GROUP II HALL TICKET DOWNLOAD
► తెలంగాణలో 1,032 గ్రూప్-2 పోస్టులకు ఈనెల 11,13 తేదీల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టులకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈనెల 11,13 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, పేపర్-3, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2, పేపర్-4 రాతపరీక్షలు జరుగుతాయి. గ్రూప్-2 రాతపరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-2 అభ్యర్థులకు సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సూచనలు విడుదల చేసింది. అభ్యర్థులు బూట్లు తొడుక్కొని పరీక్షా కేంద్రాల్లోకి హాజరుకావొద్దని కోరింది. బూట్లతోపాటు నగలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించి రాకూడదని సూచించింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటుపుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ ఇన్‌స్ట్రుమెంట్లు వంటివి పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావొద్దని తెలిపింది.
► అభ్యర్థులు చేతివేళ్లపైన గోరింటాకు (మెహిందీ), ఇంక్ వంటివి లేకుండా రావాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని తెలిపింది. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం జరిగే పరీక్షకు 8.15 గంటలకు ద్వారం (గేటు) తెరుస్తారని 9.45 గంటలకు మూసివేస్తారని తెలిపింది. మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1.15 గంటల నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారని పేర్కొంది. ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని, గేట్లు మూసివేయబడతాయని తెలిపింది. తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, ఫొటో తీసుకుంటామని పేర్కొంది. ఆ వివరాలను టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తామని తెలిపింది. ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరుకాకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ప్రశ్నాపత్రం బుక్‌లెట్ కవర్‌లోనే ఓఎంఆర్ ఉంటుందని తెలిపింది. ప్రశ్నాపత్రం సీల్‌కు ఇబ్బంది కలగకుండా ఓఎంఆర్‌ను తీసుకోవాలని సూచించింది. గంట మోగడం లేదా ప్రకటన చేసిన తర్వాతే ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ను విప్పాలని కోరింది. ప్రశ్నాపత్రం బుక్‌లెట్ కోడ్ 7 నెంబర్లతో ఉంటుందని, బుక్‌లెట్ సిరీస్ కోడ్ రెండు డిజిట్లు (ఏబీ, బీసీ, సీడీ, డీఏ) ఉంటుందని, ఓఎంఆర్ జవాబు పత్రం7 నెండర్లతో ఉంటుందని తెలిపింది.
► ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలని సూచించింది. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తామని పేర్కొంది. ఒరిజినల్ ఓఎంఆర్ పత్రంతో పరీక్షా కేంద్రం బయటికెళ్తే ఆ అభ్యర్థిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సంప్రదించాలని కోరింది.
To Download Your
పై లింక్ పై క్లిక్ చేసి మీ TSPSC OTR (one time registration) నెంబర్ ని ఎంటర్ చేసి అలాగే డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేసి గో అనే బటన్ పై క్లిక్ చేయండి వెంటంటే మీ పేరుతో డౌన్లోడ్ అనే బుట్టిఒన్ కనిపిస్తుంది డౌన్లోడ్ అనే బటన్ పై క్లిక్ చేసి మీ గ్రూప్ 2 హాల్ టికెట్ ని పొందవచ్చు . ముందుగా ప్రింట్ తీస్కోని సరిచూస్కోగలరు.
అలాగే పరీక్షా కేంద్రము తెలియని యెడల ఒక రోజు ముందుగానే వెళ్లి చూస్కొని రాగలరు.
♥ అల్ ది బెస్ట్ ♥
read post in english : click here
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి