19, జనవరి 2014, ఆదివారం

How to Type Telugu In Photoshop Cs6 & CC(14.0)






  ఫోటోలపై మంచి మంచి కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ? 
అయితే వాటిని మంచి స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్. 
కాని ఫోటోషాప్ లో తెలుగు రాయడం కుదరదు అని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.

ఫోటోషాప్ లో తెలుగు రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి.  ఉదాహరణకు అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి ఎన్నో రకాల ఫాంట్స్ ని ఉపయోగిస్తూ తెలుగు రాసుకోవచ్చు కాని అను స్క్రిప్ట్ మేనేజర్ లో రాయడానికి తెలుగు కీబోర్డ్ లేఔట్ లు తెలుసుకొని ఉండాలి అంటే ఆపిల్ , రోమ, ఫోనెటిక్ ఇలాంటివి . ఎంతైనా  అంత ఈజీ గా టైపు చేయలేము కొంచం కష్టమే మరియు అది ఫోటోషాప్ 7.0 లో మాత్రమే సాద్యమౌతుంది.
గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి రాసినచో అక్షరాలూ విపోతుంటాయి.

అయితే ఇప్పుడు ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ లు వచ్చాయి . adobe photoshop cs6 (13.0) , photosho CC (14.0). అయితే ఇందులో ఒక చిన్న చేంజ్ తో  గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు రాసే అవకాశం ఉంది .


 అదెలాగో తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ ని తప్పక చూడాల్సిందే 

ముందుగా మీ సిస్టం లో అడోబ్ ఫోటోషాప్ CS6 ని ఇన్స్టాల్ చేస్కొండి. 

తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేసి Edit > Preferences > Type లోకేల్లి 
choose text engine options  లో 

middle eastern and south asian సెలెక్ట్ చేస్కొని ఓకే ప్రెస్ చేయాలి.

తర్వాత ఫోటోషాప్ ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 

తర్వాత ఓపెన్ చేసాక మీరు ఇంతకు ముందు చేంజ్ చేసిన సెట్టింగ్ ఇప్పుడు అప్లై చేయబడి ఓపెన్ అవుతుంది. 

 ఏ ఫోటో పై అయితే  టైపు చేయాలి అంటున్నారో ఆ ఫోటో ని సెలెక్ట్ చేస్కొని ఆ ఫోటో పై  టైపింగ్ టూల్ ని ఉపయోగిస్తూ 

గూగుల్ ఇన్పుట్ టూల్ ని లో తెలుగు సెలెక్ట్ చేస్కొని తెలుగు ను స్పష్టంగా టైపు చేయవచ్చు 
(ఈ కాప్చర్ విండోస్ 8 లోనిది విండోస్ XP, 7 లో వేరే విధంగా వస్తుంది)

  

  తెలుగు ఫాంట్స్ కొరకు : teluguvijayam.org/fonts.html

ఇలా తెలుగు ఈజీ గా టైపు చేయచ్చు . వివిధ రకాల బ్లెండింగ్ ఆప్షన్స్ అదే విధంగా స్టైల్స్ కూడా అదే విధంగా తెలుగు విజయం వారి ఫాంట్స్ కూడా ఉపయోగిస్తూ డిజైన్ చేసుకోవచ్చు 
ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా చేసిన ఈ వీడియో లో చూడవచ్చు.


ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు అదే విధంగా సలహాలు ఉంటె తెలియజేయగలరు నేను తప్పకుండ సమాధానం ఇస్తాను ..

మా  అప్డేట్స్ కోసం ఫేస్బుక్  పేజి  లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా వీడియో ఛానల్ : www.youtube.com/rayarakula
రాయరాకుల కర్ణాకర్ 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి