6, మే 2015, బుధవారం

voter , aadhar seedingత్వరగా ఓటర్ అండ్ ఆదార్ అనుసంధానం చేయండి .. 

బోగస్ ఓట్లని ఏరివేసే క్రమంలో భాగంగా ఎలక్షన్ కమీషన్ వారు మన ఓటర్ ఐడిని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసే పనికి పూనుకున్నారు. వెంటనే మీ ఓటర్ ఐడిని కింద వివరించిన విధంగా మీ ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా మీ ఓటు హక్కు పొరబాటున కూడా కోల్పోకుండా కాపాడుకోండి.
http://164.100.132.184/epic/SelfSeeding.jsp


పై లింక్ మీద క్లిక్ చేస్తే పోస్టర్ లో చూపినట్టు కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వోటర్ కార్డు నంబరు, ఆధార్ నంబర్ & సెల్ ఫోన్ నంబర్ రాసి "generate OTP" మీద క్లిక్ చెయ్యాలి. అప్పుడు వెంటనే ఆ సెల్ ఫోన్ కి GHMC నుండి ఒక కోడ్ మెస్సేజ్ లో వస్తుంది. ఈ కోడ్ ని కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చే తరువాతి పేజీ లో అడిగిన చోట రాసి అదే పేజీ లో కింద కనిపించే "Validate" మీద క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీ ఆధార్ వివరాలు మరియు వోటర్ కార్డ్ పూర్తి వివరాలు తెలుపుతూ ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. వివరాలు సరి చూసుకుని. చివరన ఉన్న "seed" మీద క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీకు ఆకుపచ్చ రంగు తో కన్ఫర్మేషన్ మెస్సేజ్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఇక ఆ క్షణం నుండి మీ వోటు హక్కు నూటికి నూరు శాతం పదిలపరుచబడింది అని అర్ధం చేసుకోవచ్చు. ఈ ఉపయోగకర సమాచారం మరికొందరికి తెలుపడం కోసం ఈ పోస్టర్ ని Share చెయ్యడం మర్చిపోకండి.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి