెన్ గనుక అందులో ఉంటె మన హార్డ్ డిస్క్ లైఫ్ ని మెమరీ ని మెల్లిగా తినుకుంటూ వచ్చేస్తుంది . షార్ట్కట్ వైరస్ , లింక్ వైరస్ . EXE వైరస్ లు ఉంటె ఆ డేటా ని స్కిప్ చేసేయాలి కాని కాపీ చేస్కొని తర్వాత చూద్దాం అనుకోవడం మన మూర్ఖత్వమే
12)   BACKUP

హార్డ్ డిస్క్ పాడైపోయిన తర్వాత మనం ఎంత బాధ పడిన ఎం లాభం లేదు , ఎంత ప్రయత్నించిన తక్కువ అవకాశాలు ఉండవచ్చు . అందుకని ముందుగానే మన ఇంపార్టెంట్ డేటా ని క్లౌడ్ మెమరీ లో స్టోర్ చేస్కోవడం లేదా బ్యాక్ అప్ CREATE చేసి ఏదైనా CD/డీవీడీ లేదా ఏదైనా పెండ్రివే లోకి కాపీ చేస్కొంటే చాల చాల బెటర్ గా ఉంటుంది .

16, ఆగస్టు 2016, మంగళవారం

Hike New Option

న్ని ఇన్నిరోజులుగా హైక్ లో favorites అని ప్రవేశ పెట్టిన ప్రకారం ఎవరినైతే మనం ఫేవరెట్స్ లో ఆడ్ చేస్కొంటామో వారికి మాత్రమే మన టైంలైన్ పోస్ట్ లు కనిపించేవి....... వారు మనని ఫేవరెట్ గా ఆడ్ చేస్కొంటే వారికి మన పోస్ట్ లుకనిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ అందరికి అర్ధం కావటం లేదని గమనించిన హైక్ సంస్థ ఇప్పుడు ఆ ఫీచర్ ని కాస్తా ఫ్రెండ్స్ గా మార్చేసింది..
ప్రస్తుత ప్రజలు పై ఫేస్బుక్ ప్రభావితం చూసి ఇలా అయితే ఈజీ గా ప్రజలలోకి చొరబడుతుంది అని గమనించి ఇలా ఫ్రెండ్స్ అనే ఫీచర్ గా మార్చేసారు.. favorites లో ఎలాగైతే ఆడ్ చేస్కోన్తామో అదే విధంగా ఇది కూడా.. ఆడ్ ఫ్రెండ్ పై క్లిక్ చేస్తే చాలు.. విషయం ఏంటంటే మనం ఫ్రెండ్ గా ఆడ్ చేస్కోన్నాము అనే విషయం వారికి కూడా తెలిసి పోతుంది, అందువలన మరింత గట్టి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అని బావించింది హైక్ ఇండియన్ సంస్థ.
ఒక్కప్పటితో పోలిస్తే అప్పట్లో ఎక్కువగా పోస్ట్ లకి లైక్ లు రావట్లేదు అని బావించే మిత్రులకి ఇది అద్బుతమైనా ఆప్షన్ గా మారిపోయింది..
వాస్తవానికి వాట్స్ యాప్ తో పోలిస్తే హైక్ నే చాల ఫాస్ట్ గా తక్కువ డేటా ని ఉపయోగించుకునే అప్లికేషను అని స్పష్టంగా తెలిసిపోతుంది.
I always like hike ..
Thanks Hike

3, ఆగస్టు 2016, బుధవారం

Windows 10 Anniversary Update Released

విండోస్ 10 రిలీజ్ వార్షికోత్సవ సందర్భంగా విండోస్ 10 anniversary Update ను రిలీజ్ చేసింది. ఎన్నోన్నో అద్బుతమైన ఫీచర్లను ఇందులో పొంధపరిచారు. ఈ అప్డేట్ ను మీరు మీ విండోస్ అప్డేట్ ద్వారా పొందవచ్చు లేదా

ఈ లింక్ నుంచి చిన్న టూల్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవచ్చు

లింక్:Click Here To Download