10, ఫిబ్రవరి 2016, బుధవారం

Decreasing Memory Cards Prices



చాలాకాలం క్రితం ధరలతో పోల్చితే మెమోరీ కార్డుల ధరలు బాగా తగ్గాయి. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే మెమోరీ కార్డులు కొనుగోలు చేసి వాడుతుంటారు చాలామంది. అవి బాగానే పని చేసినా కూడా ఫిజికల్_గా క్వాలిటీ తక్కువేనన్నది వాస్తవం. మెయింటినెస్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మెమోరీ కార్డ్ కరెక్ట్ అయిపోయి డేటా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మెమోరీ కార్డ్ కరెక్ట్ అయిపోవడంతో అందులోని ముఖ్యమైన డేటా కోల్పోయి, తిరిగా డేటా రికవరీ చేయడం వీలవుతుందేమోనని ఈ గ్రూప్లో కోరినవారు కూడా ఉన్నారు. కరెప్ట్ కాకుండా ఉండాలంటే:- 1) డివైజ్ నుంచి మెమోరీ కార్డ్ బయటకు తీసేటప్పుడు ముందుగా డివైజ్_లో ఉండే ఆప్షన్ల ద్వారా మెమోరీ కార్డుని డిస్కనెక్ట్ చేయాలి. ఇలా డిస్కనెట్ చేయడం ద్వారా మెమోరీ కార్డులో రన్ అవుతున్న ప్రాసెస్లు క్లోజ్ అవడంతో మెమోరీ కార్డ్ బయటకు తీయడానికి రెడీ అవుతుంది. ఈ విధంగా డిస్కనక్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లు బయటకు లాగారంటేమటుకు ఎదో ఒక టైమ్‌లో తుస్ అంటుంది. 2) మెమోరీ కార్డుకి వెనుక యెల్లో కలర్లో కనిపించే భాగాన్ని టచ్ చేయకపోవడమే మంచిది. టచ్ చేస్తే మన శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే స్టాటిక్ వోల్టేజి మెమోరీ కార్డుని డామేజి చేయగలదు. ఇలా చిన్న చిన్న టిప్లు పాటించి మెమోరీ కార్డుని సురక్షితంగా ఉంచవచ్చు

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి