sbi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sbi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2016, ఆదివారం

De-Register SBI Secure OTP App

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మనం చేసే మనీ transactions ఇంకా ఎక్కువ సురక్షితంగా ఉండాలని SBI Secure OTP అనే యాప్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే .
కాని ప్రస్తుతం ఆ యాప్ కొత్త యూసర్ లను రిజిస్టర్ చేస్కోనుట లేదు otp ద్వార ఆక్టివేట్ కావలి కాని otp మొబైల్ కి రావట్లేదు .. ఈ సమస్య వలన కొత్త యూసర్ లెవరు ఈ యాప్ ని వాడుట లేదు ,
 

కాని వచ్చిన సమస్య ఏంటంటే ,.,

ఇదివరకే ఆ యాప్ లో రిజిస్టర్ అయి ఉంది అనివార్య కారణాల ద్వారా uninstall చేసిన వారికి వస్తుంది సమస్య .. ఇటు కొత్తగా యాప్ రిజిస్టర్ కాలేక పోతున్నాము అటు ఎలాంటి transactions చేయలేక పోతున్నారు ఎందుకంటే otp యాప్ లోకి వస్తది కాని మన వద్ద యాప్ పని చేయుట లేదు కదా .

మరి ఇలాంటి సమస్య ని సరైన పరిష్కారం ఎంటటే ..

sbi netbanking లో Profile లోకి లాగిన్ అయి ప్రొఫైల్ అనే ఆప్షన్ లో High security Options లలో Secure OTP కి బదులుగా మొబైల్ otp సెలెక్ట్ చేస్కొని సేవ్ చేస్కొంటే చాలు .. ఇక పై మల్లి యధావిధిగా otp లు మన మొబైల్ కే వస్తాయి .

24, డిసెంబర్ 2015, గురువారం

State Bank Samdhan



                                         ఖాతాదారులు బ్యాంకుకు రాకుండానే మరిన్ని సేవలు పొందేందుకు గాను తన వినియోగదారుల కోసం మొబైల్ యాప్ 'ఎస్బీఐ సమాధాన్'ను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించింది. ఈ యాప్ను ఎస్బీఐ ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఖాతాదారులు 'స్టేట్ బ్యాంక్ సమాధాన్' యాప్ ద్వారా ఏటీఎం లొకేషన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిపాజిట్స్, అడ్వాన్సెస్, బ్రాంచ్ వివరాలు లాంటి తదితర సేవలను పొందొచ్చని ఎస్బీఐ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చెప్పాలంటే అకౌంట్ స్టేట్మెంట్, విద్య గృహ రుణాలు తీసుకున్నవారు, ఎంత వడ్డీ చెల్లించామనే వివరాలను తాము నమోదు చేసుకున్న ఇమెయిల్కు 24 గంటల్లోగా వస్తుండటం ఈ యాప్ ప్రత్యేకత. బ్యాంకులో ఉన్న తమ డిపాజిట్ లేదా రుణం వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ సెలవులతో పాటు ఎస్బీఐ ఫ్రీడమ్, ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ బడ్డీ, ఎస్బీఐ క్విక్ వంటి మొబైల్ యాప్లను తద్వారా వినియోగించుకునే వీలు కలుగుతుంది. బ్యాంకు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు, పరిష్కారం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.