14, ఏప్రిల్ 2015, మంగళవారం

Telangana State Public Service Commission Registration

నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణా లో వచ్చే రెండేళ్ళలో లక్షల్లో ఉద్యోగాలు భర్తి 

అరచేతిలో ఉద్యోగాల వివరాలు

నమోదు కొసం ప్రత్యేకంగా టీ ఎస్ పీ ఎస్సీ వెబ్ సైట్ 
- ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే చాలు
- సమాచారమంతా మొబైల్ ఫోన్‌లో
- దరఖాస్తు నుంచి హాల్‌టికెట్ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే
- ప్రతి ఒక్కరికి వన్‌టైం రిజిస్ట్రేషన్
- టీఎస్‌పీఎస్సీ అధునాతన సౌకర్యం
ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి తన పేరు, ఊరు, జిల్లా వంటి వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు తెలుపుతూ.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేస్కోవాలి. వారికి వన్‌టైం రిజిస్ట్రేషన్ మొబైల్‌కు పంపిస్తారు. ఈ వన్‌టైం రిజిస్ట్రేషన్ నెంబర్ నిరుద్యోగి వ్యక్తిగతంగా ఉంటుంది.  దాని ఆధారంగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకొన్న నిరుద్యోగ అభ్యర్థి తన విద్యార్హతల ప్రకారం ఏ ఉద్యోగానికి సరిపోతాడో తేల్చుకుంటారు. ఈ మేరకు దరఖాస్తు చేస్తూ.. వ్యక్తిగత వివరాలను వన్‌టైం రిజిస్ట్రేషన్ నెంబర్  సహాయంతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయవచ్చు. అందుకోసం సర్వీస్ కమిషన్ సూచించిన పరీక్ష ఫీజులు చెల్లించిన వెంటనే, పరీక్ష కేంద్రంతో సహా హాల్‌టిక్కెట్ జనరేట్ అవుతుంది. దానిని నేరుగా విద్యార్థి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు.

One time Registration  Link : http://bit.ly/tspscOTR

Website link : http://www.tspsc.gov.in/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.youtube.com/rayarakula

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి