మీకు రెండు gmail accounts ఉన్నాయనుకోండి. మీరు ఒక మెయిల్ id లోకి లాగిన్ అయ్యి చేసి రెండోవ మెయిల్ ఎకౌంటు లో ఉన్న మెయిల్స్ ని కూడా లాగిన్ అవసరం లేకుండా ప్రతిసారి చెక్ చేస్కోవాలి అంటే ఎం చేయాలో ఈ post లో పూర్తిగా వివరిస్తున్నాను.
ముందుగా మీరు మీ మెయిల్ id దేనిని అయితే వేరే మెయిల్ id కి గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ఎకౌంటు లోకి లాగిన్ చేయండి.
ముందుగా మీరు మీ మెయిల్ id దేనిని అయితే వేరే మెయిల్ id కి గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ఎకౌంటు లోకి లాగిన్ చేయండి.
మీ యుసర్ నేమ్ , పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయగానే మీ ఎకౌంటు లాగిన్ అవ్తుంది.
లాగిన్ ఐన వెంటనే మీ ఎకౌంటు లోని ఇన్బాక్స్ వస్తుంది. ఆ స్క్రీన్ లో మీకు రైట్ సైడ్ లో మీ ఎకౌంటు ఐకాన్ క్రింద విన్న ఉన్న గేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి క్రింది ఇమేజ్ లో వలె. క్లిక్ చేయగానే వచ్చిన పాప్ అప్ లో సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే పైన వున్నా ట్యాబు లలో అకౌంట్స్ అనే ట్యాబు పై క్లిక్ చేసి వచ్చిన సెట్టింగ్స్ లలో Grant Access to Your Account : లో Add Another Account క్లిక్ చేయాలి
next step పై క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది. అక్కడ send email to grant access అని క్లిక్ చేయాలి .
మళ్ళి ఇమెయిల్ అడ్రస్ అడుగుతుంది next step>> పై క్లిక్ చేయాలి.
ఇలా ఒక ఒక మెసేజ్ చూపిస్తుంది. అంటే మనం ఏ మెయిల్ కి అయితే పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ ఎకౌంటు ని ఓపెన్ చేసి వచ్చిన ఇన్బాక్స్ లో అప్డేట్ అనే ట్యాబు లో Google Team నుంచి వచ్చిన మెయిల్ ని 7 (వారం) రోజులలో accept చేయాలి అన్న మాట.
ఇక మీ ఈ ఎకౌంటు లాగౌట్ చేసి మీరు ఏ మెయిల్ కి అయితే గ్రాంట్ పర్మిషన్స్ ఇచ్చారో ఆ ఎకౌంటు ని ఓపెన్ చేయండి. ఇన్బాక్స్ లో updates అనే ట్యాబు లో గూగుల్ టీం నుంచి వచ్చిన మెయిల్ ని ఓపెన్ చేసి
To accept this request, please click the link below:
అనే సెంటెన్స్ దాని కింద ఉండే లింక్ ని క్లిక్ చేయండి
ముప్పై ౩౦ మినిట్స్ తర్వాత మీ మెయిల్ లోకి లాగిన్ అవ్వగానే రైట్ సైడ్ ప్రొఫైల్ పిక్ పై కాని లేదా లాగౌట్ చేసే ప్రాంతం లో క్రింది ఫోటో లో విధంగా రెండవ ఎకౌంటు పేరు , మెయిల్ id బ్రోకేట్ లో (delegated) అని కనిపిస్తుంది.
అంతే ఇక అక్కడ క్లిక్ చేయగానే వేరే ట్యాబు లో మీ రెండవ మెయిల్ ఓపెన్ చేయబడుతుంది (ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా). ఇంకో బెనిఫిట్ ఏంటంటే రెండు మెయిల్స్ ని ఇలానే గ్రాన్టింగ్ ఇస్తే ఏ ఎకౌంటు ఓపెన్ చేసిన రెండో ఎకౌంటు ఓపెన్ చేస్కోవచ్చు ( రెండు మెయిల్స్ లో గ్రాన్టింగ్ దీనిది దానికి దానిది దీనికి ఇవ్వాలి ) .
Thanks for watching my Post
ఈ పోస్ట్ పై సందేహాలు comment box లో తెలియజేయగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను
ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావించినట్లైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.
మరిన్ని టెక్నికల్ పోస్ట్ లు,వీడియోస్ కోసం
మా ఫేస్బుక్ పేజి ని లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా యూటుబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కొండి : www.youtube.com/rayarakula
రాయరాకుల కర్ణాకర్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి