25, అక్టోబర్ 2016, మంగళవారం

Whats App Video Calling

ప్పుడు ఎప్పుడు అంటున్న వాట్స్ యాప్ వీడియో కాల్ రానే వచ్చింది.. ఇప్పటికే దాదాపు అన్ని రకాల చాటింగ్ మెసెంజర్ అప్లికేషను లలో వీడియో  కాల్ అందుబాటులోనే ఉంది కాని వాట్స్ యాప్ లో ఎప్పటి నుంచో ప్రవేశ పెట్ట నున్న  ఈ ఆప్షన్ కి చివరకి శ్రీకారం చుట్టింది. కాని ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు కేవలం BETA టెస్టర్ యూసర్ లకి మాత్రమే అందుబాటులోకి వచ్చింది

అస్సలు  BETA టెస్టర్ యూసర్ లంటే ఎవరు ఏమిటి?

ఏదైనా సాఫ్ట్వేర్ కి లేదా అప్లికేషను కి BETA కనిపించింది అంటే ఆ సాఫ్ట్వేర్ లేదా యాప్ ఇంకా అభివృధి దశలోనే ఉంది అంటే డెవలప్మెంట్ లో ఉంది అని అర్ధం, కొత్తగా ఆప్షన్ లను ప్రవేశ పెట్టడాలు లేదా యాప్ ఇంటర్ పేస్ ని మార్చడం లాంటివి. ప్రవేశ పెట్టిన ఫీచర్ ని ఆండ్రాయిడ్ యాప్ తయారీదారులు లేదా డెవలపర్లు తమ నుంచి కాకుండా ప్రజల నుంచి టెస్టింగ్ ని కోరుతారు అంటే ప్రజలు ఎలా వాడుతున్నారు వారికి ఎక్కువగా ఉపయోగం ఏమిటి, వారికి సరైన సంతృప్తి అందిస్తుందా లేదా అని BETA టెస్టర్ లేదా యూసర్ నుంచి ఫీడ్ బ్యాక్ రూపంలో సేకరిస్తారు, ఇలా సేకరించిన డేటా ని మొత్తం విశ్లేషించి చివరగా యూసర్ అనుకూలతకు తగిన విధంగా ఒక నిర్ణయం తీస్కోని అమలు చేసి ఫైనల్ గా అందరికి అందుబాటులోకి కొత్త అప్డేట్ గా విడుదల చేస్తారు.

                అయితే మీరు చేయవలసింది ఏంటంటే వాట్స్ యాప్ BETA  యూసర్ గా రిజిస్టర్  అయి వాట్స్ యాప్ ఇన్స్టాల్ చేయాలి. వాట్స్ యాప్ టెస్టర్ గా రిజిస్టర్ అవుటకు ముందుగా మీ GMAIL లోకి లాగిన్ అవ్వాలి తర్వాత ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు


ఈ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తున్న BECOME A TESTER పై క్లిక్ చేయండి అంతే మీరు BETA టెస్టర్ గా మారినట్లే

ఇప్పుడు మీరు మీ ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్ లో ఉన్న My apps & Games పై ట్యాప్ చేయండి ఇప్పుడు మీకు క్రింది ఇమేజ్ లో వలే BETA అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్కొండి అక్కడ వాట్స్ యాప్ మెసెంజర్ ఉంటుంది జస్ట్ అప్డేట్ చేయండి . సరిపోతుంది.
ఇప్పుడు సింపుల్ గా మీ మిత్రునికి కూడా ఈ పోస్ట్ లింక్ అందచేసి యధావిధిగా చేయమని చెప్పండి . అయిపోయిన తర్వాత సింపుల్ గా మీ మిత్రుని చాట్ బాక్స్ ఓపెన్ చేసిన కాల్ బటన్ పై క్లిక్ చేయండి వెంటనే ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి  ఒకటి వాయిస్ కాల్ అండ్ రెండవది వీడియో కాల్ . వీడియో కాల్ ని ఎంచుకోండి . మీ మిత్రుడు కూడా అప్డేట్ లో ఉన్నాడు కావున ఎంచక్క వీడియో కాల్ అనిభూతిని పొందవచ్చు .


గమనిక : మీరు టెస్టర్ గా రిజిస్టర్ అయినారు కావున మీకు తోచినవి లేదా ఏదో లోటు గా ఉంది అనుకున్న సమాచారాన్ని వాట్స్ యాప్ కి ఫీడ్ బ్యాక్ ద్వార సెండ్ చేయండి తద్వారా ఆ లోటుని పూరించుకొనే అవకాశం ఉంటుంది అలాగే వాట్స్ యాప్ కి సహాయం చేసినట్లు ఉంటుంది
మీ మిత్రుడు మరియు మీరు ఇద్దరు అప్డేట్ లోనే ఉంటేనే వీడియో కాల్ ని పొందవచ్చు
ఈ పోస్ట్ పై ఎవైన సందేహాలు సలహాలు ఉంటె తప్పక తెలియజేయండి . ఇదే పోస్ట్ ని ఇంగ్లీష్ లో చడువుతకు ఇక్కడ క్లిక్ చేయండి


19, అక్టోబర్ 2016, బుధవారం

Get Updates on Your Mail

ఎన్నో కొత్త కొత్త ప్రోడక్ట్ లు,
ఫోటోషాప్ డాక్యుమెంట్స్
ఫోటోషాప్ వీడియోస్
సాంకేతిక సమాచారం
బ్యాంకింగ్ వివరాలు 
ఏవైనా
నా  వెబ్సైటు (www.rktechnics.com) లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ మీ మెయిల్ కి పొందుటకు నా వెబ్సైటు www.rktechnics.com ని ఓపెన్ చేసి రైట్ సైడ్ లో కనిపించే ఫాల్లో అనే బటన్ పై క్లిక్ చేయండి. 

ఫాల్లో లిస్టు లో మీ ఫోటో వచ్చేస్తుంది. అంతే ఇకపై మా పోస్ట్ లన్నిమీ మెయిల్ కి సెండ్ చేయబడతాయి..


1, అక్టోబర్ 2016, శనివారం

bathukamma songs

తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ నవరాత్రులు బతుకమ్మ, దేవి నవరాత్రులతో మధురమైన బతుకమ్మ సంగీతాలతో మన సాప్రదాయం కలకలలాడాలని కోరుకుంటూ...
మీ అందరికికోసం  బతుకమ్మ సాంగ్స్ అందిస్తాను.

బతుకమ్మ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

Download link : click here

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

new feature in Whats app

వాట్సాప్ మెసెంజర్ ప్రేమికులకు మ‌రో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

మొన్నటికి మొన్న సేల్ఫీ ఫ్లాష్ ఫీచర్ వచ్చిందన్నవిషయం తెలుసుకోన్న్నము ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా తీసిన ఫోటోలకు ఎన్నో క్లిప్ ఆర్ట్స్ లని అదే విధంగా డైరెక్ట్ క్రాపు , ఫోటో తీసిన వెంటనే దానిపై ఏదైనా రాసుకొనే విధంగా మంచి మంచి ఆప్షన్ ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. త్వ‌ర‌లోనే ఈ వెర్ష‌న్‌ని విడుద‌ల చేస్తారు

గమనిక: ఇక్కడ ఒక విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు.

24, సెప్టెంబర్ 2016, శనివారం

How to Hide Photos, Video and Files in your Android Mobile

మన మిత్రులు ఎవరైనా గా రాగానే మన మొబైల్ చూపించడం అనడం సహజం .
మరి మొబైల్ తీస్కోని వారు చేసే పని ఏంటంటే అందులో ఉన్న ఫొటోస్ చూడడం వీడియోస్

చూడడంచేస్తుంటారుమన మొబైల్ లో మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా 
వీడియోస్ కావచ్చు ఏ ఫైల్స్  అయినా ఉండవచ్చు అవి వారు చూడడం మనకి ఇష్టం ఉండదు. మరి వాటిని మనం గ్యాలరీ లో కనిపించకుండా చేస్తే , అలాగే మన వీడియోస్ వీడియో ప్లేయర్ లో కనిపించకుండా  చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. అయితే చాల మంది మిత్రులు ఈ సమస్య ని ఎదురు కొనుటకు ఎన్నో రకాల అప్లికేషను లను వాడుతుంటారు. అవి మన ఫైల్స్ ని encrypt చేసేస్తాయి .కావున మనం వాటిని విడిగా access చేయలేము. వాటితో సమస్య ఏర్పడగానే మా ఫొటోస్ పోయినాయి , వీడియోస్ పోయినాయి ఇంపార్టెంట్ అని మోర పెట్టుకుంటారు , చేతులు కాలినాక ఆకులు పట్టుకొంటే ఎం లాభం, అంతేగా
  మరి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో లో చూపించాబోయే వీడియో లో ఎలాంటి అప్లికేషన్ ని వాడకుండా మన ఫైల్స్ కి డేటా కి ఎలాంటి హాని జరగకుండా  సులువుగా గ్యాలరీ లో కనిపించకుండా hide చేయడం ఎలా అనేది స్పష్టంగా తెలియజేశాను . నాకు తెలిసి ఈ వీడియో మీకు చాల బాగా ఉపయోగపడుతుందని బావిస్తున్నాను.

ఈ వీడియో మీకు ఉపయోగపదినట్లు అయితే తప్పక షేర్ మరియు లైక్  చేయండి ఇటువంటి మరిన్ని వీడియో లు చేసేలా నన్ను ప్రోత్సహించండి .

rktechnics.com       rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

21, సెప్టెంబర్ 2016, బుధవారం

facebook మార్పు సవరణ....

facebook మార్పు సవరణ....

ప్రతి పోస్ట్ కి సంబంధించిన ఎడిట్ ప్రైవసీ, సేవ్, డిలీట్ లాంటి అనేక ఆప్షన్లు మనకి రైట్ సైడ్ టాప్ లో వచ్చేసి కాని కొన్ని రోజుల క్రితం వాటిని మూవ్ చేసేసారు రైట్ బాటమ్ లొ పెట్టారు దీనికి నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది.

అయితే ఆ మార్పుకి మంచి స్పందన రాకపోయేసరికి ఆలోచనకు గురియైన ఫేస్బుక్ వారు.తిరిగి ఆ ఆప్షన్ ని యదా స్థానం లోకి పంపించేసారు.. మల్లి ఇప్పుడు రైట్ టాప్ లో అందుబాటులో ఉంది

17, సెప్టెంబర్ 2016, శనివారం

How To Hide WiFi Network Signel (Video)


            ఎవరైనా మన  ఇంటికి రాగానే వైఫై ఆన్ చేసి స్కాన్ చేసి అరేయ్ పాస్వర్డ్ చెప్పమని అడుగుతారు. మనకు ఇష్టం లేకపోయినా కొంచం కష్టంగానే  చెప్తాము. లేదా ఇస్తాము .
           అదే మరి మన  వైఫై నెట్వర్క్ సిగ్నేల్ ఎవరికీ  కనిపించకుండా కేవలం మనకు మాత్రమే కనిపించేలా ఆక్సెస్  చేస్కొనేలా ఉంటె ఎలా  ఉంటుంది. ఈ  ఆలోచననే  కొంచం హ్యాపీ గా ఉంది కదా.
మరి ఇదేంటి ఇంత పిసినారి తనమా  అనుకోవచ్చు అదేం పిసినారి తనం కాదండి బాబు. ఎన్నో సమస్యలు ఉండవచ్చు . డేటా అయిపోవచ్చు ,లేదా వాళ్ళు ఎక్కువ డౌన్లోడ్ లు పెట్టవచ్చు దాని ద్వారా మనకి స్లో అవవచ్చు. ఇంకా ఎన్నెన్నో . అదే మరి మన సిగ్నెల్ స్కానింగ్ లో కనిపించక పోతే అడిగేవారు తక్కువ
మన నెట్వర్క్ సిగ్నెల్ ని కేవలం మనం  మాత్రమే చూడగలిగేలా  ఏ విధింగా hide చేయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిచండం జరిగింది.

Video link : Click Here


              ఈ  వీడియో  చూడండి .నచ్చితే లైక్ చేసి మీ  రేటింగ్ తెలిపి షేర్ చేయగలరు . మీ  మిత్రులకు సహాయం చేయండి.ఈ  వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు.

సదా  మీ  సేవలో

మీ  కర్ణాకర్
9014819428

15, సెప్టెంబర్ 2016, గురువారం

Join with Us in Telegram

తెలుగు ప్రజలందరికీ మిత్రులందరికీ నమస్కారం.

మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది.
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.

  • ·         ఫేస్బుక్ పేజి
  • ·         ఫేస్బుక్ గ్రూప్
  • ·         పర్సనల్ ఎకౌంటు
  • ·         వాట్స్ యాప్
  • ·         hike టైంలైన్
  • ·         బ్లాగ్
  • ·         వెబ్సైటు
  • ·     YouTube


ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.


టెలిగ్రాం అప్లికేషను  డౌన్లోడ్  చేస్కోనుటకు  లింక్ : click here

(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే ఇందులో
నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి.

ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్ ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ , వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట

టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.

ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు. లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.

ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.

ఛానల్లో మ్యూట్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.

చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.

మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.

ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)


31, ఆగస్టు 2016, బుధవారం

Keep Hard Disk Drive Safe From error/failing



మన సిస్టం మెమరీ లో ఎంతో విలువైన డేటా ఉంటది. మరిఅలాంటి హార్డ్ డిస్క్ అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోతే, పాడైపోతే...
అంత విలువైనా డేటా ని మల్లి మనం పొందలేము.. స్వీట్ మెమోరీస్ , అల్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్.. చాలచాల మిస్ అయిపోతాము వాటిని కోల్పోయాము అనే బాధ నుంచి అంత త్వరగా కోలుకోలేము కూడా..
మరి అంత విలువైన హార్డ్ డిస్క్ మెమరీని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది మరి దానికి తీస్కోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ పూర్తిగా చదవల్సినదే
ఈ క్రింద ఇవబడిన  పది పద్ధతులను  సరిగా  ఫాల్లో అయితే సరిపోతుంది .
1)     Run Check Disk
సాధరణంగా మన  హర్దిస్క్ కి ఎక్కువగా  సమస్య వచ్చేది హార్డువేర్ ప్రాబ్లం వలన ఇంకా సాఫ్ట్వేర్ ప్రొబ్లెంస్,పార్టిషన్ చేసే సమస్యలు మొదలగునవి . మరి ఇలాంటి ప్రాబ్లం ని బాడ్ సెక్టార్ లను క్రాస్ లింక్డ్ ఫైల్స్ ని సరిచేయుటకు ఈ చెక్ డిస్క్ అడుతంగా పని చేస్తుంది.
Start--> run--> command అని టైపు చేసి ఇంటర్ చేయండి ఇప్పుడు మనకి బ్లాకు స్క్రీన్ కల ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది,దానినే కమాండ్ ప్రాంప్ట్ అంటారు.
ఏ  డ్రైవ్ ని అయితే మనం చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ డ్రైవ్ లోకి వెళ్ళాలి ఎలా  అంటే ?

D:

D కోలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే D డ్రైవ్ కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది . నౌ సింపుల్ గా CHKDSK అని టైపు చేస్తే సరిపోతుంది డ్రైవ్ మొత్తం చెక్ చేయబడ్తుంది ఏమైనా ఎర్రర్ ఫైల్స్ ఉంటె అది సిస్టం రీబూట్ సమయం లో క్లీన్ చేస్తుంది . మనం కెన్సెల్ చేయక పోతే సరి
2)    ADD A MONITOR
మన హార్డ్ డ్రైవ్ ని మనం ఎంత బాగా వాడితే అంత బాగుగా ఉంటది . అయితే మన డ్రైవ్ హెల్త్ ఎప్పటి కప్పుడు  తెలుసుకొనుటకు ఇప్పటికే చాల అప్లికేషను లు అందుబాటులో ఉన్నాయి. నా ఛాయస్ ప్రకారం ACRONIS DRIVE MONITOR ఇది ఒక ఫ్రీవేర్ టూల్ ఈ అప్లికేషను మన డ్రైవ్ యొక్క ఉష్ణోగ్రత, హెల్త్ , ఫ్రీ స్పేస్ మొదలగునవి అన్ని నియత్రిస్తాయి ,తెలియజేస్తాయి. అంతే కాకుండా ఒక వేల ఈ మానిటరింగ్ లో ఏమైనా అంతరాయం ఏర్పడితే వెంటనే మన మెయిల్ కి అలెర్ట్ వస్తంది . దాని వలన మనం వెంటనే ప్రతిగాతించవచ్చు.
3)    FREEUP WINDOWS DRIVE
సాద్యమైనంత వరకు మన విండోస్ ఇన్స్టాల్ చేసి ఉన్న డ్రైవ్ ను ఫుల్ చేయకుండా చూసుకోవాలి,ఎంత ఫ్రీ అంత మంచిది, డిఫాల్ట్ డౌన్లోడ్స్ ఫోల్డర్ ని C: డ్రైవ్ లో కాకుండా వేరే డ్రైవ్ లో పెడితే డేటా ఫుల్ అవకుండా ఉంటుంది అంతే కాకుండా డెస్క్టాపు క్లీన్ అండ్ నీట్ గా ఉంచుకోవాలి, ఎక్కువ డేటా వలన ఎక్కువ రీడింగ్ అండ్ రైటింగ్ పడుతుంది కావున ఎక్కువ వాడబడుతుంది.
4)    BE CAREFUL ABOUT THE SURROUNDING ENVIRONMENT
మన సిస్టం ఉన్న రూమ్ లో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూస్కోవాలి, CPU కూడా గాలి వెలుతురు కి ఉండాలి అంతే గా టైట్ గా గాలి ఆడకుండా ఉండడం వలన హీట్ పెరిగి పోయి మెమరీ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కావున ఎంత నార్మల్ వాతావరం లోనే ఉంచాలి .
5)    WATCH OUT FOR STATIC
చాల మంది వద్ద నేను గమనించిన ముఖ్య సమస్య మరియు పెద్ద సమస్య ఇది. ఎలక్ట్రిసిటీనే మన సిస్టం కి అతి పెద్ద శత్రువు. ఎలా గంటె ప్రతి ఇంటికి ఎర్త్ *గ్రౌండ్ ఎర్త్* ఖచ్చితంగా ఉండాలి. చలికాలం మరియు వర్షాకాలం రోజులలో ఈ సమస్య ప్రాణాలకు కూడా అపాయం చేస్తుంది. కరెంటు డైరెక్ట్ ప్రవహించడం వలన ఏదైనా షాట్ అయినపుడు వెంటంటే హార్డ్ డిస్క్ కొట్టేస్తుంది . కావున ఈ విషయాన్ని ఎక్కుగవా గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి.
6)    DEGRAGMENT THAT DRIVE
ఇది కూడా అందరు గమనించాలి మన చేతిలో పనికావున చేస్కొంటే మనమే మన మెమరీ పాడవకుండా కొంత కాపడుకున్నట్టు  అవుతుంది. సాదరంగా ఈ ప్రాసెస్ మన ఆపరేటింగ్ సిస్టం నే చేసేస్కోంటా ఉంటది. కాని మనకు సమయం దొరికినపుడు మనం కూడా దాని చెక్ చేస్కొంటే ఎలాంటి సమస్య రాకుండా ఉంటది . డ్రైవ్ కి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే అక్కడ టూల్స్ ట్యాబు లో OPTIMIZE AND DEGRGMENT DRIVE అంటే సెక్షన్ లో OPTIMIZE అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఆప్షన్ లు ఫాల్లో అవుతే సరిపోతుంది .
7)    ERROR CHECKING
HARD DRIVE ERROR CHECK చేస్కొంటే సమస్య రాకుండా కొంత సహాయం పడినట్టు ఉంటది . డ్రైవ్ కి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే అక్కడ టూల్స్ ట్యాబు లో ఎర్రర్ చెకింగ్ అనే ఆప్షన్ ఉంటది అది దానిపై క్లిక్ చేసి ఫాల్లో అవుతే సరిపోతాది...
8)    INTERNAL DRIVE
మనం హార్డ్ డిస్క్ కొనే సమయంలో ఏ డ్రైవ్ కొంటె బాగుంటుంది ఏ కంపెనీ బెటర్ ఇంటర్నల్ నా లేదా ఎక్స్టర్నల్ హార్డ్డిస్క్ లో ఏది బెటర్ వాటి పై మనం చాల జాగ్రత్తలు వహించాలి. దాదాపు నా ద్రుష్ట్రా ఇంటర్నల్ హార్డ్ డిస్క్ నే బెటర్ ఎలా అంటే ఎలాంటి మూవింగ్ ఉండదు కావున నిచ్చల స్థితిలో ఎలాంటి రాశేష్ లాంటివి ఉండవు. అంతే కాకుండా ఏ సిస్టం కి పడితే ఆ సిస్టం కి పెట్టడానికి ఉండదు కావున ఎలాంటి వైరస్ దాడులు ఉండవు, ఎక్స్టర్నల్ అండ్ మనలో ఉండే సమస్యనే ఇది. లార్జ్ స్పేస్ మెమరీ హర్దిస్క్ అయితే ఇంటర్నల్ నే బెటర్ తక్కువ స్పేస్ తో అయితే ఎక్స్టర్నల్ వాడవచ్చు .
9)    TAKE ADVANTAGE OF POWER SAVE
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టం లలో ఉన్న గొప్ప ఉపయోగపడే ఆప్షన్ ఈ  పవర్ సేవ్ విండోస్ 7 అలాగే ఆ పై వెర్షన్ లలో కంట్రోల్ ప్యానల్ లో పవర్ ఆప్షన్ లో చాల ఆప్షన్ లు అందుబాటులో ఉంటది . అందులో మన సిస్టం 20 నిమిషాలు IDLE గా ఉంటె సిస్టం డైరెక్ట్ గా హార్డ్ డ్రైవ్ ని ఇనాక్టివ్ చేసేస్తుంది . కావున పవర్ సమన్వయంగా ఉంటుంది కావున హార్డ్ డిస్క్ కొంచం సేఫ్ లో ఉంటుంది . అలాగే స్లీప్ లాంటి ఆప్షన్ ఇంకా ఎంతో గాను ఉపయోగపడతాయి .
10)   TIGHTEN THOSE SCREWS
ఇది చాల ముఖ్యంగా తెలియకుండా జరిగి పోయే సమస్య ఏంటంటే మన హార్డ్డిస్క్ సిస్టం CPU చాసిస్ కి భిగించినపుడు చాల టైట్ గా ఉండేలా చూస్కోవాలి లూస్ గా ఉండడం వలన చిన్న చిన్న VIBRATIONS జరిగినపుడు వర్కింగ్ లో ఉన్న హర్దిస్క్ కదలడం వలన హార్డ్ డిస్క్ ఒక్క సారిగా ఆగిపోతుంది . పాడవుతుంది . దాదాపు హార్డ్ డిస్క్ అస్సలు కదలకుండా ఫుల్ ఫిట్ అయేలా ఫీలయితే రెండు వైపులా స్క్రూ లను భిగించాలి .
11)   PENDRIVE VIRUS ATTACKING
ఇది చాల మంది ఎదురుకొంటున్న ప్రాబ్లం , PENDRIVE లోని డేటా ని ఎలాంటి స్కాన్ చేయకుండా డైరెక్ట్ గా మన హార్డ్ డిస్క్ లోకి కాపీ చేస్కోవద్దు అలా చేయడం వలన ఏదైనా మెమరీ ట్రోజెన్ గనుక అందులో ఉంటె మన హార్డ్ డిస్క్ లైఫ్ ని మెమరీ ని మెల్లిగా తినుకుంటూ వచ్చేస్తుంది . షార్ట్కట్ వైరస్ , లింక్ వైరస్ . EXE వైరస్ లు ఉంటె ఆ డేటా ని స్కిప్ చేసేయాలి కాని కాపీ చేస్కొని తర్వాత చూద్దాం అనుకోవడం మన మూర్ఖత్వమే
12)   BACKUP

హార్డ్ డిస్క్ పాడైపోయిన తర్వాత మనం ఎంత బాధ పడిన ఎం లాభం లేదు , ఎంత ప్రయత్నించిన తక్కువ అవకాశాలు ఉండవచ్చు . అందుకని ముందుగానే మన ఇంపార్టెంట్ డేటా ని క్లౌడ్ మెమరీ లో స్టోర్ చేస్కోవడం లేదా బ్యాక్ అప్ CREATE చేసి ఏదైనా CD/డీవీడీ లేదా ఏదైనా పెండ్రివే లోకి కాపీ చేస్కొంటే చాల చాల బెటర్ గా ఉంటుంది .

16, ఆగస్టు 2016, మంగళవారం

Hike New Option

న్ని ఇన్నిరోజులుగా హైక్ లో favorites అని ప్రవేశ పెట్టిన ప్రకారం ఎవరినైతే మనం ఫేవరెట్స్ లో ఆడ్ చేస్కొంటామో వారికి మాత్రమే మన టైంలైన్ పోస్ట్ లు కనిపించేవి....... వారు మనని ఫేవరెట్ గా ఆడ్ చేస్కొంటే వారికి మన పోస్ట్ లుకనిపిస్తాయి. అయితే ఈ ఫీచర్ అందరికి అర్ధం కావటం లేదని గమనించిన హైక్ సంస్థ ఇప్పుడు ఆ ఫీచర్ ని కాస్తా ఫ్రెండ్స్ గా మార్చేసింది..
ప్రస్తుత ప్రజలు పై ఫేస్బుక్ ప్రభావితం చూసి ఇలా అయితే ఈజీ గా ప్రజలలోకి చొరబడుతుంది అని గమనించి ఇలా ఫ్రెండ్స్ అనే ఫీచర్ గా మార్చేసారు.. favorites లో ఎలాగైతే ఆడ్ చేస్కోన్తామో అదే విధంగా ఇది కూడా.. ఆడ్ ఫ్రెండ్ పై క్లిక్ చేస్తే చాలు.. విషయం ఏంటంటే మనం ఫ్రెండ్ గా ఆడ్ చేస్కోన్నాము అనే విషయం వారికి కూడా తెలిసి పోతుంది, అందువలన మరింత గట్టి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అని బావించింది హైక్ ఇండియన్ సంస్థ.
ఒక్కప్పటితో పోలిస్తే అప్పట్లో ఎక్కువగా పోస్ట్ లకి లైక్ లు రావట్లేదు అని బావించే మిత్రులకి ఇది అద్బుతమైనా ఆప్షన్ గా మారిపోయింది..
వాస్తవానికి వాట్స్ యాప్ తో పోలిస్తే హైక్ నే చాల ఫాస్ట్ గా తక్కువ డేటా ని ఉపయోగించుకునే అప్లికేషను అని స్పష్టంగా తెలిసిపోతుంది.
I always like hike ..
Thanks Hike

3, ఆగస్టు 2016, బుధవారం

Windows 10 Anniversary Update Released

విండోస్ 10 రిలీజ్ వార్షికోత్సవ సందర్భంగా విండోస్ 10 anniversary Update ను రిలీజ్ చేసింది. ఎన్నోన్నో అద్బుతమైన ఫీచర్లను ఇందులో పొంధపరిచారు. ఈ అప్డేట్ ను మీరు మీ విండోస్ అప్డేట్ ద్వారా పొందవచ్చు లేదా

ఈ లింక్ నుంచి చిన్న టూల్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవచ్చు

లింక్:Click Here To Download