8, మే 2016, ఆదివారం

Automatic Disposable Profile Picture in Facebook



ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు, ఆప్షన్స్ వస్తూనేఉన్నాయి.కాని మనం వాటిని చూస్కోనే సరికి చాల సమయం పడుతుంది . అందుకే వాటిని మీరు చూసే వరకు కాకుండా ముందుగానే నేను తెలియజేయధలచాను ఈ విషయం మీకు తెలిసినదే

మరి ఇప్పటి కొత్త ముచ్చట ఏంటంటే

ఫేస్బుక్ లో ఈ మద్యలో ప్రొఫైల్ పిక్ ల పై క్రేజ్ ఎక్కువగా ఉంది . మరి ఇదే సమయం లో పండుగ కావచ్చు మీకు ఇష్టం అయిన టీం మ్యాచ్ కావచ్చు ఇంకా ఏదైనా లిమిటెడ్ సమయం లో ఐపోయే దానికోసం మనం ప్రొఫైల్ పిక్ మారుస్తున్టాము.

ఉదాహరణకు చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం వస్తుంది అనే సమయం లో త్రివర్ణ పతాకాల ప్రొఫైల్ ఫోటో లతో ఫేస్బుక్ కల కల లాడుతుంది. సందర్భం అయిపోగానే మల్లి అవి తీసేసి నచ్చినది పెట్టుకుంటారు


మరి ఇలా ప్రతి సారి ఫోటో లను మార్చుకొనే బదులు అదే లిమిటెడ్ టైం వరకు ఉండి . పని అయిపోగానే ఆటోమేటిక్ గా పాత ప్రొఫైల్ పిక్ గా మారి పోతే ఎంత బాగుంటుందో కదా . మరి ఆ సాధుపాయన్నే ఫేస్బుక్ కల్పింది మీరు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయం లో క్రింద Make Temporary అని ఉంటుంది క్లిక్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఈ ఫోటో ఉండాలి అనేది సెలెక్ట్ చేస్కోవచ్చు ఈ ఫోటో లో చూస్తే అర్ధం అవుతుంది .
ఒక గంట నా ,ఒక రోజా లేదా ఒక వారం ఇంకా ఏదైనా మీకు నచ్చిన డేట్స్ లలోనా

ఇలా సెట్ చేస్కొంటే ఆటోమేటిక్ గా డేట్ మిన్చాగానే మీ ప్రొఫైల్ పిక్ ఆటోమేటిక్ గా మారి పాత ప్రొఫైల్ పిక్ అయిపోతుంది .

లిమిటెడ్ టైం లో ఫొటోస్ పెట్టి తీసేయడం కంటే ఇది చాల బెటర్.. నాకు అయితే చాల ఉపయోగపడింది మరి మీకు ?



www.rktechinfo.com

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి