19, జులై 2013, శుక్రవారం

మీ పిల్లల్నిఅశ్లీల,సెక్సువల్ కాంటెంట్ల నుంచి కాపాడుకోండి (DNS Angel)

             ప్పుడు ఉన్న కాలంలో  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, చిన్న చిన్న పనుల  నుంచి పెద్ద పెద్ద పనుల వరకు ఇంటర్నెట్ పై ఆధారపడి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఉదాహరణకు ఏదైనా వస్తువు కొనాలి అంటే ఆన్ లైన్  షాపింగ్ అని, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలి అన్న వికీపీడియా లాంటి encyclopedia అని, సినిమాలు,పాటలు,మాటలు,వార్తలు,వ్యాపారా వ్యవహారాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయ్
ఇంతగా ఉపయోగ పడే సైట్స్ లో ఆయా సైట్స్  తమ సైట్ విసిటింగ్ ని పెంచుకోవడానికి అబ్యూస్,సెక్సువల్  ఆడ్స్ చేస్తుంటాయి.

వారి బారిన పడి పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని పిల్లలను ఇంటర్నెట్ కి దూరంగా ఉంచుతారు.అందువలన పిల్లలకి ఇంటర్నెట్ పై అవగాహనా లేకుండా అవుతుంది
అందుకే పెద్దవారికి ,తల్లితండ్రులకి పిల్లలను విచ్చల విడిగా ఎలాంటి సెక్సువల్,అబ్యూస్ ఆడ్స్,సైట్స్ లేకుండా DNS(dynamic naming system) నుండి బ్లాక్ చేసి  ఇంటర్నెట్ access చేస్కునే విధంగా సౌకర్యం కలిపిస్తుంది
DNS ఏంజెల్  అందిస్తుంది




కంపెనీ వారు అందిస్తున్న సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ లో DNS ఏంజెల్1.1(505.68kb) కూడా ఉపయోగ ఒక అప్లికేషన్ పైన చూపిన పిక్చర్ పై క్లిక్ చేయడం ద్వార మీరు ఆ జిప్  ఫైల్ ని ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు.

మీ దగ్గర ఉన్న winrar32 or winrar64  సహాయం తో extract చేసి మీ హార్డ్డిస్క్ లో సేవ్ చేస్కొండి.

ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ ని ఓపెన్ చేస్తే అందులో రెండు ఫైల్స్ మనకి కానిపిస్తాయి అవి angel.exe & readme.txt 

angel.exe అనే Executable ఫైల్ ని ఓపెన్ చేయగానే క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా ఒక స్మాల్ విండో వస్తుంది
అందులో 6 రకాల DNS సర్వర్ అడ్రస్లను  అందిస్తుంది.


అస్సలు ఇది ఎలా పని చేస్తుంది :
  ప్రతి సైట్ కి ఒక నిర్దిష్టమైన ip అడ్రస్ ఉంటుంది ఆ సైట్ ని ఓపెన్ చేసే సమయం లో ఆ ip DNS సర్వర్ కి అందిస్తుంది ఈ DNS సర్వర్ ఆ ip ని చెక్ చేస్కొని రౌటర్ కి సెండ్ చేస్తుంది అక్కడ నుంచి సైట్ ఓపెన్ కావడానికి గల అర్హతలు మన ip కి సెండ్ చేయబడతాయి, అప్పుడు ఆ సైట్ ఓపెన్ చేయబడుతుంది.
 DNS angel ఎం చేస్తుందంటే సిస్టం యొక్క DNS సర్వర్ అడ్రస్ లో సేఫ్ అడ్రస్ ని ఎంటర్ చేస్తుంది అందువలన మనం ఏదైనా సైట్ ని ఓపెన్ చేస్తున్న సమయంలో ఆ సైట్ IP DNS సర్వర్ కి చేరగానే ఆ సైట్ ని DNS సర్వర్ చెక్ చేస్తుంది ఆ సైట్ గనుక సెక్సువల్ అబ్యూస్ సైట్ అయితే వెంటనే ఆ సైట్ ని అక్కడే బ్లాక్ చేసేస్తుంది.

 నార్టన్ సేఫ్1,2 అనే బటన్ పై క్లిక్ చేయగానే ఆ బటన్ గ్రీన్ కలర్ లోకి మారిపోయి స్టేటస్ లో ఒక గ్రీన్ symbol వస్తుంది.సిస్టం రీస్టార్ట్ అయినా వెంటనే DNS సర్వర్ లో అడ్రస్ ఎంటర్ చెయబడుతుంది.
 ఇక పైనా ఏదైనా సెక్సువల్ సైట్స్ ని ఓపెన్ చేయగానే క్రింద చూపిన విధంగా నార్టన్ DNS తో block వార్నింగ్ వస్తుంది ఆ సైట్ DNS ద్వార బ్లాక్ చేయబడింది అని మనం గుర్తించ వచ్చు.
 
 Metacert DNS అనే బటన్ పై క్లిక్ చేసి enable చేసి సిస్టం రీస్టార్ట్ చేసినట్లైతే  ఇక పై అడల్ట్ ,సెక్సువల్  సైట్ అన్నియు క్రింద చూపిన విదంగా బ్లాక్ చేయ బడుతాయి.

Open DNS Family అనే enable చేసి రీస్టార్ట్ చేయగానే క్రింద చూపిన విధంగా dns బ్లాకింగ్ జరుగుతుంది.
  
ఈ విధంగా ఈ చిన్న టూల్ ని ఉపయోగించి మీ పిల్లలను ఇంటర్నెట్ కి సురక్షితంగా access చేస్కోనివ్వవచ్చు.


-ఈ పోస్ట్ పై ఏదైనా సందేహాలు,సలహాలు ఉంటె కామెంట్త బాక్స్  లో తప్పకుండ తెలియజేయగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను. 

- కర్ణా
rayarakulakarna@gmail.com

6, జులై 2013, శనివారం

make డిటెక్ట్ DVD/CD-ROM

          ప్పుడు విండోస్ లో లేటెస్ట్ గా వచ్చిన  ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 అలాగే అందులో స్టార్ట్ మెనూ ను ప్రవేశపెట్టి విండోస్ 8.1 రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది.

ఇప్పటి వరకు విండోస్ 7 కాని విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం కొత్తగా ఇంస్టాల్ చేస్కున్న వారు ఒకటి రెండు ప్రొబ్లెంస్ తప్పక తలెత్తుతున్నాయి. 

విండోస్ ఆపరేటింగ్ సిస్టం కొనుకున్న వారికి ఎం ప్రొబ్లెంస్ ఉండవు అనుకుంటాం కాని ఉంటై కాని లీగల్ ప్రోడక్ట్ కావున సరి దిద్దం ఈజీ కాని ఇంటర్నెట్ సౌకర్యం తో డౌన్లోడ్ చేస్కున్న వారి పరిస్థితి ఏంటి ? ప్రొబ్లెంస్ ఎలా ఎదుర్కోవాలి?

అస్సలు ఏంటి ఆ ప్రొబ్లెంస్  : ---

  •   personalize PC సెట్టింగ్స్ ఓపెన్ కాక పోవడం 
  • బిట్ లాకర్ auto-unlock ఆప్షన్ సపోర్ట్ చేయక పోవడం 
  • DVD/CD-ROM డిటెక్ట్ కాకపోవడం 
  • అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉన్నప్పటికీ అడ్మిన్ రైట్స్ అడగడం
  • కొన్ని ఇంటర్నల్ కమాండ్స్  పని చేయక పోయడం
  • రిజిస్ట్రీ ఎడిటింగ్ కి రైట్స్ ఇవ్వక పోవడం 
ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని సమస్యలు కొందరి నుంచి వస్తూనే ఉంటై అయితే ఇలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి?

 ఇలాంటి సమస్యల్లో నాకు మొదటిగా తలెత్తిన సమస్య personalize సెట్టిగ్స్ ఓపెన్ కావటం లేదు.

 ఇలా personalize సెట్టింగ్స్ ఓపెన్ కావట్లేదు ఎందుకంటే మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టం అనేది volume  ఎడిషన్  కాదు అని. 

మరి దానికి సోలుషన్ లేదా అంటే ? ఉంది సొల్యూషన్ ఉంది ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన విండోస్ 8 ఎడిషన్  తో సరిపడే విండోస్  ని డౌన్లోడ్ చేస్కోవాల్సి ఉంటుంది .


2) డీవీడీ డ్రైవ్ ఐకాన్ మై కంప్యూటర్ లో కనిపించడం లేదా ?

అయితే మీరు ఎం చేయాలంటే రిజిస్ట్రీ లో కొన్ని మార్పులు చేయాలి. రిజిస్ట్రీ అనేది కంప్యూటర్ కి మెదడు లాంటిది అందుకే అందులో మార్పులు చేసే సమయంలో కొద్దిగా ఆలోచించాలి.

అందుకే మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండే విధంగా రిజిస్ట్రీ ని కమాండ్ ప్రాంప్ట్ లోంచి ఎడిట్ చేస్కుంటే సేఫ్ అని

డీవీడీ/cd-రొం ఐకాన్ మీ మై కంప్యూటర్ లో కనిపించడానికి ఒక కమాండ్ ని ఎంటర్ చేయాల్సి వస్తుంది.

రిక్వైర్మెంట్స్ :


  1. యూసర్ కచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ లో ఉండాలి(అడ్మినిస్ట్రేటర్ ఎనబ్లె చేయడానికి మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి మేనేజ్ అనే ఆప్షన్ లో లోకల్ యూసర్స్ అండ్ గ్రూప్స్ పై క్లిక్ చేసి యూసర్ లో అడ్మినిస్ట్రేటర్ అనే యూసర్ ప్రాపర్టీస్ లో ఎకౌంటు ఇస్ disable పై చెక్ మార్క్ తీసి వేసి సిస్టం లాగ్ ఆఫ్ చేసి అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అవ్వాలి )
  2. UPPERCASE లెటర్స్ ని lowercase లెటర్స్ ని జాగ్రత్త గా టైపు చేయాలి
  3. సిస్టం కి డీవీడీ/CD-ROM కనెక్ట్ అయింది అని కచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమె ఈ కమాండ్ యూజ్ చేయాలి. 




కమాండ్ :   reg.exe add "HKLM\System\CurrentControlSet\Services\atapi\Controller0" /f /v EnumDevice1 /t REG_DWORD /d 0x0000001
(note: please note this command for further use) 


ఈ కమాండ్ ఎంటర్ చేసి న ENTER ప్రెస్ చేయగానే ఆపరేషన్ successful అని వస్తుంది అంతే తర్వాత మీ సిస్టం ని 




అంతే మీ డీవీడీ/cd -rom  ఐకాన్ మై కంప్యూటర్ లో కనిపిస్తుంది. 

ఇంకా ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా ఈ క్రింది వీడియో లో చేసాను తప్పకుండ చూడండి... 



ఈ పోస్ట్ పై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియ జేయగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను. 



ఇంకా ఎ ఇతర సహాయముకైనా నన్ను సంప్రదించగలరు. 
రాయరాకుల కర్ణాకర్ 
rayarakulakarna@gmail.com
www.facebook.com/rayarakula
www.youtube.com/rayarakula