27, సెప్టెంబర్ 2016, మంగళవారం

new feature in Whats app

వాట్సాప్ మెసెంజర్ ప్రేమికులకు మ‌రో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

మొన్నటికి మొన్న సేల్ఫీ ఫ్లాష్ ఫీచర్ వచ్చిందన్నవిషయం తెలుసుకోన్న్నము ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా తీసిన ఫోటోలకు ఎన్నో క్లిప్ ఆర్ట్స్ లని అదే విధంగా డైరెక్ట్ క్రాపు , ఫోటో తీసిన వెంటనే దానిపై ఏదైనా రాసుకొనే విధంగా మంచి మంచి ఆప్షన్ ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. త్వ‌ర‌లోనే ఈ వెర్ష‌న్‌ని విడుద‌ల చేస్తారు

గమనిక: ఇక్కడ ఒక విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు.

24, సెప్టెంబర్ 2016, శనివారం

How to Hide Photos, Video and Files in your Android Mobile

మన మిత్రులు ఎవరైనా గా రాగానే మన మొబైల్ చూపించడం అనడం సహజం .
మరి మొబైల్ తీస్కోని వారు చేసే పని ఏంటంటే అందులో ఉన్న ఫొటోస్ చూడడం వీడియోస్

చూడడంచేస్తుంటారుమన మొబైల్ లో మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు లేదా 
వీడియోస్ కావచ్చు ఏ ఫైల్స్  అయినా ఉండవచ్చు అవి వారు చూడడం మనకి ఇష్టం ఉండదు. మరి వాటిని మనం గ్యాలరీ లో కనిపించకుండా చేస్తే , అలాగే మన వీడియోస్ వీడియో ప్లేయర్ లో కనిపించకుండా  చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. అయితే చాల మంది మిత్రులు ఈ సమస్య ని ఎదురు కొనుటకు ఎన్నో రకాల అప్లికేషను లను వాడుతుంటారు. అవి మన ఫైల్స్ ని encrypt చేసేస్తాయి .కావున మనం వాటిని విడిగా access చేయలేము. వాటితో సమస్య ఏర్పడగానే మా ఫొటోస్ పోయినాయి , వీడియోస్ పోయినాయి ఇంపార్టెంట్ అని మోర పెట్టుకుంటారు , చేతులు కాలినాక ఆకులు పట్టుకొంటే ఎం లాభం, అంతేగా
  మరి నేను ఇప్పుడు మీకు ఈ వీడియో లో చూపించాబోయే వీడియో లో ఎలాంటి అప్లికేషన్ ని వాడకుండా మన ఫైల్స్ కి డేటా కి ఎలాంటి హాని జరగకుండా  సులువుగా గ్యాలరీ లో కనిపించకుండా hide చేయడం ఎలా అనేది స్పష్టంగా తెలియజేశాను . నాకు తెలిసి ఈ వీడియో మీకు చాల బాగా ఉపయోగపడుతుందని బావిస్తున్నాను.

ఈ వీడియో మీకు ఉపయోగపదినట్లు అయితే తప్పక షేర్ మరియు లైక్  చేయండి ఇటువంటి మరిన్ని వీడియో లు చేసేలా నన్ను ప్రోత్సహించండి .

rktechnics.com       rktechinfo.com
fb/heerasolutions
fb.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

21, సెప్టెంబర్ 2016, బుధవారం

facebook మార్పు సవరణ....

facebook మార్పు సవరణ....

ప్రతి పోస్ట్ కి సంబంధించిన ఎడిట్ ప్రైవసీ, సేవ్, డిలీట్ లాంటి అనేక ఆప్షన్లు మనకి రైట్ సైడ్ టాప్ లో వచ్చేసి కాని కొన్ని రోజుల క్రితం వాటిని మూవ్ చేసేసారు రైట్ బాటమ్ లొ పెట్టారు దీనికి నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది.

అయితే ఆ మార్పుకి మంచి స్పందన రాకపోయేసరికి ఆలోచనకు గురియైన ఫేస్బుక్ వారు.తిరిగి ఆ ఆప్షన్ ని యదా స్థానం లోకి పంపించేసారు.. మల్లి ఇప్పుడు రైట్ టాప్ లో అందుబాటులో ఉంది

17, సెప్టెంబర్ 2016, శనివారం

How To Hide WiFi Network Signel (Video)


            ఎవరైనా మన  ఇంటికి రాగానే వైఫై ఆన్ చేసి స్కాన్ చేసి అరేయ్ పాస్వర్డ్ చెప్పమని అడుగుతారు. మనకు ఇష్టం లేకపోయినా కొంచం కష్టంగానే  చెప్తాము. లేదా ఇస్తాము .
           అదే మరి మన  వైఫై నెట్వర్క్ సిగ్నేల్ ఎవరికీ  కనిపించకుండా కేవలం మనకు మాత్రమే కనిపించేలా ఆక్సెస్  చేస్కొనేలా ఉంటె ఎలా  ఉంటుంది. ఈ  ఆలోచననే  కొంచం హ్యాపీ గా ఉంది కదా.
మరి ఇదేంటి ఇంత పిసినారి తనమా  అనుకోవచ్చు అదేం పిసినారి తనం కాదండి బాబు. ఎన్నో సమస్యలు ఉండవచ్చు . డేటా అయిపోవచ్చు ,లేదా వాళ్ళు ఎక్కువ డౌన్లోడ్ లు పెట్టవచ్చు దాని ద్వారా మనకి స్లో అవవచ్చు. ఇంకా ఎన్నెన్నో . అదే మరి మన సిగ్నెల్ స్కానింగ్ లో కనిపించక పోతే అడిగేవారు తక్కువ
మన నెట్వర్క్ సిగ్నెల్ ని కేవలం మనం  మాత్రమే చూడగలిగేలా  ఏ విధింగా hide చేయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిచండం జరిగింది.

Video link : Click Here


              ఈ  వీడియో  చూడండి .నచ్చితే లైక్ చేసి మీ  రేటింగ్ తెలిపి షేర్ చేయగలరు . మీ  మిత్రులకు సహాయం చేయండి.ఈ  వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు.

సదా  మీ  సేవలో

మీ  కర్ణాకర్
9014819428

15, సెప్టెంబర్ 2016, గురువారం

Join with Us in Telegram

తెలుగు ప్రజలందరికీ మిత్రులందరికీ నమస్కారం.

మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది.
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.

  • ·         ఫేస్బుక్ పేజి
  • ·         ఫేస్బుక్ గ్రూప్
  • ·         పర్సనల్ ఎకౌంటు
  • ·         వాట్స్ యాప్
  • ·         hike టైంలైన్
  • ·         బ్లాగ్
  • ·         వెబ్సైటు
  • ·     YouTube


ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.


టెలిగ్రాం అప్లికేషను  డౌన్లోడ్  చేస్కోనుటకు  లింక్ : click here

(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే ఇందులో
నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి.

ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్ ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ , వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట

టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.

ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు. లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.

ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.

ఛానల్లో మ్యూట్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.

చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.

మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.

ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)