20, మే 2016, శుక్రవారం

Solutions for avoiding Facebook viruses

ఛి ఛి ఛి ఛి .....

ఛి... అంతగా గలీజ్ తయారైంది.

ఏంటి సడన్ గా ఇలా అన్నాను అనుకుంటున్నారా? అలా ఎం అనుకోరు లే నాకు తెలుసు ఎందుకంటే  మీకు  కనిపిస్తుంది కదా .  ఇంకా బాగా కనిపించాలంటే మీకు ఒక గ్రూప్ ఉంటె కచ్చితంగా కనిపించేది. నేను PC  solutions – karna  గ్రూప్ నడుపుతున్న సంగతి మీకు తెలిసినదే. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఎంటటే మీకు టెక్నాలజీ పరంగా  ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్కోవడానికి , సలహాలు ఉంటె పంచుకోవడానికి చేసాను .

కాని  గ్రూప్ లో రోజుకు యాబై అరవై పోస్ట్  లు పెండింగ్ లో ఉంటున్నాయి అడ్మిన్ అప్రూవల్ కొరకు.

అమ్మో.... అని ఆశ్చర్యపోకండి. అన్నిపెండింగ్ లో ఉంటున్నాయని చూస్తే అందులో  95% శాతం పోస్ట్  లు అన్ని స్పాం లు, గలీజ్ ఫోటోలు ఛి ఛి ఛి .. ఇంట్లో గ్రూప్  పోస్ట్  లు చూడాలంటె బయంగా ఉంది. 100 పోస్ట్  లకి 90 పోస్ట్  లు ఇవే ఉంటున్నాయి ఇంకో ఐదు Advertisement promotion posts  ఇక ఇంపార్టెంట్ వి 5. ఇక అవన్నీ డిలీట్ చేసేసరికి తల ప్రాణం తోక కాస్తుంది . అప్పుడప్పుడు యూసర్ ని బాన్  చేసేస్తున్న ఎం చేయను మరి.
మరి ఇలా వీరు ఎందుకు చేస్తున్నారు అని  కోపం వచ్చి ఇద్దరు ముగ్గిరిని అడిగాను (నాకు తెలుసు అవి వారి ప్రమేయం లేకుండానే పోస్ట్ అవుతున్నాయి అని , కాని ఎప్పుడో మనం చేసిన చిన్న క్లిక్ ఇప్పుడు ఇలా ఎఫెక్ట్  చూపిస్తుంది)  అలా అడిగితే వారి సమాధానం
.. కామన్..
సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని. ( ఈ విషయం మనకి తెలిసిందే )
మరి ఎందుకు అడిగారు అని అనుకుంటారేమో దానికి సంధానం ఉంది నా వద్ద . ఎంటటే వీరు ఇలా స్పాం ,ఫిషింగ్ లకి గురి అయ్యారనేది వీరికి ఎవరో చెప్తే తప్ప తెలియదు . ఆ ఎవరో నేను అవుదామని ..
“సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని.” అన్నవారే ఎక్కువ కానీ , “ అయ్యో దేవుడా ఇలా జరిగిందా . ఎలా మరి ఎం చేయాలి వీటి బారి నుంచి  నన్ను రక్షించండి “ అన్న వారు చాల తక్కువ.  ఇలా అన్నవారే ఫేస్బుక్ ని ఒక మనిషిలా మనసుతో నడుపుతుంటారు. మిగితా వాళ్ళంతా వారి  వారి సరదాలని తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చేసిన పనే ఈ గలీజ్ అంత .
ఇలాంటి సరదా మనుషులకు సరదాక ఒక్క మాట. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండిరా, ఫేస్బుక్ ని కరాబు చేయకండిరా.. మీకోసం సపరేట్ గా వేరే సైట్స్ ఉన్నాయి వాటిని వాడుకోండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతారు.

ఇక పోతే ఈ సమస్య కి గురి అయినా వ్యక్తి చేయవలసిన పనులు.
→ముందుగా ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చేయండి.
→కనిపించిన ప్రతి లింక్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా తెలిసిన వాటిపైనే క్లిక్ చేయండి
→ఫేస్బుక్ లో మనకి తెలియని యాప్స్ ఉంటె తొలగించండి అవే ముప్పు తెచ్చేవి.
(ఫేస్బుక్ లో యాప్స్ తొలగించండి అంటే ఫోన్ లో యాప్ తీసేయాలా ? అని అడుగుతున్నారు . వాళ్ళకోసం కొంచం క్లారిఫికేషన్  . ఫోన్ లో కాదు మిత్రమా ఫేస్బుక్ లో కూడా యాప్స్ ఉంటాయి , అర్ధం కాలేదా ఎప్పుడు మనం ఆడుతుంటాంమే candy crush గేమ్ ఇది కూడా ఒక యాప్ నే సెట్టింగ్స్ లో అప్ప్స్ అనే సెక్షన్ లోకి వెళితే మీరు వాడే అన్ని అప్స్ కనిపిస్తాయి అవసరం లేనివి వెంటనే తొలగిస్తే మంచిది.)
→ కనిపించింది కదా అని లటకున క్లిక్ చేయడం ఆపి ఏదైనా పనికచ్చే పోస్ట్ లు చదవండి .
→ సెక్యూరిటీ సెట్టింగ్స్ ని భలపరుచుకోండి
మీకేమో గాని రోజు ఆ దరిద్రాన్ని చూడలేక చస్తున్నాము.

ఈ మద్యలో ఇంకో వైరస్ కూడా కా కంట పడింది అదేమిటి అంటే మన మిత్రుడు ఏదో గ్రూప్ లో జాయిన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది వెళ్లి చూస్తే ఆ గ్రూప్ లో పోస్ట్ కి అర్హత ఉండదు. ఆ గ్రూప్ కూడా తయారు చేసి  కొన్ని గంటలే  అయి ఉంటుంది . మెంబెర్స్ చూస్తే వేయిలకు వెయిలు. తీర మిత్రుడిని అడిగితే అదే జవాబు .. నాకు తెలియదు .

ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్పితే అర్ధం కాదు . అలాంటి జోలికి మనం వెళ్ళనంత వరకు మనం సురక్షితంగా ఫేస్బుక్ లో ఉంటాము. ఒక్క సారి వాటి భారిన పడినారో కోలుకోవడానికి చాల సమయం పడుతుంది . ఈ వైరస్ పని ఏంటంటే మీరు ఎన్ని సార్లు లాగిన్ చేస్తే అన్ని సార్లు మీ పేరుతో గ్రూప్ లలో గలీజ్ పోస్ట్ లు చేస్తుంది అది చూసి ఇంకొకతను క్లిక్ చేస్తాడు అతని పని కూడా ఇలాగే అవుతుంది .
కావున ఇకనైనా జాగ్రత్త తీస్కోని . పేరు ను కాపాడుకోండి.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి