27, జులై 2016, బుధవారం

Android Operating System for PC (virtual Machine)

మీ విండోస్ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఇంస్టాల్ చేసుకోవచ్చని తెలుసా...

అది కూడా విండోస్_లో ఏ ఒక్క చిన్న సెట్టింగ్ కూడా మార్పు చేయకుండా! నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇంస్టాల్ చేసుకున్నాను... బాగానే వర్క్ చేస్తోంది.

కానీ వైఫై, బ్లూటూత్ వంటి కొన్ని ఫీచర్లు వర్క్ చేయకపోవచ్చు. మీరూ ప్రయత్నించి చూడండి...

వింటుంటే ఇదేదో క్లిష్టతరమైనదిలాగా అనిపించవచ్చు కాని చాలా చాలా ఈజీ. ముందుగా ఈ రెండు సాఫ్టువేర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు:-




నెక్స్ట్ ఈ ట్యుటోరియల్ వీడియో ఫాలో
అవ్వండి:-

watch this video (వీడియోలో వర్చువల్ మెషీన్ సెట్టింగ్స్_లో 2జీబీ ర్యామ్, సౌండ్ కార్డ్ రిమూవ్ చేయడం చేసారు కాని సౌండ్ కార్డ్ రిమూవ్ చేస్తే ఆండ్రాయిడ్ నుంచి సౌండ్ రాదు కనుక ఆ స్టెప్ స్కిప్ చేయండి, అలాగే ర్యామ్ 2జీబీకి సెట్ చేయడం చూపించారు బట్ మీ సిస్టంలో ర్యామ్ కనీసం 4జీబీ ఉన్నప్పుడే అలా 2జీబీ సెట్ చేయాలి.

లేదా మీ సిస్టమ్ కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే కలిగి ఉన్నట్లైతే వర్చువల్ మెషీన్_లో ర్యామ్ 512ఎంబీ మాత్రమే సెట్ చేయాలనేది గుర్తించగలరు. అలాగే నెట్వర్క్ అడాప్టర్ వద్ద bridged సెలెక్ట్ చేయడం చూపించారు.

ఒకవేళ ఆండ్రాయిడ్_లో నెట్ రాకపోతే bridged కాకుండా NAT ట్రై చేసి చూడండి.


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి