24, డిసెంబర్ 2015, గురువారం

State Bank Samdhan



                                         ఖాతాదారులు బ్యాంకుకు రాకుండానే మరిన్ని సేవలు పొందేందుకు గాను తన వినియోగదారుల కోసం మొబైల్ యాప్ 'ఎస్బీఐ సమాధాన్'ను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించింది. ఈ యాప్ను ఎస్బీఐ ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఖాతాదారులు 'స్టేట్ బ్యాంక్ సమాధాన్' యాప్ ద్వారా ఏటీఎం లొకేషన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిపాజిట్స్, అడ్వాన్సెస్, బ్రాంచ్ వివరాలు లాంటి తదితర సేవలను పొందొచ్చని ఎస్బీఐ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చెప్పాలంటే అకౌంట్ స్టేట్మెంట్, విద్య గృహ రుణాలు తీసుకున్నవారు, ఎంత వడ్డీ చెల్లించామనే వివరాలను తాము నమోదు చేసుకున్న ఇమెయిల్కు 24 గంటల్లోగా వస్తుండటం ఈ యాప్ ప్రత్యేకత. బ్యాంకులో ఉన్న తమ డిపాజిట్ లేదా రుణం వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ సెలవులతో పాటు ఎస్బీఐ ఫ్రీడమ్, ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ బడ్డీ, ఎస్బీఐ క్విక్ వంటి మొబైల్ యాప్లను తద్వారా వినియోగించుకునే వీలు కలుగుతుంది. బ్యాంకు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు, పరిష్కారం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి