ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు.
అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. లిక్విడ్ మార్ఫియంతో 5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తెలిపింది. స్టీల్, అల్యూమినియం కంటే లిక్విడ్ మార్ఫియం పటిష్టంగా ఉంటుందని వెల్లడించింది. దీంతో తయారైన ఫోను షాక్, స్క్రీన్ బ్రేకేజీలను తట్టుకుంటుందని తెలిపింది.
యాపిల్ సంస్థ ఇప్పటికే ఈ లోహాన్ని ఐఫోన్ 6లో తక్కువ మొత్తంలో లిక్విడ్ మార్ఫియం వాడుతోంది. ఫోను లోపలి భాగాలకు నానో కోటింగ్ వేయడం వల్ల నీటిలో పడినా ఏమీ కాదని పేర్కొంది. ప్రైవసీ కీస్, లిక్విడ్ మెటల్, నానో కోటింగ్ ఫీచర్లపై ప్రాధానంగా దృష్టి సారించి ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ సీఈవో స్టీవ్ చయొ తెలిపారు. జూలై 31 నుంచి దీన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. 16జీబీ మోడల్ ధర సుమారుగా రూ. 27 వేలు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి