ఈమెయిల్ను కనుగొన్నది ఎవరో తెలుసా?
వాషింగ్టన్ : ఈమెయిల్ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు.
వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి