10, ఫిబ్రవరి 2016, బుధవారం

Graphic Card Information

మదర్ బోర్డుకి గ్రాఫిక్స్ కార్డ్
        సాధారణంగా ప్రతి పీసీ మదర్_బోర్డుకి గ్రాఫిక్స్ కార్డ్, సౌండ్ కార్డ్ చిప్లు వస్తుంటాయి. అంటే ఆ చిప్లు బోర్డ్ నుంచి విడదీయలేమన్నట్లు అతికించేసి ఉంటాయన్నమాట. కానీ ఆ చిప్ల సామర్ద్యం తక్కువ. నార్మల్ యూజర్కి సరిపోను ఉంటుంది వాటి పర్ఫామెన్స్. మార్కెట్లో హై స్పెసిఫికేషన్స్ ఉన్న గ్రాఫిక్స్ కార్డ్స్, సౌండ్ కార్డ్స్ విడిగా దొరుకుతాయి. వాటిని అమర్చుకుంటే మదర్_బోర్డుకి వచ్చిన ఆ చిప్లు పనిచేయడం ఆగిపోయి మనం అమర్చిన కార్డులు పనిచేయడం మొదలెడతాయి. కొన్ని సాఫ్టువేర్లు లేదా గేములు వర్క్ అవ్వాలంటే ఇవి అవసరం అవుతుంటాయి. ఈ విధంగా నార్మల్ పీసీ యూజర్ అవసరాలకు సరిపోయే విధంగా మదర్_బోర్డు మీదే గ్రాపిక్స్ కార్డ్, సౌండ్ కార్డ్ చిప్లు ఫిక్స్ చేయబడి ఉన్నట్లే, కొన్ని మదర్_బోర్డులు ప్రాసెసర్_తో కలిపి కూడా లభ్యమవవుతుంటాయి. అంటే మనం ప్రాసెసర్ విడిగా కొనుక్కుని అమర్చుకోవాల్సిన అవసరం లేకుండా మదర్_బోర్డుకే ప్రాసెసర్ అతికించేసి ఉంటుందన్నమాట. వీటిని onboard CPU అంటారు. ఇకపోతే మదర్_బోర్డుపై అన్ని రకాల చిప్స్... ర్యామ్, ప్రాసెసర్, గ్రాఫిక్స్, సౌండ్, వైఫై, బ్లూటూత్ ఎక్సట్రా అన్ని రకాల చిప్స్ అతికించి లభించబడే మదర్_బోర్డులు కూడా ఉంటాయి. ఇలాంటి ఆల్-ఇన్-వన్ మదర్_బోర్డులను SoC (system-on-chip) అని పిలుస్తారు. మనం ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్_ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల మదర్_బోర్డులు ఈ టెక్నాలజీ కోవకు చెందినవే. లేటస్ట్_గా డెస్క్టాప్ సీపీయూల కోసం కూడా ఇటువంటి మదర్_బోర్డులు వస్తున్నాయి.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి