social website లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
social website లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, డిసెంబర్ 2016, శనివారం

How to Add Colorful Background to Facebook Status


EnglishVersion

How to Add Colorful Background to Facebook Status


 కొత్త సంవత్సరం సందర్బంగా కొత్తగా పోస్ట్ చేయండి . ముందుగా
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
 మీ ఫేస్బుక్ లో మీ విషెస్ ని బాక్గ్రౌండ్ కలర్స్ తో పోస్ట్ చేయండి. ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసే స్టేటస్ బాక్గ్రౌండ్ లో కొంచం కలర్స్ ని అమర్చి పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా మీ  స్టేటస్ ని అప్డేట్ చేయండి . ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో చూస్తే మీకు కొంచం అర్ధం అయ్యే ఉంటుంది. మరి అలా అద్బుతంగా పోస్ట్ చేస్కొనే అవకాశాన్ని మనకి కొత్త సంవత్సరం సందర్బంగా ఫేస్బుక్ అందించింది.
మరి అది ఎలా పోస్ట్ చేయాలి ఎం చేయాలి అని ఆలోచిస్తున్నారా . నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి ఈ క్రింది వీడియో చూసి తెలిసుకొని పోస్ట్ చేయండి ..

నాకు చెప్పడం మరవకండి మిత్రమా

27, డిసెంబర్ 2016, మంగళవారం

Telegram Channel for us

                     కంప్యూటర్స్ & టెక్నాలజీ 

మిత్రులందరికీ నమస్కారం.


మన గ్రూప్ అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. అలాగే గ్రూప్ అడ్మిన్ పోస్ట్ లకి కూడా మంచి రెస్పాన్స్ అందుతుంది. 
ఇప్పటికే నా పోస్ట్ లని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి అందుబాటులో ఉన్న అన్ని సోషల్ నెట్వర్క్ లలో నా పోస్ట్ లను మీకందిస్తున్నాను.

• ఫేస్బుక్ పేజి
• ఫేస్బుక్ గ్రూప్
• పర్సనల్ ఎకౌంటు
• వాట్స్ యాప్ 
• hike టైంలైన్
• బ్లాగ్
• వెబ్సైటు
• YouTube
టెలిగ్రాం అప్లికేషను  డౌన్లోడ్  చేస్కోనుటకు  లింక్ : https://telegram.org/

ఇలా అన్నింటిలోనూ పోస్ట్ లు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు టెలిగ్రాం లో ఒక ఛానల్ కూడా చేయడం జరిగినది. ఈ ఛానల్ లో మీరు జాయిన్ అవడానికి మీరు చేయవలసినదల్లా టెలిగ్రాం మీ మొబైల్ లో కాని సిస్టం లో గాని ఇన్స్టాల్ చేసి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా టెలిగ్రాం లాంచ్ అయి ఛానల్ లో జాయిన్ అవుతారు.


(సాదరంగా పై సోషల్ నెట్వర్క్స్ కి ఈ టెలిగ్రాం మెసెంజర్ లో తేడా ఏంటంటే ఇందులో 
→ నా పోస్ట్ లు అన్ని ఒకే చోట వరసగా కనిపిస్తాయి. తేది సమయం వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. 

→ ఫొటోస్, స్టేటస్, ఫోటోషాప్ ఎడిటింగ్ పిక్స్, తాజా సాకేంతిక సమాచారం, కొత్త కొత్త సాఫ్ట్వేర్ పరిచయాలు , డౌన్లోడ్ , వీడియోస్ లాంటివి అన్ని ఒకే చోట

→ టెలిగ్రాం లో ఉన్న అత్యంతమౌలికమైన సదుపాయం ఏంటంటే టెలిగ్రాం ఇటు మొబైల్ లోను అలాగే కంప్యూటర్ లోను ఇన్స్టాల్ చేస్కోవచ్చు.. కావున వాట్స్ యాప్ లా కాకుండా అందరికి అందుబాటులో ఉండవచ్చు.

→ ఛానల్ లో జాయిన్ అవుటకు ఎవరి నెంబర్ సేవ్ చేస్కోవలసిన అవసరం లేదు. లింక్ పై క్లిక్ చేసి జాయిన్ అయితే చాలు.

→ ఛానల్ మెంబెర్స్ ఎలాంటి మెసేజెస్ పోస్ట్ లు చేయడం ఉండదు కావున మనకు ఎలాంటి ఇబ్బందులు, చిరాకు తెప్పించే సమస్యలు ఉండవు.

→ ఛానల్లో మ్యూట్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది కావున నోటిఫికేషన్ ఇబ్బంది కూడా ఉండదు.

→ చాల రోజుల క్రితం చేసిన పోస్ట్ ని వెతకాలంటే స్క్రోల్ చేయకుండా సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది కావున సులువుగా సెర్చ్ చేస్కోవచ్చు.

→ మీ మిత్రులను కూడా ఇందులో జాయిన్ చేయాలంటే కేవలం పై లింక్ వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పోస్ట్ చేస్తే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోతారు.

→ ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త అప్డేట్ లలో)

20, మే 2016, శుక్రవారం

Solutions for avoiding Facebook viruses

ఛి ఛి ఛి ఛి .....

ఛి... అంతగా గలీజ్ తయారైంది.

ఏంటి సడన్ గా ఇలా అన్నాను అనుకుంటున్నారా? అలా ఎం అనుకోరు లే నాకు తెలుసు ఎందుకంటే  మీకు  కనిపిస్తుంది కదా .  ఇంకా బాగా కనిపించాలంటే మీకు ఒక గ్రూప్ ఉంటె కచ్చితంగా కనిపించేది. నేను PC  solutions – karna  గ్రూప్ నడుపుతున్న సంగతి మీకు తెలిసినదే. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఎంటటే మీకు టెక్నాలజీ పరంగా  ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్కోవడానికి , సలహాలు ఉంటె పంచుకోవడానికి చేసాను .

కాని  గ్రూప్ లో రోజుకు యాబై అరవై పోస్ట్  లు పెండింగ్ లో ఉంటున్నాయి అడ్మిన్ అప్రూవల్ కొరకు.

అమ్మో.... అని ఆశ్చర్యపోకండి. అన్నిపెండింగ్ లో ఉంటున్నాయని చూస్తే అందులో  95% శాతం పోస్ట్  లు అన్ని స్పాం లు, గలీజ్ ఫోటోలు ఛి ఛి ఛి .. ఇంట్లో గ్రూప్  పోస్ట్  లు చూడాలంటె బయంగా ఉంది. 100 పోస్ట్  లకి 90 పోస్ట్  లు ఇవే ఉంటున్నాయి ఇంకో ఐదు Advertisement promotion posts  ఇక ఇంపార్టెంట్ వి 5. ఇక అవన్నీ డిలీట్ చేసేసరికి తల ప్రాణం తోక కాస్తుంది . అప్పుడప్పుడు యూసర్ ని బాన్  చేసేస్తున్న ఎం చేయను మరి.
మరి ఇలా వీరు ఎందుకు చేస్తున్నారు అని  కోపం వచ్చి ఇద్దరు ముగ్గిరిని అడిగాను (నాకు తెలుసు అవి వారి ప్రమేయం లేకుండానే పోస్ట్ అవుతున్నాయి అని , కాని ఎప్పుడో మనం చేసిన చిన్న క్లిక్ ఇప్పుడు ఇలా ఎఫెక్ట్  చూపిస్తుంది)  అలా అడిగితే వారి సమాధానం
.. కామన్..
సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని. ( ఈ విషయం మనకి తెలిసిందే )
మరి ఎందుకు అడిగారు అని అనుకుంటారేమో దానికి సంధానం ఉంది నా వద్ద . ఎంటటే వీరు ఇలా స్పాం ,ఫిషింగ్ లకి గురి అయ్యారనేది వీరికి ఎవరో చెప్తే తప్ప తెలియదు . ఆ ఎవరో నేను అవుదామని ..
“సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని.” అన్నవారే ఎక్కువ కానీ , “ అయ్యో దేవుడా ఇలా జరిగిందా . ఎలా మరి ఎం చేయాలి వీటి బారి నుంచి  నన్ను రక్షించండి “ అన్న వారు చాల తక్కువ.  ఇలా అన్నవారే ఫేస్బుక్ ని ఒక మనిషిలా మనసుతో నడుపుతుంటారు. మిగితా వాళ్ళంతా వారి  వారి సరదాలని తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చేసిన పనే ఈ గలీజ్ అంత .
ఇలాంటి సరదా మనుషులకు సరదాక ఒక్క మాట. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండిరా, ఫేస్బుక్ ని కరాబు చేయకండిరా.. మీకోసం సపరేట్ గా వేరే సైట్స్ ఉన్నాయి వాటిని వాడుకోండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతారు.

ఇక పోతే ఈ సమస్య కి గురి అయినా వ్యక్తి చేయవలసిన పనులు.
→ముందుగా ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చేయండి.
→కనిపించిన ప్రతి లింక్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా తెలిసిన వాటిపైనే క్లిక్ చేయండి
→ఫేస్బుక్ లో మనకి తెలియని యాప్స్ ఉంటె తొలగించండి అవే ముప్పు తెచ్చేవి.
(ఫేస్బుక్ లో యాప్స్ తొలగించండి అంటే ఫోన్ లో యాప్ తీసేయాలా ? అని అడుగుతున్నారు . వాళ్ళకోసం కొంచం క్లారిఫికేషన్  . ఫోన్ లో కాదు మిత్రమా ఫేస్బుక్ లో కూడా యాప్స్ ఉంటాయి , అర్ధం కాలేదా ఎప్పుడు మనం ఆడుతుంటాంమే candy crush గేమ్ ఇది కూడా ఒక యాప్ నే సెట్టింగ్స్ లో అప్ప్స్ అనే సెక్షన్ లోకి వెళితే మీరు వాడే అన్ని అప్స్ కనిపిస్తాయి అవసరం లేనివి వెంటనే తొలగిస్తే మంచిది.)
→ కనిపించింది కదా అని లటకున క్లిక్ చేయడం ఆపి ఏదైనా పనికచ్చే పోస్ట్ లు చదవండి .
→ సెక్యూరిటీ సెట్టింగ్స్ ని భలపరుచుకోండి
మీకేమో గాని రోజు ఆ దరిద్రాన్ని చూడలేక చస్తున్నాము.

ఈ మద్యలో ఇంకో వైరస్ కూడా కా కంట పడింది అదేమిటి అంటే మన మిత్రుడు ఏదో గ్రూప్ లో జాయిన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది వెళ్లి చూస్తే ఆ గ్రూప్ లో పోస్ట్ కి అర్హత ఉండదు. ఆ గ్రూప్ కూడా తయారు చేసి  కొన్ని గంటలే  అయి ఉంటుంది . మెంబెర్స్ చూస్తే వేయిలకు వెయిలు. తీర మిత్రుడిని అడిగితే అదే జవాబు .. నాకు తెలియదు .

ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్పితే అర్ధం కాదు . అలాంటి జోలికి మనం వెళ్ళనంత వరకు మనం సురక్షితంగా ఫేస్బుక్ లో ఉంటాము. ఒక్క సారి వాటి భారిన పడినారో కోలుకోవడానికి చాల సమయం పడుతుంది . ఈ వైరస్ పని ఏంటంటే మీరు ఎన్ని సార్లు లాగిన్ చేస్తే అన్ని సార్లు మీ పేరుతో గ్రూప్ లలో గలీజ్ పోస్ట్ లు చేస్తుంది అది చూసి ఇంకొకతను క్లిక్ చేస్తాడు అతని పని కూడా ఇలాగే అవుతుంది .
కావున ఇకనైనా జాగ్రత్త తీస్కోని . పేరు ను కాపాడుకోండి.

Facebook Group for technological information amd solutions

గత 2 సంవత్సరాల గా మీ ఆదరాభిమానాలతో నడుస్తున్న మా గ్రూప్ ఎంతో మంది మిత్రులకు సహాయం గా నిలుస్తుందని బావిస్తున్నాను . ..

కంప్యూటర్ సమస్యలను ఎదురుకొంటున్న  వారు వారి సమస్యలను నా గ్రూప్ లో పోస్ట్ చేసి మా టెక్నికల్ టీం సహాయం తో పరిష్కారాన్ని అందుకొంటున్నారని బావిస్తున్నాను .

కరెక్ట్ గా 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న మా గ్రూప్ లో ఇంచు మించు ప్రస్తుతానికి 12000 మంది మిత్రులను జాయిన్ అయ్యారు ..  అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

అలాగే మా ఎదుగుదల కి  సపోర్ట్ అందిస్తున్న మిత్రులందరికీ  పాదాబివంధనాలు

గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u/

8, మే 2016, ఆదివారం

Automatic Disposable Profile Picture in Facebook



ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు, ఆప్షన్స్ వస్తూనేఉన్నాయి.కాని మనం వాటిని చూస్కోనే సరికి చాల సమయం పడుతుంది . అందుకే వాటిని మీరు చూసే వరకు కాకుండా ముందుగానే నేను తెలియజేయధలచాను ఈ విషయం మీకు తెలిసినదే

మరి ఇప్పటి కొత్త ముచ్చట ఏంటంటే

ఫేస్బుక్ లో ఈ మద్యలో ప్రొఫైల్ పిక్ ల పై క్రేజ్ ఎక్కువగా ఉంది . మరి ఇదే సమయం లో పండుగ కావచ్చు మీకు ఇష్టం అయిన టీం మ్యాచ్ కావచ్చు ఇంకా ఏదైనా లిమిటెడ్ సమయం లో ఐపోయే దానికోసం మనం ప్రొఫైల్ పిక్ మారుస్తున్టాము.

ఉదాహరణకు చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవం వస్తుంది అనే సమయం లో త్రివర్ణ పతాకాల ప్రొఫైల్ ఫోటో లతో ఫేస్బుక్ కల కల లాడుతుంది. సందర్భం అయిపోగానే మల్లి అవి తీసేసి నచ్చినది పెట్టుకుంటారు


మరి ఇలా ప్రతి సారి ఫోటో లను మార్చుకొనే బదులు అదే లిమిటెడ్ టైం వరకు ఉండి . పని అయిపోగానే ఆటోమేటిక్ గా పాత ప్రొఫైల్ పిక్ గా మారి పోతే ఎంత బాగుంటుందో కదా . మరి ఆ సాధుపాయన్నే ఫేస్బుక్ కల్పింది మీరు ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయం లో క్రింద Make Temporary అని ఉంటుంది క్లిక్ చేస్తే ఎన్ని రోజుల వరకు ఈ ఫోటో ఉండాలి అనేది సెలెక్ట్ చేస్కోవచ్చు ఈ ఫోటో లో చూస్తే అర్ధం అవుతుంది .
ఒక గంట నా ,ఒక రోజా లేదా ఒక వారం ఇంకా ఏదైనా మీకు నచ్చిన డేట్స్ లలోనా

ఇలా సెట్ చేస్కొంటే ఆటోమేటిక్ గా డేట్ మిన్చాగానే మీ ప్రొఫైల్ పిక్ ఆటోమేటిక్ గా మారి పాత ప్రొఫైల్ పిక్ అయిపోతుంది .

లిమిటెడ్ టైం లో ఫొటోస్ పెట్టి తీసేయడం కంటే ఇది చాల బెటర్.. నాకు అయితే చాల ఉపయోగపడింది మరి మీకు ?



www.rktechinfo.com

3, మే 2016, మంగళవారం

సరికొత్త అదృశ్య ఫేస్బుక్ ఫీచర్

ఫేస్బుక్ గోప్యత యూసర్ లందరికి స్వచ్చమైన శుభవార్త .

ఎంటబ్బా ?

ఫేస్బుక్ లో నయా గా ఒక అదృశ్య ఫీచర్ రానుంది. అదేంటంటే మనం మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ మాయమవనుంది అంటా.. అగొ ఇదేంది అనుకుంటున్నారా?

అవును కొత్తగా ఈ ఫీచర్ రానుంది ఈ ఫీచర్ ఆన్ చేసుకొన్నా వారికి వారు మెసేజ్ చేసిన పదిహేను నిమిషాలలో ఆ మెసేజ్ నామ రూపాలు లేకుండా పోతుంది. ఎందుకు మరి ఇలాంటి ఫీచర్ అంటే ప్రైవసీ సీక్రెట్ చాటింగ్ వారికి ఈ ఫీచర్ బలే ఉపయోగపడనుంది అని తెలుపుతున్నారు ఫేస్బుక్ వాళ్ళు, మనకు తెలుసు కదా ఈ ఫీచర్ ఎవరికీ ఎక్కువగా ఉపయోగపడుతుందో అని ఇగ నేన్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ..

మరి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాకా మరి ఉపయోగాలు ఉన్నాయా లేక నిరుపయోగాలు ఉన్నాయా మనకే తెలుస్తుంది.

20, డిసెంబర్ 2015, ఆదివారం

Facebook Desktop Notifications


        ఇకపై ఫేస్బుక్ లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఇక మన బ్రౌజరు లో రైట్ సైడ్ బాటమ్ కార్నెర్ లో వస్తాయి.  దీనిని ఆక్టివేట్ చేయటానికి సింపుల్ గా .. 

ఫేస్బుక్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్ లో ఈ క్రింది ఇమేజ్ లో వలే డెస్క్టాపు అండ్ మొబైల్  సెట్టింగ్స్ ని ఆన్ చేస్కొంటే సరిపోతుంది . 

దాదాపు అన్ని ఎకౌంటు లకు ఆక్టివేట్ అయినాయి .. ఒక వేలా ఆక్టివేట్ కాని వాళ్ళు ఈ సెట్టింగ్స్ లో చూస్కోవచ్చు 


11, డిసెంబర్ 2015, శుక్రవారం

Google Input Tools Offline Installer

సిస్టం లో తెలుగు ఎలా టైపు చేయాలి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది . అందులో చెప్పిన సూచనలు పాటిస్తే చాలు . 




అయితే ఈ వీడియో లో చూపిన తెలుగు టైపింగ్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవాలంటే 
ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే 

మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ఉంటె  వీడియో చూస్తాము అందులో ఉన్న ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ కూడా  చేస్కోన్టాము . చాల సులభమైన పని  . 

కాని ఒక వేల నెట్ లేని సిస్టం లో తెలుగు ఇంస్టాల్  చేయాలంటే ?

అయ్యో దానికి నా వద్ద అద్బుతమైనా సలహా , పరిష్కారం ఉంది.
ఏంటి అంటే 

గూగుల్  ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేయడానికి నెట్ అవసరం లేకుండా offline installer ఫైల్స్ ని నేను ఇక్కడ పొంధపరచాలు .  కేవలం ఈ ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కొని  ఏ సిస్టం  లోనైనా ఈజీ  గా గూగుల్ ఇన్పుట్ టూల్ ని ఇన్స్టాల్ చేస్కోవచ్చు .

ఫైల్ లింక్ : www.bit.ly/HS-GIT

గమనిక : ఈ ఫైల్ ని విన్రార్ సహాయం తో ఎక్స్ట్రాక్ట్ చేసాక ఇందులో వచ్చిన రెండు ఫైల్ లలో మొదటగా  ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసాక ఆ తర్వాత తెలుగు టూల్స్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయాలి . 


24, అక్టోబర్ 2015, శనివారం

Learn Photoshop Right Now

ఫోటోషాపుపై ఆసక్తి ఉండీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియోస్ (తెలుగులో) మీకోసం... www.rktechinfo.com

-------------------------------------------------
→ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-1 )

→ ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-2 )

→ మోనోక్రోమ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఫొటోషాప్ లో 

→ ఫొటోషాప్ను ఉపయోగించి passport ఫోటోలను తయారు చేయుట

→అను స్క్రిప్ట్ మేనేజర్ను విండోస్ 7, 8, 8.1 మరియు విండోస్ 10 లలో ఎలా ఉపయోగించాలి

→ఫోటోషాప్ CS6 మరియు CC [14.0] లలో తెలుగు ఎలా టైప్ చేయాలి

→ఫోటోలలో పర్సన్ యొక్క జుట్టు తొలగకుండా నీట్_గా బ్యాక్_గ్రౌండ్ మార్చుట

→వివిధ రంగులను కలిగి ఉన్న బ్యాక్_గ్రౌండ్_ను తొలగించి కావలసిన బ్యాక్_గ్రౌండ్ అప్లై చేయుట

→ఫ్రీ హ్యాండ్ టైపింగ్ ఫోటోషాపులో

→లేయర్ మాస్క్ ఫీచర్ ఉపయోగించుట

→బ్యానర్లు తయారీ నేర్చుకొనుటకు ప్రాథమిక అవగాహన

→తేలికైన పద్దతిలో డ్రస్ కలర్ మార్చుట

→ఆకుపై కృత్రిమ నీటి బిందువును సృష్టించుట

→అక్షరాలకూ మరియు లేయర్_కు లైటింగ్ ఎఫెక్టు


23, అక్టోబర్ 2015, శుక్రవారం

Post .gif Animations to Facebook

         

ఫేస్బుక్ లో .jpeg ఫోటో లను పోస్ట్ చేయడం సర్వసాధారణమే , కాని  ఈ మద్య వచ్చిన అప్డేట్ లో ఫేస్బుక్ లో అనిమేషన్ ఫోటోలను (.gif) లను కూడా అప్లోడ్ చేయడానికి వీలు కల్పించారు. 

      కాని ఇక్కడ ఒక చిక్కు ఉంది , అదేంటంటే .gif డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికి వీలు లేదు. మరి ఎలా అప్లోడ్ చేయాలి అంటారు అంతే కదా! చెప్తాను 

      ఎలా అంటే వెబ్ లో ఉన్న .gif ల యొక్క లింక్ లను పోస్ట్ చేయడం ద్వార అనిమేషన్ అయ్యే ఇమేజ్ లను కూడా మనం ఫేస్బుక్ లో పొందవచ్చు .

13, అక్టోబర్ 2015, మంగళవారం

How to Post Facebook And Twitter At a time


ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ప్రతీది ఆటోమేటిక్ గా ట్విట్టర్ లోకి కూడా పోస్ట్ అయితే ఎంత బాగుంటుందో కదా .!
అవును మరి ఈ ఆలోచన తోనే ఈ వీడియో ని మీకోసం YouTube ద్వారా అందించందం జరిగింది 
మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న ప్రతి ప్రోస్ట్ డైరెక్ట్ గా క్షణాలలో మీ ట్విట్టర్ ఎకౌంటు లోకి కూడా ట్వీట్ చేయబడడం ఎలానో తెలుసుకోవాలంటే  ఈ క్రింది వీడియో ని తప్పక చూడాల్సిందే 
మరిన్ని టెక్నికల్ వీడియోస్ అప్డేట్ కోసం మా యుట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు

video link : http://bit.ly/HSfb2twitter

2, అక్టోబర్ 2015, శుక్రవారం

How to Stop Auto Play Videos In Facebook

ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా   కొన్నిమార్పులు జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్ గా 

http://bit.ly/HSfbvidautoplay


ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న Auto-Play Videos ని ఆఫ్ చేస్తే సరిపోతుంది ..
మొబైల్ యాప్ వాడుతున్నవారు ఫేస్బుక్ అప్లికేషను లో యాప్ సెట్టింగ్ లోకి వేల్తితే అక్కడ ఆటో ప్లే వీడియోస్ ని ఆఫ్ చేస్కొనే అవకాశం ఉంది ..

18, జులై 2015, శనివారం

ఈ స్మార్ట్ ఫోన్ పగలదు , తడవదు



ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు.

అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. లిక్విడ్ మార్ఫియంతో 5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తెలిపింది. స్టీల్, అల్యూమినియం కంటే లిక్విడ్ మార్ఫియం పటిష్టంగా ఉంటుందని వెల్లడించింది. దీంతో తయారైన ఫోను షాక్, స్క్రీన్ బ్రేకేజీలను తట్టుకుంటుందని తెలిపింది.


యాపిల్ సంస్థ ఇప్పటికే ఈ లోహాన్ని ఐఫోన్ 6లో తక్కువ మొత్తంలో లిక్విడ్ మార్ఫియం వాడుతోంది. ఫోను లోపలి భాగాలకు నానో కోటింగ్ వేయడం వల్ల నీటిలో పడినా ఏమీ కాదని పేర్కొంది. ప్రైవసీ కీస్, లిక్విడ్ మెటల్, నానో కోటింగ్ ఫీచర్లపై ప్రాధానంగా దృష్టి సారించి ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ సీఈవో స్టీవ్ చయొ తెలిపారు. జూలై 31 నుంచి దీన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. 16జీబీ మోడల్ ధర సుమారుగా రూ. 27 వేలు.

17, జులై 2015, శుక్రవారం

How to Type Telugu In Photoshop Cs6 & CC(14.0)

ఫోటోలపై మంచి మంచి కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ?

అయితే వాటిని మంచి స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్.
కాని ఫోటోషాప్ లో తెలుగు రాయడం సాద్యం కాదని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.

ఫోటోషాప్ లో తెలుగు రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి.  ఉదాహరణకు అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి ఎన్నో రకాల ఫాంట్స్ ని ఉపయోగిస్తూ తెలుగు రాసుకోవచ్చు కాని అను స్క్రిప్ట్ మేనేజర్ లో రాయడానికి తెలుగు కీబోర్డ్ లేఔట్ లు తెలుసుకొని ఉండాలి అంటే ఆపిల్ , రోమ, ఫోనెటిక్ ఇలాంటివి.
 ఎంతైనా  అంత ఈజీ గా టైపు చేయలేము కొంచం కష్టమే మరియు అది ఫోటోషాప్ 7.0 లేదా 8.0(సి ఎస్) లో మాత్రమే సాద్యమౌతుంది.

గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి రాసినచో అక్షరాలూ విపోతుంటాయి. లేదా ప్రశ్నార్ధకాలు వస్తుంటాయి .

అయితే ఇప్పుడు ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ లు వచ్చాయి . అవి adobe photoshop cs6 (13.0) , Adobe Photosho CC (14.0). అయితే ఇందులో ఒక చిన్న చేంజ్ తో  గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు రాసే అవకాశం ఉంది .


  ఇలా తెలుగు ఈజీ గా టైపు చేయచ్చు . వివిధ రకాల బ్లెండింగ్ ఆప్షన్స్ అదే విధంగా స్టైల్స్ కూడా అదే విధంగా తెలుగు విజయం వారి ఫాంట్స్ కూడా ఉపయోగిస్తూ డిజైన్ చేసుకోవచ్చు
ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా చేసిన ఈ వీడియో లో చూడవచ్చు.



(గూగుల్ ఇన్పుట్ టూల్స్ గురించి తెలుసుకొనుటకు ఇక్కడ పై  క్లిక్ చేయండి: www.bit.ly/HSteGIT )

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు అదే విధంగా సలహాలు ఉంటె తెలియజేయగలరు నేను తప్పకుండ సమాధానం ఇస్తాను ..

మా  అప్డేట్స్ కోసం ఫేస్బుక్  పేజి  లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా వీడియో ఛానల్ : www.youtube.com/rayarakula
అదే విధంగా ఏమైనా కంప్యూటర్ కి సంబంధించిన  సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మీకు తప్పక సమాధానం దొరకుతుంది : గ్రూప్ లింక్ : www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

23, జూన్ 2015, మంగళవారం

How To Make Passport Photos in easy way using photoshop తెలుగులో



మన నిత్య జీవితం లో పాస్ ఫోటోలు చాల ఉపయోగపడుతుంటాయి. ఏదైనా అప్లికేషను నింపాలి అన్న పాస్ ఫోటో అదే విధంగా ఒక సిం కొనాలి అన్న పాస్ ఫోటో 

మరి ప్రతి సారి 40 నుంచి 100 రూపాయలు ఈ పాస్ ఫోటో లేక్ అవుతాయి. అదే మనమే చేస్కొంటే ఎలా ఉంటుంది ..  సింపుల్ గ 5 నుంచి 10 రూపాయలలో అయిపోతుంది ..  

మనకు చేయడం రాదూ కదా అంటారా?

దానికెందుకు చింత నేన్ ఉండగా.. అతి సులువుగా పాస్ ఫోటోలను మీ చేస్తా నేన్ చేయిస్తాను .  కేవలం మీ ఫోటో అండ్ మీ సిస్టం లో ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి ఉంటె చాలు .

ఈ ఐడియా ఏదో బాగుంది కదా .. అయితే మరెందుకు ఆలస్యం 

వెంటనే ఈ క్రింది లింక్ నుంచి వీడియో చూడండి. పాస్ ఫోటోలు ఏవిధంగా చేస్తారో తెలుసుకోండి .

Video link : http://bit.ly/HSpassphoto



ఈ వీడియో గనుక ఉపయోగకరమైనది అని మీరు బావిస్తే తప్పక షేర్ చేయండి. 

→ అలాగే మరిన్ని టెక్నికల్ సమాచారాల కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ని సందర్శించండి. 

→ అదే విధంగా మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని subscribe చేస్కొండి మా అప్డేట్ లను మీ మెయిల్ కి పొందండి. 

   youtube ఛానల్ లింక్ : www.bit.ly/HSrayarakula

→ మా official ఫేస్బుక్ పేజి : www.fb.com/heerasolutions

→మీకు కంప్యూటర్ లో ఏవైనా సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మా టెక్నికల్ టీం తప్పక స్పందిస్తారు 
మా గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u

→→ఈ పోస్ట్ పై లేదా వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదా నన్ను సంప్రదించండి ←←

రాయరాకుల కర్ణాకర్​
9014819428
rayarakula.karnakar@gmail.com
www.fb.com/rayarakula

16, జూన్ 2015, మంగళవారం

New Unread Messages Option in Facebook



ఫేస్బుక్ లో మరో కొత్త మార్పు .. 


ఇంతకు ముందు ఎవరైనా మెసేజ్ చేస్తే అది మనం చూస్కోక పోతే అది మల్లి వాళ్ళతో తిరిగి చాట్ చేసే సమయం  లోనే కనిపిస్తుంది లేదా unread మెస్సేజ్ లు  చూస్తేనే తెలుసుతుంది. మరి ఇలా అయితే కొన్ని మెసేజ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది.

 కాని కొత్తగా వచ్చిన మార్పు లో చాట్ బాక్స్ లో గ్రీన్ సిగ్నల్ పక్కన వాళ్ళు మెసేజ్ చేసి ఉంటె ఎన్ని మెసేజ్ లు అయితే చేసినారో అంత సంఖ్య పడుతుంది .
దీని ద్వార మనం ఈజీ గా మెసేజ్ లు వచ్చాయి అని చూస్కోవచ్చు. 

note: ఈ ఆప్షన్ కొందరికి ఎప్పుడో వచ్చి ఉంటుంది మరి కొందరికి ఇంకా రాక పోవచ్చు .. కాని త్వరలోనే అందరికి అప్డేట్ అవుతుంది . 

7, జూన్ 2015, ఆదివారం

How To Use Mail Merge

ఒక లెటర్ కావచ్చు లేదా సర్టిఫికేట్ కావచ్చు ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద డాక్యుమెంట్ తయారుచేయడం అంటే చాల కష్టం అంటే ఒకరు ఇద్దరు అయితే ఓకే కాని 100 మంది అయితే ?
అందుకే మనకి మెయిల్ మెర్జ్ అనే సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ ఆప్షన్ వలన ఒక లెటర్ ని ఒక్క నిమిషం లోనే అందరికి తయారుచేయవచ్చు .  మరి అది ఏవిధంగా చేయాలో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండ ఈ క్రింది లింక్ ద్వార వీడియో ని చూడాలి

వీడియో లింక్ : www.bit.ly/HSmailmerge



అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు .
Subscriber link : www.bit.ly/rayarakula

మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com
మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u
మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను.  
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

22, మే 2015, శుక్రవారం

Photoshop Online Course Registration Form

తెలుగు వారందరికీ అర్ధమయ్యే రీతిలో ఫోటోషాప్ కాసులు ఆన్లైన్ లో ఇంటినుండి కదలకుండానే ఇంటర్నెట్ లో కనెక్ట్ అయి నేర్చుకోవచ్చు . 

మరింత సమాచారం కోసం మా ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు .  9014819428, 7670980698



11, మే 2015, సోమవారం

Comment Reply Option in Facebook

ఇక నుంచి ఫేస్బుక్ లో  కామెంట్ లకి రిప్లై ఇచ్చే అద్బుత అవకాశం . ఇన్ని రోజులు కేవలం ఫేస్బుక్ పేజి లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కామెంట్ రిప్లై ఇప్పుడు ఫేస్బుక్ మొత్తానికి అందించారు.  ఈ ఆప్షన్ వలన మనం చేసే కామెంట్ పోస్ట్ కు చేస్తున్నామా లేదా పైనా ఉన్న కామెంట్ కి చేస్తున్నామా అనేది సులభంగా అర్ధం అవుతుంది .

ఇది వరకు ఒక పోస్ట్ యొక్క కామెంట్ కి కామెంట్ లు వస్తే అది అస్సలు పోస్ట్ కిచ్చరా లేక పై ఉన్న కామెంట్ కిచ్చరా అర్ధం కాక పోయేది కాని ఇప్పుడు ..  పైన ఉన్న పోస్ట్ కి కామెంట్ పెట్టాలంటే పాత పద్ధతే కాని ఎవరైనా ఇచ్చిన కామెంట్ కి రిప్లై లేదా కామెంట్ పెట్టాలంటే  రిప్లయ్ అనే సదుపాయం .. 

నోట్ : ఈ సదుపాయం కేవలం మనకు సంబంధించిన పోస్ట్ లకి మాత్రమే వస్తుంది . 

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ ఆప్షన్ కోసం ఇప్పుడు లభించింది ..  ఇక పై కామెంట్ కి రిప్లయ్ ఇచ్చే వాళ్ళు ఈ ఆప్షన్ ని తప్పక వాడుకోండి .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

12, ఏప్రిల్ 2015, ఆదివారం

Stickers on Uploading Photo

ఇక ఐ నుంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటో ల పై స్టికర్ లను అంటిస్తూ డిజైన్ చేస్కోవచ్చు 

ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయంలో ఈ క్రింది ఇమేజ్ లో వాలే మనకి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది దాని పై క్లిక్ చేయాలి 

వెంటనే మనకి ఈ క్రింది ఫోటో వాలే స్టికర్ లని కనిపిస్తుంది . క్లిక్ చేసి మనకి కావాల్సిన స్టికర్ ఎంచుకోవాలి 
 ఫైనల్ గా ఎంచుకొన్న స్టికర్ ని కావలసిన చోట ప్లేస్ చేసేసి డన్ పై క్లిక్ చేయడమే . 

ఈ  పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కంమ్మేంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేన్ తప్పక సమాదానం ఇస్తాను.

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ఫాల్లో అవగలరు .

రాయరాకుల కర్ణాకర్
9014819428