WhatsApp Delete for Everyone Feature
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వాట్సాప్ ‘డిలీట్’ ఫీచర్ ఇప్పుడు
అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఫోన్,
విండోస్ ఫోన్లలో వాట్సాప్ వాడుతున్న వినియోగదారులందరూ ఈ
సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైనా పొరపాటు సందేశం పంపితే
దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒక్కోసారి భారీ మూల్యాన్నే
చెల్లించాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులకు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్ ఈ
కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిలీట్ ఇలా..
మీ స్నేహితులకో లేదా గ్రూప్‌లోనో పొరపాటున ఓ సందేశాన్ని
పంపారనుకుందాం. ఏదైతే మీరు పంపారో ఆ సందేశాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ
తర్వాత పైన ఉండే ‘డిలీట్’
సింబల్‌ను క్లిక్ చేయాలి. ‘డిలీట్ ఫర్ ఆల్’ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సందేశాన్ని డిలీట్ చేయొచ్చు. కేవలం మీకు
మాత్రమే సందేశం డిలీట్ కావాలంటే ‘డిలీట్ ఫర్ మీ’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
అయితే, కేవలం 7 నిమిషాల వ్యవధి వరకు మాత్రమే ఈ సదుపాయం వినియోగించే వెసులుబాటు ఉంది.
అప్పటికే ఆ సందేశాన్ని ఆ వ్యక్తి చూసినా డిలీట్ అవుతుంది. మీరు డిలీట్ చేసిన
తర్వాత అవతలి వ్యక్తికి సందేశం డిలీట్ చేసినట్లుగా చూపుతుంది.
Raad in English : click here
Raad in English : click here
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి