25, ఆగస్టు 2014, సోమవారం

అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని కొన్ని ట్రిక్స్
నేను అనుస్క్రిప్ట్ మేనేజర్ పై చేసిన వీడియో ను చాల మంది చూసారు . చాల మంది కాల్ కూడా చేసారు .. నాకు చాల సంతోషంగా ఉంది . 

అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో నేను రోమిక్ కీబోర్డ్ ని ఉపయోగంచి ఎ విధంగా టైపు చేయాలి అని చెప్పను .. కాని ఈ రోమిక్ కీబోర్డ్ లో కొన్ని లోపాలుకుడా ఉన్నాయి .. 
ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చిన వాటిలో 

ఐత్వం ఏ విధంగా ఇవ్వాలన్నది (రైల్వే లో ర కు ఇచ్చిన గుణింతం) 
అదే విధంగా క్ష ఎలా టైపు చేయాలనేది 
→ ho
అంటే హో ఇలా వస్తుంది కాని నాకు హో అంటే ఇలా కాదు ఓత్వం ఉండాలనేది .
అరసున్నా ఎలా రాయాలి .. ?

ఇవి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను 

ఐత్వం ఇవ్వటానికి డైరెక్ట్ బటన్ రోమిక్ కేయ్పాడ్ లో లేదు కాని ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఎత్వం ఇచ్చి ఆ తర్వాత షిఫ్ట్ 8 (*) కొడితే ఐత్వం గా వస్తుంది కాని అంత పర్ఫెక్ట్ గా అనిపించక పోవచ్చు .. ఇక ఆపిల్ కీబోర్డ్ లో అయితే డైరెక్ట్ బటన్ ఉంది అక్షరం రాసాక [ (బిగ్ బ్రాకెట్) ఇస్తే చాలు ఐత్వం వస్తుంది కింది ఇమేజ్ లో అది మీరు గమనించవచ్చు ..

ఇక క్ష అక్షరానికి వస్తే నాకు తెలిసినంతవరకు రోమిక్ కీబోర్డ్ లో క్ష అక్షరం ఇవ్వడం జరగలేదు. సో అందుకోసం అని ఆపిల్ కీబోర్డ్ లో నే చేయడం బెటర్ .. ఆపిల్ కీబోర్డ్ లో Y (కాపిటల్) క్ష వచ్చేస్తుంది .

ప్రస్తుత కాలం లో తెలుగులో కొన్ని అక్షరాలను మార్చుట వలన హో అనునది ఇలా అయి పోయింది. కాని దీనిని కూడా ఓత్వం గానే పలుకుతాము . అయినా మనకి పాత ఓత్వంనే కావాలనుకుంటే అది కూడా సాధ్యమవుతుంది ఎలా అంటే ముందుగా హ రాసి ఆ తర్వాత ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఓత్వం ఇచ్చి ఆ తర్వాత లెఫ్ట్ ఆరో ప్రెస్ చేసి backspace బటన్ ప్రెస్ చేయాలి అప్పుడు ఆ అక్షరం డిలీట్ అయి ఓత్వం అనేది ముందటి అక్షరం మీదకి వస్తది. సో అల మనం తృప్తి పొందవచ్చు .
ఇది చాల సింపుల్ మన రోమ కీబోర్డ్ లోనే $ (షిఫ్ట్ 4) ఇది కొడితే సింపుల్ గా మనకి అర సున్నా వస్తుంది సో మనం పద్యాలూ రాస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు .


ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె తెలియజేయగలరు .. నేన్ తప్పక సమాదానం ఇస్తాను .. త్వరలో ఈ టాపిక్ పై వీడియో చేస్తాను. కాని మరి వీటికే కాకుండా ఉన్న అను స్క్రిప్ట్ మేనేజర్ లో రోమిక్ లో వచ్చే ప్రొబ్లెంస్ అన్నింటిని  చేద్దాం అనుకుంటున్నా .. మీరు ఎంత తొందరా అయితే అంత తొందరగా సమస్యలను నా దృష్టికి తీసుక రండి. ఇతరులకు సహాయం చేద్దాం.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి