Push bullet అనే పేరుతో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో ఒక యాప్
ఉంది. ఇది చాలా మందికి తెలిసిన అప్లికేషన్, కాని అలాగే useful
కూడా. సైజ్ 4.3 MB. 2g ఇంటర్నెట్ లో కూడా ఈజీగా డౌన్లోడ్
చేయగలరు. 4.6 స్టార్ రేటింగ్ ఉంది. ఐ ఫోన్ కూడా ఉంది.
సరే ఇది ఏమి చేస్తుంది?
మీరు కంప్యుటర్ లో సినిమాలు, ఏదైనా వర్క్ చేసుకుంటూ
ఉంటారా ఎక్కువగా? అయితే మీ మొబైల్ కు వచ్చే ప్రతీ నోటిఫికేషన్స్
ను కంప్యుటర్ లో చూడండి ఇక నుండి. జాబ్ చేసే వారికీ బాగా
helpful.
ఫోన్ జేబులో ఉండటం లేదా పక్క రూమ్ లో ఉండటం లేదా
చార్జింగ్ ఎక్కించటానికి వేరే దగ్గర పెట్టడం వంటివి
జరుగుతాయి. అప్పుడప్పుడు మీకు వినిపించక అలానే
వదిలేస్తారు.
లేదా వినిపించిన ఏదో ఇంపార్టెంట్ అని లేచి వెళ్లి చూస్తే
అనవసరమైన అప్ డేట్ ఉంటుంది. ఇలాంటివి ఏమి లేకుండా
మీరు వర్క్ చేస్తున్న pc లోనే నోటిఫికేషన్ ఏంటో చూడటం
అంటే మంచిదే కదా!
ఎలా చేయాలి?
ఈ లింక్ లో కి వెళ్లి యాప్స్ అనే దగ్గర క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్
చేసి ఇంస్టాల్ చేయండి. ఇప్పుడు సెక్యురిటీ లో అడ్మిన్
సెట్టింగ్స్ లో push bullet ను యాక్టివేట్ చేయాలి మొబైల్ లో.
ఇప్పుడు మీ క్రోమ్ లేదా మొజిల్లా బ్రౌజర్ యొక్క extension ను
ఇంస్టాల్ చేయండి. అంతే. మిగిలిన స్టెప్స్ యాప్ చెబుతుంది.
మీరు బ్రౌజర్ వాడకపోయినా మొబైల్ నోటిఫికేషన్స్ pc లో
చూపించటానికి బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లో ఆప్షన్ enable చేయండి.
యాప్ లో ఉన్న అదనపు ఫీచర్స్
- మీరు ఒకే అకౌంట్ తో లాగిన్ అవ్వాలి pc బ్రౌజర్ లో అయినా, మొబైల్ లో
అయినా.. సో ఇక మొబైల్ లేదా pc లో ఏది కాపి చేసినా (టెక్స్ట్, లింక్స్,
స్టేటస్ అప్ డేట్స్) అది మరొక డివైజ్(మొబైల్ లేదా pc) లో జస్ట్ పేస్ట్
చేస్తే చాలు అక్కడకు వచ్చేస్తుంది. దీని కోసం సెట్టింగ్స్
లో యూనివర్సల్ కాపీ & పేస్ట్ ఆన్ చేయాలి.
- clip board లో ఆటోమేటిక్ గా లింక్స్ అండ్ నోట్స్ సేవ్ అయ్యి
ఉంచుకోవోచ్చు సెట్టింగ్స్ లో ఆప్షన్ enable చేస్తే. ఫర్ eg
మొబైల్ లో కాని pc లో కానీ ఏదో టెక్స్ట్ టైప్ చేసి దానిని సేవ్
చేయాలనుకుంటే ఇది సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన దానిని మరలా
వాడుకోగలరు.
- మీకు నచ్చిన చానెల్స్ అండ్ కమ్యూనిటీల అప్ డేట్స్
channels అనే మెను నుండి పొందగలరు.
- కంప్యుటర్ నుండే వాట్స్ అప్ మెసేజ్స్ అండ్ sms లకు
reply ఇవ్వగలరు
10, డిసెంబర్ 2015, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి