ఎప్పుడు ఎప్పుడు అంటున్న వాట్స్ యాప్ వీడియో కాల్ రానే వచ్చింది..
ఇప్పటికే దాదాపు అన్ని రకాల చాటింగ్ మెసెంజర్
అప్లికేషను లలో వీడియో కాల్ అందుబాటులోనే
ఉంది కాని వాట్స్ యాప్ లో ఎప్పటి నుంచో ప్రవేశ పెట్ట నున్న ఈ ఆప్షన్ కి చివరకి శ్రీకారం చుట్టింది. కాని
ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు కేవలం BETA టెస్టర్ యూసర్ లకి మాత్రమే
అందుబాటులోకి వచ్చింది
అస్సలు BETA టెస్టర్ యూసర్ లంటే ఎవరు ఏమిటి?
ఏదైనా సాఫ్ట్వేర్ కి లేదా
అప్లికేషను కి BETA కనిపించింది అంటే ఆ సాఫ్ట్వేర్ లేదా యాప్ ఇంకా అభివృధి దశలోనే ఉంది
అంటే డెవలప్మెంట్ లో ఉంది అని అర్ధం, కొత్తగా ఆప్షన్ లను ప్రవేశ పెట్టడాలు లేదా
యాప్ ఇంటర్ పేస్ ని మార్చడం లాంటివి. ప్రవేశ పెట్టిన ఫీచర్ ని ఆండ్రాయిడ్ యాప్
తయారీదారులు లేదా డెవలపర్లు తమ నుంచి కాకుండా ప్రజల నుంచి టెస్టింగ్ ని కోరుతారు
అంటే ప్రజలు ఎలా వాడుతున్నారు వారికి ఎక్కువగా ఉపయోగం ఏమిటి, వారికి సరైన సంతృప్తి
అందిస్తుందా లేదా అని BETA టెస్టర్ లేదా యూసర్ నుంచి ఫీడ్ బ్యాక్ రూపంలో సేకరిస్తారు,
ఇలా సేకరించిన డేటా ని మొత్తం విశ్లేషించి చివరగా యూసర్ అనుకూలతకు తగిన విధంగా ఒక
నిర్ణయం తీస్కోని అమలు చేసి ఫైనల్ గా అందరికి అందుబాటులోకి కొత్త అప్డేట్ గా
విడుదల చేస్తారు.
అయితే
మీరు చేయవలసింది ఏంటంటే వాట్స్ యాప్ BETA యూసర్ గా రిజిస్టర్ అయి వాట్స్ యాప్ ఇన్స్టాల్
చేయాలి. వాట్స్ యాప్ టెస్టర్ గా రిజిస్టర్ అవుటకు ముందుగా మీ GMAIL లోకి లాగిన్ అవ్వాలి తర్వాత ఈ క్రింది
లింక్ పై క్లిక్ చేయగలరు
ఈ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు
కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తున్న BECOME A TESTER పై క్లిక్ చేయండి అంతే మీరు BETA టెస్టర్ గా మారినట్లే
ఇప్పుడు మీరు మీ ప్లే
స్టోర్ ని ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్ లో ఉన్న My
apps & Games పై ట్యాప్ చేయండి ఇప్పుడు మీకు క్రింది ఇమేజ్ లో వలే
BETA అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేస్కొండి అక్కడ వాట్స్ యాప్ మెసెంజర్
ఉంటుంది జస్ట్ అప్డేట్ చేయండి . సరిపోతుంది.
ఇప్పుడు సింపుల్ గా మీ
మిత్రునికి కూడా ఈ పోస్ట్ లింక్ అందచేసి యధావిధిగా చేయమని చెప్పండి . అయిపోయిన
తర్వాత సింపుల్ గా మీ మిత్రుని చాట్ బాక్స్ ఓపెన్ చేసిన కాల్ బటన్ పై క్లిక్ చేయండి
వెంటనే ఈ క్రింది ఇమేజ్ లో వలే మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి ఒకటి వాయిస్
కాల్ అండ్ రెండవది వీడియో కాల్ . వీడియో కాల్ ని ఎంచుకోండి . మీ మిత్రుడు కూడా అప్డేట్
లో ఉన్నాడు కావున ఎంచక్క వీడియో కాల్ అనిభూతిని పొందవచ్చు .
గమనిక : మీరు టెస్టర్ గా రిజిస్టర్ అయినారు కావున మీకు తోచినవి
లేదా ఏదో లోటు గా ఉంది అనుకున్న సమాచారాన్ని వాట్స్ యాప్ కి ఫీడ్ బ్యాక్ ద్వార సెండ్
చేయండి తద్వారా ఆ లోటుని పూరించుకొనే అవకాశం ఉంటుంది అలాగే వాట్స్ యాప్ కి సహాయం చేసినట్లు
ఉంటుంది
మీ మిత్రుడు మరియు మీరు ఇద్దరు అప్డేట్ లోనే ఉంటేనే వీడియో కాల్
ని పొందవచ్చు
ఈ పోస్ట్ పై ఎవైన సందేహాలు సలహాలు ఉంటె తప్పక తెలియజేయండి . ఇదే
పోస్ట్ ని ఇంగ్లీష్ లో చడువుతకు ఇక్కడ క్లిక్ చేయండి