2, నవంబర్ 2014, ఆదివారం

Light Brust Effect .. Photoshop

         
ఫోటోషాప్ ని ఉపయోగిస్తూ టెక్స్ట్ ని కావచ్చు లేదా ఇంకా ఇతర ఏదైనా లేయర్ లో లైటింగ్ బృస్ట్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది .. ఈ క్రింది వీడియో లో చూపించాను .. 

ఈ క్రింది వీడియో ని తప్పక చూడగలరు ..  ఈ వీడియో పై మీ అభిప్రాయన్ని కామెంట్ రూపం లో లేదా నా మెయిల్ id లేదా నా నెంబర్ నుంచి నాకు తెలుపగలరు .. 



రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

10, అక్టోబర్ 2014, శుక్రవారం

Team Viewer



కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఏదో
అంతుపట్టని సమస్య వస్తే దానిని ఎలా
సాల్వ్ చేయాలో తెలియదు .. చాల కష్టంగా ఉంది
మరి అలాంటప్పుడు ఎలా ప్రతి చిన్న
సమస్యకు కంప్యూటర్ షాప్ కి
తీస్కపోవడం మంచిది కాదు .. సో ఇలాంటప్పుడే
ఈ ప్రాబ్లం సాల్వ్
చేయగలవారు మనకు తెలిసినవారు ఎవరైనా
ఉన్నరా చూడాలి ఎవరైనా ఉంటె వారు దగ్గరలో
లేకుంటే అయినా పర్లేదు జస్ట్
టీం వ్యూయర్ ద్వారా మన పర్మిషన్ తో మన
సిస్టం ని వేరే వాళ్ళు ఆపరేట్ చేసేలా
చేస్కోవచ్చు ..
ఈ టీం వ్యూయర్ లో మనకు ఒక id అండ్
పాస్వర్డ్ కేటాయించబడతాయి. ఈ id ని
పాస్వర్డ్ ని ఇతరులకు ఇస్తే వాళ్ళు మన
సిస్టం ని access చేయగలుగుతారు .. అంతే
కాకుండా ఇందులో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్కునే
అవకాసం కూడా ఉంది.
టీం వ్యూయర్ లింక్ :http://www.teamviewer.com/hi/download/currentversion.aspx
ఈ పోస్ట్ పై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్
బాక్స్ లో తెలియజేయండి ..

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

4, అక్టోబర్ 2014, శనివారం

Some 3D styles For Photoshop

ఈ క్రింది ఇమేజ్ లలో చూసి నట్లైతే మనకి అధ్బుతమైనా స్టైల్ లలో పేర్లు కనిపిస్తున్నాయి .. వీటిని ఒక స్టైల్ అప్లై చేసి 3d లో కనిపించేలా డిజైన్ చేయడం జరిగింది .. ఇలా అద్భుతమైనా స్టైల్స్ మీరు చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ నుంచి మీరు ఈ ఫోటోషాప్ స్టైల్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు 

డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

డౌన్లోడ్ చేస్కొన్న ఫైల్స్ ని C:\Program Files\Adobe\Photoshop(మీరు వాడుతున్న వెర్షన్)\Presets\Styles లో పేస్టు చేయండి ఆ తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేస్తే అక్కడ స్టైల్స్ ప్యాలేట్  లో రైట్ సైడ్ లో ఉండే చిన్న బటన్ పై క్లిక్ చేయగానే ఈ స్టైల్స్ అక్కడ కనిపిస్తాయి .









డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

psd files కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://bit.ly/HS3Dpsd
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

1, అక్టోబర్ 2014, బుధవారం

free operating systems


మనం తరుచూ మన ఆపరేటింగ్ సిస్టం లో బ్లాకు స్క్రీన్ రావడం , గేన్యూన్ కాదని మెసేజ్ రావడము .. ఆక్టివేట్ చేస్కొండి అని ,  ట్రయిల్ పీరియడ్ అయిపోయిందని వస్తూ ఉంటాయి.. 

అస్సలు అవేంటి అంటే మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఒర్గినల్ కాక పోవడం ఎక్కడో ఇంటర్నెట్ లో దొరికిన పైరసీ లను మనం os గా వాడుతున్నాము . సో అందుకని అలాంటి మెసేజ్ లు మనకి కనిపిస్తుంటాయి . 

మరి దానికి పరిష్కారం లేదా అంటే ఉంది . అంతగా పైరసీ ని కనిపెట్టినవ వాళ్ళు activators ని మాత్రం కనిపెట్టారా ఎం . అయినా ఎంత చేసిన అది నకిలీ os నే .. 

అయితే ఉచితంగా దొరికే os లు కుడా ఉన్నాయి ఎంటా అవి అనుకుంటున్నారా?
అయితే ఈ లింక్ ను చూడండి అందులో మనకి ఫ్రీ గా దొరికే os లు ఉన్నాయి 

http://distrowatch.com/dwres.php?resource=major

ఈ os లో కూడా మనం రెగ్యులర్ గా చేసే కాపీ పేస్టు లు పని చేస్తాయి ఫైల్ బ్రౌసింగ్ నెట్ బ్రౌసింగ్ అన్ని ఉంటాయి .

గమనిక : విండోస్ లో పని చేసే అన్ని సాఫ్ట్వేర్లు  ఈ os లలో పని చేయక పోవచ్చు .  ఇవి కేవలం నకిలీ వాడుతున్నాం అనే బావన లేకుండా ఉండటానికి మాత్రమే .

Rayarakula Karnakar
    

Net Speed Monitor

మనం వాడుతున్న నెట్ స్పీడ్ ఏవిధంగా వస్తుందో ఎప్పటికప్పుడు తెసుకోవాలంటే నెట్ స్పీడ్ మానిటర్ అనే సాఫ్ట్వేర్ చాల బాగా పని చేస్తుంది ఈ క్రింది ఇమేజ్ లో వాలే టాస్క్ బార్ మీద ఇలా upload అండ్ downloading Speed డిస్ప్లే చేయడం జరుగుతుంది .. 

 ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ లను వాడండి 

32 bit Operating system : http://bit.ly/HS32nsm
64 bit Operating System : http://bit.ly/HS64nsm

XP ఆపరేటింగ్ సిస్టం వాడే వాళ్ళు ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కోన్నాక ఈ క్రింది ఇమేజ్ లో వలే  చేయాలి 

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

News for upcoming windows 10

విండోస్ వెర్షన్ లో కొత్తగా ఇప్పుడు విండోస్ 10 రాబోతున్నది .

మరి విండోస్ 9 రాకుండానే విండోస్ 10 ఏంటి అనుకుంటున్నారా?
దానికొక కారణం ఉంది చెప్తాను

ఈ మధ్యలోనే గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పలు రకాల devices లో ఒకే ఓ ఎస్ ని వాడుట వలన ఒక ఓ ఎస్ ని అన్నింట్లో ఉంది కావున వన్ అని సంబోధించారు .అదే విధంగా విండోస్ లేటెస్ట్ వెర్షన్ ని అన్ని devices లోను అంటే మొబైల్స్ , టాబ్లెట్స్ , కంప్యూటర్, టీవీ మో|| ఇలా అన్నింట్లో ఒకే ఆపరేటింగ్ సిస్టం వాడుకోవచ్చు కావున లేటెస్ట్ వెర్షన్ కి ముందుగా విండోస్ వన్ అని పేరు పెడదాం అనుకున్నారు కాని విండోస్ వన్ అంటే windows వచ్చిన మొదటి ఆపరేటింగ్ సిస్టం అవుతుందని  అందుకని విండోస్ 9 ని స్కిప్ చేసి విండోస్ 10 ని రూపొందిస్తున్నారు .
Windows 10 Final వెర్షన్ 2015 చివరి నెలల్లో విడుదల కాబోతోంది. అలాగే Windows Phonesలో తర్వాత రాబోయే వెర్షన్ పేరు కూడా Windows 10నే.

ఇవి విండోస్ 10 ఫస్ట్ లుక్స్









- రాయరకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

24, సెప్టెంబర్ 2014, బుధవారం

Bank A/C +BSNL sim


     









     బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీఎస్ఎన్ఎల్సిమ్ కార్డులు బోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రారంభించిన జనధన యోజన పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోబీఎస్ఎన్ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని ఆ సంస్థజీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈఅవకాశం కల్పిస్తామని అన్నారు . ఈపథకం కిందబ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడాలభిస్తుంది. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం

Chinna Prashna



మిత్రులారా ?నాదొక చిన్న ప్రశ్న ..మీరు తప్పక చెప్పాలని ఆశిస్తున్నాను ..→ కంప్యూటర్ ని తెలుగులో ఏమంటారు ?→ what do you Call Computer in Telugu ?ganana yantram matram kaadhu ganana yantram ante calculator

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

Frames PSD


ఈ ఇమేజ్ లో కనిపించే ఫ్రేమ్స్ యొక్క పిఎస్ డి(ఫోటోషాప్ డాక్యుమెంట్) ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


                                                             Click here to Download

25, ఆగస్టు 2014, సోమవారం

అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని కొన్ని ట్రిక్స్




నేను అనుస్క్రిప్ట్ మేనేజర్ పై చేసిన వీడియో ను చాల మంది చూసారు . చాల మంది కాల్ కూడా చేసారు .. నాకు చాల సంతోషంగా ఉంది . 

అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో నేను రోమిక్ కీబోర్డ్ ని ఉపయోగంచి ఎ విధంగా టైపు చేయాలి అని చెప్పను .. కాని ఈ రోమిక్ కీబోర్డ్ లో కొన్ని లోపాలుకుడా ఉన్నాయి .. 
ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చిన వాటిలో 

→
ఐత్వం ఏ విధంగా ఇవ్వాలన్నది (రైల్వే లో ర కు ఇచ్చిన గుణింతం) 
→
అదే విధంగా క్ష ఎలా టైపు చేయాలనేది 
→ ho
అంటే హో ఇలా వస్తుంది కాని నాకు హో అంటే ఇలా కాదు ఓత్వం ఉండాలనేది .
→ అరసున్నా ఎలా రాయాలి .. ?

ఇవి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను 

►
ఐత్వం ఇవ్వటానికి డైరెక్ట్ బటన్ రోమిక్ కేయ్పాడ్ లో లేదు కాని ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఎత్వం ఇచ్చి ఆ తర్వాత షిఫ్ట్ 8 (*) కొడితే ఐత్వం గా వస్తుంది కాని అంత పర్ఫెక్ట్ గా అనిపించక పోవచ్చు .. ఇక ఆపిల్ కీబోర్డ్ లో అయితే డైరెక్ట్ బటన్ ఉంది అక్షరం రాసాక [ (బిగ్ బ్రాకెట్) ఇస్తే చాలు ఐత్వం వస్తుంది కింది ఇమేజ్ లో అది మీరు గమనించవచ్చు ..

►
ఇక క్ష అక్షరానికి వస్తే నాకు తెలిసినంతవరకు రోమిక్ కీబోర్డ్ లో క్ష అక్షరం ఇవ్వడం జరగలేదు. సో అందుకోసం అని ఆపిల్ కీబోర్డ్ లో నే చేయడం బెటర్ .. ఆపిల్ కీబోర్డ్ లో Y (కాపిటల్) క్ష వచ్చేస్తుంది .

►
ప్రస్తుత కాలం లో తెలుగులో కొన్ని అక్షరాలను మార్చుట వలన హో అనునది ఇలా అయి పోయింది. కాని దీనిని కూడా ఓత్వం గానే పలుకుతాము . అయినా మనకి పాత ఓత్వంనే కావాలనుకుంటే అది కూడా సాధ్యమవుతుంది ఎలా అంటే ముందుగా హ రాసి ఆ తర్వాత ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఓత్వం ఇచ్చి ఆ తర్వాత లెఫ్ట్ ఆరో ప్రెస్ చేసి backspace బటన్ ప్రెస్ చేయాలి అప్పుడు ఆ అక్షరం డిలీట్ అయి ఓత్వం అనేది ముందటి అక్షరం మీదకి వస్తది. సో అల మనం తృప్తి పొందవచ్చు .
► ఇది చాల సింపుల్ మన రోమ కీబోర్డ్ లోనే $ (షిఫ్ట్ 4) ఇది కొడితే సింపుల్ గా మనకి అర సున్నా వస్తుంది సో మనం పద్యాలూ రాస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు .


ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె తెలియజేయగలరు .. నేన్ తప్పక సమాదానం ఇస్తాను .. త్వరలో ఈ టాపిక్ పై వీడియో చేస్తాను. కాని మరి వీటికే కాకుండా ఉన్న అను స్క్రిప్ట్ మేనేజర్ లో రోమిక్ లో వచ్చే ప్రొబ్లెంస్ అన్నింటిని  చేద్దాం అనుకుంటున్నా .. మీరు ఎంత తొందరా అయితే అంత తొందరగా సమస్యలను నా దృష్టికి తీసుక రండి. ఇతరులకు సహాయం చేద్దాం.

17, ఆగస్టు 2014, ఆదివారం

How To delete Your Facebook account permanently

 ఏదైనా అనివార్య కారణాల వాళ్ళ కావచ్చు ,మీ రెండవ ఎకౌంటు కావచ్చు లేదా అవసరం లేని ఎకౌంటు కావచ్చు లేదా ఫేక్ ఎకౌంటు కావచ్చు వాటిని శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటే
ఎలా చేయాలి , ఎ విధంగా చేయాలో తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియోచూసి వాటిని డిలీట్ చేసేయండి ఫేస్బుక్ వాళ్ళకు కొంచం హెల్ప్ చేయండి .

వీడియో లింక్ : http://bit.ly/HSfbdelete





ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీ మిత్రులకు కూడా షేర్ చేయండి . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు .

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యూ ట్యూబ్ ఛానల్ ని చేస్కోగలరు