smart phone లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
smart phone లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2016, గురువారం

Join with Us in Telegram

తెలుగు ప్రజలందరికీ మిత్రులందరికీ నమస్కారం.

మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది.
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.

  • ·         ఫేస్బుక్ పేజి
  • ·         ఫేస్బుక్ గ్రూప్
  • ·         పర్సనల్ ఎకౌంటు
  • ·         వాట్స్ యాప్
  • ·         hike టైంలైన్
  • ·         బ్లాగ్
  • ·         వెబ్సైటు
  • ·     YouTube


ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.


టెలిగ్రాం అప్లికేషను  డౌన్లోడ్  చేస్కోనుటకు  లింక్ : click here

(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే ఇందులో
నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి.

ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్ ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ , వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట

టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.

ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు. లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.

ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.

ఛానల్లో మ్యూట్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.

చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.

మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.

ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)


26, జులై 2016, మంగళవారం

hike messenger లో కొత్త అప్డేట్..

hike  messenger  లో కొత్త అప్డేట్.. 

ఇన్నిరోజులు  కేవలం  చాట్  థీమ్ కేవలం  అక్కడ  ఉన్న ఇమేజ్  లను మాత్రమే  పెట్టుకొనేలా  ఉండేది .. 
కాని  ఇప్పుడు  వచ్చిన  కొత్త  అప్డేట్  లో  మనకు  నచ్చిన  ఫోటో,వాల్పేపర్  ని  చాట్  థీమ్  గా పెట్టుకునే  అవకాశం  వచ్చింది . 



వాట్స్  యాప్  లో  ఇది  ఎప్పటి నుంచో  ఉంది  కదా  అని  అనుకోవచ్చు  కాని దానికి  దీనికి  చాల తేడా  ఉంది . వాట్స్ యాప్  లో మనం  పెట్టిన వాల్ పేపర్  అన్ని  చాట్  బాక్స్  లోను అదే  కనిపిస్తుంది . కాని హైక్  లో మనం  పెట్టిన  చాట్ థీమ్ కేవలం  ఎవరి చాట్ బాక్స్ లో పెట్టామో  అందులోనే  కనిపిస్తుంది.ఇలా మనకి నచ్చిన చాట్ థీమ్స్ ఒక్కొకరికి  ఒక్కొక్కటిగా  పెట్టుకోవచ్చు .


వాస్తవానికి  ఇది  మంచి  అప్డేట్  అని  చెప్పుకోవాలి .

పర్సనల్  గా ఇద్దరు  ఇష్టపడే  ఇమేజ్  ని చాట్ థీమ్  గా  మార్చుకొంటే  చాల  బాగుంటుంది. స్వీట్  మెమోరీస్  లాంటివి  ప్రత్యేకంగా  పెట్టుకోవచ్చు  కావున ఆనంధకరముగా  కూడా  ఉంటుంది . తప్పక  ట్రై  చేయండి .

27, మే 2016, శుక్రవారం

Lenovo K3 Note New Update





లెనోవో కే3 నోట్ లో మల్లి సరికొత్త అప్డేట్ 13 mb గల ఈ అప్డేట్ ద్వార పెర్ఫార్మన్స్ మరియు బగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది .. డౌన్లోడ్స్ అనే యాప్ కూడా తిరిగి వచ్చింది

30, ఏప్రిల్ 2016, శనివారం

Save Battery Life

ప్రస్తుత కాలంలో smartphone మన శరీరంలో ఒక భాగం అయ్యింది. ఎంత పనిలో నిమగ్నమై ఉన్న కూడా రోజులో ఒక గంటలో పది సార్లు notifications చూస్తుంటాము. whatsapp చూస్తూఉంటాము. అనవసరపు గ్రూప్ చాటింగ్ కూడా ఉంటాయి..

రోజు మొత్తం data connection or wifi ఆన్ చేసే ఉంచుతారు.
మితంగా చార్జింగ్‌.. అమితంగా బ్యాటరీ వాడకం.. అస్తమానం మొబైల్‌ వాడుతూ ఉండటం వల్ల చార్జింగ్‌ పెట్టేందుకు సాధారణంగా సమయం దొరకదు...మరి కొందరు రాత్రి మొత్తం చార్జింగ్‌ పెట్టి ఉదయమే తీస్తుంటారు. ఈ విధానం వల్ల బ్యాటరీ త్వరగా దాని సామర్థ్యం కోల్పోతూ ఉంటుంది.

బ్టాటరీ నిర్వాహణలో కొన్ని చిట్కాలు.

1) battery full అని చూపగానే చార్జింగ్‌ తీసే యాలి. అంతకన్నా ఎక్కువగా చార్జింగ్‌ ఉంచితే క్రమేణా దాని సామర్థ్యం కోల్పోతుంది.

2) సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్యలోనే చార్జింగ్‌ వాడకం ఉండాలి. 20 శాతం కన్నా తక్కువ చార్జింగ్‌ వాడుతున్నప్పుడు రేడియేషన్‌ కూడా ఎక్కు వగా ఉంటుందని నిపుణులు హెచ్చరిసున్నారు.

3) అవసరం మేరకే data connection ఆన్ చేసి, మిగతా సమయంలో off చేయాలి

4) display brightness మనకి కనిపించేలా తక్కువగా ఉండేలా చూస్కోవాలి. సెల్ఫ్ స్టడీ మోడ్ ఉంటె రాత్రి సమయం లో ఆన్ చేస్కోవాలి.

5) gps location అవసరం మేరకే ఆన్లో ఉంచాలి.దీని వల్ల battery తొందరగా discharge అవుతుంది.

6) power saver లాంటి సదుపాయాలు ఉంటె మనం వాడని సమయం లో ఆన్ చేస్కొంటే మంచిది.

7) ఛార్జింగ్ పెట్టి సెల్ఫోన్ వాడటం అంత మంచిది కాదు.

8) camera వాడుతున్నసమయం లో వాడకం ఐపోగానే బ్యాక్ వచ్చేయాలి.. కెమెరా స్టాండ్ బై పెట్టడం వలన అధికంగా discharge అవుతుంది.

9) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో సెల్ ఫోన్ వాడకం అస్సలు మంచిది కాదు.

10) ఎండాకాలం ఎక్కువగా సెల్ వేడి అవుతా ఉంటుంది కావున వాడకం తగ్గించి. కూల్ weather లో ఉపయోగించడం మంచిది.

వీటిని అనుసరిస్తే చార్జింగ్ ఎక్కువ సేపు నిలుస్తుంది.

ముఖ్యమైనది ఎంటంటే చాలా మంది కంప్యూటర్లు, ల్యాప్ టాపులతో చార్జింగ్ పెడితే మంచిదేనా అనుకుంటారు.
*మామూలు చార్జర్‌తో 5 volts,1 amps విద్యుత్తు వస్తుంది. అదే కంప్యూటర్‌ యూఎస్‌బీ నుంచి 5 volts, 0.5 amps వస్తుంది.

*యాంప్స్‌ తేడా వల్ల చార్జింగ్‌ అయ్యే వేగం తగ్గుతుంది తప్పా వేరే ఇబ్బంది ఉండదు. సాధారణ చార్జర్‌తో వేగంగా అవుతుంది ఫోన్‌ కొంత మేర వేడెక్కుతుంది. అదే యూఎస్‌బీ నుంచి అయితే వేగం తక్కువైనా వేడి ఎక్కడం తక్కువగా ఉంటుంది.

*.యూఎస్‌బీ 3.0 నుంచి మాత్రం 0.900 యాంప్స్‌రావడం వల్ల సాధారణ చార్జర్‌కి దానికి పెద్దగా తేడా ఉండదు. పైగా నష్టం కూడా లేదు.

* యూఎస్‌బీ పెట్టిన వెంటనే మొబైల్లో వచ్చే ఆప్షన్ లలో ఛార్జింగ్ ఓన్లీ ఆప్షన్ ఎంచుకొంటే బాగుంటుంది.. ( అన్నిమొబైల్ లలో ఈ ఫీచర్ ఉండక పోవచ్చు)

*.యూఎస్‌బీ ద్వారా చార్జింగ్‌ చేసుకోవాలంటే సిస్టమ్‌ నుంచి నేరుగా పెట్టుకోవాలి తప్పాయూఎస్‌బీ హబ్‌ ద్వారా పెట్టుకోకూడదు. దానికి కనెక్ట్‌ చేసిన వేరు డివైస్‌ల వల్ల కొంత ఇబ్బంది కలిగి చార్జింగ్‌ అయ్యే విధానంలో వ్యత్యాసాలు ఏర్పాడతాయి.

17, ఫిబ్రవరి 2016, బుధవారం

Freedom 251 Smart Mobile only on 251 rupees

నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ప్రపంచంలోకల్లా అత్యంత చవకైన స్మార్ట్_ఫోన్ తయారు చేసింది. 'ఫ్రీడమ్ 251' గా పిలవబడుతున్న ఈ స్మార్ట్_ఫోన్ ఖరీదు కేవలం 251 (రెండొందల యాభై ఒక్క రూపాయలు) మాత్రమే..!!! కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన భారీ సహకారంతోనే ఫ్రీడమ్ 251 స్మార్ట్_ఫోన్ తయారు చేయగలిగామని రిగింగ్ బెల్స్ ప్రకటించింది. ఈ రోజు (17-02-2016) కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, బీజేపీ సీనియర్ ఎంపీ మురళీమనోహర్ జోషి సమక్షంలో న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌_ను ఆవిష్కరించనున్నారు.

ప్రీ installed గా ప్రజల అవసారాలకు అనుగుణంగా మంచి అప్లికేషను లను అందిస్తున్నారు. 

Women safety
swatch bharath
fisher man 
farmar
medical

ఇలా మంచి అప్లికేషన్స్ తో .. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1( లాలిపాప్  ) తో అందిస్తున్నారు 

అంతే కాదు. ఫ్రంట్ 3.0 కెమెరా బ్యాక్ 3.2 mp కెమెరా ను కూడా అందిస్తున్నారు. 

ఈ ఫోన్ రైతులకు , ఇంట్లో అమ్మ కి , బయట నాన్నకు అక్క చెల్లలికి  చాల బాగా పని చేస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు 

online booking start from tomoroow link is http://freedom251.com/index.php/home

వీడియో కోసం : https://www.youtube.com/watch?v=ET9jc9GeGNk

16, డిసెంబర్ 2015, బుధవారం

Publish Your Songs World Wide

HOW TO PUBLISH OUR SONGS

             చాల వరకు వ్యక్తులలో మంచి టాలెంట్ ఉంటుంటుంది. కవితలు రాయడం పాటలు రాయడం , రాసిన వాటిని పాడడం చేస్తుంటారు . అయితే ఇలా వారు పాడిన కవిత కాని , పద్యాలూ కాని, వ్యాక్యాలు కాని , పాటలు కాని ఏవైనా ఎవరికైనా పంపించాలంటే మెయిల్ చేయడం పర్సనల్ గా పంపించడం చేస్తుంటాము, లేదా క్లౌడ్ storage లో పెట్టి లింక్ ని షేర్ చేస్తుంటాము. కాని అది అందరికి డౌన్లోడ్ చేస్కోవడం రాకపోవచ్చు .

మరి ఎలా అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది . ఇలాంటి వారికోసం ప్రత్యేకమైనా వెబ్సైటు ఉంది అందులో అందరు ఒకే రకమైనా బావం తో ఉన్న వారు ఉంటారు కావి ఆ డేటాబేస్ లోనుంచి మంచి మిత్రులు కలవ వచ్చు .

వీడియో తప్పక చూడండి . ఉపయోగకరమని బావిస్తే సబ్స్క్రయిబ్ చేస్కొండి మా వీడియో లను మీ మెయిల్ కి పొందండి .

వీడియో లింక్ : How to publish your song

వీలైతే మీ మిత్ర్లులకు కూడా తెలియజేయండి .
రాయరాకుల కర్ణాకర్
9014819428
www.rktechinfo.com

18, జులై 2015, శనివారం

ఈ స్మార్ట్ ఫోన్ పగలదు , తడవదు



ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు.

అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. లిక్విడ్ మార్ఫియంతో 5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తెలిపింది. స్టీల్, అల్యూమినియం కంటే లిక్విడ్ మార్ఫియం పటిష్టంగా ఉంటుందని వెల్లడించింది. దీంతో తయారైన ఫోను షాక్, స్క్రీన్ బ్రేకేజీలను తట్టుకుంటుందని తెలిపింది.


యాపిల్ సంస్థ ఇప్పటికే ఈ లోహాన్ని ఐఫోన్ 6లో తక్కువ మొత్తంలో లిక్విడ్ మార్ఫియం వాడుతోంది. ఫోను లోపలి భాగాలకు నానో కోటింగ్ వేయడం వల్ల నీటిలో పడినా ఏమీ కాదని పేర్కొంది. ప్రైవసీ కీస్, లిక్విడ్ మెటల్, నానో కోటింగ్ ఫీచర్లపై ప్రాధానంగా దృష్టి సారించి ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ సీఈవో స్టీవ్ చయొ తెలిపారు. జూలై 31 నుంచి దీన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. 16జీబీ మోడల్ ధర సుమారుగా రూ. 27 వేలు.

7, జూన్ 2015, ఆదివారం

Send Message to All Members At a Once Whats App

మన నిరంతర కాలం లో వాట్స్ యాప్ ఇప్పుడు ఒక బాగంగా మారిపోయింది. ఏ విషయం అయినా సరే వాట్స్ యాప్ లో యిట్టె అందరికి పాకేస్తుంది. 

ఏదైనా విషయాన్నీ ఒకే సారి మన మిత్రులందరికీ లేదా ఎక్కువగా మనతో చాట్ చేసే మిత్రులకు, షేర్ చేయాలంటే మెసేజ్ చేయాలంటే ఎలా? చేయొచ్చు చాల సులభం. మరి అది ఎలానో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వచ్చే వీడియో ను తప్పక చూడాల్సిందే.


Video link : www.bit.ly/HSbroadcast






అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు .
Subscriber link : www.bit.ly/rayarakula

మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com
మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u
మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను.  
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com