31, మే 2014, శనివారం

How to Transfer Files Fastly (Andriod)

 ఆండ్రాయిడ్ లో ఏదైనా ఫైల్ ని షేర్ చేయాలంటే మనం బ్లూటూత్ ని వాడుతుంటాం. అది కొద్దిగా స్లో గా అనిపిస్తుంది . ఇంకా వేగంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనిపిస్తే దానికి మనం WiFi ని ఉపయోగించి ఫైల్స్ షేర్ చేయవచ్చు. అదెలా చేయాలో ఈ పోస్ట్ లో మీరు చూడవచ్చు .. 

WiFi టెక్నాలజీ ని ఉపయోగించి ఫైల్ షేర్ చేయడానికి మనకు ఉపయోగపడే అప్లికేషను " ఫ్లాష్ ట్రాన్స్ఫర్ " . దీని ద్వార మనం wifi ని ఉపయోగించి ఫైల్స్ ని ఈజీ గా స్పీడ్ గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు .. 


ఇది ఎలా పని చేస్తుంది ?


ఇదెల పని చేస్తుంది అంటే ఫైల్ ని ఒకరి మొబైల్ నుంచి ఇంకొరికి పంపించాలనుకున్నప్పుడు ఈ అప్లికేషను  ఒకరి మొబైల్ లో wifi ని portable Wi-Fi హాట్ స్పాట్ గా మార్చేస్తుంది .. మరొకరి మొబైల్ లో WiFi ని enable చేసి ఇంతకు ముందు చేయబడిన హాట్ స్పాట్ కి కనెక్ట్ అయిపోతుంది .. అంటే ఇప్పుడు ఈ రెండు మొబైల్స్ ఒకే నెట్వర్క్ లో కమ్యూనికేట్ అయ్యాయి అన్నమాట .. తర్వాత ఫైల్స్ ని షేర్ ఈ అప్లికేషను ద్వార షేర్ చేస్కోవచ్చు .. 

ఫైల్ షేర్ చేసే సమయం లో గాల్లరీ కి వేరుగా ఆడియో వీడియో కి వేరుగా అప్లికేషన్స్ కి వేరుగా ట్యాబు లు ఇవ్వబడుతాయి కావున ఈజీ గా షేర్ చేస్కోవచ్చు .. 

ఉపయోగించే విధానం :


→ ముందుగా ఈ లింక్ నుంచి ఈ అప్లికేషను APK ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవాలి .. : http://bit.ly/HSftAPK


→ ఇన్స్టాల్ కాగానే మెనూ లోకేల్లి Flash Transfer ఓపెన్ చేయాలి.




→ Flash Transfer ఓపెన్ అవ్వగానే అది కొన్ని instructions చూపిస్తుంది . వాటిని ఒక్కసారి చదువుతూ లెఫ్ట్  సైడ్ కి swipe చేసేయండి .



 → తర్వాత Start Sharing అనే బటన్ పై tap చేయండి .. 
→ ఒక ప్రొఫైల్ ఫోటో ని అదే విధంగా ఒక నిక్ నేమ్ ని సెట్ చేస్కొని సేవ్ పై tap చేయండి .
→ సేవ్ చేసిన వెంటనే flash transfer ఆక్టివేట్ అవ్తుంది. కనెక్ట్ కావడానికి మనకి Connect with Friends అనే బటన్ పై tap చేయాలి .
→ Connect with Friends అనే బటన్ పై tap చేయగానే మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి . అందులో ఒక ఒక డివైస్ లో మరొక ఆప్షన్ ఇంకో డివైస్ లో చేయాల్సి ఉంటుంది . 

దేనికంటే మొబైల్1 లో మొదటి ఆప్షన్ Create a group ని ఎంచుకుంటే ఒక గ్రూప్ అనేది create చేయడం జరుగుతుంది అన్న మాట అంటే portable wifi హాట్ స్పాట్ create చేయబడుతుంది. మొబైల్2 లో Scan to join ని ఎంచుకోవాలి దాని ద్వార ఆల్రెడీ మొబైల్1 లో  create చేయబడిన హాట్ స్పాట్ ని ఇది స్కాన్ చేసి చూపిస్తుంది. మొబైల్1 అయితే దానిపై tap చేయగానే అది wifi ని enable చేస్కొని కనెక్ట్ అయిపోతుంది . అంటే రెండు మొబైల్స్ ఒకే నెట్వర్క్ లోకి కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. 
→ కనెక్ట్ అవ్వగానే రెండు డివైస్ లలో  వాటర్ డ్రాప్ సౌండ్ వస్తుంది . అదే విధంగా Connect with friends అనే ఆప్షన్ వద్ద అది పోయి మనం ఎవరితోనైతే కనెక్ట్ ఐ ఉన్నామో వారి పిక్ అండ్ పేరు వస్తుంది. 

→ ఆ తర్వాత క్రింది లైన్ లో కనిపించే వాటిల్లో app లో అప్ప్స్ అండ్ గేమ్ అనే రెండు ట్యాబు లుంటాయి మనకి ఏది పంపాలి అనుకుంటున్నామో దాని పై క్లిక్ చేసి మొబైల్ shake చేస్తే చాలు అది ఇతర మొబైల్ లోకి ట్రాన్స్ఫర్  అయిపోతాయి.  అదే విధంగా ఇమేజ్ , మీడియా (ఆడియో, వీడియో ). ఫైల్ (ఫైల్ మేనేజర్) లో ఏవైనా మీరు సెలెక్ట్ చేస్కొని shake చేస్తే చాలు ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి .. 

ఎం ఎం మనం పంపాము . ఎం రిసీవ్ చేస్కోన్నాము అనేదిమానం హిస్టరీ లో చూస్కోవచ్చు .. 


→ ఈ ఫైల్ లింక్ పని చేయని యడల తెలుపగలరు. 

→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి