17, మే 2014, శనివారం

How to Synchronize Audio and Video


       
కొన్ని సినిమాలు (డౌన్లోడ్ చేసినవి లేదా purchase చేసినవి) చూసినట్లయితే అందులోని ఆడియో అనేది వీడియో కి పర్ఫెక్ట్ గా సింక్ అవ్వకుండా కొంచం ముందుగానో లేదా లేట్ గానో రావడం జరుగుతుంది.  
అలాంటప్పుడు మనకు ఆ సినిమా చూడాలంటె విసుగు వచ్చేస్తుంది. ఇక ఆ సినిమాని కట్టేసి అంతే కాక డిలీట్ కూడా చేస్తుంటాము. 

  అలా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా మనం ఆడియో ని వీడియో తో పర్ఫెక్ట్ గా సింక్ చేస్కొని చూస్కోవచ్చు. 
అదేలగా అంటారా ?


వీడియో ఆడియో సింక్ చేయడానికి చాల అప్లికేషన్స్ ఉన్నప్పటికీ నేను vlc మీడియా ప్లేయర్ లో ఏవిధంగా చేయాలో ఈ పోస్ట్ లో చూపించాను. 

మీరు చూడాలనుకున్న వీడియో ప్లే చేయండి , ప్లే అవుతున్న సమయం లో క్రింది ఇమేజ్ లో వలె tools మెనూ లోకేల్లి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో Track Synchronization పై క్లిక్ చేయాలి (Tools→Track Synchronization) షార్ట్ కట్ కీ alt+0 then T.


ఇలా ట్రాక్ synchronization పై క్లిక్ చేయగానే మనకి కింది ఇమేజ్ లో వలె ఒక విండోస్ వస్తుంది . వాయిస్ (ఆడియో) ముందుగా వస్తూ వీడియో లేట్ గా వస్తున్నట్లయితే 
Audio Track Synchronization :  లో ప్లస్ (delayed) వాల్యూస్ ఇస్తూ ఎన్ని సెకన్స్ తేడా గా వస్తుందో చూస్తూ వీడియో ని సీక్ చేస్తూ పర్ఫెక్ట్ గా సింక్ చేస్కోవచ్చు .

వాయిస్ (ఆడియో) లేట్ గా వస్తూ వీడియో ముందుగా  ప్లే అవుతుంటే Audio Track Synchronization : లో మైనస్
(Hastended) వాల్యూస్ ఇస్తూ ఎన్ని సెకన్స్ తేడా గా వస్తుందో చూస్తూ వీడియో ని సీక్ చేస్తూ పర్ఫెక్ట్ గా సింక్ చేస్కోవచ్చు.

అదే విధంగా ఈ విండో లోనే subtitles ని కూడా సింక్ చేస్కోవచ్చు . 
--------------------------------------*------------------------------------------→ ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి