photoshop లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
photoshop లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2019, శనివారం

Imagenomic Plugin

Imagenomic Plugin ఫర్ ఫోటోషాప్... పేస్ రిటచ్ (మేకప్ లాగ) అంటే క్లీన్ చేయడం స్మూత్ గా చేయడం వంటివి.. ఇవి వాడడం చాల ఈజీ, ఇందులో ప్రతి దానికి గైడ్ కూడా ఉంటుంది అది చూసి మీరు అర్ధం చేస్కోవచ్చు .


ఈ ప్లగ్ ఇన్ లో మొత్తం మూడు ఫిల్టర్స్ ఉంటాయి. అవి

Noiseware
Portraiture
RealGrain

ప్రతి దానికి కీ మీకు ఈ ఫైల్ లోనే వస్తుంది . అలాగే గైడ్ కూడా.. వాస్తవానికి ఇవి చాల అద్బుతమైన ఫిల్టర్స్. మంచి క్వాలిటీ ఫోటోలపై వాడి చూడండి మీకు deference తెలుసుతుంది...

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

How to Create Touch Image on Whats App Using Photoshop


మహాశివరాత్రి శుభాకాంక్షలతో .........
కొత్త వీడియో వచ్చేసింది అది కూడా ఫోటోషాప్ దే ..
వాట్స్ యాప్ లో పండుగల సందర్భంగా వచ్చే టచ్ ఇమేజ్ లు చాల ఫేమస్ .. అయితే వాటిని మనం ఎవరో పంపిస్తే చూస్తున్నమే తప్ప మనమే కొత్తగా చేయట్లేదు. అందుకే స్వంతగా అలాంటి ఇమేజ్ లను ఎలా తయారుచేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
నేను ఇప్పటి వరకు చేసిన టచ్ ఇమేజ్ లను మీరు చూసే ఉంటారు. అయితే అవి అంత ఎఫెక్టివ్ గ రావడానికి కారణం పర్ఫెక్ట్ క్రియేషన్ మీరు కూడా అలా చేయాలన్నదే నా ఆశయం అందుకే ఈ వీడియో మీకోసం ఇస్తున్నాను .. తప్పక చూడండి .

వీడియో చూసిన తర్వాత వీడియో పై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ ద్వార తెలపండి . వీడియో నచ్చితే లైక్ కొట్టడం మరవకండి. అలాగే వీడియో ఉపయోగకరమని భావిస్తే తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి

9, నవంబర్ 2017, గురువారం

How to Create Oil Paint,Digital Paintig with Effectiveness Part 2

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న ఆయిల్ పెయింటింగ్ ఫొటోస్ మరి వాటిని ఎలా అద్బుతంగా తయారు చేయాలో ఈ వీడియో లో చూడవచ్చు.
Link : Oil painting with effectiveness


ఇదివరకే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్కోవాలి అలాగే దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూచుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
పార్ట్ 1 వీడియో : How to create oil paint

మరి ఈ వీడియో లో అదే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఎడిట్స్ చేస్తూ మీ ఫోటోని అద్బుతంగా డిజిటల్ పెయింటింగ్ వలే ఏ విధంగా మార్చాలో తెలియజేయండి జరిగింది . తప్పక చూడండి .
ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి.
Share to All.


రాయరాకుల కర్ణాకర్

14, మార్చి 2017, మంగళవారం

Alternate of Photoshop

ఏదైనా ఫోటోని ఎడిట్ చేయాలంటే మనం సాధారంగా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్ లను యూస్ చేస్తుంటాము . అయితే ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి లేని చొ ఎలా ?

ఇన్స్టాల్ అయి లేక పోతే ఏంటి ఇంటర్నెట్ ఉంటె చాలు.
డౌన్లోడ్ చేస్కోవడానికి అనుకుంటున్నారా ? అంత టైం లేదండి ..

ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించడమే ..!
క్రింద ఇచ్చిన లింక్ లను ఓపెన్ చేస్తే అచ్చం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ కలిగి ఉన్న సైట్ ఓపెన్ అవ్తుంది. అంతే మొత్తం ఫోటోషాప్ లో చేసుకొనే సదుపాయాలు దాదాపు అన్ని ఉన్నాయి. కొన్ని మాత్రమే చేయలేము .

ఫోటో అప్లోడ్ చేసి ఎడిట్ చేస్కొని మల్లి డౌన్లోడ్ చేస్కోవడమే.

→PIXLR← Pixlr

Is available on the interface design and close more than Photoshop can be edited with your photos and add effects you want and write it

→SUMOPAINT← Sumopaint

Site is much closer than Photoshop more than the first site, and is available on a variety of settings very adjustable on your photos

5, జులై 2016, మంగళవారం

Vector Designs

వీటిని వెక్టార్ డిజైన్స్ అంటారు.. వీటికి మంచి కలర్ వేసి లేదా gradient వేసి కార్నోర్ లో పెడితే చాల బాగుంటది. ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్కొని.. వాడండి.
బ్లాకు లో కావాలంటే multiply పెట్టుకున్న సరిపోతాది.

open the image right click and save image .thats it 

26, జూన్ 2016, ఆదివారం

Oil Paint Effect in Photoshop CS5

ఫోటోషాప్ నుపయోగించి ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ ఏవిధంగా తయారు చేయాలన్నది మనం
ఈ వీడియో ని చూసి నేర్చుకోవచ్చు ఒక్కో డిజైన్ అద్బుతంగా తయరుచేస్కోవచ్చు
.. నేను చేసిన ఎఫెక్ట్ లను చూసి మీరే అర్ధం చేస్కోవచ్చును. ఈ వీడియో
లో ఫోటోషాప్ cs5 వాడి చేయడం జరిగింది ... ఎలా చేయాలన్నది ఈ వీడియో
చూస్తే మీకే అర్ధం అయితది .

5, జూన్ 2016, ఆదివారం

corner vector designs psd file for photoshop

ఇక్కడ కనిపిస్తున్న యీ ఇమేజ్ లోఉన్న కార్నెర్ vector  డిజైన్ ల psd file ను డౌన్లోడ్ చేసుకొనుటకు యీ క్రింది లింక్ పై క్లిక్ చేసి గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేస్కోగలరు.  



27, మే 2016, శుక్రవారం

Wonderful Photography Forever


ఈ ఫోటో తీయడానికి.. ఫోటోగ్రాఫర్.. 18 కెమేరాలను ఉపయోగించి.. 62 రోజులు ఎదురుచూశాడట.. 
ఇందులో గొప్ప ఉముంది అంటారా...??
మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నట్టు అయితే.. మీ ఫోనుని రివర్స్ చేసి చూడండి.. మీకే తెలుస్తుంది...
ఈ ఫోటో.. ప్రపంచములోనే అద్భుతమైన... గొప్ప చిత్రంగా ఎన్నుకోబడింది...
హాట్సాఫ్..

20, మే 2016, శుక్రవారం

Some Documents to learn Photoshop

కొన్నిఫోటోషాప్ డాకుమెంట్స్ మీకోసం..  నా తరఫున..  నా ఫోటోషాప్ వీడియోస్  చూసిన తప్పక ట్రై చేయండి..

ఫోటోషాప్ వీడియోస్ లింక్: https://www.youtube.com/playlist?list=PLKPUn2pFhrh731EhUW-mJwK8ebX_4IN5c

డాకుమెంట్స్ లింక్: https://drive.google.com/open?id=0B58hGceAo-QZdlJaV2VJbmNKVVE

1, మే 2016, ఆదివారం

learn Photoshop Today and Now

ఎవరైనా ఫేస్బుక్ లో ఏదైనా ఫోటో ఫోటోషాప్ లో ఎడిట్ చేసి అద్బుతంగా మలిచి పెడితే వావ్.... అనాలి అనిపిస్తుంది .

ఒక్క సారి ఆలోచించండి మరి మనే అలా ఫొటోస్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని .. అలా ఊహ నే ఎంత బాగుందో కదా .. బాగుంటుంది మరి . మరి


మరి నేన్ ఉన్నదీ ఎందుకు మీకు ఏదైనా నేర్పించడానికే . అందుకో మీకోసం ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ ని youtube లో అప్లోడ్ చేస్తున్నాను . నెమ్మదిగా ఫోటోషాప్ నేర్చుకొని మీరు కూడా ఫొటోస్ ని ఆధారగోట్టేయాలి మరి .అందుకే ఇక్కడ నేన్ ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక్క ప్లే లిస్టు గా మర్చి లింక్ అందిస్తున్నాను . ఒక్కోట్టిగా అన్ని చూసేయండి .. ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి వెంటనే కాక పోయిన ఎప్పటికైనా మీ పోస్ట్ లని చూసి ఇతరులు వావ్ అనేలా ఉంటుంది .

మరి రెడీ నా .. ఇదిగోండి ప్లే లిస్టు లింక్ ..


పోస్ట్ చూసి చదివి .. ఇప్పుడు ఏముంది లే తర్వాత చూద్దాం అని వోదిలేయకండి . అలా అలా సరదాకి ఒకటి రెండు చూడండి మీకే ఆసక్తి వస్తుంది . ఎందుకంటే సరళమైన రీతిలో అందరికి అర్ధం అయ్యేలా వీడియోస్ చేసాను .. ఏమైనా సందేహాలున్న తప్పక సంప్రదించవచ్చు . ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను .. ఒక వేలా చూడడానికి సమయం అనుకరించక పోతే బుక్ మార్క్ అయిన చేసి పెట్టుకోండి . వీలు ఉన్నప్పుడు చూడండి .

వీడియోస్ చూసాక మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయాలి మరి .. వెయిట్ చేస్తా ఉంటాను .. మీ రిప్లై కోసం ..

మీ కర్ణా



2, ఏప్రిల్ 2016, శనివారం

Anurag 10

http://bit.ly/1gniWxr

అనురాగ్ సాఫ్ట్వేర్ : ఫోటోషాప్ లో పేస్ మేకప్ కి మంచి టూల్స్ ని అందించే సాఫ్ట్వేర్ ఈ అనురాగ్ ఈ అప్లికేషను ఓన్లీ ఫోటోషాప్ 7.0, cs, cs2 , cs3 లకు మాత్రమే వస్తుంది

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

3D effect Using Photoshop telugulo

వీక్షకులందరికి నమస్కారములు 
అతి సులభమైన రీతిలో అందరికి అర్ధమయ్యే సరలమైనా బాషలో వీడియో ని తయారుచేయడం జరిగింది. మీ పేరును కాని లేదా ఇతర ఏ లేయర్ అయినా ఈ విధంగా సింపుల్ గా డిజైన్ చేయవచ్చును. పెద్దగా లోతైనా ఆప్షన్ ఏమి వాడకుండా మనం రెగ్యులర్ గా చూస్తే ఆప్షన్ నే వాడి చేయడం జరిగింది . తప్పక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫోటోషాప్ లోని 7.0, 8.0 ఇలా ఏ వెర్షన్ లోనైనా ఈ ట్రిక్ ని యూస్ చేయవచ్చును, లేటెస్ట్ వెర్షన్ ఫోటోషాప్ లలో 3D ఆప్షన్ ఇప్పటికి అందుబాటులో ఉన్న దానికి హై గ్రాఫిక్స్ కావలసి ఉంటుంది. కాని ఈ వీడియో లో చూపిన దానికి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం లేదు .కావున తప్పక చూడండి . స్వంతగా డిజైన్ చేయండి . తప్పకుండ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి నాకు ట్యాగ్ చేయండి. 

వీడియో లో ఏమైనా సందేహాలు , సలహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు.

15, జనవరి 2016, శుక్రవారం

16, డిసెంబర్ 2015, బుధవారం

2,00,000 Views for Dress Color Changing

  



    ఇంకో పదిహేను వ్యూస్ వస్తే చాలు .. 2,00,000 (రెండు లక్షలు ) వ్యూస్.

వీడియో లింక్ : Change Dress Color


నాకు చాల సంతోషంగా ఉంది . ఈ వీడియో ఇంత ప్రాచుర్యం చెందుతది అనుకోలేదు . 

నన్ను అనుసరిస్తూ సహకరిస్తూ మిత్రులకు , వీడియో వీక్షకులకు, అభిమానులకు  నా హృదయ పూర్వక ధన్యవాదాలు

4, డిసెంబర్ 2015, శుక్రవారం

Designed Name



మీ పేరు కూడా ఇలా డిజైన్ చేస్కోవాలి అని ఉందా ?  అయితే నేను మీకు తప్పక హెల్ప్ చేస్తాను.

ఫోటోషాప్ నుపయోగించి ఇలాంటి డిజైన్ చేస్కోవచ్చు అయితే ఈ పేరు డిజైన్ ఫైల్ ని మీకు .psd (Photoshop Document) ఫైల్ ఇక్కడ లింక్ ఇస్తున్నాను దాని నుంచి మీరు ఫైల్ డౌన్లోడ్ చేస్కొని winrar సహాయంతో ఎక్స్ట్రాక్ట్ చేసి ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తే సరిపోతుంది .

psd ఫైల్ లింక్ :https://www.facebook.com/download/952458271498352/name.rar

మీ పేరు తో ఎడిట్  చేసాక  తప్పక ఫేస్బుక్ లో అప్లోడ్ చేయండి వీలైతే నన్ను ట్యాగ్ కూడా చేయండి .

నా వాళ్ళ మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు అని సంతోషిస్తాను

24, అక్టోబర్ 2015, శనివారం

Learn Photoshop Right Now

ఫోటోషాపుపై ఆసక్తి ఉండీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియోస్ (తెలుగులో) మీకోసం... www.rktechinfo.com

-------------------------------------------------
ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-1 )

ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-2 )

మోనోక్రోమ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఫొటోషాప్ లో 

ఫొటోషాప్ను ఉపయోగించి passport ఫోటోలను తయారు చేయుట

అను స్క్రిప్ట్ మేనేజర్ను విండోస్ 7, 8, 8.1 మరియు విండోస్ 10 లలో ఎలా ఉపయోగించాలి

ఫోటోషాప్ CS6 మరియు CC [14.0] లలో తెలుగు ఎలా టైప్ చేయాలి

ఫోటోలలో పర్సన్ యొక్క జుట్టు తొలగకుండా నీట్_గా బ్యాక్_గ్రౌండ్ మార్చుట

వివిధ రంగులను కలిగి ఉన్న బ్యాక్_గ్రౌండ్_ను తొలగించి కావలసిన బ్యాక్_గ్రౌండ్ అప్లై చేయుట

ఫ్రీ హ్యాండ్ టైపింగ్ ఫోటోషాపులో

లేయర్ మాస్క్ ఫీచర్ ఉపయోగించుట

బ్యానర్లు తయారీ నేర్చుకొనుటకు ప్రాథమిక అవగాహన

తేలికైన పద్దతిలో డ్రస్ కలర్ మార్చుట

ఆకుపై కృత్రిమ నీటి బిందువును సృష్టించుట

అక్షరాలకూ మరియు లేయర్_కు లైటింగ్ ఎఫెక్టు


1, ఆగస్టు 2015, శనివారం

Banner Creation Using Photoshop

చాల మంది అడుగుతుంటారు . ఒక ఈవెంట్ కి బ్యానర్ , ఫ్లెక్స్ లాంటివి ఫోటోషాప్ లో ఎలా తయారుచేయాలి అని. అవూ మరి బ్యానర్ కాని ఫ్లెక్స్ కాని ఫోటోషాప్ లో డిజైన్ చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి అంతే కాక కొన్ని జాగ్రతలు పాటించాలి అనే విషయాలను మీకు తెలియపరుచుటకు ఈ వీడియో చేయడం జరిగింది .. 
వీడియో లింక్ : http://www.bit.ly/HSbanner 
తప్పక అందరు చూడగలరు .
అదే విధంగా ఎవరి టాలెంట్ వారిది ఎవరి knowledge వారిది .. అలాగే ఎవరి క్రియేటివ్ థాట్ వారిది .. కావున బ్యానర్ క్రియేషన్ లో ఎలా చేయాలి అనేది వారి వారి ఆలోచనల పై ఆధారపడి ఉంటుంది . అంతే కాని ఒకరి చెప్పినట్లుగా చేస్తే అది మన క్రియేషన్ గా గుర్తించబడదు. ఇక పోతే ఫోటోషాప్ టూల్స్ గురించి చెప్పిన వీడియో ఆధారంగా మిగితా డిజైన్ అంత మనం చేస్కోవచ్చు .

ఫోటోషాప్ టూల్స్ పార్ట్ 1 : http://bit.ly/HSPStools
ఫోటోషాప్ టూల్స్ పార్ట్ 2 : http://bit.ly/HSPStools2 

ఈ వీడియో లపై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె తప్పక తెలియజేయగలరు.
మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని Subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula 
మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల  కోసం మా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు : www.heerasolutions.blogspot.com 
మా అప్డేట్ లను ఫేస్బుక్ లో పొందుటకు మా పేజి ని లైక్ చేయగలరు : www.fb.com/heerasolutions 
మీ కంప్యూటర్ లో ఏమైనా సందేహాలు ఉంటె మా గ్రూప్ లో ప్రాబ్లం ని స్క్రీన్ షాట్ జత చేసి పోస్ట్ చేయగలరు . మీకు తప్పక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది 
గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

17, జులై 2015, శుక్రవారం

How to Type Telugu In Photoshop Cs6 & CC(14.0)

ఫోటోలపై మంచి మంచి కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ?

అయితే వాటిని మంచి స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్.
కాని ఫోటోషాప్ లో తెలుగు రాయడం సాద్యం కాదని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.

ఫోటోషాప్ లో తెలుగు రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి.  ఉదాహరణకు అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి ఎన్నో రకాల ఫాంట్స్ ని ఉపయోగిస్తూ తెలుగు రాసుకోవచ్చు కాని అను స్క్రిప్ట్ మేనేజర్ లో రాయడానికి తెలుగు కీబోర్డ్ లేఔట్ లు తెలుసుకొని ఉండాలి అంటే ఆపిల్ , రోమ, ఫోనెటిక్ ఇలాంటివి.
 ఎంతైనా  అంత ఈజీ గా టైపు చేయలేము కొంచం కష్టమే మరియు అది ఫోటోషాప్ 7.0 లేదా 8.0(సి ఎస్) లో మాత్రమే సాద్యమౌతుంది.

గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి రాసినచో అక్షరాలూ విపోతుంటాయి. లేదా ప్రశ్నార్ధకాలు వస్తుంటాయి .

అయితే ఇప్పుడు ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ లు వచ్చాయి . అవి adobe photoshop cs6 (13.0) , Adobe Photosho CC (14.0). అయితే ఇందులో ఒక చిన్న చేంజ్ తో  గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు రాసే అవకాశం ఉంది .


  ఇలా తెలుగు ఈజీ గా టైపు చేయచ్చు . వివిధ రకాల బ్లెండింగ్ ఆప్షన్స్ అదే విధంగా స్టైల్స్ కూడా అదే విధంగా తెలుగు విజయం వారి ఫాంట్స్ కూడా ఉపయోగిస్తూ డిజైన్ చేసుకోవచ్చు
ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా చేసిన ఈ వీడియో లో చూడవచ్చు.



(గూగుల్ ఇన్పుట్ టూల్స్ గురించి తెలుసుకొనుటకు ఇక్కడ పై  క్లిక్ చేయండి: www.bit.ly/HSteGIT )

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు అదే విధంగా సలహాలు ఉంటె తెలియజేయగలరు నేను తప్పకుండ సమాధానం ఇస్తాను ..

మా  అప్డేట్స్ కోసం ఫేస్బుక్  పేజి  లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా వీడియో ఛానల్ : www.youtube.com/rayarakula
అదే విధంగా ఏమైనా కంప్యూటర్ కి సంబంధించిన  సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మీకు తప్పక సమాధానం దొరకుతుంది : గ్రూప్ లింక్ : www.facebook.com/groups/PCSolutions4u

రాయరాకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

23, జూన్ 2015, మంగళవారం

How To Make Passport Photos in easy way using photoshop తెలుగులో



న నిత్య జీవితం లో పాస్ ఫోటోలు చాల ఉపయోగపడుతుంటాయి. ఏదైనా అప్లికేషను నింపాలి అన్న పాస్ ఫోటో అదే విధంగా ఒక సిం కొనాలి అన్న పాస్ ఫోటో 

మరి ప్రతి సారి 40 నుంచి 100 రూపాయలు ఈ పాస్ ఫోటో లేక్ అవుతాయి. అదే మనమే చేస్కొంటే ఎలా ఉంటుంది ..  సింపుల్ గ 5 నుంచి 10 రూపాయలలో అయిపోతుంది ..  

మనకు చేయడం రాదూ కదా అంటారా?

దానికెందుకు చింత నేన్ ఉండగా.. అతి సులువుగా పాస్ ఫోటోలను మీ చేస్తా నేన్ చేయిస్తాను .  కేవలం మీ ఫోటో అండ్ మీ సిస్టం లో ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి ఉంటె చాలు .

ఈ ఐడియా ఏదో బాగుంది కదా .. అయితే మరెందుకు ఆలస్యం 

వెంటనే ఈ క్రింది లింక్ నుంచి వీడియో చూడండి. పాస్ ఫోటోలు ఏవిధంగా చేస్తారో తెలుసుకోండి .

Video link : http://bit.ly/HSpassphoto



ఈ వీడియో గనుక ఉపయోగకరమైనది అని మీరు బావిస్తే తప్పక షేర్ చేయండి. 

→ అలాగే మరిన్ని టెక్నికల్ సమాచారాల కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ని సందర్శించండి. 

→ అదే విధంగా మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని subscribe చేస్కొండి మా అప్డేట్ లను మీ మెయిల్ కి పొందండి. 

   youtube ఛానల్ లింక్ : www.bit.ly/HSrayarakula

→ మా official ఫేస్బుక్ పేజి : www.fb.com/heerasolutions

→మీకు కంప్యూటర్ లో ఏవైనా సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మా టెక్నికల్ టీం తప్పక స్పందిస్తారు 
మా గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u

→→ఈ పోస్ట్ పై లేదా వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదా నన్ను సంప్రదించండి ←←

రాయరాకుల కర్ణాకర్​
9014819428
rayarakula.karnakar@gmail.com
www.fb.com/rayarakula

21, జూన్ 2015, ఆదివారం

Background Change white Hairs

ఇదివరకు నేన్ చేసిన వీడియో లలో బాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి అని ఒక వీడియో చేయడం జరిగింది మరి ఆ వీడియో లో వెంట్రుకలు నల్లగా ఉండడం వలన multiply అనే బ్లెండ్ మోడ్ ని ఎంచుకోవాలని చెప్పను .. 

 మరివిదేశస్థులు లేదా హెయిర్ వైట్ కలర్ హెయిర్ ఉన్నవారివి ఎలా అంటే multiply బ్లెండ్ మోడ్ వద్ద screen మోడ్ అని పెట్టేస్తే చాలు . 

Video link: http://bit.ly/HShaircutting



video link : http://bit.ly/HSbackgroundchange


         మరివిదేశస్థులు లేదా హెయిర్ వైట్ కలర్ హెయిర్ ఉన్నవారివి ఎలా అంటే multiply బ్లెండ్ మోడ్ వద్ద screen మోడ్ అని పెట్టేస్తే చాలు .