6, మే 2014, మంగళవారం

How To Take Screen Shot

        సిస్టం లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఎవరికైనా సొల్యూషన్ చెప్తున్నప్పుడు స్క్రీన్ కాప్చర్ అనునది మనకు చాల ఉపయోగ పడుతుంది, అదెలా అంటారా! మీరు సిస్టం పై ఏదైనా వర్క్ చేస్తున్నప్ప ఏదైనా సందేహం గనుక వస్తే ఈ విషయాన్ని ఎవరినైనా అడగాలనుకుంటారు కాని ఎక్స్ప్లెయిన్ చేయలేక పోయినప్పుడు ఆ స్క్రీన్ ని కాప్చర్ చేసి  వారికి పంపి ఇది ప్రాబ్లం అని డౌట్ క్లారిఫయ్ చేస్కోవచ్చు. వాళ్ళకు కూడా ఎ ఇబ్బంది లేకుండా క్లారిటీ గా అర్ధం అవ్తుంది .పరిష్కారం తొందరగా దొరుకుతుంది . అదే విధంగా మీరు ఎవరికైనా ఒక సాఫ్ట్వేర్ గాని లేదా ఇంకా ఏదైనా ఆప్షన్ గురించి ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ స్క్రీన్ కాప్చర్ అనినది చాల ఉపయోగ పడుతుంది . కంప్యూటర్ ఫీల్డ్ లో ఇంతగా ఉపయోగ పడే ఈ ఆప్షన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి .అందువలన ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా తీస్తారో తెలుసుకుందాం.
స్క్రీన్ షాట్ తీయడానికి 3rd పార్టీ సాఫ్ట్వేర్ చాల ఉన్నపటికి ఎలాంటి సాఫ్ట్వేర్ ని యూస్ చేయకుండా మనకి విండోస్ తో పాటు వచ్చే అప్లికేషన్స్ సరిపోతాయి .
Windows 7 మరియు 8 Users కోసం :
Windows XP Users కోసం :


          విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న వారు స్క్రీన్ షాట్ తీయడానికి ముందుగా ఏ స్క్రీన్ ని అయితే మీరు కాప్చర్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి  మీ కీబోర్డు  లోని ఎడిటింగ్ బటన్స్ కి పైన ఉండే Print Screen SysRq (క్రింది ఇమేజ్ చూడండి)  అనే బటన్ ని ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయగానే ప్రస్తుతం కనిపిస్తున్న స్క్రీన్ క్లిప్ బోర్డు లోకి కాపీ అవుతుంది (క్లిప్ బోర్డు అనగా మనం ఏదైతే కాపీ చేస్తామో అది temporary గా స్టోర్ అయ్యే డైరెక్టరీ).


 తర్వాత మీడియా అప్లికేషను లో పేస్టు చేయడం ద్వారా సింపుల్ గా కాపీ చేసిన స్క్రీన్ పేస్టు చేయడం జరుగుతుంది. అందుకే ఫోటోషాప్, పెయింట్ లాంటి వాటిలో పేస్టు చేసి క్రాప్, టెక్స్ట్ టైపింగ్ లాంటివి చేసి ఎడిటింగ్ చేస్కోవచ్చు. 

      ఫోటోషాప్ లాంటి వాటిలో కొత్త డాక్యుమెంట్ తీసుకొనే సమయం లో మనం Print Screen SysRq తో కాపీ చేసిన స్క్రీన్ సైజు ఆటోమేటిక్ సైజు పర్ఫెక్ట్ గా తీసుకుంటుంది అందువలన జస్ట్ మనం ఓకే కొట్టి పేస్టు (ctrl+v) చేస్తే సరిపోతుంది,  ఎడిటింగ్ లాంటివి చేస్కోవడానికి వీలుగా ఉంటుంది.


    విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం యూస్ చేస్తున్నవారు XP లో చేసిన విధానాన్ని కూడా యూస్ చేస్కోవచ్చు.. 
కాని మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు విండోస్ 7 యూసర్ల కోసం స్నిపింగ్ టూల్ 
( Snipping Tool ) in-build అప్లికేషను ఒకటి అమర్చారు. దీనితో స్క్రీన్ షాట్ తీయడం చిన్న చిన్న ఎడిటింగ్ ఆప్షన్ కూడా కలదు .. 
 (విండోస్ 7 యూసర్లు స్టార్ట్ మెనూ లో సెర్చ్ చేసి దీని పట్టుకోవచ్చు. 
విండోస్ 8 వాడుతున్నవారు టైల్స్ వద్ద సెర్చ్ చేసి పట్టుకోవచ్చు) 
 ఈ అప్లికేషను ని ఓపెన్ చేయగానే మనకి క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా విండోస్ వస్తుంది 

 New పక్కన ఉన్న చిన్న ఆరో బటన్ ని క్లిక్ చేయగానే అందులో మనకి క్రింది ఇమేజ్ లాగా ఆప్షన్ వస్తాయి. 
ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి వివరిస్తాను.
  1. Free-form snip = ఇది మనకి కావలసిన బాగాన్ని మౌస్ తో గీసుకుంటూ ఇష్ట ప్రకారం కాప్చర్ చేస్కోవచ్చు . స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కలవగానే కాప్చర్ అవ్తుంది .
  2. Rectangular Snip = ఇది దీర్గ చతురస్ర రూపం లో కావలసిన దానిని కాప్చర్ చేస్కోవచ్చు.
  3. Window Snip =  ఓపెన్ అయి ఉన్న విండోస్ ని కాప్చర్ చేస్కోవచ్చు.
  4. Full-Screen Snip = ఫుల్ స్క్రీన్ కాప్చర్ చేస్తుంది అందులో ఏవేవి ఓపెన్ అయి ఉన్న అన్ని కాప్చర్ చేయబడుతాయి .
 కాప్చర్ అయిన తర్వాత ఇలా మనకి పై విండో వస్తుంది అందులో పెన్సిల్ , ఎరేజర్, హైలైటర్ లాంటి టూల్స్ లబిస్తాయి .  ఎడిటింగ్ కోసం ఈజీ గా ఉంటుంది .

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను. 

note : ఈ సమాచారం గనుక ఉపయోగకరమని భావిస్తే ఇతరులకు షేర్ చేయండి .
మా youtube ఛానల్ : www.youtube.com/rayarakula
→ ధన్యవాదాలు ←
రాయరాకుల కర్ణాకర్


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి