ప్రస్తుత కాలంలో smartphone మన శరీరంలో ఒక భాగం అయ్యింది. ఎంత పనిలో నిమగ్నమై ఉన్న కూడా రోజులో ఒక గంటలో పది సార్లు notifications చూస్తుంటాము. whatsapp చూస్తూఉంటాము. అనవసరపు గ్రూప్ చాటింగ్ కూడా ఉంటాయి..
రోజు మొత్తం data connection or wifi ఆన్ చేసే ఉంచుతారు.
మితంగా చార్జింగ్.. అమితంగా బ్యాటరీ వాడకం.. అస్తమానం మొబైల్ వాడుతూ ఉండటం వల్ల చార్జింగ్ పెట్టేందుకు సాధారణంగా సమయం దొరకదు...మరి కొందరు రాత్రి మొత్తం చార్జింగ్ పెట్టి ఉదయమే తీస్తుంటారు. ఈ విధానం వల్ల బ్యాటరీ త్వరగా దాని సామర్థ్యం కోల్పోతూ ఉంటుంది.
బ్టాటరీ నిర్వాహణలో కొన్ని చిట్కాలు.
1) battery full అని చూపగానే చార్జింగ్ తీసే యాలి. అంతకన్నా ఎక్కువగా చార్జింగ్ ఉంచితే క్రమేణా దాని సామర్థ్యం కోల్పోతుంది.
2) సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్యలోనే చార్జింగ్ వాడకం ఉండాలి. 20 శాతం కన్నా తక్కువ చార్జింగ్ వాడుతున్నప్పుడు రేడియేషన్ కూడా ఎక్కు వగా ఉంటుందని నిపుణులు హెచ్చరిసున్నారు.
3) అవసరం మేరకే data connection ఆన్ చేసి, మిగతా సమయంలో off చేయాలి
4) display brightness మనకి కనిపించేలా తక్కువగా ఉండేలా చూస్కోవాలి. సెల్ఫ్ స్టడీ మోడ్ ఉంటె రాత్రి సమయం లో ఆన్ చేస్కోవాలి.
5) gps location అవసరం మేరకే ఆన్లో ఉంచాలి.దీని వల్ల battery తొందరగా discharge అవుతుంది.
6) power saver లాంటి సదుపాయాలు ఉంటె మనం వాడని సమయం లో ఆన్ చేస్కొంటే మంచిది.
7) ఛార్జింగ్ పెట్టి సెల్ఫోన్ వాడటం అంత మంచిది కాదు.
8) camera వాడుతున్నసమయం లో వాడకం ఐపోగానే బ్యాక్ వచ్చేయాలి.. కెమెరా స్టాండ్ బై పెట్టడం వలన అధికంగా discharge అవుతుంది.
9) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో సెల్ ఫోన్ వాడకం అస్సలు మంచిది కాదు.
10) ఎండాకాలం ఎక్కువగా సెల్ వేడి అవుతా ఉంటుంది కావున వాడకం తగ్గించి. కూల్ weather లో ఉపయోగించడం మంచిది.
వీటిని అనుసరిస్తే చార్జింగ్ ఎక్కువ సేపు నిలుస్తుంది.
ముఖ్యమైనది ఎంటంటే చాలా మంది కంప్యూటర్లు, ల్యాప్ టాపులతో చార్జింగ్ పెడితే మంచిదేనా అనుకుంటారు.
*మామూలు చార్జర్‌తో 5 volts,1 amps విద్యుత్తు వస్తుంది. అదే కంప్యూటర్ యూఎస్‌బీ నుంచి 5 volts, 0.5 amps వస్తుంది.
*యాంప్స్ తేడా వల్ల చార్జింగ్ అయ్యే వేగం తగ్గుతుంది తప్పా వేరే ఇబ్బంది ఉండదు. సాధారణ చార్జర్‌తో వేగంగా అవుతుంది ఫోన్ కొంత మేర వేడెక్కుతుంది. అదే యూఎస్‌బీ నుంచి అయితే వేగం తక్కువైనా వేడి ఎక్కడం తక్కువగా ఉంటుంది.
*.యూఎస్‌బీ 3.0 నుంచి మాత్రం 0.900 యాంప్స్‌రావడం వల్ల సాధారణ చార్జర్‌కి దానికి పెద్దగా తేడా ఉండదు. పైగా నష్టం కూడా లేదు.
* యూఎస్‌బీ పెట్టిన వెంటనే మొబైల్లో వచ్చే ఆప్షన్ లలో ఛార్జింగ్ ఓన్లీ ఆప్షన్ ఎంచుకొంటే బాగుంటుంది.. ( అన్నిమొబైల్ లలో ఈ ఫీచర్ ఉండక పోవచ్చు)
*.యూఎస్‌బీ ద్వారా చార్జింగ్ చేసుకోవాలంటే సిస్టమ్ నుంచి నేరుగా పెట్టుకోవాలి తప్పాయూఎస్‌బీ హబ్ ద్వారా పెట్టుకోకూడదు. దానికి కనెక్ట్ చేసిన వేరు డివైస్‌ల వల్ల కొంత ఇబ్బంది కలిగి చార్జింగ్ అయ్యే విధానంలో వ్యత్యాసాలు ఏర్పాడతాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి