13, జనవరి 2015, మంగళవారం

1,00,000 views video .. How to change dress color in Photoshop

నా అభిమాన మిత్రులందరికీ ధన్యవాదాలు.

 నేన్ గత ఏడాది కింద చేసిన డ్రెస్ కలర్ చేంజ్ వీడియో ఇప్పటికి 1,00,000 వ్యూస్ ని సాధించింది. దీనంతటికి కారణం మీరే . నాకు చాల సంతోషంగా ఉంది . మీ సహకారం తో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు పేరు పేరునా ధన్యవాదాలు.

video link : http://bit.ly/HSdresscolor

ఈ సందర్బంగా మీకొక నిజం చెప్పదలుచుకున్నాను .

నేను YouTube లో మొదటగా ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని టెక్నికల్ వీడియోస్ పోస్ట్ చేసాను .. కాని ఆ వీడియో ఛానల్ యుఆర్ఎల్ బాలేకపోవడం వలన కొత్తగా ఇంకో ఛానల్ తెరిచాను
రెండు ఛానల్ లు క్రియేట్ చేసాను అదే www.youtube.com/rayarakula అప్పటికే నా మొదటి ఛానల్ లో ఉన్న వీడియోస్ చాల మంది చూసేసారు . అందుకని అందులో ఉన్న వీడియోస్ వొదిలేసి కొత్త వీడియోస్ ని తయారు చేస్తూ ఈ ఛానల్ లో పెట్టేస్తూ వచ్చేసాను.

రాయరాకుల ఛానల్ కి కూడా మంచి రేస్పోన్స్ వచ్చింది . అనుస్క్రిప్ట్ మేనేజర్ పై నేన్ చేసిన వీడియో కి దాదాపు 10,000+ పైగా వ్యూస్ ఉండడం వలన కాల్స్ కూడా బానే వస్తున్నాయి.

అప్పటికే పాత ఛానల్ ఉన్న ఈ వీడియో కి చాల వ్యూస్ వచ్చేసి ఇప్పటికి లక్ష వ్యూస్ కి చేరుకున్నది. కాని ఆ ఛానల్ లో ఇక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు కావున ఆ ఒక్క వీడియో కి ఉన్న వ్యూస్ కోసం ఆ వీడియో ని అలాగే ఉంచేశాను .

ఇది నా YouTube తతాంగం .

మరొకసారి నా మిత్రులకు , వీక్షకులకు , అభిమానులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు  
(ఇమేజ్ : లక్ష వ్యూస్  కి చేరుకున్న వీడియో స్క్రీన్ షాట్)

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి