29, ఫిబ్రవరి 2016, సోమవారం

Secure Zone Management in Lenovo K3 Note in telugu

మన మొబైల్ లో మనం రోజు వాట్స్ ఆప్ చాటింగ్ , హైక్ , ఫేస్బుక్ లాంటివి ఎన్నోపర్సనల్  మెంటైన్ చేస్తుంటాము. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మన మొబైల్ లో మన మిత్రులు అడగవచ్చు.  లేదా ఇంట్లో ఫోన్ ని మనం వాడుతున్నాం అనుకుందాం . మరి అలాంటప్పుడు చాల కష్టం అవుతుంది . మనం  వాట్స్ ఆప్ లో ఎం చాట్ చేసామో చూస్తారనే బయం ఉంటుంది . 

లేదా ఒక మొబైల్ లో ఒకరు మాత్రమే వాట్స్ ఆప్ , హైక్ , ఫేస్బుక్ లాంటి అప్లికేషను ని వాడవచ్చు (external ఆప్స్ తో వాడడం వేరే విషయం) మరి ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషను లేకుండా  secure గా  మైంటైన్ చేయడం లెనోవో k3 నోట్ లో  సాద్యం,సులభం మరి ఇదే విషయం పై వీడియో చేసాను . 

తప్పక వీడియో చూడండి. వీలైతే రెండు  వాట్స్ యాప్ లు కూడా  వాడుకోండి.  చాల సులభామైనా పద్ధతి . తప్పక మీకు అందరికి నచ్చుతుందని బావిస్తున్నాను . 

వీడియో మనకు ఉపయోగకరమని బావిస్తే నలుగురికి తెలియజేసి ఆనందించగలరు .

వీడియో లింక్ : https://youtu.be/wSW9_CMQtF4

    

17, ఫిబ్రవరి 2016, బుధవారం

3d effect easy in photoshop



ఒక మంచి అద్బుతమైన 
3d ఎఫెక్ట్ తయారు చేయాలంటే తప్పక ఈ వీడియో చూడండి .

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు 
కచ్చితంగా సంమాధనం ఇస్తాను .

https://www.youtube.com/watch?v=m3zJ24ibzY4
    

Freedom 251 Smart Mobile only on 251 rupees

నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రపంచంలోకల్లా అత్యంత చవకైన స్మార్ట్_ఫోన్ తయారు చేసింది. 'ఫ్రీడమ్ 251' గా పిలవబడుతున్న ఈ స్మార్ట్_ఫోన్ ఖరీదు కేవలం 251 (రెండొందల యాభై ఒక్క రూపాయలు) మాత్రమే..!!! కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన భారీ సహకారంతోనే ఫ్రీడమ్ 251 స్మార్ట్_ఫోన్ తయారు చేయగలిగామని రిగింగ్ బెల్స్ ప్రకటించింది. ఈ రోజు (17-02-2016) కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, బీజేపీ సీనియర్ ఎంపీ మురళీమనోహర్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌_ను ఆవిష్కరించనున్నారు.

ప్రీ installed గా ప్రజల అవసారాలకు అనుగుణంగా మంచి అప్లికేషను లను అందిస్తున్నారు. 

Women safety
swatch bharath
fisher man 
farmar
medical

ఇలా మంచి అప్లికేషన్స్ తో .. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1( లాలిపాప్  ) తో అందిస్తున్నారు 

అంతే కాదు. ఫ్రంట్ 3.0 కెమెరా బ్యాక్ 3.2 mp కెమెరా ను కూడా అందిస్తున్నారు. 

ఈ ఫోన్ రైతులకు , ఇంట్లో అమ్మ కి , బయట నాన్నకు అక్క చెల్లలికి  చాల బాగా పని చేస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు 

online booking start from tomoroow link is http://freedom251.com/index.php/home

వీడియో కోసం : https://www.youtube.com/watch?v=ET9jc9GeGNk

Mi Smart Phones

ఇదిగో mi వీక్ ..

mi ఫోన్స్ రేట్స్ చాల తగ్గినాయి . త్వరగా త్వరపడండి. బాగా చూసి వెరిఫై చేస్కొని తెలుసుకొని కొనండి ...

నేను కొందాము అనుకున్నప్పుడు చాల రేట్స్ ఉండే అందుకే లెనోవో k3 నోట్ తీస్కోన్నాను .

ఇప్పుడు అవకాశం వచ్చింది కావున మీకు చెప్తున్నాను .

అమెజాన్ లో mi స్టోర్ ని సంప్రదించండి

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

3D effect Using Photoshop telugulo

వీక్షకులందరికి నమస్కారములు 
అతి సులభమైన రీతిలో అందరికి అర్ధమయ్యే సరలమైనా బాషలో వీడియో ని తయారుచేయడం జరిగింది. మీ పేరును కాని లేదా ఇతర ఏ లేయర్ అయినా ఈ విధంగా సింపుల్ గా డిజైన్ చేయవచ్చును. పెద్దగా లోతైనా ఆప్షన్ ఏమి వాడకుండా మనం రెగ్యులర్ గా చూస్తే ఆప్షన్ నే వాడి చేయడం జరిగింది . తప్పక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫోటోషాప్ లోని 7.0, 8.0 ఇలా ఏ వెర్షన్ లోనైనా ఈ ట్రిక్ ని యూస్ చేయవచ్చును, లేటెస్ట్ వెర్షన్ ఫోటోషాప్ లలో 3D ఆప్షన్ ఇప్పటికి అందుబాటులో ఉన్న దానికి హై గ్రాఫిక్స్ కావలసి ఉంటుంది. కాని ఈ వీడియో లో చూపిన దానికి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం లేదు .కావున తప్పక చూడండి . స్వంతగా డిజైన్ చేయండి . తప్పకుండ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి నాకు ట్యాగ్ చేయండి. 

వీడియో లో ఏమైనా సందేహాలు , సలహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

Graphic Card Information

మదర్ బోర్డుకి గ్రాఫిక్స్ కార్డ్
        సాధారణంగా ప్రతి పీసీ మదర్_బోర్డుకి గ్రాఫిక్స్ కార్డ్, సౌండ్ కార్డ్ చిప్లు వస్తుంటాయి. అంటే ఆ చిప్లు బోర్డ్ నుంచి విడదీయలేమన్నట్లు అతికించేసి ఉంటాయన్నమాట. కానీ ఆ చిప్ల సామర్ద్యం తక్కువ. నార్మల్ యూజర్కి సరిపోను ఉంటుంది వాటి పర్ఫామెన్స్. మార్కెట్లో హై స్పెసిఫికేషన్స్ ఉన్న గ్రాఫిక్స్ కార్డ్స్, సౌండ్ కార్డ్స్ విడిగా దొరుకుతాయి. వాటిని అమర్చుకుంటే మదర్_బోర్డుకి వచ్చిన ఆ చిప్లు పనిచేయడం ఆగిపోయి మనం అమర్చిన కార్డులు పనిచేయడం మొదలెడతాయి. కొన్ని సాఫ్టువేర్లు లేదా గేములు వర్క్ అవ్వాలంటే ఇవి అవసరం అవుతుంటాయి. ఈ విధంగా నార్మల్ పీసీ యూజర్ అవసరాలకు సరిపోయే విధంగా మదర్_బోర్డు మీదే గ్రాపిక్స్ కార్డ్, సౌండ్ కార్డ్ చిప్లు ఫిక్స్ చేయబడి ఉన్నట్లే, కొన్ని మదర్_బోర్డులు ప్రాసెసర్_తో కలిపి కూడా లభ్యమవవుతుంటాయి. అంటే మనం ప్రాసెసర్ విడిగా కొనుక్కుని అమర్చుకోవాల్సిన అవసరం లేకుండా మదర్_బోర్డుకే ప్రాసెసర్ అతికించేసి ఉంటుందన్నమాట. వీటిని onboard CPU అంటారు. ఇకపోతే మదర్_బోర్డుపై అన్ని రకాల చిప్స్... ర్యామ్, ప్రాసెసర్, గ్రాఫిక్స్, సౌండ్, వైఫై, బ్లూటూత్ ఎక్సట్రా అన్ని రకాల చిప్స్ అతికించి లభించబడే మదర్_బోర్డులు కూడా ఉంటాయి. ఇలాంటి ఆల్-ఇన్-వన్ మదర్_బోర్డులను SoC (system-on-chip) అని పిలుస్తారు. మనం ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్_ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల మదర్_బోర్డులు ఈ టెక్నాలజీ కోవకు చెందినవే. లేటస్ట్_గా డెస్క్టాప్ సీపీయూల కోసం కూడా ఇటువంటి మదర్_బోర్డులు వస్తున్నాయి.

Decreasing Memory Cards Prices



చాలాకాలం క్రితం ధరలతో పోల్చితే మెమోరీ కార్డుల ధరలు బాగా తగ్గాయి. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే మెమోరీ కార్డులు కొనుగోలు చేసి వాడుతుంటారు చాలామంది. అవి బాగానే పని చేసినా కూడా ఫిజికల్_గా క్వాలిటీ తక్కువేనన్నది వాస్తవం. మెయింటినెస్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మెమోరీ కార్డ్ కరెక్ట్ అయిపోయి డేటా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మెమోరీ కార్డ్ కరెక్ట్ అయిపోవడంతో అందులోని ముఖ్యమైన డేటా కోల్పోయి, తిరిగా డేటా రికవరీ చేయడం వీలవుతుందేమోనని ఈ గ్రూప్లో కోరినవారు కూడా ఉన్నారు. కరెప్ట్ కాకుండా ఉండాలంటే:- 1) డివైజ్ నుంచి మెమోరీ కార్డ్ బయటకు తీసేటప్పుడు ముందుగా డివైజ్_లో ఉండే ఆప్షన్ల ద్వారా మెమోరీ కార్డుని డిస్కనెక్ట్ చేయాలి. ఇలా డిస్కనెట్ చేయడం ద్వారా మెమోరీ కార్డులో రన్ అవుతున్న ప్రాసెస్లు క్లోజ్ అవడంతో మెమోరీ కార్డ్ బయటకు తీయడానికి రెడీ అవుతుంది. ఈ విధంగా డిస్కనక్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు బయటకు లాగారంటేమటుకు ఎదో ఒక టైమ్‌లో తుస్ అంటుంది. 2) మెమోరీ కార్డుకి వెనుక యెల్లో కలర్లో కనిపించే భాగాన్ని టచ్ చేయకపోవడమే మంచిది. టచ్ చేస్తే మన శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే స్టాటిక్ వోల్టేజి మెమోరీ కార్డుని డామేజి చేయగలదు. ఇలా చిన్న చిన్న టిప్లు పాటించి మెమోరీ కార్డుని సురక్షితంగా ఉంచవచ్చు

Stopping Support To Windows 8 from microsoft


విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేత 

      విండోస్ 8 ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఈ ఓఎస్‌ను వాడుతున్న యూజర్లు కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా విండోస్ 8కు ముందు వెర్షన్ విండోస్ 7కు సెక్యూరిటీ సపోర్ట్‌ను 2020 జనవరి 14 వరకు కొనసాగించనుండగా, ప్రస్తుతం యూజర్లు కొత్తగా వాడుతున్న విండోస్ 10కు 2025 అక్టోబర్ 14 వరకు సపోర్ట్‌ను అందించనుంది. విండోస్ 7కు కాకుండా విండోస్ 8కు సపోర్ట్‌ను ఆపేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. విండోస్ 7 లా కాకుండా 8 వెర్షన్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదని ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


మూలం : నమస్తే తెలంగాణ

Electric Auto Riksha

ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా



దిల్లీ: ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని సులభతరం చేసేందుకు స్వీడన్‌కు చెందిన క్లీన్‌ మోషన్‌ కార్‌ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాను బుధవారం విడుదల చేసింది. దేశరాజధాని దిల్లీలో 'జెబ్బీ' పేరుతో ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాను క్లీన్‌ మోషన్‌ సీఈవో గోరన్‌ ఫోక్సన్‌, భారత్‌లో ఆ కంపెనీ హెడ్‌ అనిల్‌ అరోరా బుధవారం విడుదల చేశారు. ముగ్గురు వ్యక్తులు కూర్చుని ప్రయాణించగలిగే ఈ ఆటోరిక్షా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. సుమారు 10 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుంది 

మూలం : ఈనాడు