ప్రతి వాడికి శంకుచక్రం లాగ బిపి,షుగరు.
ఎందుకు రావు, ఇప్పడు ఆడవాళ్ళు ఉన్నారు నిద్ర లేచాకా నీళ్ళు తోడడం, వాకిలి తుడవడం, ముగ్గులు వేయడం, వంట, వార్పూ, బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, తిప్పడం ఇవన్ని చేస్తుంటే జబ్బులెందుకస్తాయి..
అంతే గాని నీళ్ళకి స్విచ్చి, నిప్పులకు స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి, ఆకరికి ఆ స్విచ్ వేసుకోవడానికి కూడా ఓపిక లేకుండా దానికో రిమోట్ స్విచ్చి....
రాళ్ళు తిని ఆరగ తీసుకోవలసిన వయస్సులో గుప్పిళ్ళ కొద్ది మాత్రలు మింగే దౌర్బాగ్యం పట్టింది దౌర్బాగ్యం.
అని ఒక మంచి డైలాగ్ ని తనికెళ్ళ భరణి గారు "మిథునం" అనే సినిమాలో ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి చేత బ్రమ్హాండంగా చెప్పించారు...
అవునండి ఈ కాలంలో టీవీ కి రిమోట్ డీవీడీ కి రిమోట్ ఎ సి కి రిమోట్ మెషిన్ కి రిమోట్ కర్టెన్ కు రిమోట్ ఆకరికి చిన్న పిల్లల ఊయల కు ఊగడానికి కూడా రిమోట్...
అంతగా పని చేసే రిమోట్ పాడైతే ఎలా?
ఈ కాలం లో చూస్తే ఒకరి ఇంట్లో నాలుగైదు రిమోట్ లు కనిపిస్తాయి ..
మన ఇళ్ళలో ఉండే ఈ రిమోట్ లు ఒక నొక సమయం లో సరిగా పని చేయవు అలా అని వాటిని మనం చావా గొడుతూ ఉటాం... అలాంటి సమయం లో ఆ రిమోట్ లు సరిగా పని చేస్తున్నాయో లేదో అని తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ మీరు పూర్తిగా చదువుతూ చూడాల్సిందే.
స్టెప్ ౧:
---} పని చేయుట లేదు అని అనుమాన్గా ఉన్న రిమోట్(రేమోట్లను) ని తీసుకోండి.
---} మీ దగ్గర వున్నా మొబైల్ కాని డిజిటల్ కెమారాలో కెమారాను కాని వీడియో కాని ఆన్ చేయండి
--}IR సిగ్నెల్ పూర్తిగా కనిపించుటకు మీ రూమ్ లో లైట్స్ ని ఆఫ్ చేయండి ( లైట్స్ ఆఫ్ చేయకున్నాను సిగ్నెల్ కనిపిస్తుంది కాని క్లారిటీ కోసం ఆఫ్ చేయండి)
---}రిమోట్ ను మీ కెమెరా కి ఎదురుగా పెట్టండి .
---} మీ రిమోట్ ని కెమెరా కి ఎదురుగా ఉంచి రిమోట్లో ని ఏదైనా బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి.(కొన్ని బటన్స్ సిగ్నెల్ ని ట్రాన్స్మిట్ చేయవు అందువలన పవర్ కీ ని యూస్ చేయండి)
---} ఆ ఇన్ఫ్రారెడ్ సిగ్నెల్ (IR సిగ్నెల్) ఒక రెడ్డిష్ కాని బ్లూఇష్ కలర్ లో రిమోట్ ముందర ఉండే లైట్ లో కనిపిస్తుంది అల కనిపించింది అంటే రిమోట్ సరిగానే ఉంది అని అర్ధం.
---) ఒక వేల ir సిగ్నెల్ సరిగానే ఉంది కాని టీవీ,డీవీడీ కాని ఇంకా ఏవైనా మషీన్ పని చేయడం లేదంటే మీరు సరిగా మషీన్ వైపు పెట్టడం లేదు అని లేక మషీన్ IR వద్ద ఏదైనా అడ్డుకోవడం కాని జరుగుతుందని అర్ధం ir వద్ద కొంచం ని క్లీన్ చేసి ట్రై చేయండి...
-కర్ణా
nice బ్లాగ్ ,పోస్ట్ చాలా బావుంది , నేను ప్రయత్నిస్తాను ,
రిప్లయితొలగించండివీలున్నప్పుడు మా బ్లాగు ని చూడండి :)
ధన్యవాదాలు ,
తరుణ్
techwaves4u.blogspot.in
తెలుగు ల టెక్నికల్ బ్లాగ్
తారు ప్రీతం రెడ్డి గారు ధన్యవాదాలు....
తొలగించండిమీ బ్లాగ్ చాల బాగుంది మీలో ఒక దేవోలోపెర్ ఉన్నారని యిట్టె తెలుస్తుంది..
నా బ్లాగ్ ను సందర్శించినందుకు దన్యవాదములు