విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేత
విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఓఎస్‌ను వాడుతున్న యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా విండోస్ 8కు ముందు వెర్షన్ విండోస్ 7కు సెక్యూరిటీ సపోర్ట్‌ను 2020 జనవరి 14 వరకు కొనసాగించనుండగా, ప్రస్తుతం యూజర్లు కొత్తగా వాడుతున్న విండోస్ 10కు 2025 అక్టోబర్ 14 వరకు సపోర్ట్‌ను అందించనుంది. విండోస్ 7కు కాకుండా విండోస్ 8కు సపోర్ట్‌ను ఆపేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. విండోస్ 7 లా కాకుండా 8 వెర్షన్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదని ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మూలం : నమస్తే తెలంగాణ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి