22, జనవరి 2015, గురువారం

Whats App In Computer


వాట్స్ యాప్ వినియోగదారులకి ఒక శుభవార్త 

ఇక నుంచి వాట్స్ యాప్ మీ మొబైల్ లోనే కాదు  మీ కంప్యూటర్ లో ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా వాడుకోవచ్చు.

దీనికోసం  కేవలం మీ మొబైల్ లో లేటెస్ట్ వెర్షన్ వాట్స్ ఉంటె చాలు.

వాట్స్ యాప్ లేని వారు మరియు ఓల్డ్ వెర్షన్ వాడుతున్న వారు మీ వాట్స్ యాప్ ని అప్డేట్ చేస్కోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి అప్డేట్ చేస్కోవచ్చు 



ముందుగా కావలసినవి మీ సిస్టం మరియు మొబైల్ ఒకే నెట్వర్క్ పై ఉండేలా చూస్కోండి (వై ఫై)

→ మీ మొబైల్ లో వాట్స్ యాప్ ఓపెన్ చేసి క్రింది స్టెప్స్ ని ఫాల్లో అవ్వండి.

→ వాట్స్ యాప్ ఓపెన్ చేసి  మెనూ ఆప్షన్ లో కి వెళ్ళాలి.

→ అక్కడ WHATS APP WEB అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిని టాప్ చేయండి.


→ ఇప్పుడు QR కోడ్ స్కాన్ స్కానింగ్  అడుగుతూ కెమెరా ఓపెన్ అవుతుంది.

→ ఇప్పుడు మీ కంప్యూటర్ లోweb.whatsapp.com చేయాలి .

→ అక్కడ పైన ఇమేజ్ లో చూపినట్లు ఒక QR CODE వస్తుంది.

→ ఈ కోడ్ ని మన మొబైల్ తో స్కాన్ చేయాలి

→ స్కానింగ్ లో recognize అవ్వగానే వెంటనే  DONE అని వస్తుంది .

→ ఇప్పుడు సిస్టం లో మన మెసేజ్ లతో పాటు దాదాపు అన్ని ఆప్షన్స్ తో  సిస్టం లో వాట్స్ యాప్ ని వాడుకోవచ్చు .


( విండోస్ , బల్క్బెర్రి లాంటి వారు Whats app web ఆప్షన్ ని ఎంచుకొనుటకు క్రింది ఇమేజ్ లో తెలిపిన విధంగా చేయండి )


ఈ పోస్ట్ ఉపయోగకరమని మీరు బావిస్తే మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారికి సహాయపడగలరు.
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. నేను తప్పక సమాధానం ఇస్తాను . 

రాయరాకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

13, జనవరి 2015, మంగళవారం

1,00,000 views video .. How to change dress color in Photoshop

నా అభిమాన మిత్రులందరికీ ధన్యవాదాలు.

 నేన్ గత ఏడాది కింద చేసిన డ్రెస్ కలర్ చేంజ్ వీడియో ఇప్పటికి 1,00,000 వ్యూస్ ని సాధించింది. దీనంతటికి కారణం మీరే . నాకు చాల సంతోషంగా ఉంది . మీ సహకారం తో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు పేరు పేరునా ధన్యవాదాలు.

video link : http://bit.ly/HSdresscolor

ఈ సందర్బంగా మీకొక నిజం చెప్పదలుచుకున్నాను .

నేను YouTube లో మొదటగా ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని టెక్నికల్ వీడియోస్ పోస్ట్ చేసాను .. కాని ఆ వీడియో ఛానల్ యుఆర్ఎల్ బాలేకపోవడం వలన కొత్తగా ఇంకో ఛానల్ తెరిచాను
రెండు ఛానల్ లు క్రియేట్ చేసాను అదే www.youtube.com/rayarakula అప్పటికే నా మొదటి ఛానల్ లో ఉన్న వీడియోస్ చాల మంది చూసేసారు . అందుకని అందులో ఉన్న వీడియోస్ వొదిలేసి కొత్త వీడియోస్ ని తయారు చేస్తూ ఈ ఛానల్ లో పెట్టేస్తూ వచ్చేసాను.

రాయరాకుల ఛానల్ కి కూడా మంచి రేస్పోన్స్ వచ్చింది . అనుస్క్రిప్ట్ మేనేజర్ పై నేన్ చేసిన వీడియో కి దాదాపు 10,000+ పైగా వ్యూస్ ఉండడం వలన కాల్స్ కూడా బానే వస్తున్నాయి.

అప్పటికే పాత ఛానల్ ఉన్న ఈ వీడియో కి చాల వ్యూస్ వచ్చేసి ఇప్పటికి లక్ష వ్యూస్ కి చేరుకున్నది. కాని ఆ ఛానల్ లో ఇక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు కావున ఆ ఒక్క వీడియో కి ఉన్న వ్యూస్ కోసం ఆ వీడియో ని అలాగే ఉంచేశాను .

ఇది నా YouTube తతాంగం .

మరొకసారి నా మిత్రులకు , వీక్షకులకు , అభిమానులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు  
(ఇమేజ్ : లక్ష వ్యూస్  కి చేరుకున్న వీడియో స్క్రీన్ షాట్)

2, జనవరి 2015, శుక్రవారం

23, డిసెంబర్ 2014, మంగళవారం

Anu Script Part 2

నేను పెట్టిన అను స్క్రిప్ట్ మేనేజర్  వీడియో లో రోమిక్ కీబోర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది..  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : www.bit.ly/HSanuSM Roma Keyboard Link : http://bit.ly/HSroma


ఈ వీడియో కి వచ్చిన కామెంట్ లలో జాగ్రత్త గా గమనిస్తే చాల మంది  ఐ ఎలా రాయాలి , క్ష ఎలా రాయాలి ఐత్వం ఎలా ఇవ్వాలి  అని అడిగినారు .. ఆ సమయం లో నాకు తెలియదు అందుకు నేన్ ఆపిల్ కీబోర్డ్ యూస్ చేయండి అని అని ఎలా చేయాలో తెలిపినాను ..

కాని ఇప్పుడు ఆ అవసరం లేదు .. డైరెక్ట్ గా రోమిక్ కీబోర్డ్ లోనే టైపు చేస్కొనే విధంగా యున్న అక్షరాలూ ఎలా టైపు చేయాలో తెలుసుకొన్నాను ... ఈ విషయం పై త్వరలో వీడియో చేస్తాను కానీ ఇప్పుడు మీకు తెలుపుట కొరకు చెపుతున్నాను

ఒక సారి రోమ కీబోర్డ్ లేఔట్ ని గమనించండి .. ఐ v లో ఉంది అదే విధంగా v లో ఇంకా ఔ ,వ కూడా ఉంది ఇదేంటి ఒక అక్షరం లో మూడు ఏంటి ఎలా టైపు చేయాలి అనుకుంటున్నారు కదూ ..  మరేం పర్లేదు  స్మాల్ v కొడితే వ కాపిటల్ v కొడితే ఔ వస్తుంది అండ్ స్క్రోల్ బార్ బటన్ ఉంటుంది కదా అది హోల్డ్ చేసి v కొడితే అప్పుడు వస్తుంది ఐ ..

ఇలాగే అన్ని అక్షరాలూ ను ... ఈ విషయాన్నీ వీడియో లో చూసుటకు  ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : www.bit.ly/HSanuSM2


ఒక సారి ట్రై చేయండి .. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె తెలియ జేయండి  

6, డిసెంబర్ 2014, శనివారం

FlipKart Offer in Mobile app only 8-12-14 to 12-12-14




షాపింగ్ మిత్రులందరికీ శుభవార్త .. ప్రముఖ షాపింగ్ సైట్ లలో మొదటగా నిలిచినా ఫ్లిప్ కార్ట్  8-12-2014 నుంచి 12-12-2014 వరకు బిగ్ డీల్ ఆఫర్స్ ని అనౌన్స్ చేసింది .. కానీ ఇది కేవలం స్మార్ట్ ఫోన్ మొబైల్ లో ఫ్లిప్ కార్ట్ అప్లికేషను వాడుతున్న వాళ్ళకి మాత్రమే .. త్వరపడండి .. ఇప్పుడే అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కొండి .. షాపింగ్ కి రెడీ అవ్వండి .

Application link : https://play.google.com/store/apps/details?id=com.flipkart.android&hl=en

1, డిసెంబర్ 2014, సోమవారం

Setup Your own News Feed

మీ న్యూస్ ఫీడ్ లో అన్ని రకాల పోస్ట్లు (ఉపయోగపడేవి, చెత్త చెదారం) అన్ని వస్తూన్నయా ? మీ న్యూస్ ఫీడ్ ని మీకు నచ్చిన విధంగా ఎవరెవరి  పోస్ట్ లు కనబడాలి, ఏ పేజి పోస్ట్ లు కనబడాలి , ఏ గ్రూప్ పోస్ట్ లు కనబడాలి అనేది మీకు నచ్చినట్లుగా మీరు ఎంచుకోవలనుకున్తున్నారా ?

అయితే  ఈ క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా News Feed Preferences ఓపెన్ చేసి 
ఏ ఏ పోస్ట్ లు ఎవరెవరి పోస్ట్ లు కావాలో వారిని FOLLOW కొట్టేసి మిగితావి UNFOLLW చేయండి.

GROUPS, FRIENDS, FOLLOWINGS, PAGES లో కావలసినవి సెట్ చేస్కోవడమే .. ఈ క్రింది ఇమేజ్ లో గమనించవచ్చు .

థంక్ యు .


ఈ పోస్ట్ పై సందేహాలు ఉంటె నాకు తెలియజేయగలరు 

రాయరాకుల కర్ణాకర్
9014819428
rayarakula.karnakar@gmail.com

23, నవంబర్ 2014, ఆదివారం

Photoshop Tools Bar Video



ఫోటోషాప్ ని ఉపయోగించి అద్బుతమైనా ఫోటో ఎఫెక్ట్స్ డిజైన్స్ create చేయవచ్చు అని మనందికి తెలుసు అలా ఫొటోస్ డిజైన్ చేయాలనీ అందరికి ఉంటుంది  కాని ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేయడం అందరికి రాదూ ..

అది రావాలంటే ముందుగా మనకి అందులో ఉన్న టూల్స్ గురించి ఎంతో కొంత అవగాహనా తప్పక ఉండాలి . అలా అయితేనే మనం ఏదైనా ఫొటోస్ డిజైన్ చేయవచ్చు.. 

ఈ ఫోటోషాప్ టూల్స్ పై ప్రతిఒక్కరికి  కొంత అవగాహనా తీసుకరావాలనే ఉద్దేశం తో నేన్ ఈ ఫోటోషాప్ బేసిక్ టూల్స్ వీడియో ని మీకు అందిస్తున్నాను . ఈ వీడియో రెండు పార్ట్ లలో ఉంటుంది .. 


పార్ట్ 1 వీడియో ఈ క్రింది లింక్ ద్వారా చూడవచ్చు ..

Photoshop Tools Bar Part 1 Video link  : http://bit.ly/HSPStools



Photoshop Tools Bar Part 2 Video link: www.bit.ly/HSPStools2




ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరు . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు,సలహాలు  ఉన్నచో కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యుట్యూబ్ ఛానల్ ని subscribe చేస్కోగలరు : www.bit.ly/HSrayarakula

www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
https://www.facebook.com/groups/PCSolutions4u/

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com
www.facebook.com/rayarakula

9, నవంబర్ 2014, ఆదివారం

SBI mobile Banking

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందుటకు ముందుగా

MBSREG to 9223440000 sms


చేయాలి వెంటనే వచ్చే మెసేజ్ లో మీకు ఒక యూసర్ id అండ్ ఒక పిన్ ఇవ్వడంజరుగుతుంది .. ఆ తర్వాత దగ్గర లో ఉన్నatm లోకేల్లి మీ atm కార్డు సహాయం తోమొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్కోవాలి .. అంతేఇప్పుడు


https://mobile.onlinesbi.com/sbidownloader/DownloadApplication.action

ఈ సైట్ నుంచి మీ మొబైల్ కి సంబంధించిన అప్లికేషను ని డౌన్లోడ్చేస్కొని మీ యూసర్ id తో లాగిన్ అవ్వాలి .అంతే ఇక బ్యాంకింగ్ మొత్తం మీ మొబైల్ నుంచే చేస్కోవచ్చు .


www.heerasolutions.blogspot.com
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions

2, నవంబర్ 2014, ఆదివారం

How To Create Water Drops On Leaf In Photoshop


ఫోటోషాప్లో  డిజైనింగ్ లేదా ఆల్బం డిజైనింగ్ చేసే సమయం లో అట్రాక్షన్ కొరకు మనం వివిధ రకాలుగా డిజైన్ లను చేస్తూ ఉంటాం అందులో బాగంగా ఒక నీటి బిందువును తయారు చేసి దానిని మనం వేరే psd లలో కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా ఫోటోలపై వాడుకోవడానికి అలాంటి నీటి బిందువును  ఫోటోషాప్ ని ఉపయోగించి   ఎలా డిజైన్ చేయాలి . అనేది మనం ఈ క్రింది వీడియో లో చూడవచ్చు .

ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు మెయిల్ ద్వార లేదా కామెంట్ ద్వార తెలియజేయగలరు .
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

Light Brust Effect .. Photoshop

         
ఫోటోషాప్ ని ఉపయోగిస్తూ టెక్స్ట్ ని కావచ్చు లేదా ఇంకా ఇతర ఏదైనా లేయర్ లో లైటింగ్ బృస్ట్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది .. ఈ క్రింది వీడియో లో చూపించాను .. 

ఈ క్రింది వీడియో ని తప్పక చూడగలరు ..  ఈ వీడియో పై మీ అభిప్రాయన్ని కామెంట్ రూపం లో లేదా నా మెయిల్ id లేదా నా నెంబర్ నుంచి నాకు తెలుపగలరు .. 



రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

10, అక్టోబర్ 2014, శుక్రవారం

Team Viewer



కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఏదో
అంతుపట్టని సమస్య వస్తే దానిని ఎలా
సాల్వ్ చేయాలో తెలియదు .. చాల కష్టంగా ఉంది
మరి అలాంటప్పుడు ఎలా ప్రతి చిన్న
సమస్యకు కంప్యూటర్ షాప్ కి
తీస్కపోవడం మంచిది కాదు .. సో ఇలాంటప్పుడే
ఈ ప్రాబ్లం సాల్వ్
చేయగలవారు మనకు తెలిసినవారు ఎవరైనా
ఉన్నరా చూడాలి ఎవరైనా ఉంటె వారు దగ్గరలో
లేకుంటే అయినా పర్లేదు జస్ట్
టీం వ్యూయర్ ద్వారా మన పర్మిషన్ తో మన
సిస్టం ని వేరే వాళ్ళు ఆపరేట్ చేసేలా
చేస్కోవచ్చు ..
ఈ టీం వ్యూయర్ లో మనకు ఒక id అండ్
పాస్వర్డ్ కేటాయించబడతాయి. ఈ id ని
పాస్వర్డ్ ని ఇతరులకు ఇస్తే వాళ్ళు మన
సిస్టం ని access చేయగలుగుతారు .. అంతే
కాకుండా ఇందులో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్కునే
అవకాసం కూడా ఉంది.
టీం వ్యూయర్ లింక్ :http://www.teamviewer.com/hi/download/currentversion.aspx
ఈ పోస్ట్ పై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్
బాక్స్ లో తెలియజేయండి ..

రాయరాకుల కర్ణాకర్ 
9014819428