ప్రస్తుత కాలం లో WhatsApp చాల ఫేమస్.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నదా చాలు అందులో WhatsApp కంపల్సరీ ఉండాలి అంటారు ప్రస్తుత యువత . మరి అస్సలు అందులో అంతగా గొప్పదనం ఏముంది ? ఏముంది అంటే అది మన మొబైల్ కాంట్రాక్ట్స్ లో ఉన్న వారు ఎవరితే ఈ అప్లికేషను ని వాడుతున్నారో చూసి వారితో చాట్ చేయవచ్చు . అంతే కాదు మీడియా ఫైల్స్ అదే ఇమేజ్ , వీడియో , ఆడియో , వాయిస్ రికార్డు, ఇలా ఎన్నెనో విధాలుగా చాట్ చేయడానికి సులువైనా అప్లికేషను .. ఈ అప్లికేషను ఫేస్బుక్ కంపెనీ వారిది .. చాల తక్కువ సమయం లో ఎక్కువ ఫేమస్ అయినది . అయినా ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉంటె బాగుండు అనుకునే వారు చాల మంది ఉన్నారు ..
ఇదిలా ఉండగా మన ఇండియా వాళ్ళు తయారు చేసిన Hike Messenger ఒక్కసారిగా అందరిని ఆకట్టుకొని ఒక ఊపు ఊపుతుంది. మరి అంతగా ఊపుతున్న ఈ అప్లికేషను గురించి మనం తప్పకుండ తెలుసుకోవాలి ..
Hike Messenger
ఈ హైక్ మెసెంజర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, IOS, విండోస్ ఫోన్ , బ్లాక్బెర్రీ , S40,S60 ( java) అందుబాటులో ఉన్నదీ ..
ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోన్నాక మన నెంబర్ తో రిజిస్టర్ చేస్కోవాలి ..
ఫీచర్స్
ఇదిలా ఉండగా మన ఇండియా వాళ్ళు తయారు చేసిన Hike Messenger ఒక్కసారిగా అందరిని ఆకట్టుకొని ఒక ఊపు ఊపుతుంది. మరి అంతగా ఊపుతున్న ఈ అప్లికేషను గురించి మనం తప్పకుండ తెలుసుకోవాలి ..
Hike Messenger
ఈ హైక్ మెసెంజర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, IOS, విండోస్ ఫోన్ , బ్లాక్బెర్రీ , S40,S60 ( java) అందుబాటులో ఉన్నదీ ..
ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోన్నాక మన నెంబర్ తో రిజిస్టర్ చేస్కోవాలి ..
ఫీచర్స్
- హైక్ లో అద్బుత అవకాశం ఫ్రీ కాలింగ్. ఇందులో ఫ్రీ కాలింగ్ వచ్చిన తర్వాత నే వాట్స్ యాప్ లో ప్రవేశ పెట్టడం జరిగింది.
- ఇందులో ఫ్రీ SMS సౌకర్యం కలదు . మీరు చాట్ చేయాలి అనుకున్న వ్యక్తి ఆఫ్ లైన్ లో ఉంటె గనుక మీరు అతనికి మీరు పంపలనుకున్న మెసేజ్ ని SMS రూపంలో వారి మొబైల్ కి సెండ్ చేయవచ్చు . అంతే కాకుండా హైక్ యూస్ చేయని వ్యక్తులకు కూడా SMS చేయవచ్చు . ఈ ఫ్రీ sms లు మనం రిజిస్టర్ అయినపుడు 20 వస్తాయి. మనం హైక్ లో గడిపే సమయం , చేసే చాటింగ్ ను బట్టి అవి పెరుగుతుంటాయి ..
- మన కాంటాక్ట్స్ లిస్టు లో ఉన్న నెంబర్ హైక్ లో రిజిస్టర్ అవ్వగానే మనకి పలానా వ్యక్తి జాయిన్ అయ్యారు అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం హైక్ లో వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు .
- మన ఆన్లైన్ స్టేటస్ ని పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లాంటి వాటిని ఎంచుకొని వాటిలోకి కూడా ఒక్కసారిగా పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ అందరికి వెళ్తుంది .. వాళ్ళ వారి చాట్ బాక్స్ చూసుకున్నప్పుడు కూడా ఈ స్టేటస్ కనిపిస్తుంది . ఉదాహరణకు : మీరు నైట్ చాట్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర వస్తుంటే గనుక మీ మూడ్ ని స్లీపి అని ఒక స్మైలీ తో స్టేటస్ పెడితే మీకు నిద్ర వస్తున్న విషయం అందరికి తెలుస్తుంది ...
- 20 మిల్లియన్ stickers ఉన్నాయి . అందులో కొన్ని చిన్న చిన్న డైలాగ్ లతో ఉన్నాయి కావున మన ఫీలింగ్ ని ఈ stickers లో వ్యక్త పరచ వచ్చు . అద్బుతం ఈ stickers ప్రస్తుతానికి Whats app లో లేవు ..
- మనం చాట్ చేస్తున్న చాట్ బాక్స్ యొక్క తీంస్ ను సమయాన్ని , మూడ్ ని బట్టి ఇష్టం వచ్చిన నట్లుగా ఆ తీంస్ ని సెట్ చేస్కోవచ్చు .
- ఇది చాల మందికి ఉపయోగ పడే ఫీచర్, మన మొబైల్ లో ఎవరితో ఎలా చాట్ చేసాము అని బయటి వ్యక్తులు చూసే అవకాసం ఉంది . సో మనం చాట్ చేసే వ్యక్తులలో సీక్రెట్ గా పర్సనల్ గ చాట్ చేసే వ్యక్తులు గనుక వుంటే వారిని హైడేన్ గా పెట్టుకొనే అధ్బుత అవకాశం ఉంది . దీనికి కేవలం మన హైక్ లోగో పై క్లిక్ చేసి ఒక పాటర్న్ లాక్ పెట్టుకోవచ్చు. ఈ హైక్ లోగో పై క్లిక్ చేసి లాక్ ఓపెన్ చేస్కొని చాట్ చేస్కోవచ్చు .
- సైజు లిమిట్ అని ఏమి లేదు . వీడియో ఫైల్స్ ని ఆడియో ఫైల్స్ ని, రికార్డింగ్ ఎంత పెద్ద సైజు కలిగి ఉన్న అది సెండ్ చేయవచ్చు ..
- ఇది ఇంకో గ్రేట్ ఫీచర్ . సాధనంగా అయితే ఇతర ఏ సోషల్ అప్లికేషన్స్ అయిన మనం సెండ్ చేసిన మెసేజ్ వారికి డెలివరీ ఐనది అని tick , డబల్ tick రూపంలో చూపిస్తాయి . కాని ఈ హైక్ లో tick, డబల్ tick, R అని మూడు ఉంటాయి. → సింగల్ tick అంటే మన దగ్గర నుంచి సెండ్ అయినదని , → డబల్ tick అనే మనం పంపిన వారి హైక్ చేరుకున్నది అని → R అనే వారు మనం పంపిన మెసేజ్ ని చూసారు లేదా చదివారు అని .. ఇలా వారు చదివారో లేదో కూడా మనకి తెలిసేలా చూపిస్తుంది .
- అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడి పంపించేలా , అప్పటికప్పుడు వీడియో రికార్డు చేసి పంపవచ్చు . దీనికి టైం లిమిట్ సైజు లిమిట్ అని ఏమి ఉండవు ..అంతే కాక వేయిలాది స్మైల్స్ కూడా ఉన్నాయి. అందరికి (మీ కాంటాక్ట్స్) కి ఇన్విటేషన్ ఒక్క టాప్ తో.
- గ్రూప్ చాట్ ఫెసిలిటీ ఇది కామన్ , మనం పేస్ బుక్ లో చాలా చూసి ఉన్నాము .కాని ఇందులో కొంచం వెరైటీ గా అనిపిస్తుంది . హైక్ స్పీడ్ కూడా అదుబుతంగా ఉంటుంది .
- ఇక ఇది చాల మందికి ఇష్టమైనా ఉపయోగపడే ఫీచర్ ఇది చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారు , కాని నేను వస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. ఈ ఫీచర్ ఏంటంటే రివార్డ్స్ ఏంటి ఆ రివార్డ్స్ అనుకుంటున్నారా ? మీరు ఈ హైక్ లో జాయిన్ అయినందుకు మీకు ఒక 10 రూపాయలు హైక్ ఎకౌంటు లోకి వస్తాయి. మీరు ఇన్విటేషన్ పంపిన వక్తులు మీ ఇన్విటేషన్ ని గమనించి వారు కూడా హైక్ డౌన్లోడ్ చేస్కొని ఎకౌంటు తీసుకొని మీకు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు 20 రూపీస్ ఆడ్ అవుతాయి .. ఇలా ఎంత మంది మీ ఇన్వైట్ ని అంగీకరించి హైక్ రిజిస్టర్ చేస్కుంటే మీకు అన్ని 20 రూపాయలు ఆడ్ అయితాయి .
- ఈ రివార్డ్ లలో ఫస్ట్ టైం మినిమం 50 వుంటే మన మెయిన్ బాలెన్సు లోకి ట్రాన్స్ఫర్ చేస్కోవచ్చు . నెక్స్ట్ టైం నుంచి ఎంత ఉన్న రెడీం చేస్కోవచ్చు .. . ఎలా మనం చాటింగ్ తో కూడా ఎర్నింగ్ చేయవచ్చు .
- ఇలా రివార్డ్స్ అండ్ sms లను ఈజీ గా ఎర్న్ చేస్కోవచ్చు .. మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి favorites లో గ్రీన్ సిగ్నెల్ ఫేస్బుక్ వాలే ఉంటుంది .
ఇంకా ఎందుకాలస్యం వెంటనే మీ ఫోన్ తీసి హైక్ రిజిస్టర్ అవ్వండి .. అంతే కాదు నాకు మెసేజ్ కొట్టడం మరవకండి. నేనుకూడా మీతో కనెక్ట్ అయి ఉంటాను .. నా నెంబర్ 9014819428
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె నాకు తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను ..
→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula
మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula
మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .
♥ ధన్యవాదాలు ♥
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి