30, ఆగస్టు 2015, ఆదివారం

E-mail founder

ఈమెయిల్ను కనుగొన్నది ఎవరో తెలుసా?

వాషింగ్టన్ : ఈమెయిల్ను ఎవరు కనుగొన్నారో తెలుసా.. భారతీయుడే!! అవును.. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్ను తొలిసారిగా 32 ఏళ్ల క్రితం కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు. అప్పట్లో న్యూజెర్సీలోని లివింగ్టన్ హైస్కూల్లో చదువుకొంటున్న అయ్యదురై.. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ కోసం ఈ మెయిల్ను కనుగొనేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు.
వాస్తవానికి ఆయన 1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అయితే 1982లో దానికి కాపీరైట్ లభించింది. ఆ సమయంలో కాపీరైట్ పేటెంటు హక్కుతో సమానం. సాఫ్ట్వేర్ ఆవిష్కరణలను రక్షించుకోడానికి అంతకంటే మార్గం ఉండేది కాదు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 1981లో అయ్యదురైకి వెస్టింగ్హౌస్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డు లభించింది. అయితే.. ఆయనే ఈమెయిల్ను కనుగొన్నా.. కంప్యూటర్ చరిత్రలో మాత్రం వేరేవాళ్లు కూడా తామే కనుగొన్నట్లు చెబుతుండటంతో కొంత వివాదం ఏర్పడి ఆయన పేరు పెద్దగా బయటకు రాలేదు.

23, ఆగస్టు 2015, ఆదివారం

Edit TSPSC OTR form

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ లను పొందుటకు మరియు అప్లై చేయుటకు ముందుగా ONE TIME REGISTRATION చేస్కోవాలని ఇదివరకే తెలుసుకున్నాము .. 

మరి ఇలా రిజిస్ట్రేషన్ చేస్కొన్న తర్వాత ఏదైనా ఎడిట్ చేయాల్సి వస్తే ఉదాహరణకు QUALIFICATION పెరిగిన , ఏవైనా డీటెయిల్స్ తప్పుగా ఇచ్చిన .. 

మార్చాల్సి వస్తే ఈ క్రింది లింక్ నుంచి మార్చుకోవచ్చు .. 
http://bit.ly/OTRedit

మీ రిఫరెన్స్ ID మరి డేట్ ఆఫ్ బర్త్ కొట్టి లాగిన్ అయి ఎడిట్ ఏమైనా ఉంటె చేస్కోవచ్చును .

ఈ విలువైన సమాచారాన్ని అందరికి షేర్ చేయగలరు 

15, ఆగస్టు 2015, శనివారం

Solutions for Windows 10 Resolutions Problems

విండోస్ 8 ,8.1 లేదా 10 లో కావచ్చు  ఆపరేటింగ్ సిస్టం మన డెస్క్టాపు సిస్టం లో వేస్కోన్నప్పుడు  మన స్క్రీన్ కరెక్ట్  రెసొల్యూషన్ రాక పోవచ్చు  . అంటే  ఉదాహరణకు మన స్క్రీన్ రెసొల్యూషన్ 1366X768 అయితే ఆపరేటింగ్ సిస్టం వేస్కోన్నపుడు మన స్క్రీన్ Resolution డిఫాల్ట్ గా  1024 × 768 లేదా 1280x720 ఇలా వచ్చేస్తుంది.  మన స్క్రీన్ ఎంత పెద్దది అయినప్పటికీ అంటే 1920x1080 ఐనప్పటికీ డిఫాల్ట్ గా 1024x768 మాత్రమే వస్తుంది .. అంతకు ముందు ఉన్న ఆపరేటింగ్ సిస్టం లో కరెక్ట్ గానే ఉన్న కొత్త వెర్షన్ వచ్చేసరికి ఇలా అయ్యే అవకాశం ఉంది .

మరి ఇలాంటి సమయం లో ఎం చేయాలి అంటే

My Computer కి రైట్ క్లిక్ చేసి Manage లోకి వెళ్ళాలి , అక్కడ
Device Manager >> Display Adapters >> ఇందులో ఉన్న డ్రైవర్ కి రైట్ క్లిక్ చేసి అప్డేట్ పై క్లిక్ చేయాలి ఇలా చేయడం ద్వార అది నెట్ కి కనెక్ట్ అయి అప్డేటెడ్ డ్రైవర్స్ ని ఫౌండ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది .


ఇన్స్టాల్ అయిన వెంటనే మనకి కావలసిన Resolution అక్కడ ప్రత్యక్షమౌతుంది.

నోట్ : అంటే అందరికి ఇలా అవుతుంది అని కాదు .. ఓల్డ్ మదర్ బోర్డు వాడే వారికి అయ్యే అవకాశం ఉంది . మరి వారు సరైనా రెసొల్యూషన్ రావట్లేదని మల్లి పాత వెర్షన్ కి కన్వేర్ట్ కాకుండా సరైనా సొల్యూషన్ ఇది .

మరేమైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి లేదా నాకు కాల్ చేయగలరు.. తప్పక సమాధానం ఇస్తాను .

9014819428

1, ఆగస్టు 2015, శనివారం

Type Telugu in Apple Keyboard Layout

గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు టైపు చేయడం మనం ఇది వరకే నేర్చుకున్నాము ఇప్పుడు అలానే టైపు చేస్తున్నాం .. 

కాని కొంత మంది ఆపిల్ (కీబోర్డ్ లేఔట్) లో టైపు చేసి అలవాటు అయి ఉంటారు. అంటే మగజైన్ , పేపర్ , advertisement మొదలగునవి , చేసే వాళ్ళకి ఆపిల్ పై పట్టు ఉంటుంది. మరి డైరెక్ట్ గా అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి డైరెక్ట్ గా ఫేస్బుక్ లో టైపు చేయలేము. 

మరి ఆపిల్ లోనే డైరెక్ట్ గా ఫేస్బుక్ , జిమెయిల్ ఎక్కడైనా సరే ఈజీ గా టైపు చేయుటకు ఈ క్రింది లింక్ నుంచి అప్లికేషను డౌన్లోడ్ చేస్కోగలరు . 

link : http://bit.ly/HSte_apple

జస్ట్ దాంట్లో ఉన్న సెటప్ ఫైల్ ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ వలె టూల్ బార్ పై ఐకాన్ వస్తుంది.

గూగుల్ ఇన్పుట్ టూల్స్ గురించి తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : www.bit.ly/HSteGIT

ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

Banner Creation Using Photoshop

చాల మంది అడుగుతుంటారు . ఒక ఈవెంట్ కి బ్యానర్ , ఫ్లెక్స్ లాంటివి ఫోటోషాప్ లో ఎలా తయారుచేయాలి అని. అవూ మరి బ్యానర్ కాని ఫ్లెక్స్ కాని ఫోటోషాప్ లో డిజైన్ చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి అంతే కాక కొన్ని జాగ్రతలు పాటించాలి అనే విషయాలను మీకు తెలియపరుచుటకు ఈ వీడియో చేయడం జరిగింది .. 
వీడియో లింక్ : http://www.bit.ly/HSbanner 
తప్పక అందరు చూడగలరు .
అదే విధంగా ఎవరి టాలెంట్ వారిది ఎవరి knowledge వారిది .. అలాగే ఎవరి క్రియేటివ్ థాట్ వారిది .. కావున బ్యానర్ క్రియేషన్ లో ఎలా చేయాలి అనేది వారి వారి ఆలోచనల పై ఆధారపడి ఉంటుంది . అంతే కాని ఒకరి చెప్పినట్లుగా చేస్తే అది మన క్రియేషన్ గా గుర్తించబడదు. ఇక పోతే ఫోటోషాప్ టూల్స్ గురించి చెప్పిన వీడియో ఆధారంగా మిగితా డిజైన్ అంత మనం చేస్కోవచ్చు .

ఫోటోషాప్ టూల్స్ పార్ట్ 1 : http://bit.ly/HSPStools
ఫోటోషాప్ టూల్స్ పార్ట్ 2 : http://bit.ly/HSPStools2 

ఈ వీడియో లపై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె తప్పక తెలియజేయగలరు.
మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని Subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula 
మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల  కోసం మా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు : www.heerasolutions.blogspot.com 
మా అప్డేట్ లను ఫేస్బుక్ లో పొందుటకు మా పేజి ని లైక్ చేయగలరు : www.fb.com/heerasolutions 
మీ కంప్యూటర్ లో ఏమైనా సందేహాలు ఉంటె మా గ్రూప్ లో ప్రాబ్లం ని స్క్రీన్ షాట్ జత చేసి పోస్ట్ చేయగలరు . మీకు తప్పక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది 
గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్ 
9014819428