27, మే 2016, శుక్రవారం

Telugu Typing

కవితలు , కావ్యాలు, వ్యాకాలు మొదలగునవి .. ఆకర్షించే విధంగా రకరకాల ఫాంట్ లను వాడుతూ మంచి స్టైల్స్ ని ఎంచుకొని తయారుచేయుటకు అను స్క్రిప్ట్ మేనేజర్ చాల ఉపయోగపడుతుంది ..

ఏంటి ఇందులో స్పెషల్ ఎంటటే మొత్తం 85 రకాల ఫాంట్స్ ఉంటాయి. అంతే కాక ఇది ఫోటోషాప్ 7, 8.0(సి ఎస్) లో పని చేస్తుంది కావున అధ్బుతమైనా బాక్గ్రౌండ్ ఇమేజ్ లను ఉపయోగించుకొంటూ డిజైన్ చేసోవచ్చు.

అంతే కాదు ఈ సాఫ్ట్వేర్ లో roma, apple, DOE phonetic, modular ఇలా నాలుగు రకాల కీబోర్డ్ లేఔట్ లు ఉంటాయి కావున ఎవరికీ వచ్చినది వారు టైపు చేస్కొనే విధంగా ఉంటుంది .

అయితే అందరికి ఆపిల్ , ఫోనెటిక్, మోడులర్ లాంటివి రాక పోవచ్చు ఎందుకంటే అవి వేరే వేరే అక్షరాలలో తెలుగు అక్షరాలూ ఉంటాయి కావునా .. కాని రోమ కీబోర్డ్ అలా కాదు
A= అ
B=బ
C=స

ఇలా ఉంటాయి కావున మనం ఈజీ గా అక్షరాలను ఐడెంటిఫై చేస్కొని టైపు చేస్కోవచ్చు.

నేర్చుకోవడానికి కొంచం టైం పట్టవచ్చు కాని నేర్చుకొంటే చాల స్పీడ్ గా వెళ్ళవచ్చు.

ఈ విషయం పై నేన్ చేసిన వీడియో చూసి ఈ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా వాడాలి అని తెలుసుకోవచ్చు

అను స్క్రిప్ట్ మేనేజర్ నుపయోగించి తెలుగు టైపు చేయుటకు : www.bit.ly/HSanuSM

క్ష , జ్ఞా, క్ష్మీ, ష్ట్ర ,ఐ వంటి అక్షరాలను టైపు చేయుటకు : www.bit.ly/HSanuSM2

నోట్ : ఈ సాఫ్ట్వేర్ లో టైపు చేయుట కొంచం కష్టంగా ఉండవచ్చు . కాని ప్రాక్టిస్ చేస్తే చాల ఈజీ గా ఉంటుంది . అంతే కాక 85 రకాల ఫాంట్స్ మనకి సంతృప్తి ని ఇస్తాయి . ఫోటోషాప్ వంటి వాటిలో అయితే అద్బుతంగా మీ క్రియేటివిటీ ని నిరూపించవచ్చు. ఆపిల్ లేఔట్ వారికైతే ఇది బాగా సెట్ అవుతుంది .

ఈ పోస్ట్ గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మా టెక్నికల్ ఛానల్

www.youtube.com/rayarakula ని విసిట్ చేయగలరు.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరియు మా updates కోసం క్రింది లింక్ ల ద్వారా మాతో జాయిన్ అవ్వండి .
www.facebook.com/heerasolutions
www.facebook.com/groups/PCSolutions4u



ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె నన్ను సంప్రదించగలరు

రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

Wonderful Photography Forever


ఈ ఫోటో తీయడానికి.. ఫోటోగ్రాఫర్.. 18 కెమేరాలను ఉపయోగించి.. 62 రోజులు ఎదురుచూశాడట.. 
ఇందులో గొప్ప ఉముంది అంటారా...??
మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నట్టు అయితే.. మీ ఫోనుని రివర్స్ చేసి చూడండి.. మీకే తెలుస్తుంది...
ఈ ఫోటో.. ప్రపంచములోనే అద్భుతమైన... గొప్ప చిత్రంగా ఎన్నుకోబడింది...
హాట్సాఫ్..

Lenovo K3 Note New Update





లెనోవో కే3 నోట్ లో మల్లి సరికొత్త అప్డేట్ 13 mb గల ఈ అప్డేట్ ద్వార పెర్ఫార్మన్స్ మరియు బగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది .. డౌన్లోడ్స్ అనే యాప్ కూడా తిరిగి వచ్చింది

20, మే 2016, శుక్రవారం

Some Documents to learn Photoshop

కొన్నిఫోటోషాప్ డాకుమెంట్స్ మీకోసం..  నా తరఫున..  నా ఫోటోషాప్ వీడియోస్  చూసిన తప్పక ట్రై చేయండి..

ఫోటోషాప్ వీడియోస్ లింక్: https://www.youtube.com/playlist?list=PLKPUn2pFhrh731EhUW-mJwK8ebX_4IN5c

డాకుమెంట్స్ లింక్: https://drive.google.com/open?id=0B58hGceAo-QZdlJaV2VJbmNKVVE

Solutions for avoiding Facebook viruses

ఛి ఛి ఛి ఛి .....

ఛి... అంతగా గలీజ్ తయారైంది.

ఏంటి సడన్ గా ఇలా అన్నాను అనుకుంటున్నారా? అలా ఎం అనుకోరు లే నాకు తెలుసు ఎందుకంటే  మీకు  కనిపిస్తుంది కదా .  ఇంకా బాగా కనిపించాలంటే మీకు ఒక గ్రూప్ ఉంటె కచ్చితంగా కనిపించేది. నేను PC  solutions – karna  గ్రూప్ నడుపుతున్న సంగతి మీకు తెలిసినదే. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఎంటటే మీకు టెక్నాలజీ పరంగా  ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్కోవడానికి , సలహాలు ఉంటె పంచుకోవడానికి చేసాను .

కాని  గ్రూప్ లో రోజుకు యాబై అరవై పోస్ట్  లు పెండింగ్ లో ఉంటున్నాయి అడ్మిన్ అప్రూవల్ కొరకు.

అమ్మో.... అని ఆశ్చర్యపోకండి. అన్నిపెండింగ్ లో ఉంటున్నాయని చూస్తే అందులో  95% శాతం పోస్ట్  లు అన్ని స్పాం లు, గలీజ్ ఫోటోలు ఛి ఛి ఛి .. ఇంట్లో గ్రూప్  పోస్ట్  లు చూడాలంటె బయంగా ఉంది. 100 పోస్ట్  లకి 90 పోస్ట్  లు ఇవే ఉంటున్నాయి ఇంకో ఐదు Advertisement promotion posts  ఇక ఇంపార్టెంట్ వి 5. ఇక అవన్నీ డిలీట్ చేసేసరికి తల ప్రాణం తోక కాస్తుంది . అప్పుడప్పుడు యూసర్ ని బాన్  చేసేస్తున్న ఎం చేయను మరి.
మరి ఇలా వీరు ఎందుకు చేస్తున్నారు అని  కోపం వచ్చి ఇద్దరు ముగ్గిరిని అడిగాను (నాకు తెలుసు అవి వారి ప్రమేయం లేకుండానే పోస్ట్ అవుతున్నాయి అని , కాని ఎప్పుడో మనం చేసిన చిన్న క్లిక్ ఇప్పుడు ఇలా ఎఫెక్ట్  చూపిస్తుంది)  అలా అడిగితే వారి సమాధానం
.. కామన్..
సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని. ( ఈ విషయం మనకి తెలిసిందే )
మరి ఎందుకు అడిగారు అని అనుకుంటారేమో దానికి సంధానం ఉంది నా వద్ద . ఎంటటే వీరు ఇలా స్పాం ,ఫిషింగ్ లకి గురి అయ్యారనేది వీరికి ఎవరో చెప్తే తప్ప తెలియదు . ఆ ఎవరో నేను అవుదామని ..
“సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని.” అన్నవారే ఎక్కువ కానీ , “ అయ్యో దేవుడా ఇలా జరిగిందా . ఎలా మరి ఎం చేయాలి వీటి బారి నుంచి  నన్ను రక్షించండి “ అన్న వారు చాల తక్కువ.  ఇలా అన్నవారే ఫేస్బుక్ ని ఒక మనిషిలా మనసుతో నడుపుతుంటారు. మిగితా వాళ్ళంతా వారి  వారి సరదాలని తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చేసిన పనే ఈ గలీజ్ అంత .
ఇలాంటి సరదా మనుషులకు సరదాక ఒక్క మాట. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండిరా, ఫేస్బుక్ ని కరాబు చేయకండిరా.. మీకోసం సపరేట్ గా వేరే సైట్స్ ఉన్నాయి వాటిని వాడుకోండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతారు.

ఇక పోతే ఈ సమస్య కి గురి అయినా వ్యక్తి చేయవలసిన పనులు.
→ముందుగా ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చేయండి.
→కనిపించిన ప్రతి లింక్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా తెలిసిన వాటిపైనే క్లిక్ చేయండి
→ఫేస్బుక్ లో మనకి తెలియని యాప్స్ ఉంటె తొలగించండి అవే ముప్పు తెచ్చేవి.
(ఫేస్బుక్ లో యాప్స్ తొలగించండి అంటే ఫోన్ లో యాప్ తీసేయాలా ? అని అడుగుతున్నారు . వాళ్ళకోసం కొంచం క్లారిఫికేషన్  . ఫోన్ లో కాదు మిత్రమా ఫేస్బుక్ లో కూడా యాప్స్ ఉంటాయి , అర్ధం కాలేదా ఎప్పుడు మనం ఆడుతుంటాంమే candy crush గేమ్ ఇది కూడా ఒక యాప్ నే సెట్టింగ్స్ లో అప్ప్స్ అనే సెక్షన్ లోకి వెళితే మీరు వాడే అన్ని అప్స్ కనిపిస్తాయి అవసరం లేనివి వెంటనే తొలగిస్తే మంచిది.)
→ కనిపించింది కదా అని లటకున క్లిక్ చేయడం ఆపి ఏదైనా పనికచ్చే పోస్ట్ లు చదవండి .
→ సెక్యూరిటీ సెట్టింగ్స్ ని భలపరుచుకోండి
మీకేమో గాని రోజు ఆ దరిద్రాన్ని చూడలేక చస్తున్నాము.

ఈ మద్యలో ఇంకో వైరస్ కూడా కా కంట పడింది అదేమిటి అంటే మన మిత్రుడు ఏదో గ్రూప్ లో జాయిన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది వెళ్లి చూస్తే ఆ గ్రూప్ లో పోస్ట్ కి అర్హత ఉండదు. ఆ గ్రూప్ కూడా తయారు చేసి  కొన్ని గంటలే  అయి ఉంటుంది . మెంబెర్స్ చూస్తే వేయిలకు వెయిలు. తీర మిత్రుడిని అడిగితే అదే జవాబు .. నాకు తెలియదు .

ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్పితే అర్ధం కాదు . అలాంటి జోలికి మనం వెళ్ళనంత వరకు మనం సురక్షితంగా ఫేస్బుక్ లో ఉంటాము. ఒక్క సారి వాటి భారిన పడినారో కోలుకోవడానికి చాల సమయం పడుతుంది . ఈ వైరస్ పని ఏంటంటే మీరు ఎన్ని సార్లు లాగిన్ చేస్తే అన్ని సార్లు మీ పేరుతో గ్రూప్ లలో గలీజ్ పోస్ట్ లు చేస్తుంది అది చూసి ఇంకొకతను క్లిక్ చేస్తాడు అతని పని కూడా ఇలాగే అవుతుంది .
కావున ఇకనైనా జాగ్రత్త తీస్కోని . పేరు ను కాపాడుకోండి.

Facebook Group for technological information amd solutions

గత 2 సంవత్సరాల గా మీ ఆదరాభిమానాలతో నడుస్తున్న మా గ్రూప్ ఎంతో మంది మిత్రులకు సహాయం గా నిలుస్తుందని బావిస్తున్నాను . ..

కంప్యూటర్ సమస్యలను ఎదురుకొంటున్న  వారు వారి సమస్యలను నా గ్రూప్ లో పోస్ట్ చేసి మా టెక్నికల్ టీం సహాయం తో పరిష్కారాన్ని అందుకొంటున్నారని బావిస్తున్నాను .

కరెక్ట్ గా 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న మా గ్రూప్ లో ఇంచు మించు ప్రస్తుతానికి 12000 మంది మిత్రులను జాయిన్ అయ్యారు ..  అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

అలాగే మా ఎదుగుదల కి  సపోర్ట్ అందిస్తున్న మిత్రులందరికీ  పాదాబివంధనాలు

గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u/

11, మే 2016, బుధవారం

Whats App Software For PC

            ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న వాట్స్ యాప్  యూసర్ లందరికి  శుభవార్త .ఇకపై వాట్స్ యాప్    సిస్టం కూడా  ఉపయోగించుకోవచ్చు, వాట్స్ యాప్  వెబ్ ద్వారా సర్వీస్ అందించిన వాట్స్ యాప్ సంస్థ ఇక పై నుంచి ఎలాంటి వెబ్ బ్రౌజరు ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్కొని వాడుకోవచ్చు అని తెలిపారు . కాని వాట్స్ యాప్ వెబ్ ఎలా పని చేసిందో అదే విధంగా పని చేస్తుంది అంతే కాక ఇంకా పెర్ఫార్మన్స్ ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. . ఈ మద్యనే ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ని అమరు పరిచారు . Whats App Software నుంచి వాట్స్ అప్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవచ్చు .


 అయితే ఈ అప్లికేషను ని మన సిస్టం లో ఇన్స్టాల్ చేస్కోవాలంటే కొన్ని requirements ఉన్నాయండి.అవేంటంటే.

→ మీ సిస్టం లోని ఓస్  విండోస్ 8 లేదా ఆపై  వెర్షన్ అయి ఉండాలి .
→ మొబైల్ లో అప్లికేషను నడుస్తుండాలి.
→ మొబైల్ మరియు సిస్టం లో నెట్వర్క్ ఉండాలి.

నోట్: విండోస్ xp, విండోస్  7 లో ఈ సాఫ్ట్వేర్ పని చేయదు.

మరిన్ని ఇలాంటి టెక్నికల్ విషయాల అప్డేట్ ల కోసం నా వెబ్సైటు ని సందర్శించండి :www.rktechinfo.com

8, మే 2016, ఆదివారం

Automatic Disposable Profile Picture in Facebook



ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు, ఆప్షన్స్ వస్తూనేఉన్నాయి.కాని మనం వాటిని చూస్కోనే సరికి చాల సమయం పడుతుంది . అందుకే వాటిని మీరు చూసే వరకు కాకుండా ముందుగానే నేను తెలియజేయధలచాను ఈ విషయం మీకు తెలిసినదే

మరి ఇప్పటి కొత్త ముచ్చట ఏంటంటే

ఫేస్బుక్ లో ఈ మద్యలో ప్రొఫైల్ పిక్ ల పై క్రేజ్ ఎక్కువగా ఉంది . మరి ఇదే సమయం లో పండుగ కావచ్చు మీకు ఇష్టం అయిన టీం మ్యాచ్ కావచ్చు ఇంకా ఏదైనా లిమిటెడ్ సమయం లో ఐపోయే దానికోసం మనం ప్రొఫైల్ పిక్ మారుస్తున్టాము.

ఉదాహరణకు చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం వస్తుంది అనే సమయం లో త్రివర్ణ పతాకాల ప్రొఫైల్ ఫోటో లతో ఫేస్బుక్ కల కల లాడుతుంది. సందర్భం అయిపోగానే మల్లి అవి తీసేసి నచ్చినది పెట్టుకుంటారు


మరి ఇలా ప్రతి సారి ఫోటో లను మార్చుకొనే బదులు అదే లిమిటెడ్ టైం వరకు ఉండి . పని అయిపోగానే ఆటోమేటిక్ గా పాత ప్రొఫైల్ పిక్ గా మారి పోతే ఎంత బాగుంటుందో కదా . మరి ఆ సాధుపాయన్నే ఫేస్బుక్ కల్పింది మీరు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయం లో క్రింద Make Temporary అని ఉంటుంది క్లిక్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఈ ఫోటో ఉండాలి అనేది సెలెక్ట్ చేస్కోవచ్చు ఈ ఫోటో లో చూస్తే అర్ధం అవుతుంది .
ఒక గంట నా ,ఒక రోజా లేదా ఒక వారం ఇంకా ఏదైనా మీకు నచ్చిన డేట్స్ లలోనా

ఇలా సెట్ చేస్కొంటే ఆటోమేటిక్ గా డేట్ మిన్చాగానే మీ ప్రొఫైల్ పిక్ ఆటోమేటిక్ గా మారి పాత ప్రొఫైల్ పిక్ అయిపోతుంది .

లిమిటెడ్ టైం లో ఫొటోస్ పెట్టి తీసేయడం కంటే ఇది చాల బెటర్.. నాకు అయితే చాల ఉపయోగపడింది మరి మీకు ?



www.rktechinfo.com

3, మే 2016, మంగళవారం

సరికొత్త అదృశ్య ఫేస్బుక్ ఫీచర్

ఫేస్బుక్ గోప్యత యూసర్ లందరికి స్వచ్చమైన శుభవార్త .

ఎంటబ్బా ?

ఫేస్బుక్ లో నయా గా ఒక అదృశ్య ఫీచర్ రానుంది. అదేంటంటే మనం మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ మాయమవనుంది అంటా.. అగొ ఇదేంది అనుకుంటున్నారా?

అవును కొత్తగా ఈ ఫీచర్ రానుంది ఈ ఫీచర్ ఆన్ చేసుకొన్నా వారికి వారు మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ నామ రూపాలు లేకుండా పోతుంది. ఎందుకు మరి ఇలాంటి ఫీచర్ అంటే ప్రైవసీ సీక్రెట్ చాటింగ్ వారికి ఈ ఫీచర్ బలే ఉపయోగపడనుంది అని తెలుపుతున్నారు ఫేస్బుక్ వాళ్ళు, మనకు తెలుసు కదా ఈ ఫీచర్ ఎవరికీ ఎక్కువగా ఉపయోగపడుతుందో అని ఇగ నేన్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ..

మరి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాకా మరి ఉపయోగాలు ఉన్నాయా లేక నిరుపయోగాలు ఉన్నాయా మనకే తెలుస్తుంది.

1, మే 2016, ఆదివారం

learn Photoshop Today and Now

ఎవరైనా ఫేస్బుక్ లో ఏదైనా ఫోటో ఫోటోషాప్ లో ఎడిట్ చేసి అద్బుతంగా మలిచి పెడితే వావ్.... అనాలి అనిపిస్తుంది .

ఒక్క సారి ఆలోచించండి మరి మనే అలా ఫొటోస్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని .. అలా ఊహ నే ఎంత బాగుందో కదా .. బాగుంటుంది మరి . మరి


మరి నేన్ ఉన్నదీ ఎందుకు మీకు ఏదైనా నేర్పించడానికే . అందుకో మీకోసం ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ ని youtube లో అప్లోడ్ చేస్తున్నాను . నెమ్మదిగా ఫోటోషాప్ నేర్చుకొని మీరు కూడా ఫొటోస్ ని ఆధారగోట్టేయాలి మరి .అందుకే ఇక్కడ నేన్ ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక్క ప్లే లిస్టు గా మర్చి లింక్ అందిస్తున్నాను . ఒక్కోట్టిగా అన్ని చూసేయండి .. ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి వెంటనే కాక పోయిన ఎప్పటికైనా మీ పోస్ట్ లని చూసి ఇతరులు వావ్ అనేలా ఉంటుంది .

మరి రెడీ నా .. ఇదిగోండి ప్లే లిస్టు లింక్ ..


పోస్ట్ చూసి చదివి .. ఇప్పుడు ఏముంది లే తర్వాత చూద్దాం అని వోదిలేయకండి . అలా అలా సరదాకి ఒకటి రెండు చూడండి మీకే ఆసక్తి వస్తుంది . ఎందుకంటే సరళమైన రీతిలో అందరికి అర్ధం అయ్యేలా వీడియోస్ చేసాను .. ఏమైనా సందేహాలున్న తప్పక సంప్రదించవచ్చు . ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను .. ఒక వేలా చూడడానికి సమయం అనుకరించక పోతే బుక్ మార్క్ అయిన చేసి పెట్టుకోండి . వీలు ఉన్నప్పుడు చూడండి .

వీడియోస్ చూసాక మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయాలి మరి .. వెయిట్ చేస్తా ఉంటాను .. మీ రిప్లై కోసం ..

మీ కర్ణా