31, డిసెంబర్ 2016, శనివారం

How to Add Colorful Background to Facebook Status


EnglishVersion

How to Add Colorful Background to Facebook Status


 కొత్త సంవత్సరం సందర్బంగా కొత్తగా పోస్ట్ చేయండి . ముందుగా
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
 మీ ఫేస్బుక్ లో మీ విషెస్ ని బాక్గ్రౌండ్ కలర్స్ తో పోస్ట్ చేయండి. ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసే స్టేటస్ బాక్గ్రౌండ్ లో కొంచం కలర్స్ ని అమర్చి పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా మీ  స్టేటస్ ని అప్డేట్ చేయండి . ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో చూస్తే మీకు కొంచం అర్ధం అయ్యే ఉంటుంది. మరి అలా అద్బుతంగా పోస్ట్ చేస్కొనే అవకాశాన్ని మనకి కొత్త సంవత్సరం సందర్బంగా ఫేస్బుక్ అందించింది.
మరి అది ఎలా పోస్ట్ చేయాలి ఎం చేయాలి అని ఆలోచిస్తున్నారా . నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి ఈ క్రింది వీడియో చూసి తెలిసుకొని పోస్ట్ చేయండి ..

నాకు చెప్పడం మరవకండి మిత్రమా

28, డిసెంబర్ 2016, బుధవారం

How can I find a list of My Facebook Groups & Control notifications





 How can I find a list of My Facebook Groups 
& Control notifications 



ఫేస్బుక్ లో మనకు తెలియకుండానే మన మిత్రులు తమ తమ గ్రూప్ లలో మనల్ని ఆడ్ చేస్తా ఉంటారు. అలాగే మనం కూడా కొన్ని గ్రూప్ లలో జాయిన్ అవుతాము. మనకి మనం ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యమో ఖచ్చితమైన సంఖ్య కూడా తెలిసి ఉండదు. అలాగే  గ్రూప్స్  నుంచి  నోటిఫికేషన్స్ విపరీతంగా వస్తా ఉంటాయి. ఇబ్బంది కూడా కలుగుతుంది. అందుకే మనం ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యాము, అలాగే ఆ గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఎలా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది మేరు ఎన్ని గ్రూప్ లలో జాయిన్ అయ్యారో వాటినుంచి వచ్చే నోటిఫికేషన్ లను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోవాలంటే  ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే . ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు .



Video link : Click Here






27, డిసెంబర్ 2016, మంగళవారం

Telegram Channel for us

                     కంప్యూటర్స్ & టెక్నాలజీ 

మిత్రులందరికీ నమస్కారం.


మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది. 
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.

• ఫేస్బుక్ పేజి
• ఫేస్బుక్ గ్రూప్
• పర్సనల్ ఎకౌంటు
• వాట్స్ యాప్ 
• hike టైంలైన్
• బ్లాగ్
• వెబ్సైటు
• YouTube
టెలిగ్రాం అప్లికేషను  డౌన్లోడ్  చేస్కోనుటకు  లింక్ : https://telegram.org/

ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.


(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే ఇందులో 
→ నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. 

→ ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్ ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ , వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట

→ టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.

→ ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు. లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.

→ ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.

→ ఛానల్లో మ్యూట్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.

→ చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.

→ మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.

→ ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)

15, డిసెంబర్ 2016, గురువారం

Kalthi In Pathanjali Products

పతంజలి ప్రోడక్ట్ లలో కల్తీ విపరీతంగా జరుగుతుందంట..

కావున పతంజలి ప్రోడక్ట్ లు వాడే ముందు కొంత జాగ్రత్తలు పాటించండి

పతంజలి కారం లో ఇటుక సూరా కల్తి జరుగుతుందట.. నీట్లో కారం వేసినపుడు కారం తెలియాదకుండా నీటి అడుగుకి చేరితే అది కల్తీ జరిగిందని గమనించవచ్చు .

అలాగే ఉప్పులో సుద్ధ(ముగ్గు ) కల్తీ జరుగుతుందట .. నీటిలో కలిపితే నీరు తెలుపు రంగులోకి వచ్చి అడుగున ఏదైనా పదార్థం మిగిలితే కల్తీనే .. ఉప్పు అయితే కరిగి పోయి నీటి రంగులో ఎలాంటి మార్పులు ఉండవు .

ఇక పోతే తేనె తేనెలో బెల్లం కల్తీ.. తేనెని నీటిలో వేస్తే నీటితో కలిసి పోతే . కల్తీ అలాగే తేనెలో పత్తి (వత్తి) ని ముంచి అగ్గి పుల్లతో నిప్పు అన్తిచినపుడు అంటుకొని మంట మండితే అది నిజమైనా తేనె లేదా కల్తీ.. కావున మిత్రులారా .. జాగ్రత్త పాటించండి ..

నాకు చెప్పే వారు లేక పోసపోయాను .. మీకు చెప్పడానికి నేను ఉన్నాను కావున జాగ్రత్తగా ఉండండి ..

వి6 తీన్మార్ న్యూస్ లో చూసిన వెంటనే పోస్ట్ చేస్తున్నాను
    

14, డిసెంబర్ 2016, బుధవారం

Take care About Install Application

eనాడు సౌజన్యంతో.... 
ఆప్‌ ఎంపికలో...
గూగుల్‌ ప్లేని రోజూ ఓపెన్‌ చేస్తాం...ఆప్స్‌ చూస్తాం... ఇన్‌స్టాల్‌ చేస్తాం...కానీ, ఎలాంటివి డౌన్‌లోడ్‌ చేస్తున్నాం? సరైన ఆప్స్‌ ఎంపికలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం?ఎప్పుడైనా ఆలోచించారా?
ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే చాలు. అవసరం ఏదైనా గూగుల్‌ ప్లేలోకి వెళ్లి ఆప్‌ కోసం వెతుకులాటే. ఒకటా... రెండా... లెక్కకు మిక్కిలి ఆప్స్‌. ఒకే అవసరానికి వందల సంఖ్యలో కనిపిస్తాయి. అన్నింటినీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటూ వెళ్తే! ఫోన్‌ మెమొరీ ఖాళీనే! మరైతే వాటిల్లో ఏది సరైన ఆప్‌? ఎంపిక చేయడం ఓ కళే! ఇవిగోండి కొన్ని చిట్కాలు!
మీకు సరిపడేవి... 
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని ఎప్పటి నుంచో వాడుతున్నారా? అయితే, ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌తో ఆప్స్‌ లైబ్రరీ క్రియేట్‌ అవుతుంది. దీంతో మీరెప్పుడు గూగుల్‌ ప్లేలోకి వెళ్లినా హోం స్క్రీన్‌లోని Apps & Games విభాగంలో Recommended for You జాబితా కనిపిస్తుంది. ముందు వాటిపై ఓ కన్నేయండి. ఎందుకంటే ఇన్‌స్టాల్‌ చేసిన ఆప్స్‌ ఆధారంగా మీ అభిరుచికి సరిపడే వాటిని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. అంతేకాదు... గూగుల్‌ ప్లస్‌లో మీ స్నేహితులు వాడుతున్న ఆప్స్‌ ట్రాక్‌ అయ్యి రికమండేషన్స్‌లోనే కనిపిస్తాయి.
ఇంకా ఏమున్నాయి... 
ఆప్‌ని సెలెక్ట్‌ చేసి వెంటనే ఇన్‌స్టాల్‌ చేయడం మామూలే! కానీ, ఎంపిక చేసిన ఆప్‌ లాంటివి ఇంకా ఏమున్నాయో ఓ మారు బ్రౌజ్‌ చేసి చూద్దాం అనుకుంటే? Similar apps సెక్షన్‌లో చూడండి. రేటింగ్‌ ఆధారంగా మీరు సెలెక్ట్‌ చేసిన ఆప్స్‌ ఇంకా ఏమేం ఉన్నాయో చెక్‌ చేసి చూడొచ్చు.
ఇతరులు వాడేవేంటి? 
మీ అవసరానికి తగిన ఆప్‌ని ఎంపిక చేశారు. వెంటనే ఇన్‌స్టాల్‌ చేయకుండా ఇతరులు ఏమేం వాడుతున్నారో చూడండి. అందుకు ఏం చేయాలంటే... ఆప్‌ని ఎంపిక చేశాక కిందికి స్క్రోల్‌ చేయండి. users also installed సెక్షన్‌ కనిపిస్తుంది. దాంట్లో మీరు సెలెక్ట్‌ చేసిన ఆప్‌ని అప్పటికే వాడుతున్న యూజర్లు... ఇంకా ఏమేం ఆప్స్‌ వాడుతున్నారో చూడొచ్చు. వాటి రేటింగ్‌ ఆధారంగా ఆయా ఆప్స్‌ ప్రయోజనాన్ని అంచనా వేయవచ్చు.
రివ్యూలు... రేటింగ్‌లు 
సెలెక్ట్‌ చేసిన ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసే ముందు ఆప్‌కి ఉన్న ఆదరణని విశ్లేషించండి. కొన్ని రివ్యూలను నిశితంగా పరిశీలించాలి. తర్వాత ఆప్‌కి స్టార్‌లతో ఇచ్చిన రేటింగ్‌ని చూడండి. నాలుగు స్టార్‌ల పైనే రేటింగ్‌ ఉంటే ప్రయత్నించొచ్చు. మూడు స్టార్‌ల కంటే తక్కువ ఉంటే ఒకటికి రెండు సార్లు పరిశీలించాల్సిందే. అలాగే, రివ్యూ ఎంత మంది రాశారో చెక్‌ చేయడంతో పాటు... డౌన్‌లోడ్స్‌ సంఖ్యని పరిశీలించండి.
డెవలపర్‌ ఆప్స్‌... 
మీరొక ఆప్‌ని ఎప్పటి నుంచో వాడుతున్నారు. దాన్ని రూపొందించిన డెవలపర్‌ ఇంకా ఏమేం ఆప్స్‌ అందిస్తున్నారో బ్రౌజ్‌ చేద్దాం అనుకుంటే? ఉదాహరణకు ఫేస్‌బుక్‌ వాడుతున్నారు... ఆ కంపెనీ డెవలపర్స్‌ అందించే మరిన్ని ఆప్‌లను బ్రౌజ్‌ చేయడానికి గూగుల్‌ ప్లేలో ఫేస్‌బుక్‌ ఆప్‌ని సెలెక్ట్‌ చేసి కిందికి స్క్రోల్‌ చేస్తే More by Facebook సెక్షన్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేస్తే ఫేస్‌బుక్‌ అందించే మొత్తం ఆప్స్‌ జాబితా వస్తుంది.
అప్‌డేట్‌ ఎప్పుడో? 
ఎంపిక చేసుకున్న ఆప్‌ని ఎప్పుడు ఆప్‌డేట్‌ చేశారో చెక్‌ చేయండి. అందుకు ఆప్‌ని సెలెక్ట్‌ చేశాక More లోకి వెళ్లండి. ఆప్‌కి సంబంధించిన సమాచారంతో పాటు What's New బాక్స్‌లో కొత్తగా ఏం అప్‌డేట్‌ చేశారో చూడొచ్చు. దాని కిందే ఆప్‌ వెర్షన్‌తో పాటు... ఏ తేదీన అప్‌డేట్‌ చేశారో చెక్‌ చేయవచ్చు. ఒకవేళ ఆప్‌ని కొన్ని సంవత్సరాల ముందు నుంచి అప్‌డేట్‌ చేయకుండా ఉన్నట్లయితే ఇన్‌స్టాల్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అప్‌డేట్‌ లేని ఆప్‌తో వైరస్‌లు ఫోన్‌లోకి సులువుగా ప్రవేశిస్తాయని గ్రహించాలి.
ఎడిటర్‌ ఛాయిస్‌... 
గూగుల్‌ ప్లే నిర్వాహకులు నిత్యం ఆప్స్‌ని మానిటర్‌ చేస్తూ ఎక్కువ ఆదరణ పొందిన, ఆసక్తికరమైన వాటిని ప్రత్యేకంగా హైలైట్‌ చేసి అందిస్తున్నారు. వాటిని Editors' Choice సెక్షన్‌లో చూడొచ్చు. గేమ్స్‌, ఆప్స్‌ అన్నీ కలగలుపుగా ఉంటాయి. నచ్చిన వాటిని ఎలాంటి సందేహం లేకుండా ఇన్‌స్టాల్‌ చేసి వాడుకోవచ్చు.
విభాగాల వారీగా... 
వివిధ రంగాలకు సరిపడే ఆప్స్‌ని బ్రౌజ్‌ చేద్దాం అనుకుంటే Categories మెనూలోకి వెళ్లండి. ‘టాప్‌ కేటగిరీస్‌’లో ఫొటోగ్రఫీ, ఫ్యామిలీ, మ్యూజిక్‌, షాపింగ్‌... లాంటివి ఐకాన్‌ గుర్తులతో కనిపిస్తాయి. మరిన్ని రంగాల్ని వెతికేందుకు all Categories సెలెక్ట్‌ చేయండి.
టాప్‌’ జాబితా... 
ఎక్కువగా ఆదరణ పొందిన ఆప్స్‌ని విభాగాల వారీగా Top Charts సెక్షన్‌లో పొందొచ్చు.