4, మే 2014, ఆదివారం

మీ న్యూస్ ఫీడ్ లో ఇబ్బంది పెట్టె పోస్ట్ లు రాకుండా చేస్కోవడం ఎలా ? (facebook)

    facebook లో కొందరి పోస్ట్ లు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. పోనీ  unfriend చేసేద్దాం అనుకుంటే వారు మనకు తెలిసిన వారు లేదా కావాల్సిన వారు అయితే వారిని unfriend చేయలేము, బ్లాక్ అంతకన్నా చేయలేము. అలాంటి సమయం లో వారి పోస్ట్ లు మన న్యూస్ ఫీడ్ లో రాకుండా చేస్కోవడానికి ఒక చిన్న ఆప్షన్ ఉంది అదే unfollow. ఈ ఆప్షన్ వలన ఎవరినైతే మనం unfollow చేసామో వారికి మనం వారిని ఎలాంటి నోటిఫికేషన్ పోదు అందువలన మనం వారిని unfollow  చేసాము అనే విషయం వారికి తెలియదు .

ఈ ఆప్షన్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం .

ఎవరి పోస్ట్ లైతే మీ న్యూస్ ఫీడ్ లో కనిపించ వద్దు అనుకుంటున్నారో వారి పోస్ట్ కి రైట్ సైడ్ కనిపించే డౌన్ ఆరో వద్ద క్లిక్ చేయాలి (క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా )
  అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పాప్ అప్ వస్తుంది. అక్కడ కనిపించే unfollow <వారి పేరు>  పై క్లిక్ చేయగానే ఇక పై వారి పోస్ట్లు మీ న్యూస్ ఫీడ్ లో కనిపించవు .. 
( లేదా )
 వారి ప్రొఫైల్ ని ఓపెన్ చేసి వారి కవర్ ఫోటో రైట్ సైడ్ క్రింద కనిపించే ఆప్షన్ లలో ఫాలోయింగ్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే అది ఫాలో గా మారి పోతుంది అంతే .. ఇక వారి పోస్ట్ లు మీ న్యూస్ ఫీడ్ లో  రావు.. క్రింది ఇమేజ్ లో గమనించ వచ్చు .
  మీరు వారి పోస్ట్ లు గనుక చూడవలసి వస్తే వారి ప్రొఫైల్ ఓపన్ చేసి చూడవచ్చు .. అదే విధంగా ఏదైనా పరిస్థుతులలో వారిని మల్లి ఫాలో అవ్వాలనుకుంటే వారి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఫాలో అని బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది .

  → ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేన్ తప్పక సమాదానం ఇస్తాను. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .


Thank You 


రాయరాకుల కర్ణాకర్ 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి