mobile లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mobile లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2017, సోమవారం

Review on 10.or G Mobile (New Arrival)

10.or G మొబైల్ రివ్యూ..
అయితే ఈ మొబైల్ గురించి చెప్పుకోవాలంటే మీరు ఈ మొబైల్ అధికార వెబ్సైటు ని సందర్శించాల్సిందే ఎందుకంటే ఒక మామూలు యూసర్ ఒక ఫోన్ లో ఏ ఫీచర్స్ అయితే కోరుకుంటాడో వాటికీ అనుగుణంగా ఈ మొబైల్ ని తయారు చేయడం జరిగింది ఆ విషయాలు తెలుసుకోవడానికి 10.or ఈ వెబ్సైటు లో frequently asked questions చదివితే అర్ధం అవుతుంది .
నోట్ : ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి విషయం ఈ మొబైల్ కి సంబంధించినదే, అలాగే కంపైర్ చేస్తున్నాం అంటే దాదాపు ఇదే ధరతో, ఇదే ఫీచర్స్ తో అందుబాటులో ఉన్న మొబైల్స్ తో కంపైర్ చేస్తున్నాము అని అర్ధం.

ఫోన్ లుక్
→ రెండు మోడల్ లలో వచ్చిన బ్లాకు అండ్ గ్రే కలర్స్ కి మీనింగ్ అందిస్తూ స్పూర్తిని కలిగించాఋ టేనార్ సంస్థ. 10.or G చూడడానికి సింపుల్ గా స్లిమ్ గా ఉంటుంది. చేతిలో పట్టుకొంటే జారిపోతుందేమో అనేవిధంగా స్మూత్ ఇచ్చాడు. అలా అని జారి ఏమి పోదు. అలాగే రెండు బ్యాక్ కెమెరాలు ఒక దాని కింద ఒకటి ఇచ్చాడు కావున చూడడానికి అందగానే కనిపిస్తాయి. ఇక పోతే అంత మెటల్ బాడీ కావున గ్రే కలర్ మోడల్ అందంగా కనిపిస్తుంది. బ్యాక్ కవర్ లు ఇప్పుడిప్పుడే టెనార్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. కావున వాటిని వేసాక అందం విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ఇక మొబైల్ లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే
కెమెరా
Ì మొదటగా ఈ మొబైల్ స్పెషల్ ఫీచర్ bokeh ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ కోసమే ప్రత్యేకమైనా కెమెరాను అమర్చారు (రెండు 13mp బ్యాక్ కెమెరాలు వున్నది విదితమే), ఈ ఎఫెక్ట్ ఫోకస్ ఆధారంగా ఉపయోగపడుతుంది.అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ లను కాప్చర్ చేస్తుంటే బాక్గ్రౌండ్ బ్లర్ అవడం, అలాగే బాక్గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్ లను తీస్తుంటే ఫ్రంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ బ్లర్ అవడం (ex. ఆకు పైనుంచి బాక్గ్రౌండ్ షూట్ చేయడం)
Ì  అంతే కాకుండా ఈ కెమెరా ద్వార కాప్చర్ చేసిన తర్వాత wide aperture effect ద్వారా ఇంకాస్తా బ్లర్ ఎఫెక్ట్ ని ఆడ్ చేస్కోవచ్చు. అది వేరే ఇమేజ్ గా సేవ్ అవుతుంది ఒరిజినల్ అలానే ఉంటుంది. తద్వారా ఆబ్జెక్ట్ ని ఇంకాస్తా హైలైట్ చేయవచ్చును.
Ì  ఇకపోతే నార్మల్ ఫొటోస్ కి వస్తే 13mp కి న్యాయం చేసినట్లుగా అయితే అనిపించట్లేదు కాని .. పిక్సెల్ బాగా ఉంది అలాగే డేలైట్ లో క్లారిటీ బాగుంది.
Ì  ఫ్రంట్ కెమెరా 16mp ఇది కూడా అంతగా సంతృప్తి ఉండదుకాని. పిక్సెల్ పరంగా బాగుంది డేలైట్ లో అద్బుతంగా వస్తాయి. సేల్ఫీ ఫ్లాష్ కొంచం బెటర్ అంతే పర్ఫెక్ట్ అని కాదు.
Ì బ్యాక్ ఫ్లాష్ లైట్ తీసుకుంటే రెడ్ బుల్బ్ లాగా వస్తుంది కావున ఫొటోస్ అంతగా బాగా ఏమి రావట్లేదు. అలాగే చిన్నగా వస్తుంది కావున దగ్గరా ఉన్న ఆబ్జెక్ట్ లైతే పర్లేదు. ఛార్జింగ్ ఉద్దేశం తో ఈ విధంగా చిన్న led ని అమర్చారు..
Ì బాటరీ విషయానికస్తే మొబైల్ లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంతగా ఏమి ఉండవు కావునా వాటి వినియోగం ఉండదు. అందువలన ఛార్జింగ్ బానే వస్తుంది. ఎటువంటి ఉపయోగం చేయక పోతే ఒక రోజు పైగానే ఛార్జింగ్ ఉంటుంది. వర్క్ చేస్తే ఒక డే మాత్రమే వస్తుంది. ఈ ప్రైస్ లో ఉన్న మిగితా మొబైల్స్ తో పోలిస్తే బెటర్ నే
Ì ఇక పోతే హీటింగ్ ప్రాబ్లం : సర్వసాధారణంగా ఇప్పుడు ఉన్న హై స్పీడ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ హీట్ ఎక్కడం సాధారణమే. కాని ఇతర మొబైల్ లతో కంపైర్ చేస్తే మరి అంతగా హీట్ ఏమి లేదు. కాని కొన్ని కొన్ని సందర్బాలలో ఒకసారి హీట్ అవుతున్నట్లు ఉంటుంది అంతే అది కూడా చాల తక్కువే. కాని ఎక్కువశాతం హీట్ ఏమి లేదు.
Ì VOLTE సపోర్ట్ చేస్తుంది కాని HD పేరుతో. ఈ ఆప్షన్ కి ఆన్ ఆఫ్ కూడా ఉంది.
Ì ఇక పోతే ఇతర మొబైల్ లలో ఉన్న ఫీచర్స్ ఇందులో లేవు. అంటే gestures లాంటివి ఎందుకంటే ఫింగుర్ ప్రింట్ స్పీడ్ అండ్ పెర్ఫార్మన్స్ అద్బుతంగా ఉన్నయికావున అవి లేకున్నా అంతగా ఏమి అనిపించదు.
Ì సౌండ్ విషయనికస్తే కాల్ విషయం లో అంతా బానే ఉందికాని లౌడ్ స్పీకర్ సౌండ్ డబ్బాలో మోగుతున్నట్టుగా వస్తుంది. అలాగే పాటలు పెట్టుకున్న అలానే వినసొంపు గా ఏమో లేదు. కాని చాల హై సౌండ్ ఉంది, రెండు పాయింట్స్ పెట్టుకొంటే చాలు మనకు సంతృప్తిగా ఉంటుంది.
Ì ఇక పోతే icons విషయానికస్తే celkon, karbban, lava మో|| మొబైల్ లలో ఉండే icons వలే ఉంటాయి కావున అంత అందంగా ఏమి కనిపించవు.
Ì  ఇక పోతే ఇందులో 4 జిబి ల రామ్ ఇవ్వడం జరిగింది. కాని మనం రెగ్యులర్ గా వాడే అప్లికేషన్స్ వేసుకున్నకా , ఆపరేటింగ్ సిస్టం మరియు మన యాప్స్ మొత్తం రెండున్నర GB లను వాదేసుకుంటాయి మనకు మిగిలేది 1 జిబి మాత్రమే..
Ì స్టోరేజ్ అయితే 64జిబి (58జిబి) మొత్తం సిస్టం 6.52 GB యాప్స్ 3 GB, ఇతరాలు 4 GB వాడుకుంటాయి. అంటే approx 14 జిబిల డేటా పోను మనకు మిగిలేది 44 GB.
Ì ఆండ్రాయిడ్ 7.0 కనుక ఏ చోటు నుంచి అయిన మనం అన్ని ఫీచర్స్ ని యాక్సెస్ చేస్కొనే విధంగా ఉంటుంది అనుకూలం. అలాగే ఓరియో కి అప్గ్రేడ్ కూడా అవుతుంది కనుక భవిష్యత్తులో వచ్చే ఫీచర్స్ అద్బుతంగా ఉండవచ్చు.
Ì టోటల్ గా గూగుల్ వాయిస్ అసిస్ట్ అనుమతి ఉంది కనుక రెస్పాన్స్ కూడా అద్బుతంగా ఉంటుంది. వాయిస్ recognition బాగుంది.
Ì టచ్ అద్బుతంగా ఉంది గొరిల్లా 3 గ్లాస్ తో వచ్చింది కావున చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది టచ్ స్మూత్ నెస్ అద్బుతంగా ఉంటుంది.

Ì కాల్ మాట్లాడుతున్న సమయంలో ఛార్జింగ్ ఎక్కువసేపు రావాలి కావున ఎలాంటి కాల్ రికార్డింగ్ లాంటివి పెట్టలేదు. తద్వారా బాక్గ్రౌండ్ ఎలాంటి అప్లికేషన్స్ రన్ అవవు కావున ఫోన్ హీట్ అవదు అలాగే ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉంటుంది.

Ì  ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే కాల్ మాట్లాడుతున్న సమయంలో ఎదుటి వారి మాట చిన్న వినిపిస్తున్నప్పుడు మనకు వాల్యూం బూస్టర్ అని ఒక icon ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే వాల్యూం బూస్ట్ అయి బెస్ట్ లెవెల్ వాల్యూంకి వచ్చేస్తుంది. 
   మరిన్ని అప్డేట్ లతో మల్లి కలుస్తాను..
    మీ కర్ణాకర్ 


27, మే 2016, శుక్రవారం

Lenovo K3 Note New Update





లెనోవో కే3 నోట్ లో మల్లి సరికొత్త అప్డేట్ 13 mb గల ఈ అప్డేట్ ద్వార పెర్ఫార్మన్స్ మరియు బగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది .. డౌన్లోడ్స్ అనే యాప్ కూడా తిరిగి వచ్చింది

30, ఏప్రిల్ 2016, శనివారం

Save Battery Life

ప్రస్తుత కాలంలో smartphone మన శరీరంలో ఒక భాగం అయ్యింది. ఎంత పనిలో నిమగ్నమై ఉన్న కూడా రోజులో ఒక గంటలో పది సార్లు notifications చూస్తుంటాము. whatsapp చూస్తూఉంటాము. అనవసరపు గ్రూప్ చాటింగ్ కూడా ఉంటాయి..

రోజు మొత్తం data connection or wifi ఆన్ చేసే ఉంచుతారు.
మితంగా చార్జింగ్‌.. అమితంగా బ్యాటరీ వాడకం.. అస్తమానం మొబైల్‌ వాడుతూ ఉండటం వల్ల చార్జింగ్‌ పెట్టేందుకు సాధారణంగా సమయం దొరకదు...మరి కొందరు రాత్రి మొత్తం చార్జింగ్‌ పెట్టి ఉదయమే తీస్తుంటారు. ఈ విధానం వల్ల బ్యాటరీ త్వరగా దాని సామర్థ్యం కోల్పోతూ ఉంటుంది.

బ్టాటరీ నిర్వాహణలో కొన్ని చిట్కాలు.

1) battery full అని చూపగానే చార్జింగ్‌ తీసే యాలి. అంతకన్నా ఎక్కువగా చార్జింగ్‌ ఉంచితే క్రమేణా దాని సామర్థ్యం కోల్పోతుంది.

2) సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్యలోనే చార్జింగ్‌ వాడకం ఉండాలి. 20 శాతం కన్నా తక్కువ చార్జింగ్‌ వాడుతున్నప్పుడు రేడియేషన్‌ కూడా ఎక్కు వగా ఉంటుందని నిపుణులు హెచ్చరిసున్నారు.

3) అవసరం మేరకే data connection ఆన్ చేసి, మిగతా సమయంలో off చేయాలి

4) display brightness మనకి కనిపించేలా తక్కువగా ఉండేలా చూస్కోవాలి. సెల్ఫ్ స్టడీ మోడ్ ఉంటె రాత్రి సమయం లో ఆన్ చేస్కోవాలి.

5) gps location అవసరం మేరకే ఆన్లో ఉంచాలి.దీని వల్ల battery తొందరగా discharge అవుతుంది.

6) power saver లాంటి సదుపాయాలు ఉంటె మనం వాడని సమయం లో ఆన్ చేస్కొంటే మంచిది.

7) ఛార్జింగ్ పెట్టి సెల్ఫోన్ వాడటం అంత మంచిది కాదు.

8) camera వాడుతున్నసమయం లో వాడకం ఐపోగానే బ్యాక్ వచ్చేయాలి.. కెమెరా స్టాండ్ బై పెట్టడం వలన అధికంగా discharge అవుతుంది.

9) ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో సెల్ ఫోన్ వాడకం అస్సలు మంచిది కాదు.

10) ఎండాకాలం ఎక్కువగా సెల్ వేడి అవుతా ఉంటుంది కావున వాడకం తగ్గించి. కూల్ weather లో ఉపయోగించడం మంచిది.

వీటిని అనుసరిస్తే చార్జింగ్ ఎక్కువ సేపు నిలుస్తుంది.

ముఖ్యమైనది ఎంటంటే చాలా మంది కంప్యూటర్లు, ల్యాప్ టాపులతో చార్జింగ్ పెడితే మంచిదేనా అనుకుంటారు.
*మామూలు చార్జర్‌తో 5 volts,1 amps విద్యుత్తు వస్తుంది. అదే కంప్యూటర్‌ యూఎస్‌బీ నుంచి 5 volts, 0.5 amps వస్తుంది.

*యాంప్స్‌ తేడా వల్ల చార్జింగ్‌ అయ్యే వేగం తగ్గుతుంది తప్పా వేరే ఇబ్బంది ఉండదు. సాధారణ చార్జర్‌తో వేగంగా అవుతుంది ఫోన్‌ కొంత మేర వేడెక్కుతుంది. అదే యూఎస్‌బీ నుంచి అయితే వేగం తక్కువైనా వేడి ఎక్కడం తక్కువగా ఉంటుంది.

*.యూఎస్‌బీ 3.0 నుంచి మాత్రం 0.900 యాంప్స్‌రావడం వల్ల సాధారణ చార్జర్‌కి దానికి పెద్దగా తేడా ఉండదు. పైగా నష్టం కూడా లేదు.

* యూఎస్‌బీ పెట్టిన వెంటనే మొబైల్లో వచ్చే ఆప్షన్ లలో ఛార్జింగ్ ఓన్లీ ఆప్షన్ ఎంచుకొంటే బాగుంటుంది.. ( అన్నిమొబైల్ లలో ఈ ఫీచర్ ఉండక పోవచ్చు)

*.యూఎస్‌బీ ద్వారా చార్జింగ్‌ చేసుకోవాలంటే సిస్టమ్‌ నుంచి నేరుగా పెట్టుకోవాలి తప్పాయూఎస్‌బీ హబ్‌ ద్వారా పెట్టుకోకూడదు. దానికి కనెక్ట్‌ చేసిన వేరు డివైస్‌ల వల్ల కొంత ఇబ్బంది కలిగి చార్జింగ్‌ అయ్యే విధానంలో వ్యత్యాసాలు ఏర్పాడతాయి.

25, జనవరి 2016, సోమవారం

Whats App Life time Validity offer Gives some More


ప్రస్తుత కాలం లో వాట్స్ ఆప్ ఎంత పాపులర్ నో  మనందరికీ తెలుసు 

అయితే ...

ఇంత వరకు సంవత్సరానికి 55 రూ|| చొప్పున తీస్కోని మనకి సర్వీస్ ని అందించేవారు .
అయితే ఇటివల కాలం లో ఎలాంటి రూపాయి ఆశించకుండా అందరికి లైఫ్ టైం సర్వీస్ ని అందించింది. 

మరి ఎం జరిగి ఉంటుంది అంటే .. వివరంగా చెప్తాను ,,, వినుకోండి 

ఇదివరకు మన వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్కోన్తుంది. అంటే ఆదాయం మన వద్ద నుంచి వస్తుంది కావున సరిపోయింది . మరి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేదు మరి ఎలా అంటే . ఇదవరకు డబ్బులు పే చేసాము కావున ఎలాంటి ఆడ్స్ మన వాట్స్ ఆప్ లో రాకపోయేవి. కాని ఇప్పుడు ఫ్రీ సర్వీస్ కావున ఇక పై మన వాట్స్ ఆప్ లో ఆడ్స్ వచ్చేస్తాయి.  చికాకు పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి. 


సంవత్సరానికి మనం ఇచ్చే 55 రూ కన్నా ఆడ్స్ ద్వారా ఒక్కరోజులో వచ్చే ఆదాయం 1000 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు విజ్ఞాన  నిపుణులు.

ఇంత వరకు ఎలాంటి ఆడ్స్ లేకుండా ప్రశాంతగా చాట్ చేస్కోన్నాము కదా . ఇప్పుడు ఇక ఎలానో ఏంటో. నాకు కూడా చాల ఫికర్ ఐతంది. చిరాకు పుట్టిస్తాయి కావున .

మరి పాపం #markzukerberg గారు ఆసితిలో 99% ఇచ్చాడు కదా మరి మల్లి కొంత అయినా సమకూర్చుకోవాలి కదా .

ఇది వాట్స్ ఆప్ లైఫ్ టైం validity అస్సలు కథ 



నా మట్టుకు మాత్రం ఎప్పటి లాగే hike నే ఎక్కువగా వాడుతాను.


24, డిసెంబర్ 2015, గురువారం

TrueCaller Devolopent




ట్రూ కాలర్ ఎం అభివృద్ధి అయింది .. 
చూస్తుంటే చూస్తుంటే చిన్న పిల్లగాడు పెద్దోడు అయినట్టు ,ఇది కూడా చూస్తంటే చూస్తంటే అభివృద్ధి అయిపోతుంది.
 మొదట్లో....  కాల్ వచ్చిన ఏదో ఒక నెంబర్ పేరు పడేది . 
నడిమిట్ల..... దాదాపు అన్ని కాల్స్ (unknown numbers) పేర్లు పడినాయి. 
మరి ఇప్పుడు అబ్బ అబ్బ అబ్బ ఎక్కడ unknown నెంబర్ కనిపిస్తే చాలు టక్కున నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది . unknown నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిన ఆ మెసేజ్ బాడీ లో unknown నెంబర్ ఉన్నా , మీద నోటిఫికేషన్ బార్ లో చటుక్కున్న  ప్రత్యక్షమైతంది ..

వాట్స్ యాప్  లో మెసేజ్ వచ్చిన అందులో unknown number  ఉన్న .. చూపిస్తుంది .  అబ్బ అబ్బ ఎం అభివృద్ధి ఎం అభివృద్ధి..

లెనోవో లో ఇంబిల్డ్ గా రావడం వలన ఇంకా చురుగ్గా పనిచేస్తుంది కాబోలు  


Hats off

28, జులై 2015, మంగళవారం

Some Technical Updates

కొన్ని ముఖ్యమైన అత్యవసర విషయాలు ..

1. మీరు మీ  సిస్టం లో తెలుగు టైపింగ్ చేయాలా ? www.bit.ly/HSteGIT
2. లేదా మీ మొబైల్ లో తెలుగు టైపు చేయాలా ? http://bit.ly/HStelugumata
3. ఫోటో షాప్ లో తెలుగు టైపు చేసి మంచి డిజైన్ లు తయారు చేయాలనుకుంటున్నారా? http://bit.ly/HStePS  
4. మీరు టీవీ రిమోట్ పని చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ? http://bit.ly/HSremote
5. మీ సిస్టం యొక్క పవర్ సప్లె సరిగా పని చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ? http://bit.ly/HSsmpstest
6. మీ విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ కి బదులు మీ పేరు పెట్టుకోవలనుకున్తున్నారా? http://bit.ly/HSstartxp
7. ఎర్రర్ రిపోర్టింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ? http://bit.ly/HSerrorreport
8. మీ పిల్లల్ని అశ్లీల , సెక్సువల్ కంటెంట్ ల నుంచి కాపాడుకోవాలంటే ?  http://bit.ly/HSdnsangel
9. మీ సిస్టం లో కొత్తగా విండోస్ 8 వేస్తే డీవీడీ డ్రైవ్ కనిపించడం లేదా అయితే ఒక పని  చేయాలి ? http://bit.ly/HSditectdvd
10. టోరెంట్స్ ని మీ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ తో త్వరగా డౌన్లోడ్ చేయాలి అనుకుటున్నరా ?  http://bit.ly/HStorrentIDM
11. ఆండ్రాయిడ్ మొబైల్ లో  స్క్రీన్ కాప్చర్ ఎలా చేయాలి ? http://bit.ly/HSscreencapture
12. కామర్స్ స్టూడెంట్స్ ఎక్కువగా వాడే సిటిజెన్ calculator ఎలా ఆఫ్ చేయాలో తెలుసా ? http://bit.ly/HSctizencalculator
13. ఆన్లైన్ లో షాపింగ్ చేయాలా ? http://bit.ly/HSshopingwebsites
14. అన్ని సదుపాయాలు కలిగిన బ్రౌజరు కావాలా ? http://bit.ly/HStorchbrowser
15. మొబైల్ సైట్స్ ని సిస్టం లో ఓపెన్ చేయాలి అనుకుటున్నరా ? http://bit.ly/HSoperaemulator
16. bootable USB ఎలా చేస్తారు ? http://bit.ly/HSbootableUSB
17. మీ పేరు ని మంచి స్టైల్స్ లో సెట్ చేస్కోవాలా ? http://bit.ly/HStext
18. మీకు నచ్చిన ఫాంట్స్ ని డౌన్లోడ్ చేస్కొని డిజైన్ చేస్కొండి . http://bit.ly/HSfonts
19. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఎలా backup చేయాలి ? http://bit.ly/HSappbr
20. ఆధార్ కార్డు ఆండ్రాయిడ్ అప్లికేషను http://bit.ly/HSaadharapp
21. ఫేస్బుక్ లో నచ్చిన వీడియోస్ ని డౌన్లోడ్ చేస్కోవలనుకుతున్నారా ? http://bit.ly/HSfbvideos
22. ఆండ్రాయిడ్ మొబైల్  లాక్ వేసి పాస్వర్డ్  మరిచిపోయారా ? http://bit.ly/HSpattern
23. అనుస్క్రిప్ట్ మేనేజర్ తో తెలుగు టైపు చేసి మంచి డిజైన్  చేకోవచ్చు , అదేలనో తెలుసుకోవలనుకుటున్నారా? www.bit.ly/HSanuSM  &  www.bit.ly/HSanuSM2
24. ఒకే జిమెయిల్ ఎకౌంటు లోకి లాగిన్ అయ్యి రెండు లేదా అంత కన్నా ఎక్కువ మెయిల్ id లను Access చేయవచ్చు తెలుసా? http://bit.ly/HS2in1mail
25. మన ఇండియన్ రూపీ సింబల్ ఎలా టైపు చేయాలో తెలుసా ? http://bit.ly/HSrupee
26. ఈజీ గా కాపీ మూవ్ లను చేయడానికి  http://bit.ly/HScopymove
27. స్క్రీన్ షాట్ లంటే ఏంటి ఎలా తీయాలి ? http://bit.ly/HSscreenshot
28. మీరు డౌన్లోడ్ చేసుకున్న మూవీ ఆడియో ఒకసారి , వీడియో ఒకసారి వస్తుందా ?  http://bit.ly/HSavsync
29. మల్టీ లాంగ్వేజ్ మూవీ ల గురించి తెలుసా ? http://bit.ly/HSMultiLanguageMovies
30. ఆండ్రాయిడ్ లో ఫైల్స్  స్పీడ్ ట్రాన్స్ఫర్ చేయలనుకుతున్నారా? http://bit.ly/HSflashtransfer
31. మెయిల్ మెర్జ్ అనే సదుపాయం అంటే ఏమిటి ? దానిని  ఎలా వాడాలి ? http://bit.ly/HSMailMerge
32. అస్సలే పలగని , నీటిలో తడవని స్మార్ట్ ఫోన్ గురించి మీకు తెలుసా?  http://bit.ly/HSsmartphone
33. Passport Size Photos ఎలా తయారు చేయాలో తెలుసా ? http://bit.ly/HSpassphotos
34. వైట్ వెంట్రుకలను ఫోటోషాప్ లో ఎలా కటింగ్ చేయాలి ? http://bit.ly/HSwhitehairs
35. వోటర్ మరియు ఆధార్ అనుసంధానం చేయాలా? http://bit.ly/HSepiclink
36. ఫేస్బుక్ లో అప్లోడ్ చేయబడుతున్న ఫోటో ఎడిటింగ్ ఎలానో తెలుసా ? http://bit.ly/HSfbuploadedit
37. ఫేస్బుక్ ON THIS DAY గురించి తెలుసా ? http://bit.ly/HSFBonthisday
38. అతి సులభంగా డ్రెస్ కలర్ చేంజ్ చేయాలా? http://bit.ly/HSspeedresschange
39. ఫోటోషాప్ నేర్చుకోవాలని ఉందా?  http://bit.ly/HSphotoshop
40. పాటలు వీడియో లు కట్టర్, కన్వటర్ చేయాలా ? http://bit.ly/HSrealplayer16
41. హైక్ లోని నటాషా గురించి తెలుసా ?  http://bit.ly/HShikenatasha
42. Whats app ని మీ కంప్యూటర్ లో వాడలనుకున్తున్నారా?  http://bit.ly/HSwhatsappsystem
43. SBI మొబైల్ బ్యాంకింగ్ గురించి తెలుసా ? http://bit.ly/HSSBImobilebanking
44. మీ ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ ని మీకు నచ్చినట్లుగా ఉంచలా ? http://bit.ly/HSnewsfeed
45. ఫోటోషాప్ లో నీటి బిందువులను తయారు తయారు చేయాలా? http://bit.ly/HSwaterdrops
46. ఫోటోషాప్ light brush effect గురించి తెలుసా ? http://bit.ly/HSlightbrush
47.  మీ కంప్యూటర్ లో సమస్యా ? అయితే దీని గురించి తెలుసుకోండి  http://bit.ly/HSTeamViewer
48. ఫోటోషాప్ 3D స్టైల్  డాకుమెంట్స్ కావాలా? http://bit.ly/HS3Dstyles
50. ఉచిత ఆపరేటింగ్ సిస్టంస్ కావాలా? http://bit.ly/HSfreeOS
51. ఫోటో ఫ్రేమ్స్ కావాలా ?   http://bit.ly/HSframespsd
52. మీ ఫేస్బుక్ ఎకౌంటు ని పూర్తిగా తీసివేయాలా ? http://bit.ly/HSdeletefb
56. లోగో లు తయారు చేయుట లో టెక్స్ట్ గురించి http://bit.ly/HSfreehandtyping
57. అతిత్వరగా ఆండ్రాయిడ్ మొబైల్ లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలా ? http://bit.ly/HSflashtransfer
58. మీ సిస్టం లో లో స్క్రీన్ కాప్చర్ ఎలా తీయాలి ? http://bit.ly/HSScreenShot
59. మీ ఫేస్బుక్ లో మీకు ఇబ్బంది పెట్టె పోస్ట్ లు రాకుండా చేయాలా ? http://bit.ly/HSfbnewsfeed
60. కాపీ ఫోల్డర్ మరియు మూవ్ ఫోల్డర్ ఆప్షన్స్ కావాలా ? http://bit.ly/HScopymoveoptions
61. ఫేస్బుక్ లోని వీడియోస్ డౌన్లోడ్ చేయాలా ? http://bit.ly/HSFBvideos
62. మీ మొబైల్ పాటర్న్ లాక్ మరిచి పోయారా? http://bit.ly/HSPatternLock
63.  ఆండ్రాయిడ్ అప్ప్స్ మీ మెమరీ లోకి బ్యాక్అప్ పెట్టండి ఇలా http://bit.ly/HSbackupandrestore
64. మీ సెర్చ్ బాక్స్ లోనే గూగుల్ సెర్చ్ చేయాలా ? http://bit.ly/HSsearchsearch
65. మీ వాట్స్ అప్ మిత్రులందరికీ ఒకేసారి మెసేజ్ చేయాలా ? http://bit.ly/HSsendwhatsapp
66.  ఫోటోషాప్ నుపయోగించి బాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకోండి http://bit.ly/HShaircuttingPS
67. విండోస్ xp ఆన్ ఆఫ్ అయ్యే సమయం లో మనకి నచ్చిన సౌండ్ లను పెట్టుకోవాలా? http://bit.ly/HSsounds
68.  facbook ట్యాగ్ లతో ఇబ్బంది పడుతున్నారా ? http://bit.ly/HScontrolfbtags
69. మౌస్ లేకుండా మౌస్ కర్సర్ ని ఇలా ఎలా వాడాలి ? http://bit.ly/HScursor
70. ఫోటోషాప్ లో మంచి ఎఫెక్ట్ నేర్చుకోవలనుకుంటున్నారా ? http://bit.ly/HSPSeffects
71. ఎవరికీ కనిపిచంని ఫోల్డర్ కావాలా ? http://bit.ly/HSinvisible
72. మీ పేరును డిజైన్ చేస్కోవలా ? http://bit.ly/HStextstyles

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ పోస్ట్ ల కొరకు మా బ్లాగ్ లో జాయిన్ అవ్వండి . www.heerasolutions.blogspot.com

వీడియోస్ కోసం మా YouTube ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు

ఇవ్వే కాదు  ఇంకా ఫోటోషాప్ , కంప్యూటర్ టిప్స్ ఇలా ఇంకెన్నో పోస్ట్ లు వీడియోస్ లు వీటన్నింటిని మిస్ అవ్వకండి .

www.youtube.com/rayarakula లో మా వీడియోస్ చూడవచ్చు .. భవిష్యత్తు లో మేం చేసే పోస్ట్లు

మీ మెయిల్ కి పొందడానికి మా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కో గలరు .

వీటిపై ఏవైనా సందేహాలు ఉంటె తెలియజేయగలరు . సరైనా సమాదానం ఇస్తాను ..


→ ఇంకా చేరువలో ←
మా  facebook పేజి : www.facebook.com/heerasolutions
ఫేస్బుక్ గ్రూప్ : https://www.facebook.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్                
www.facebook.com/rayarakula
rayarakula.karnakar@gmail.com
9014819428



ఈ సమాచారం ఉపయోగకరమని మీరు భావిస్తే మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి 

18, జులై 2015, శనివారం

ఈ స్మార్ట్ ఫోన్ పగలదు , తడవదు



ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు.

అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు అమెరికాకు చెందిన టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. లిక్విడ్ మార్ఫియంతో 5.5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తెలిపింది. స్టీల్, అల్యూమినియం కంటే లిక్విడ్ మార్ఫియం పటిష్టంగా ఉంటుందని వెల్లడించింది. దీంతో తయారైన ఫోను షాక్, స్క్రీన్ బ్రేకేజీలను తట్టుకుంటుందని తెలిపింది.


యాపిల్ సంస్థ ఇప్పటికే ఈ లోహాన్ని ఐఫోన్ 6లో తక్కువ మొత్తంలో లిక్విడ్ మార్ఫియం వాడుతోంది. ఫోను లోపలి భాగాలకు నానో కోటింగ్ వేయడం వల్ల నీటిలో పడినా ఏమీ కాదని పేర్కొంది. ప్రైవసీ కీస్, లిక్విడ్ మెటల్, నానో కోటింగ్ ఫీచర్లపై ప్రాధానంగా దృష్టి సారించి ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు టర్నింగ్ రొబొటిక్ ఇండస్ట్రీస్ సీఈవో స్టీవ్ చయొ తెలిపారు. జూలై 31 నుంచి దీన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. 16జీబీ మోడల్ ధర సుమారుగా రూ. 27 వేలు.

7, జూన్ 2015, ఆదివారం

How To Use Mail Merge

ఒక లెటర్ కావచ్చు లేదా సర్టిఫికేట్ కావచ్చు ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద డాక్యుమెంట్ తయారుచేయడం అంటే చాల కష్టం అంటే ఒకరు ఇద్దరు అయితే ఓకే కాని 100 మంది అయితే ?
అందుకే మనకి మెయిల్ మెర్జ్ అనే సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ ఆప్షన్ వలన ఒక లెటర్ ని ఒక్క నిమిషం లోనే అందరికి తయారుచేయవచ్చు .  మరి అది ఏవిధంగా చేయాలో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండ ఈ క్రింది లింక్ ద్వార వీడియో ని చూడాలి

వీడియో లింక్ : www.bit.ly/HSmailmerge



అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు .
Subscriber link : www.bit.ly/rayarakula

మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com
మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u
మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను.  
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

Send Message to All Members At a Once Whats App

మన నిరంతర కాలం లో వాట్స్ యాప్ ఇప్పుడు ఒక బాగంగా మారిపోయింది. ఏ విషయం అయినా సరే వాట్స్ యాప్ లో యిట్టె అందరికి పాకేస్తుంది. 

ఏదైనా విషయాన్నీ ఒకే సారి మన మిత్రులందరికీ లేదా ఎక్కువగా మనతో చాట్ చేసే మిత్రులకు, షేర్ చేయాలంటే మెసేజ్ చేయాలంటే ఎలా? చేయొచ్చు చాల సులభం. మరి అది ఎలానో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వచ్చే వీడియో ను తప్పక చూడాల్సిందే.


Video link : www.bit.ly/HSbroadcast






అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు .
Subscriber link : www.bit.ly/rayarakula

మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com
మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u
మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను.  
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com